Jump to content

పటాస్ కాంబో.. మళ్లీ కలుస్తున్నారోచ్


swas

Recommended Posts

కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్.. గతేడాది బ్లాక్ బస్టర్లలో ఒకటి. ఈ మూవీ సక్సెస్ తర్వాతే నందమూరి నామ సంవత్సరం అనే కాన్సెప్ట్ కూడా మొదలైంది. తనే ఈ చిత్రాన్ని నిర్మించాడు కళ్యాణ్ రామ్. కరప్టెడ్ పోలీస్ పాత్రలో కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ను సూపర్బ్ గా చూపించి సక్సెస్ కొట్టాడు అనిల్ రావిపూడి.

 
 
అనిల్ రావిపూడు తను తీసిన రెండో సినిమా సాయిధరంతేజ్ మూవీ సుప్రీమ్ తో కూడా సూపర్ హిట్ కొట్టేశాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కు ఓకే చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది. దీన్ని కళ్యాణ్ రామ్ తనే నిర్మించనున్నాడు. తన మూడో సినిమాని ఎనర్జిటిక్ హీరో రామ్ తో తీయనున్న అనిల్ రావిపూడి అది పూర్తయ్యాక.. తన నాలుగో చిత్రంగా మళ్లీ కళ్యాణ్ రామ్ నే డైరెక్ట్ చేయనున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు బిజీగానే ఉన్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఈ నందమూరి హీరో.. అది పూర్తయ్యాక సొంత బేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. హిట్ కాంబో మళ్లీ సెట్ కావడంతో.. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...