Jump to content

Vizag Apples,Lychee (litchi)Fruit


Recommended Posts

నవ్యాంధ్రకూ ‘లిచీ’ రుచి
 
  • సాగుకు విశాఖ ఏజెన్సీ అనుకూలం
  • చింతపల్లిలో ఏడాదిగా ప్రయోగం
తాడేపల్లిగూడెం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న లిచీ పండ్లు నవ్యాంధ్రప్రదేశ్‌కూ రుచులు పంచనున్నాయి. విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతంలో ఏడాదిగా సాగుతున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో, లిచీ పండ్ల సాగు విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ పండ్ల జాతి సాగుకు విశాఖ ఏజన్సీ అనువుగా ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. చింతపల్లిలోని పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మకంగా సాగు మొదలుపెట్టారు. తొలి ఏడాది 48 మొక్కలతో మొదలుపెట్టారు. నిజానికి, లిచీ పండ్ల సాగులో అంతర్జాతీయ మార్కెట్‌లో చైనా తరువాతి స్థానం భారతదే. కిలో రూ.200 నుంచి రూ.250 పలుకుతోంది. పోషక విలువలు, విటమిన్లు అధికంగా కలిగి, రోగ నిరోధక శక్తిని పెంచే ఈ జాతి పండ్లను బిహార్‌, యూపీ, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాషా్ట్రల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఐదేళ్ల వ్యవధిలో కాపుకొచ్చే లిచీ సాగు మంచి ఫలితాలను సాధిస్తే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైస్‌ చాన్సలర్‌ బీఎంసీ రెడ్డి తెలిపారు.

 

Link to comment
Share on other sites

 

నవ్యాంధ్రకూ ‘లిచీ’ రుచి

 

  • సాగుకు విశాఖ ఏజెన్సీ అనుకూలం
  • చింతపల్లిలో ఏడాదిగా ప్రయోగం
తాడేపల్లిగూడెం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న లిచీ పండ్లు నవ్యాంధ్రప్రదేశ్‌కూ రుచులు పంచనున్నాయి. విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతంలో ఏడాదిగా సాగుతున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో, లిచీ పండ్ల సాగు విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ పండ్ల జాతి సాగుకు విశాఖ ఏజన్సీ అనువుగా ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం  గుర్తించారు. చింతపల్లిలోని పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మకంగా సాగు మొదలుపెట్టారు. తొలి ఏడాది 48 మొక్కలతో మొదలుపెట్టారు. నిజానికి, లిచీ పండ్ల సాగులో అంతర్జాతీయ మార్కెట్‌లో చైనా తరువాతి స్థానం భారతదే. కిలో రూ.200 నుంచి రూ.250 పలుకుతోంది. పోషక విలువలు, విటమిన్లు అధికంగా కలిగి, రోగ నిరోధక శక్తిని పెంచే ఈ జాతి పండ్లను బిహార్‌, యూపీ, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాషా్ట్రల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఐదేళ్ల వ్యవధిలో కాపుకొచ్చే లిచీ సాగు మంచి ఫలితాలను సాధిస్తే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైస్‌ చాన్సలర్‌ బీఎంసీ రెడ్డి తెలిపారు.

 

:terrific:

Link to comment
Share on other sites

మన్యానికి ‘హరిమాన్‌’ యాపిల్‌
 
636049176584299480.jpg
చింతపల్లి, జూలై 23: విశాఖ మన్యంలో మరో యాపిల్‌ రకం సాగులోకి రానుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని.. అధిక దిగుబడినిచ్చే ‘హరిమాన’ను ప్రయోగాత్మకంగా సాగుచేయనున్నారు. ఉత్తరప్రదేశలో అధికంగా సాగుచేసే ఈ రకంపై చేసిన ప్రయోగాలు ఫలించాయి. దీంతో చింతపల్లి పరిశోధన స్థానానికి వచ్చిన 500 మొక్కలను చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీసీఎంబీ డైరెక్టర్లు డాక్టర్‌ రమేశ్‌ అగర్వాల్‌, డాక్టర్‌ ఎ.వీరభద్రరావు శనివారం తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో వీటిని నాటుతామని.. రెండేళ్లలో యాపిల్‌ సాగు ఫలితాలు వస్తాయని వివరించారు. కాగా, ఈ ఏడాది తెలంగాణలోనూ యాపిల్‌ సాగు ప్రారంభిస్తున్నట్టు సీసీఎంబీ డైరెక్టర్లు తెలిపారు. అదిలాబాద్‌ జిల్లాలోని జోడిఘాట్‌ ఏజెన్సీలో యాపిల్‌ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాది 500 మొక్కలను పది మంది రైతులకు ఇస్తామన్నారు.
Link to comment
Share on other sites

  • 6 months later...
ఏజెన్సీలో యాపిల్‌ సాగు
 
636213391726154219.jpg
 
  • శీతలపంట సాగుకు విశాఖ అనుకూలం
  • హిమాచల్‌ నుంచి 10 వేల మొక్కలు
  • వారంలో గిరిజన రైతులకు పంపిణీ
చింతపల్లి(విశాఖ జిల్లా), జనవరి 29: పచ్చదనాల ఏజెన్సీ.. ఎర్రదనాల మందార వనం కానుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించడంతో..ఈ శీతల పంటని ఇక్కడ సాగు చేసేందుకు రంగం సిద్ధమయింది. పాడేరు ఐటీడీఏ అధికారులు హిమాచల్‌ప్రదేశ నుంచి ప్రత్యేకంగా యాపిల్‌ మొక్కలు తీసుకొచ్చారు. నాలుగు రకాలకు చెందిన సుమారు 10 వేల మొక్కలు ఆదివారం చింతపల్లి ఉద్యానవన పరిశోధనాకేంద్రానికి చేరుకున్నాయి. వీటిలో అన్న, డార్సెట్‌గోల్డ్‌, ఫిజి, గాల రకాలు ఉన్నాయి.
 
 
ఐటీడీఏ పీహెచ్‌వో ప్రభాకరరావు, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శివకుమార్‌, ప్రదీప్‌ కుమార్‌, యాపిల్‌ సాగు సలహాదారు వీ పురుషోత్తమరావు, హిమాచల్‌ప్రదేశలోని నేవా ప్లాంటేషన్‌ మేనేజర్‌ నితిన్‌ ఈ మొక్కలను పరిశీలించారు. ఈ మొక్కలను వారం రోజుల్లో రైతులకు పంపిణీ చేస్తామని ట్రైకార్‌ రాష్ట్ర పథక సమన్వయకర్త(ఎస్ పీసీ) సీహెచ్‌ ఆనంద్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. పాడేరు ఐటీడీఏ అధికారులు ఎంపిక చేసిన 100 మంది రైతులకి 100 మొక్కల చొప్పున వారంలో ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు
Link to comment
Share on other sites

  • 4 months later...
మన మన్యంలోనే స్ట్రాబెర్రీ, డ్రాగన్‌ ఫ్రూట్‌
 
 
636333484893731046.jpg
  • ఏజెన్సీలోనే పండనున్న యాపిల్‌
  • ప్రయోగాత్మక సాగుకు పాడేరు ఐటీడీఏ ప్రణాళిక
  • ట్రైకార్‌ పథకం కింద ఉచితంగా మొక్కలు పంపిణీ
  • ఇప్పటికే గిరిజన రైతులకు 9 వేల యాపిల్‌ మొక్కలు
  • వచ్చే జనవరిలో మరో 10 వేల మొక్కలు అందజేత
విశాఖ ఏజెన్సీ విభిన్న వాతావరణం ఉన్న ప్రాంతం. ఇక్కడ ఉత్తర భారతదేశం, విదేశాల్లో సాగుచేసే అరుదైన పంటలు కూడా పండుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిరూపించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏజెన్సీలో యాపిల్‌ సాగును విస్తరించిన ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు.. ఆదివాసీ రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు డ్రాగన్‌ ఫ్రూట్‌, స్ట్రాబెర్రీల సాగు చేయించాలని ప్రణాళికలు సిద్ధంచేశారు.
 
లాభాల సాగు
చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సహకారంతో మండలంలోని గొందిపాకలు గ్రామానికి చెందిన బౌడు కుశలవుడు ఐదేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు చేసి లాభాలను అర్జిస్తున్నాడు. అలాగే ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి కిలోమీటరు దూరంలోనున్న జల్లూరుమెట్ట గ్రామంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయ శ్రీరామ్‌ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ను మూడేళ్లుగా విజయవంతంగా సాగుచేస్తున్నాడు. విశాఖ ఏజెన్సీ డ్రాగన్‌ ఫ్రూట్‌, స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలమని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం పూర్వ అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త దివంగత డాక్టర్‌ సీహెచ్‌.చంద్రశేఖరరావు నివేదిక ఇచ్చారు. దీంతో ఈ ఏడాది ట్రైకార్‌ పథకం కిందట రైతులకి ఈ పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ప్రాజెక్టు ఉద్యాన శాఖ అధికారి ప్రభాకర్‌రావు తెలిపారు.
 
ఇక ఆంధ్రా యాపిల్‌
ఇప్పటికే చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన యాపిల్‌ సాగు విజయవంతమైంది. దీంతో పాడేరు ఐటీడీఏ అధికారులు ఈ ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి దిగుమతి చేసుకున్న అన్న, డార్సెట్‌ గోల్డ్‌ రకాలకు చెందిన సుమారు తొమ్మిది వేల మొక్కలను జనవరిలో 104 మంది గిరిజన రైతులకు ట్రైకార్‌ కింద ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కొక్క రైతు 20 సెంట్ల నుంచి అర ఎకరం విస్తీర్ణంలో మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటీవల తాను దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీ గిరిజనులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, యాపిల్‌ సాగుపట్ల తమకూ ఆసక్తి ఉందని, మొక్కలు సరఫరా చేయాలని కోరారు. వారికి ట్రైకార్‌ పథకం కింద యాపిల్‌ మొక్కలను పంపిణీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఫలితంగా ఈ ఏడాది మరో పదివేల యాపిల్‌ మొక్కలను రైతులకు పంపిణీ చేసేందుకు ఐటీడీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
2dragon-fruit.jpg 
తొలి ఏడాది 50 ఎకరాల్లో సాగు
అసక్తి కలిగిన ఆదర్శ ఆదివాసీ రైతులతో తొలి ఏడాది 50 ఎకరాల్లో డ్రాగన్‌, స్ట్రాబెర్రీ సాగు చేపట్టాలని ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైకార్‌ పథకం ద్వారా రైతులకు మొక్కలు, ఎరువులు ఉచితంగా అందజేయనున్నారు. మొక్కలను హిమాచల్‌ప్రదేశ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిఫారసు మేరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క రైతుతో అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో ఈ రెండు రకాల పంటలను సాగుచేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలోనే మొక్కలను దిగుమతి చేసుకుని రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- చింతపల్లి
 
రైతులను ఎంపిక చేస్తున్నాం
స్ట్రాబెర్రీ, డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేసేందుకు అసక్తి చూపే రైతులను ఎంపిక చేస్తున్నాం. ఇప్పటికే ట్రైకార్‌ ద్వారా 104 మంది ఆదివాసీలతో తొమ్మిది వేల యాపిల్‌ మొక్కలు నాటించాం. వచ్చే ఏడాది మరో పది వేల మొక్కలను పంపిణీ చేస్తాం. ఇదే పథకంలో డ్రాగన్‌ఫ్రూట్‌, స్ట్రాబెర్రీ సాగును ఏజెన్సీలో విస్తరించేందుకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఆదివాసీలు ఈ నూతన ఉద్యాన పంటలు సాగుచేసుకోవడం వల్ల ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది.
- ప్రభాకర్‌రావు, ప్రాజెక్టు ఉద్యానశాఖ
అధికారి, ఐటీడీఏ పాడేరు
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
  • 1 month later...
  • 5 months later...
యాపిల్‌.. కాపుకొచ్చిందోచ్‌!
14-05-2018 02:51:18
 
636618630786982971.jpg
అతిశీతల ప్రాంతాల్లో మాత్రమే పండే యాపిల్‌.. ఆంధ్ర కశ్మీర్‌గా పేరుగాంచిన విశాఖ మన్యంలోనూ గుబాళించింది. మూడేళ్ల క్రితం చింతపల్లి క్షేత్రంలో యాపిల్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా సాగుచేసి ఫలితం సాధించారు. ఆ స్ఫూర్తితో గిరిజన వికాస్‌ స్వచ్ఛంద సేవా సంస్థ, హైదరాబాద్‌ సీసీఎంబీ శాస్త్రవేత్తల సహకారంతో ఏడాదిన్నర క్రితం జీకేవీధి, చింతపల్లి మండలాల్లో 100 మంది గిరిజన రైతులకు ఒక్కొక్కరికి వంద మొక్కల చొప్పున పంపిణీ చేశారు. ఇందులో గూడెంకొత్తవీధి మండలం కట్టుపల్లికి చెందిన మాతే కృపారావు పొలంలో నాటిన వంద మొక్కల్లో ఎనిమిది మొక్కలు కాయలు కాశాయి. కాయల పరిమాణం, రుచి బాగున్నా ఆకారం కాస్త భిన్నంగా, పొడవుగా ఉండడం విశేషం. యాపిల్‌ మొక్కలు నాటిన రెండేళ్ల తర్వాత నుంచి కాపుకాస్తాయని, కొన్ని మొక్కలు ఏడాదిన్నరకే కాపునకు రావడం విశేషమని గిరిజన వికాస్‌ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి నెల్లూరి సత్యనారాయణ తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...