February 19, 20179 yr Author 15 ఆలోచనలతో ‘స్టార్ట్’ యువ కలలకు వ్యాపార రూపం విజయవాడలో ‘స్టార్ట్ ఏపీ’ మొదలు తొలినాడే 2,500 ఆలోచనలపై కసరత్తు ఎంపిక చేసిన ఆలోచనలకు తిరుపతి, విజయవాడ ఇన్‌క్యుబేషన్‌ల్లో సాన ఇన్నోవేషన్ సొసైటీ, వైస్క్వేర్ నిర్దేశం అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): తమకు వచ్చిన విభిన్న ఆలోచనలపై ఒకవైపు వేలమంది యువత మథనం! మరోవైపు వాటిల్లో అత్యుత్తమ ఆలోచనలు ఏవీ? ఏ ఆలోచనలను అభివృద్ధి చేసి వ్యాపార స్థాయికి తీసుకెళ్లొచ్చన్న దానిపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల పరిశీలన! మొత్తంగా ఒక్కరోజులో 2,500 ఆలోచనలు! వడపోతలో 200 ఆలోచనల ఎంపిక! తుదిదశలో 15ఆలోచనలతో ‘స్టార్ట్‌ప’! ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ-వై స్వ్కేర్ బిజినెస్ ఇంక్యుబేషన్ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘స్టార్ట్ ఏపీ’ కార్యక్రమం ఇలా మొదలైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు 2,500 మంది పాల్గొన్నారు. రెండు వేదికలు ఏర్పాటుచేసి 35సెషన్లుగా వివిధ అంశాలపై అందరి ఆలోచనలను నిపుణులు, పారిశ్రామికవేత్తలు విన్నారు. చివరకు 15ఆలోచనలను ఎంపికచేశారు. ‘‘వినూత్న ఆలోచనలను తగిన మార్గదర్శకం అందిస్తాం. పెట్టుబడిదారులతో మాట్లాడి ఆ ఆలోచనలకు వ్యాపారరూపం తీసుకురావడంలో, ప్రభుత్వం తరఫున సాయపడతాం’’ అని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో నిఖిల్ అగర్వాల్ హామీఇచ్చారు. ఎంపికైన ఆలోచనలకు తిరుపతి, విజయవాడ ఇంక్యుబేషన్ కేంద్రాల్లో అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎంపికైన ఆలోచనలకు, ఆలోచనదారులకు.. ఎలాంటి చార్జీలు లేకుండా నెట్‌వర్కింగ్, మార్కెటింగ్‌చేసి పెడతామంటూ యువకులను వై స్క్వేర్ బిజినెస్ ఇంక్యుబేషన్ కేంద్రం ఛైర్మన్ వై.వి.రత్నకుమార్ ఉత్సాహపరిచారు. ‘‘ఆలోచన ఆచరణ రూపంలోకి వచ్చి స్టార్ట్‌పగా మారాక.. వ్యాపార భాగస్వాములుగా చేసుకుంటాం. స్టార్ట్‌పగా మారిన ఆలోచనలకు ప్రపంచ, జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉన్న విస్తృత అవకాశాలను పరిశీలించి ఒక నెట్‌వర్క్ ఏర్పాటుచేస్తాం. ఏంజెల్ ఇన్వెస్టర్స్‌ను కూడా తీసుకొస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ట్ ఏపీ చైర్మన్ సిద్ధార్థ్ మారుపెద్ది, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చైర్మన్ విష్ణు ఇందూరి, పవర్‌హౌస్ వెంచర్స్ ప్రతినిధి పెద్దు, ఓయో ప్రతినిధి హేమసుందర్, ఇంక్‌మాంక్, డిజిటెంట్, పీడబ్ల్యూసీ తదితర వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
November 21, 20187 yr Author AP Development Forum Retweeted 10,000 Start-ups @NASSCOMStartUps 9h9 hours ago We launch Make in AP, a unique initiative by NASSCOM 10,000 Startups and @ap_innovation with @idealabsftv as the Knowledge partner, today. Stay tuned for more information. #MakeInAP #Amravati #AP
December 27, 20187 yr Author ‘స్టార్టప్’ లీడర్ ఆంధ్ర27-12-2018 03:46:12 ప్రత్యేక ఫండ్ కూడా ఏర్పాటు అమరావతి అభివృద్ధికి సహకరించండి సింగపూర్ తరహాలో జూ ఏర్పాటు ఆ దేశ రాయబారితో లోకేశ్ భేటీ వివిధ సంస్థల ప్రతినిధులతో కూడా.. ప్రవాసాంధ్రులతోనూ సమావేశం బీజేపీ అన్యాయం చేసిందని ధ్వజం అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సహకరించాలని మంత్రి లోకేశ్ సింగపూర్ విదేశీ వ్యవహారాల రాయబారి గోపీనాథ్ పిళ్లైను కోరారు. అమరావతి నిర్మాణంలో సహకరించేందుకు సింగపూర్ ప్రభుత్వం పిళ్లైను ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఎస్‌ఆర్ నాథన్ ఫెలోషి్‌పలో భాగంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన లోకేశ్.. బుధవారం పిళ్లైను కలిశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక వసతుల నిర్వహణపై చర్చించారు. ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చే విధంగా క్యాపిటల్ రీజియన్ ఇన్వె్‌స్టమెంట్ ప్రమోషన్ ఏజెన్సీ, ఇన్నోవేషన్ కారిడార్ ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్ వ్యాలీ ఏర్పాటుచేసి అనేక స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘ఏంజెల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి మార్గం సుగమమైంది. అందులో మా రాష్ట్రం.. దేశంలోనే లీడర్‌గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తరపున స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని పిళ్లై తెలిపారు. అనంతరం సింగపూర్ వైల్డ్‌లైఫ్ రిజర్వ్ సీఈవో మైక్‌బార్లేతో లోకేశ్ సమావేశమయ్యారు. ప్రపంచంలోని ఉత్తమ నిర్వహణ ఉన్న జంతు ప్రదర్శనశాలల్లో సింగపూర్ జూ ఒకటి. ఏటా 17 లక్షల మంది ఈ జూను సందర్శిస్తారని, 315 జాతుల జంతువులు ఇందులో ఉన్నాయని బార్లే వెల్లడించారు. లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సింగపూర్ జూ తరహాలో జంతుప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని.. దీనికి సహకరించాలని కోరారు. కట్టుబట్టలతో గెంటేశారు అనంతరం లోకేశ్‌ను సింగపూర్ ఎన్‌ఆర్‌టీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదని, మనల్ని కట్టుబట్టలతో బయటకు గెంటేశారని చెప్పారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం సాకారం చేశారు. గ్రామాల్లో ఎప్పుడూ లేని విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. కానీ ప్రత్యేక ప్యాకేజీ అని బీజేపీ మోసం చేసింది. దానితో పాటు ఇచ్చిన 18 హామీలను నెరవేర్చలేదు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ని అన్ని సీట్లలో టీడీపీ గెలిస్తే.. దేశ ప్రధాని ఎ వరనేది సీఎం నిర్ణయిస్తారు’ అని చెప్పారు.
September 23, 20241 yr 1 hour ago, sonykongara said: Ento anna, 2014 - 2019 , 500 kooda vachundavemo.... ulukupaluku ledhu, hyd antha gattiga ga unte, manakaemi vasthay. adhi 2019 - 2024 choosaaka, janalu itu raaru... 2029 kanna bagupadaalani korukundham
April 3, 20251 yr Author Cm chandrababu: ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, ఇతర మేధావులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. By Andhra Pradesh News DeskPublished : 03 Apr 2025 05:02 IST Ee Font size 2 min read పారిశ్రామికవేత్తలు, మేధావులకుచంద్రబాబు పిలుపు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, ఇతర మేధావులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 20 వేల స్టార్టప్‌లు ఏర్పాటు అయ్యేలా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాటి ద్వారా లక్ష మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఆంత్రప్రెన్యూర్’ సంకల్పాన్ని సాకారం చేసేందుకు సహకరించాలని కోరారు. సచివాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) గురించి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అందరిలో స్ఫూర్తి నింపేందుకు ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టాం. రాష్ట్రం నుంచి కొత్త పారిశ్రామికవేత్తలు రావాలి. నూతన ఆవిష్కరణలకు రాష్ట్రం హబ్ కావాలి. అదే స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించాలి’ అని పేర్కొన్నారు. టాటా గ్రూప్, టాటా సన్స్ ఛైర్మన్, ఆర్‌టీఐహెచ్ వైస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ సహా మరికొందరు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. జీరో పావర్టీ-పీ4, ఇంటికో పారిశ్రామికవేత్త కార్యక్రమాలు ఎంతో ఉన్నతమమైనవని సమావేశానికి హాజరైన పలువురు అభిప్రాయపడ్డారు. పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు అమరావతి హబ్‌కు అనుసంధానంగా.. ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌గా అమరావతి ఉంటుంది. దీనికి టాటా గ్రూప్ నాయకత్వం వహిస్తుంది. ఎల్ అండ్ టీ, ఎంఎంఎన్‌ఎస్ భాగస్వామ్య సంస్థలుగా వ్యవహరిస్తాయి. దీనికి అనుబంధంగా రాష్ట్రంలో మరో ఐదు అనుబంధ విభాగాలు ఏర్పాటవుతాయి. అనంతపురంలో ఏర్పాటు చేసే హబ్‌కు జేఎస్‌డబ్ల్యూ, తిరుపతికి అదానీ గ్రూప్, విజయవాడకు మేఘా, రాజమహేంద్రవరానికి గ్రీన్‌కో, విశాఖపట్నానికి జీఎంఆర్ సంస్థలు లీడ్ భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. ఆర్టీఐహెచ్‌లో ఇంక్యుబేటర్, ఎంఎస్‌ఎంఈ ఫెసిలిటేషన్ సెంటర్, బ్యాంకింగ్ లింకేజ్, శిక్షణ, వీసీ ఫండింగ్, హోల్డింగ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, హైపెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ లింకేజ్, ముడిసరకు సరఫరా సపోర్ట్, ప్రొటో టైపింగ్ సెంటర్, ఔట్ డేటింగ్ టెస్టింగ్ ట్రాక్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంటాయి’ అని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి అమరావతిలో బిట్స్ ‘వచ్చే ఏడాది కల్లా అమరావతిలో బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది.అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కూడా భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి చూపింది. విశాఖలో జీఎంఆర్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఆసక్తి వ్యక్తం చేసింది’ అని సీఎం అన్నారు.‘సమాజంలో పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో పీ4 కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో చేపట్టిన పీ3 కార్యక్రమం ద్వారా కొన్ని కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి’ అని సీఎం పేర్కొన్నారు. క్వాంటమ్ వ్యాలీగా అమరావతి హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా చేసినట్లే.. ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయాలన్నదే నా సంకల్పం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది’ అని సీఎం గుర్తు చేశారు.
Create an account or sign in to comment