Jump to content

Kondapalli Fort & Mulapadu


Recommended Posts

  • Replies 136
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ఎన్నెన్నో అందాలు 
మూలపాడులో సీతాకోకచిలుకల వనం 
ప్రత్యేకంగా 2 కి.మీ మేర కాలిబాట 
ప్రకృతి ప్రేమికులకు వరం 
అభివృద్ధికి అటవీశాఖ కసరత్తు 
పరిశోధన ప్రారంభించిన అధికారులు 
ఈనాడు - అమరావతి 
amr-top1a.jpg

ప్రకృతిలోని వర్ణాలన్నీ రెక్కలపై అద్దినట్లు ఉండే సీతాకోక చిలుక అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎంత ఏడ్చే పిల్లలైనా వాటిని చూడగానే టక్కున ఆపి.. కేరింతలు కొడుతూ వాటిని పట్టుకునేందుకు పరుగులు పెడతారు. ఏడు పదులు దాటిన వారు కూడా చిన్న పిల్లల్లా వాటిని చూడగానే తెగ ఆనందపడిపోతారు. కన్ను ఆర్పకుండా వాటిని పరిశీలనగా చూస్తారు. వాటి అందాలను ఆస్వాదిస్తారు. ఒకటి, రెండు సీతాకోకచిలుకలకే అంత సంబరపడి పోతే.. వేల సంఖ్యలో వివిధ రంగుల్లో ఉన్న వాటిని చూస్తే.. వావ్‌ అనిపిస్తుంది. వాటితో ఆడుకోవాలనిపిస్తుంది. కొండపల్లి అటవీ ప్రాంతంలోని  మూలపాడు వెళ్తే వాటి అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మనల్ని చుట్టుముట్టి స్వాగతం పలుకుతాయి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన ఈ ప్రాంతానికి వారాంతాలలో యువత, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడి కొండపైకి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోయినా భారీగా వస్తుంటారు. కాంక్రీట్‌ వనంగా మారిన బెజవాడ నగరం నుంచి మానసిక ప్రశాంతత కోసం మూలపాడు వచ్చి ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. కొత్త ఉత్సాహంతో తిరిగి వెళ్తున్నారు. ఎటువంటి వసతులు లేని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ నడుం బిగించింది. సాధ్యాసాధ్యాలపై కసరత్తు మొదలుపెట్టింది. ఎటువంటి వసతులు లేని మూలపాడులో అన్ని హంగులతో సీతాకోకచిలుకల వనాన్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. దీని కోసం ప్రణాళికలపై పరిశోధన ప్రారంభించింది. వీటిపై వారం, పది రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 
* మూలపాడులోని ఈ ప్రాంతంలోకి వెళ్లగానే మనపై ఒక్కసారిగా లెక్కలేనన్ని సీతాకోకచిలుకలు వాలిపోతాయి. ఇక్కడ వేల సంఖ్యలో కనిపించడానికి ప్రధాన కారణం ఇక్కడి వృక్షాలే. ఈ కీటకాలు సాధారణంగా రెండు రకాల చెట్లపైనే ఆధారపడతాయి. ఇవి ఎక్కువ ఉన్న చోటే కనిపిస్తాయి. ఆశ్రయం ఇచ్చే చెట్లపైన జీవిస్తాయి. గుడ్లు పెట్టే దశ, ఆ తర్వాత లార్వా, గొంగళిపురుగు నుంచి సీతాకోక చిలుకగా మారేది ఈ చెట్లపైనే. నిమ్మ, సీతాఫలం, కరివేపాకు, అశోకా, ఆముదం, తదితర చెట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో వీటి సంఖ్య భారీగా పెరిగింది. 
* దీనికి తోడు ఇవి జీవించడానికి మకరందాన్ని పీల్చేందుకు పలు పుష్పాలపై ఆధారపడతాయి. వీటి నుంచి తేనెను తీసుకుంటాయి. సబ్జా, గన్నేరు, తులసి, బంతిపూలు, లిల్లీ తదితర పూల నుంచి మకరందాన్ని జుర్రుకుంటాయి. ఇలా రెండు రకాల చెట్లు అధికంగా ఉండటంతో వీటి సంతతి అనూహ్యంగా పెరిగింది. ఇవి కాలుష్య కారకాలు, స్వచ్ఛమైన గాలి ఉన్న చోటే కనిపిస్తాయి. పురుగు మందులు చల్లిన మొక్కలపై వాలవు. ఇవి తిరిగే చోట ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నట్లు భావిస్తారు.

ప్రత్యేక వనం అభివృద్ధి 
* మూలపాడులో వసతులు కల్పించే లక్ష్యంతో అటవీశాఖ కదులుతోంది. దీని కోసం ఇప్పటికే ఓ ప్రణాళికను రూపొందించుకుంది. ఎక్కువ మంది పర్యటకులను ఆకర్షించేలా ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సీతాకోక చిలుకల పార్కును ఏర్పాటు చేయనున్నారు. వీటి సంతతి మరింత అభివృద్ధి చెందేలా చూడనున్నారు. వీటికి ఆశ్రయమిచ్చే చెట్లను మరిన్ని పెంచనున్నారు. వీటి సంఖ్య పెరగడానికి ఇవి కీలకంగా మారనున్నాయి. సీతాకోకచిలువ జీవిత చక్రం పూర్తయ్యేది వీటిపైనే. 
* ఇందులో భాగంగా ప్రతి రకాన్ని ఫొటో తీయించి, వాటికి సంబంధించి ఆధారపడే చెట్లను గుర్తించనున్నారు. ఇక్కడ దాదాపు 50 రకాల సీతాకోకచిలుకలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంపై ఇప్పటికే కొంత పరిశోధన చేసిన ఏపీ బర్డ్‌ వాచర్స్‌ సొసైటీతో కలసి అటవీ శాఖ నడవనుంది. ఈ సంఘంతో పాటు, అవసరం మేరకు కొన్ని స్వచ్ఛంద సంస్థల సాయాన్ని కూడా తీసుకోనుంది. వీటి సాయంతో మరింత సమాచారం కోసం పరిశోధనలను చేపట్టనుంది. 
* ఇక్కడి జీవవైవిధ్యం, ప్రకృతి సమతుల్యతకు ఇబ్బంది లేకుండా పార్కును ఏర్పాటు చేయబోతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీతాకోకచిలుకల సంతతి పెరుగుతుంది. ఈ సమయంలో గొంగళిపురుగుల దశ నుంచి కీటకంగా మారుతుంది. ఈ ప్రాంతంలో 2 కి.మీ మేర దీన్ని అభివృద్ధి చేయాలని తలపోస్తోంది. ఎక్కువగా వాహనాలు ఇక్కడికి రాకుండా కట్టడి చేయనున్నారు. కాలుష్యం బారిన ఈ ప్రాంతం పడకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ప్రవేశ మార్గాల వద్దనే వాహనాలను ఆపనున్నారు. 
 పార్కులా అభివృద్ధి చేసే ప్రాంతంలో కూర్చోవడానికి అనుకూలంగా బల్లలు ఏర్పాటు చేయనున్నారు. 2 కి.మీ పరిధిలోని ఈ ప్రాంతంలో పూర్తిగా కాలినడనకనే తిరగాల్సి ఉంది. మధ్యలో సీతాకోకచిలుక ఆకారంలో పెద్ద బోర్డులు పెట్టనున్నారు. వీటిపై వివిధ రకాల కీటకాల విశేషాలు, వాటి చిత్రాలు, అవి ఏరకమైన చెట్లపై ఆధారపడతాయి, వంటి విశేషాలను కూడా వివరించనున్నారు.

జీవవైవిధ్యాన్ని మెరుగుపరుస్తాం 
కొండపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న మూలపాడు బీట్‌లో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని వీక్షించేందుకు ప్రత్యేకంగా కాలిబాటను అభివృద్ధి చేయబోతున్నాం. ఇక్కడ జీవ వైవిధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుంది. ఇప్పటికే రెండు కిలోమీటర్ల మేర మార్గాన్ని గుర్తించాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుభవం ఉన్న స్వచ్ఛంద సంస్థల సాయాన్ని తీసుకుంటున్నాం. త్వరలో వారి ఆధ్వర్యంలో సీతాకోక చిలుకల గణన జరగనుంది. ఈ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం.

-రామచంద్రరావు, ఇన్‌ఛార్జి అటవీశాఖ అధికారి, విజయవాడ

అరుదైన జీవవైవిధ్యం 
జిల్లాల్లోని ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి కొండలపై రిజర్వ్‌ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది జి.కొండూరు మండలం వరకు విస్తరించింది. దట్టమైన ఈ కొండల్లో దాదాపు 30వేల ఎకరాల్లో ఉన్న ఈ అడవిలో పలు వృక్ష జాతులతో పాటు చిరుతలు, నక్కలు, తోడేళ్లు, వంటి పలు జంతువులు కనిపిస్తాయి. ఇందులోని మూలపాడు వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో వివిధ రకాల సీతాకోకచిలుకలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఇంత అరుదైన జీవవైవిధ్యం కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి నిత్యం చాలా మంది ట్రెక్కింగ్‌ కోసం వస్తుంటారు. శని, ఆదివారాల్లో యువత ద్విచక్ర వాహనాలు, కార్లలో ఇక్కడికి భారీగా వస్తారు. ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. సహజసిద్ధమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ నిర్ణయించింది.

Edited by sonykongara
Link to comment
Share on other sites

11 పెద్ద జలపాతాలు 
పేర్లు ప్రకటించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం 
amr-gen1a.jpg

సూర్యారావుపేట(విజయవాడ), న్యూస్‌టుడే: కొండపల్లి అడవుల్లో ఉన్న 11 పెద్ద జలపాతాలకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం శనివారం రాత్రి అధికారకంగా పేర్లను ప్రకటించారు. యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా విజయవాడ సభ్యులు 12ఏళ్లపాటు కొండపల్లి అడవుల్లో ట్రెక్కింగ్‌ నిర్వహించి దాదాపు 100కు పైగా చిన్న, పెద్ద జలపాతాలను గుర్తించారు. వీటిని అధ్యయనం చేసి వాటిలో నుంచి 11 పెద్ద జలపాతాలను ఎంపిక చేశారు. ఆయా జలపాతాల ప్రాశస్త్యం, భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా విజయవాడ ఛైర్మన్‌ ఎన్‌.విష్ణువర్దన్‌ కొన్ని పేర్లను నిర్ణయించారు.  కొండపల్లి అడవుల్లో ఉన్న అందమైన ఈ జలపాతాల వివరాలను తెలుసుకుని కలెక్టర్‌ లక్ష్మీకాంతం సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. కొండపల్లి, దొనబండ, మూలపాడు అడవుల్లో టెక్కింగ్‌ కోసం సిద్ధంగా ఉన్న 21 మార్గాల గురించి కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. సాహస క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. జిల్లా టూరిజం అధికారి డాక్టర్‌ వెలగా జోషి, రత్నప్రసాద్‌, కృపాకర్‌రావు, మల్లికార్జున్‌, అబ్దుల్‌ ఖలిక్‌ తదితరులు పాల్గొన్నారు. 
కొంగుధార(కొండపల్లి) 
నెమలిధార (మూలపాడు) 
క్షీరలింగ జలపాతం (మూలపాడు) 
మాదులమ్మ తీర్థం (దొనబండ) 
సప్తస్వర ధారలు (దొనబండ) 
చిట్టి తుంబురు కోన (దొనబండ) 
సీతాకోకల గుండం (మూలపాడు) 
కుడి-ఎడమల జలపాతం (మూలపాడు) 
వనమాలి జలపాతం (కొండపల్లి) 
బేబీ చిత్రకూట్‌ (కొండపల్లి) 
జడల కొలను (కొండపల్లి)

Link to comment
Share on other sites

జలపాతాల నామకరణం పోస్టర్‌ విడుదల
10-08-2018 07:44:05
 
636694838454333967.jpg
విజయవాడ: కొండపల్లి పరిసర రిజర్వు ఫారెస్ట్‌లో వెలుగుచూసిన అద్భుతమైన జలపాతాల నామకరణ పోస్టర్‌ను కలెక్టర్‌ లక్ష్మీకాంతం విడుదల చేశారు. పర్యాటకులు, ట్రెక్కర్లు వెళ్లగలిగే 12 జలపాతాలకు నెమలిధార, మావూళ్లమ్మ తీర్థం, కొంగుధార, వనమాలి, చిట్టితుంబుర ధార, సప్తస్వర ధార, కుడి, ఎడమల ధార, శ్రీమాదులమ్మ ధార, క్షీరలింగ, జడల కొలను, సీతాకోకల గుండం, బేబీ చిత్రకూట్‌ పేర్లను కలెక్టర్‌ ఖరారు చేశారు. వీటిలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం పేరుతో కూడా ఒక వాటర్‌ఫాల్‌ ఉంది. ఆయా పేర్లతో ఉన్న జలపాతాల పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (వైహెచ్‌ఏఐ) ద్వారా ఈ జలపాతాలకు సంబంధించి మరింత ప్రాచుర్యం కల్పించనున్నారు. అందులో భాగంగా వీటికి నామకరణం చేశారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో వైహెచ్‌ఏఐ తరఫున ఎన్‌.విష్ణువర్ధన్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ వెలగా జోషి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కొండపల్లి అడవుల్లో అందాలు
దసరా ఉత్సవాలకు వచ్చే సందర్శకులకు ఈ ఏడాది కొత్తగా కొండపల్లి అడవిలోని అందాలను పరిచయం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలోని సీతాకోక చిలుకల పార్క్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. ఇక్కడ దాదాపు 52 రకాల సీతాకోక చిలుకల జాతులను, కొండ కోనల మధ్య అందమైన జలపాతాలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు. ఇక్కడ పర్యాటకులు సేదతీరేందుకు వీలైన ఏర్పాట్లు చేపట్టాలని కూడా నిర్ణయించారు. దసరా ఉత్సవాలకు ముందుగానే ఇందుకు ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించారు.
 
మూలపాడు సీతాకోక చిలుకల పార్క్‌, కొండపల్లి ఫారెస్ట్‌ జలపాతాల సోయగాలకు సంబంధించి విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో ఇటీవల సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. రాజధాని ప్రాంతంలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా సహజ ప్రకృతి సౌందర్యంతో అలరారే వీటికి మరింత విశేష ప్రాచుర్యాన్ని కల్పించటానికి జిల్లా యంత్రాంగం దసరా ఉత్సవాలను ఒక వేదికగా చేసుకోవాలని భావిస్తోంది.
Link to comment
Share on other sites

రానున్న అక్టోబరులో ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పర్వత ప్రాంతాల్లో ర్యాప్‌లింగ్‌ అంతర్జాతీయ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో దేశంలోనే మొదటి సారిగా 52 రకాల జాతులతో కూడిన సీతాకోక చిలుకల వనాన్ని ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు సీతాకోకచిలుకల వనాన్ని సందర్శించ వచ్చన్నారు. దసరా ఉత్సవాల తరుణంలో నగరంలోని స్వరాజ్యమైదాన్‌లో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌, సీవీఆర్‌ కళాశాలలో సెప్టెంబరులో ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్టు చెప్పారు. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధి వంటకాలు ఉంటాయని వివరించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు పూర్తి అయిన క్రమంలో, త్వరలో సింగపూర్‌కు విమానాలను నడపనున్నట్టు తెలిపారు. బందరు ఓడ రేవు పనులకు సెప్టెంబరు చివరి వారంలో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • 2 months later...
పర్యాటక ఆకర్షణగా కేంద్రంగా ‘కొండపల్లి’ ఖిల్లా
09-11-2018 08:23:32
 
636773486135496001.jpg
  • పర్యాటక ఆకర్షణగా కేంద్రంగా అభివృద్ధి
  • రూ.10కోట్లతో అభివృద్ధి పనులు
  • పనులను పరిశీలించిన మంత్రి ఉమా
  • డిసెంబరులో ‘కొండపల్లి’ ఉత్సవాలు: మంత్రి
  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు
రాజధాని పర్యాటకానికి పెట్టని కోట కొండపల్లి ఖిల్లా. దీన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రూ.10 కోట్లతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇక్కడ అభివృద్ధి పనులను చేయిస్తోంది. రూ.50 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. చివరికి కేంద్రం చేతులు ఎత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖిల్లాకు సమీపాన క్రాఫ్ట్‌ బజార్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను ఏర్పాటు చేయబోతున్నారు.
 
 
విజయవాడ/ఇబ్రహీంపట్నం(ఆంధ్రజ్యోతి): కొండపల్లి ఖిల్లా చారిత్రక సంపదను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. డిసెంబర్‌ నెల మూడో వారంలో రాష్ట్ర ప్రభుత్వం కొండపల్లి ఖిల్లా ఉత్సవాలను జరపనున్న నేపథ్యంలో ఆయన ఏర్పాట్లను పురవస్తు శాఖ కమిషనర్‌ డాక్టర్‌ వాణి మోహన్‌, ఏపీ పర్యాటక శాఖ డైరెక్టర్‌ శుక్లాతో కలసి పరిశీలించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించటంతో పాటు పలు నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. వాటిలో ప్రధానంగా కొండపల్లి మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు పర్యాటకులను ఆకర్షించే విధంగా స్వాగత ద్వారం, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేటప్పుడు ఘాట్‌ రోడ్‌ వైపు స్వాగత ద్వారాలు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అంతే కాకుండా రెస్టారెంట్‌ లాంటివి కూడ నిర్మాణాలను పరిశీలించాలని కోరారు. అయితే అటవీశాఖ అనుమతులు ఇవ్వటం లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావటంతో జిల్లా అటవీశాఖ అధికారిని సంప్రదించారు. 1921 సంవత్సరంలో మద్రాసు ప్రిసిడెన్సీ కొండపల్లి ఖిల్లాపై ఐదు వేల ఎకరాలు పురావస్తు శాఖకు అప్పగిస్తూ జారీ చేసిన జీవోను గుర్తుచేశారు. కొండపల్లి ఖిల్లాపై ఏపీ పర్యాటక శాఖ, పురావస్తు శాఖతో సమన్వయం చేసుకుని అటవీశాఖ భూమిని అప్పగించాలని దాని ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
 
ఇదీ చరిత్ర..
erte4w46uws.jpgక్రీ.శ.1360లో రెడ్డి రాజైన అన వేమారెడ్డి కొండపల్లి కోట నిర్మాణం చేపట్టారు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడి నుంచి పాలన సాగించారు. తర్వాత మహ్మదీయ రాజైన నిజాం ఉల్‌ముల్క్‌ పాలనలో మంత్రి గవాన్‌ ఆధ్వర్యంలో ఈ కోటకు క్రీ.శ.1471లో మరమ్మతులు జరిగాయి. ఆ తర్వాత మహ్మద్‌ షా కాలంలో పురుషోత్తమ గజపతి ఈ కోటకు అధిపతి అయ్యారు. క్రీ.శ.1516లో విజయనగర రాజైన శ్రీకృష్ణ దేవరాయులు ఈ కోటను ముట్టడించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాలంలో గోల్కొండ పాలకులు కులీకుతుబ్‌షా ఖిల్లాను ఆక్రమించారు. అనంతరం ఇబ్రహీం కులీ కుతుబ్‌షా చేతికి ఈ కోట వచ్చింది.
 
కొండ దిగువున ఆయన పేరు మీదే ఇబ్రహీంపట్నం ఏర్పడిందని చెబుతారు. 1767లో బ్రిటీష్‌ వారి చేతిలోకి వెళ్లింది. ఆర్థిక సమస్యలతో 1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. నాటి నుంచి ఈ కోటను పట్టించుకున్న వారు లేరు. 1962లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి ఈ కోట వచ్చింది. నాటి నుంచి దీన్ని రక్షిత కట్టడంగా ప్రకటించారు. ఈ కోట అలనాటి రాజుల వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. దీనిలో మూడంతస్థుల రాతి బురుజు కనిపిస్తుంది. గజశాల, నర్తనశాల, వంటి కొన్ని భాగాలు ఇప్పటికీ ఇంకా ఇక్కడ మనకి దర్శనమిస్తుంటాయి.
 
కోట విశేషాలు
రాజమహల్‌ గోడలపై అత్యద్భుతంగా కళాఖండాలను తీర్చిదిద్దారు. నర్తనశాల నిర్మాణం అబ్బురపరుస్తుంది. నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజకుటుంబీకుల కోసం మరో కొలను.. ఇవన్నీ ఆ కొండపైనే కొలువుదీరిన నిర్మాణాలు.
 
భావి తరాలకు చారిత్రక సంపద
et5dtyd7o.jpgఅనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కొండపల్లి ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం రూ.10కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆ పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తున్నారని అన్నారు. కొండపల్లి ఖిల్లా మెట్ల మార్గంను కూడ పునరుద్ధరణ చేయనున్నట్లు తెలిపారు. కొండపల్లి నుంచి తిమ్మరుసు రహదారి మార్గంను కూడ పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.డిసెంబర్‌ మూడవ వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోజెక్షన్‌ మ్యాపింగ్‌ 3డి లేజర్‌ షోను ఖిల్లాపై ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
చాళుక్యుల దగ్గర నుంచి కృష్ణ దేవరాయల కాలం వరకు రాజుల పరిపాలన గురించి మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఖిల్లాపై ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య, వైస్‌ ఎంపీపీ చెరుకూరి వెంకటకృష్ణ, రాజశేఖర్‌, తుమ్మల శ్రీనివాసరావు, చెన్నుబోయిన చిట్టిబాబు, నారాయణ, మైలా సైదులు, శ్రీనివాసరావు, బొర్రా క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
వేడుకల ఖిల్లా..!
అలనాటి అందాలకు ఆధునిక సొబగులు
డిసెంబర్‌లో మూడు రోజులపాటు నిర్వహణ
శరవేగంగా ఉత్సవాల ఏర్పాట్లు
amr-gen15a.jpg

ఏకచత్రాధిపత్యం చేసిన రాజమార్తాండల చరిత్రలతో కూడిన మ్యూజియం.. 13వ శతాబ్ధం నాటి నుంచి నేటి వరకు కోటకున్న ప్రాశస్త్యం తెలిపే ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ (దృశ్య చిత్రీకరణ).. దేదీప్య కాంతుల లేజర్‌ షో.. చూడటానికి రెండు కళ్లూ చాలని పచ్చని సోయగాలు... సువిశాల సుందర ప్రాంగణం. ఇవన్నీ పురాతన కొండపల్లి కోటలో ఏర్పాటు కానున్నాయి. కొండపల్లి ఖిల్లా ఉత్సవాల పేరుతో మూడు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలకు కోట సర్వంగా సుందరంగా రూపుదిద్దుకొంటోంది.

న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆర్కియాలజీ కన్సల్టెంట్‌ షికా జైన్‌ దిశా నిర్దేశంతో కోట అందాలు ఇనుమడించనున్నాయి. ఈ ఉత్సవాలను డిసెంబర్‌ నెలలో చేపట్టనున్న నేపథ్యంలో కోట అంతర్‌, బాహ్య భాగంలో పూర్వ అందాలను పదిలపరుస్తూ కొద్దిపాటి మార్పులు చేసి ఆధునిక హంగులు సమకూర్చనున్నారు. అందులో భాగంగా పలు అందమైన రంగులు అద్దనున్నారు.

మ్యూజియం: కోట దిగువ భాగాన్ని దర్బార్‌ హాల్‌ 9 వేల అడుగుల్లో 74 ఆర్చీలతో దీనిని నిర్మించగా ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. 13వ శతాబ్ధంలో కొండపల్లి కోటను నిర్మించిన రెడ్డిరాజుల కాలం నుంచి అనంతరం పాలించిన వంశీయుల చరిత్ర అక్కడ పదిలపరచనున్నారు. రాజరికం అనంతరం ఆంగ్లేయుల పాలనలో కోటను ఎలా ఉపయోగించారు అనే అంశాలతో పాటు ఇతర రాజులకు సంబంధించిన చరిత్ర దర్బారు హాల్‌లో ఏర్పాటు చేయనున్నారు. పురావస్తు శాఖ సేకరించిన కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. సందర్శకుల కోసం దర్బారు హాల్‌ను శీతలీకరణ చేయడంతో పాటు పలు వర్ణాల్లో వెలుగులు అద్దనున్నారు.

గోల్కొండ దారి వద్ద ప్రవేశం: కోట పడమర భాగంలో గోల్కొండ దారిగా వ్యవహరించే ప్రాంతం నుంచి కోటకు రావడానికి ప్రత్యేక మార్గాన్ని అభివృద్ధి చేశారు. వంద వాహనాలు నిలిపి ఉండేలా రివిటింగ్‌తో కూడిన ప్రాంగణాన్ని ఏర్పరుస్తున్నారు. బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీ కృష్ణదేవరాయుల స్వాగత ద్వారాలు: కొండపల్లి నుంచి ఖిల్లాకు వెళ్లే దిగువ ప్రాంతంలో, ఇబ్రహీంపట్నం నుంచి ఖిల్లాకు వెళ్లే ప్రాంతంలో కృష్ణదేవరాయల చిత్ర పటాలు, కోట వివరాలు తెలిపే స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌
కోట తూర్పు భాగంలో ఆరు ఆర్చీల ద్వారా ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. దర్బార్‌ హాల్‌లోని మ్యూజియం తెలిపే విశేషాలను దృశ్య, శ్రావణ పద్ధతుల్లో ఆహుతులకు అర్ధమయ్యే రీతిలో కొండపల్లి కోట నిర్మాణ రీతిని, వైశాల్యాన్ని, రాజుల చరిత్రలను ఇక్కడ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ ద్వారా వివరించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ల్యాండ్‌ స్కేపింగ్‌
కోట పడమర వైపు ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు చేపట్టారు, అవెన్యూ ప్లాంటింగ్‌తో అందమైన మొక్కలను ఉంచుతున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న పురాతన చెట్ల మధ్య పర్యాటకులు గడపటానికి అందమైన వాతావరణాన్ని రూపొందిస్తున్నారు. పచ్చని చెట్లు, బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. పదేళ్ల నాటి ప్రవేశద్వారాన్ని సువిశాలంగా మారుస్తున్నారు.

ముఖ ద్వారం వద్ద అందమైన ఆకృతి
*కోట ముఖద్వారం తూర్పు వైపు కావడంతో అక్కడి ప్రాంతాలను సైతం కోట రాళ్లతోనే పునఃనిర్మాణం చేపట్టారు. నాడు రాజులు వచ్చిన మార్గాన్నే ఉత్సవాలకు వచ్చే వారు నడిచే విధంగా చక్క దిద్దుతున్నారు.
*మూడు రోజుల పాటు నిర్వహించే ఖిల్లా ఉత్సవాల్లో రాత్రిపూట విద్యుత్తు కాంతులు వెదజల్లనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
సాహస క్రీడల ఖిల్లా
13-12-2018 06:38:29
 
636802799105967156.jpg
  • ఇంటర్నేషనల్‌ అడ్వెంచర్‌ ఈవెంట్ల నిర్వహణ
  • జనవరిలో ముహూర్తం
  • సుమారు ఎనిమిది అంశాల్లో పోటీలు
  • 500-1000 మంది సాహస క్రీడాకారులు వస్తారని అంచనా
  • ఎఫ్‌1హెచ్‌2వో నిర్వహణతో దేశవిదేశాల్లో బెజవాడ పేరు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీలైఫ్‌): ఎఫ్‌1హెచ్‌2వో బోట్‌ రేసింగ్‌తో అంతర్జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలిగిన విజయవాడ మరోసారి ప్రపంచచూపును ఆకర్షించబోతున్నది. ఇప్పటికే ఫార్ములా వన్‌ రేసింగ్‌ను విజయవంతంగా నిర్వహించిన ఘనతను విజయవాడ పుటల్లో లిఖించుకుంది. త్వరలో మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు అడుగులు వేస్తోంది. చారిత్రక నేపథ్యం, వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కొండపల్లి ఖిల్లా సాక్షిగా సాహసక్రీడలు నిర్వహించనున్నారు. జనవరిలో అంతర్జాతీయ కొండపల్లి సాహసక్రీడలను ఇక్కడ నిర్వహించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఇండియా (వైహెచ్‌ఏఐ) విజయవాడ చాప్టర్‌, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాయి. జనవరి 20 లేక 21వ తేదీన ఈవెంట్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. భాషా, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జనవరిలో కొండపల్లి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలోభాగంగా అంతర్జాతీయ సాహస క్రీడలను నిర్వహించడానికి రంగం సిద్ధమవుతున్నది. కొండపల్లి కేంద్రంగా గడచిన 15 ఏళ్లుగా సాహస క్రీడలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సాహస క్రీడలను 24 గంటల పా టు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
 
ఇవీ ఈవెంట్లు
Untitled-15.jpgకొండపల్లి చుట్టుపక్కల ఉన్న కొండలు, దాన్ని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సాహస క్రీడలను నిర్వహిస్తారు. ఏయే కేటగిరీల్లో పోటీలను నిర్వహించాలన్న దానిపై అధికారులు, వైహెచ్‌ఏఐ ప్రతినిధులు ఒక స్పష్టతకు వచ్చారు. రాప్ల్లెంగ్‌, ట్రెక్కింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, జుమారింగ్‌, జిప్‌లైన్‌, ట్రజర్‌ హంట్‌, అడ్వంచర్‌ పెయింటింగ్స్‌, నైట్‌ ట్రెక్కింగ్‌ వంటి కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలకు వివిధ దేశాల నుంచి 500-1000 మంది వరకు సాహస క్రీడకారులు హాజరవుతారని భావిస్తున్నారు. దేశంలో పలు సాహసక్రీడలు యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన శాఖలు అన్ని దేశాల్లోనూ ఉన్నా యి. ఆయా దేశాల్లో ఉన్న సాహస క్రీడాకారులు ఈ వైఏహెచ్‌ఐకి అనుబంధంగా ఉంటారు. కొండపల్లిలో నిర్వహించే అంతర్జాతీయ సాహస క్రీడలకు సంబంధించిన ఆహ్వానాన్ని ఆయా శాఖలకు పంపుతారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభింస్తారు. మరో రెండు, మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్లను మొదలు పెడతమాని వైహెచ్‌ఏఐ విజయవాడ అధ్యక్షుడు విష్ణువర్థన్‌ తెలిపారు.
 
రాప్లెంగ్‌: ఈ విభాగంలో క్రీడాకారులు ఎత్తైన కొండపై నుంచి తాడు సహాయంతో కిందికి దిగుతారు.
ట్రెక్కింగ్‌: ఈ కేటగిరిలో క్రీడాకారులు కొం డలపైకి, అడవుల్లోకి నడిచి ఎక్కుతారు.
రాక్‌ క్లైంబింగ్‌: ఈ విభాగంలో క్రీడాకారులు కొండలపైకి ఎక్కడ, దిగడం చేస్తారు.
జిప్‌లైన్‌: ఇందులో రెండుకొండల మధ్య తాడులు కడతారు. దానిద్వారా ఒకవైపునుంచి మరోవైపునకు వెళ్లాలి.
జుమారింగ్‌: ఈ విభాగంలో క్రీడాకారులు తాళ్ల సహాయంతో కింది నుంచి కొండపైకి ఎక్కుతారు.
ట్రజర్‌ హంట్‌: ఇందులో కొన్ని వస్తువులను అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో కనిపించకుండా ఉంచుతారు. క్రీడాకారులు వాటిని గుర్తించాలి.
నైట్‌ ట్రెక్కింగ్‌: అడవుల్లోనూ, కొండలపైన క్రీడాకారులు రాత్రి పూట నడుస్తారు. టార్చిలైట్ల సహాయంతో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తారు.
అడ్వంచర్‌ పెయింటింగ్స్‌: అడవుల్లోని చెట్లకు సాహస క్రీడలకు సంబంధించిన పెయింటింగ్స్‌ వేస్తారు.
 
 
కొండపల్లి చుట్టూ..
  • gataewr.jpgకొండపల్లిలోని అటవీ ప్రాంతం 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది.
  • కొండపల్లి, మాధవరం, గంగినేని, జజ్జూరు, గొట్టిముక్కల, పరిటాల, మూలపాడు ప్రాంతాల్లో ఈ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.
  • విజయవాడ నుంచి కొండపల్లి 23 కిలోమీటర్లు.
  • ఈ ప్రాంతాల్లో ఉన్న జలపాతాలకు ఇటీవలే మాతృభాషలో నామకరణం చేశారు.
  • నెమలిధార, మావుళ్లమ్మ తీర్థం, కొంగుధార, బేబీ చిత్రకూట్‌, వనమాలి జలపాతం, కుడి, ఎడమల జలపాత, చిట్టి తుంబురధార, సప్త స్వరధారలు వంటివి ఇక్కడ ఉన్నాయి.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...