Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Amaravati ki High-speed trains

Featured Replies

  • Author

High Speed Rail: హై స్పీడ్‌... ఏపీ!

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:24 AM

 

ఆంధ్రప్రదేశ్‌ మీదుగా మరో భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెజార్టీ భాగం రాష్ట్రం గుండా...

High Speed Rail: హై స్పీడ్‌... ఏపీ!

 

  • రాష్ట్రానికి 2 ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్లు

     
  • వ్యయం 5.42 లక్షల కోట్లు.. వేగం 350 కి.మీ.

చీఅమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ మీదుగా మరో భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్‌) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెజార్టీ భాగం రాష్ట్రం గుండా వెళ్లే విధంగా రెండు హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్లకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. ఎస్సీఆర్‌ ప్రతిపాదనల మేరకు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ను 605 కిలోమీటర్లు, హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ను 760 కిలోమీటర్ల దూరం నిర్మించనున్నారు. రెండు కలిపి 1,365 కిలోమీటర్ల పొడవు గల హై స్పీడ్‌ కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు కారిడార్లు 767 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు ఎస్సీఆర్‌ రూ.5.42 లక్షల కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌కు రూ.3.04 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు సంబంధించి ఏపీలో 263 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణం చేపడతారు. 6 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌కు సంబంధించి ఏపీలో 9 ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 504 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రెండు కారిడార్లలో ముఖ్యమైన వర్కులు ఏపీలోనే జరగనున్నాయి.

 

 
ABN ఛానల్ ఫాలో అవ్వండి
 

హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌..

హైదరాబాద్‌-బెంగళూరు హై స్పీడ్‌ కారిడార్‌ రాష్ట్రంలో నాలుగు జిల్లాల మీదుగా ఏర్పాటు కానుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గుండా కారిడార్‌ నిర్మాణం జరగనుంది. కర్నూలులో 46.56 కి.మీ. మేర ఏర్పాటు కానున్న కారిడార్‌కు 139.68 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. నంద్యాలలో 37.3 కి.మీ. మేర నిర్మించనున్న కారిడార్‌కు 111.9 హెక్టార్ల సాధారణ భూమితో పాటు 1.29 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాల్సి ఉంది. అనంతపురంలో అత్యధికంగా 86.6 కి.మీ పొడవున కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు 259.8 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 79.08 కి.మీ. పొడవున ఏర్పాటు కానున్న కారిడార్‌కు రూ.237.24 హెక్టార్ట భూమితో పాటు 2.92 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈ మేరకు భూ కేటాయింపుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక లేఖను కూడా సమర్పించింది.

హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌..

చీహైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ ఏపీలో ఏడు జిల్లాల మీదుగా వెళ్లనుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా కారిడార్‌ నిర్మాణం జరగనుంది. పల్నాడు జిల్లాలో 81 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మాణానికి 243 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో 66.45 కి.మీ. మేర నిర్మాణానికి 199.35 హెక్టార్ల భూమి, బాపట్ల జిల్లాలో 43.21 కి.మీ. నిర్మాణానికి 129.63 హెక్టార్ల భూమి, ప్రకాశం జిల్లాలో 58.37 కి.మీ. నిర్మాణానికి 175.11 హెక్టార్ల భూమి, నెల్లూరు జిల్లాలో 116.79 కి.మీ. నిర్మాణానికి 350.37 హెక్టార్ల భూమి, తిరుపతి జిల్లాలో 130.58 కి.మీ నిర్మాణానికి రూ.391.74 హెక్టార్ల భూమి, చిత్తూరు జిల్లాలో 8.17 కి.మీ. నిర్మాణానికి 24.51 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. వీటితో పాటు పల్నాడులో 21.39 హెక్టార్ల అటవీ భూమి, నెల్లూరులో 40.8 హెక్టార్లు, తిరుపతిలో 20.44 హెక్టార్లు, చిత్తూరులో 7.68 హెక్టార్ల అటవీ భూమి కూడా కారిడార్ల కోసం కేటాయించాల్సిన అవసరం ఉందని ఎస్సీఆర్‌ ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాజఽధాని అమరావతిని ఈ కారిడార్‌కు కలిపేలా లైన్‌ ఏర్పాటు అంశం కూడా పరిశీలనలో ఉంది.

 

 
 

ఏపీలో 15 స్టేషన్లు

రెండు హై స్పీడ్‌ కారిడార్ల నిర్మాణంలో భాగంగా ఏపీలో 15 స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌కు సంబంధించి కర్నూలు, డోన్‌, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం వద్ద ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌కు సంబంధించి దాచేపల్లి, నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతిలో ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఏపీకి ఈ రెండు రైల్వే కారిడార్లు ఎంతో ప్రయోజనం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులను అత్యంత వేగంగా ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. టైమ్‌ లైన్‌కు అనుగుణంగా లొకేషన్లలో సర్వేలు పూర్తి చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పూర్తిస్థాయిలో అందించాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులు కోరుతున్నారు.

  • 1 month later...
  • Replies 91
  • Views 9.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • sonykongara
    sonykongara

  • ravindras
    ravindras

    bullet train vanity project. india ki white elephant avvuddhi. Mumbai Ahmedabad bullet train initial estimate 1 lakh crore. final figure 2 lakh crore avutundi. length 508 km. approximate cost per

  • ravindras
    ravindras

    india needs to build dedicated freight corridors(dfc) and upgrading existing railway network. india don't need white elephant bullet train. china high speed rail running on losses with debt 900 billio

  • Author

South Central Railway: ఏపీ మీదుగా బుల్లెట్‌ రైలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:55 AM

 

చెన్నై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు తిరుపతి మార్గంలో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేసిన దక్షిణ మధ్య రైల్వే...

South Central Railway: ఏపీ మీదుగా బుల్లెట్‌ రైలు
 

 

  • చెన్నై - హైదరాబాద్‌ వయా తిరుపతి

     
     
     
     
     
     
  • ప్రయాణ సమయం 2.20 గంటలు తగ్గే చాన్స్‌

  • తమిళనాడుకు ప్రతిపాదనలు అందజేసిన దక్షిణ మధ్య రైల్వే

చెన్నై, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): చెన్నై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు తిరుపతి మార్గంలో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేసిన దక్షిణ మధ్య రైల్వే... ఆ మేరకు నివేదికను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. 2027లో సూరత్‌ నుంచి తొలి బుల్లెట్‌ రైలు నడిచేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా దక్షిణాదిన రెండు మార్గాల్లో బుల్లెట్‌ రైళ్ల ప్రాజెక్ట్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మార్గంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అమలుకు భూసర్వే జరుగుతోంది. అలాగే చెన్నై-హైదరాబాద్‌ మధ్య 778 కి.మీ. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు నివేదికను దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేస్తోంది. చెన్నై నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్‌కు బుల్లెట్‌ రైలు సేవలు అందేలా చర్యలు చేపట్టాలని భావించింది. అయితే తిరుపతి మార్గంలో ఆ ప్రాజెక్టును అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి చేసింది. ఆ ప్రకారం కొన్ని సవరణలు చేసి నివేదిక రూపొందించిన దక్షిణ మధ్య రైల్వే... ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. దీనికి సూత్రప్రాయంగా ఆమోదం లభిస్తే, చెన్నై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం, తమిళనాడు ప్రభుత్వ కన్సల్టెన్సీ రిట్జ్‌, తమిళనాడులో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ‘223.44 హెక్టార్ల భూమి అవసరం. చెన్నై సెంట్రల్‌, మీంజూరు సమీపంలోని చెన్నై ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతాల్లో 2 బుల్లెట్‌ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అని నివేదిక సమర్పించినట్లు సమాచారం. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అమలులోకి వస్తే... ప్రస్తుత ప్రయాణ సమయం 12 గంటలు కాగా... 2.20 గంటలు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.

  • 2 months later...
  • Author

2026: అభివృద్ధిలో.. ‘బుల్లెట్‌’ పరుగులే

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 02 Feb 2026 06:06 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

రాష్ట్రంలో డెడికేటెడ్‌ రేర్‌ ఎర్త్‌ కారిడార్‌
7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలో 3 ఏపీ మీదుగానే 
సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0 ఏర్పాటుతో ప్రయోజనాలు
పోలవరానికి రూ.3,320 కోట్లు
అమరావతికి రూ.1,561 కోట్లు
2026-27 బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం
ఈనాడు - అమరావతి, దిల్లీ

ap010226main1a.webp

పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా.. ఉద్యోగ కల్పనకు ఊతమిచ్చేలా కేంద్రం ఏపీకి బడ్జెట్‌లో వరాలిచ్చింది. రాష్ట్రంలో డెడికేటెడ్‌ రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు కారిడార్లు ప్రకటించగా.. వాటిలో ఏపీ ఒకటి. దీనివల్ల మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, ఉత్పత్తిరంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేస్తూ బుల్లెట్‌ రైళ్లు పరుగులు తీసేలా హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ప్రాజెక్టుల్ని ప్రకటించింది. ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలో హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-అమరావతి-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లు మన రాష్ట్రం మీదుగా వెళ్లేవే.

ఈ మూడు కారిడార్ల మొత్తం పొడవు 1,671 కి.మీ ఉంటే అందులో ఏపీలో నిర్మించేదే 857 కి.మీ.. అంటే 51% మన రాష్ట్రంలోనే.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 49% సాగుతుంది. కీలక ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి రాజధానికీ కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. 2025-26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించినా.. అంచనాల సవరణలో రూ.3,017.20 కోట్లకు తగ్గింది. 2026-27 బడ్జెట్లో రూ.3,320.39 కోట్లు కేటాయించారు. రాజధాని అమరావతికి ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ), ఇంటర్నేషనల్‌ బ్యాంకు ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఐబీఆర్‌డీ) నుంచి రూ.1,561 కోట్లు సమకూరుస్తోంది. 

సెమీకండక్టర్‌ పరిశ్రమకు బూస్ట్‌.. 

రూ.40,000 కోట్లతో ప్రతిపాదించిన ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0 (ఐఎస్‌ఎం)లో భాగంగా.. ఏపీలో కర్నూలు, తిరుపతిలో కార్బైడ్‌ చిప్స్, అడ్వాన్స్‌డ్‌ ప్యాకేజింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.14,000 కోట్ల పెట్టుబడితో సిలికాన్‌ కార్బైడ్‌ సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. దీనితోపాటు రాబోయే ఏపీలో సెమీకండక్టర్‌ తయారీ చేపట్టే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉంది. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్‌ పథకాల ద్వారా రాష్ట్ర రైతులకు ప్రయోజనం లభించనుంది. కుసుమ్‌లో 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, సూర్యఘర్‌లో 2లక్షల కనక్షన్లు అదనంగా వస్తాయని అంచనా.

పర్యాటకానికి ప్రోత్సాహమిచ్చేలా

రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రోత్సాహమిచ్చేలా.. అరకులో ట్రెక్కింగ్, హైకింగ్‌ మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. పులికాట్‌ సరస్సులో పక్షుల్ని మరింత దగ్గర్నుంచి వీక్షించేందుకు వీలుగా.. బర్డ్‌ వాచింగ్‌ ట్రైల్స్‌కు ప్రాధాన్యం కల్పించనుంది. 

  • గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.500.99 కోట్లు. 
  • ఏపీ సహజ వ్యవసాయ సాగు ప్రాజెక్టు కోసం జీఓడీఈ నుంచి రూ.155.32 కోట్లు. 
  • రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్‌డీబీ నుంచి రూ.350 కోట్ల నిధులు రానున్నాయి.
  • కేంద్ర నౌకాయాన శాఖ నుంచి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు రూ.450 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.250 కోట్లు అంతర్గత వనరుల నుంచి, రూ.200 కోట్లు ఇతర మార్గాల నుంచి సమకూరుస్తారు. గత ఏడాది కేటాయించిన రూ.730 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. 
  • వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.545 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. 
  • రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి సంస్థలకు ఆర్థిక సాయంలో భాగంగా అటామిక్‌ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ నుంచి గీతం యూనివర్సిటీకి గ్రాంటు రూ.50 లక్షలు, స్పేస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీకి రూ.12 లక్షలు కేటాయించారు. 
  • క్లస్టర్‌ స్థాయిలో షీమార్ట్‌ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 670 పైగా మండలాల్లో ఒక్కోదానికి రూ.20 లక్షల మేర కేంద్ర గ్రాంట్‌ అందనుంది. 
  • అధిక విలువ కలిగిన పంటలకు ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రంలో సాగయ్యే కొబ్బరి, కోకో, జీడిమామిడి ఉద్యాన పంటల సాగుకు కేంద్ర సాయం లభించనుంది. 
  • దేశవ్యాప్తంగా మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్రం నుంచి ప్రతిపాదించిన ధర్మవరం, పిఠాపురం, మంగళగిరి పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రోత్సాహకాలు అందనున్నాయి.

విశాఖ పెట్రో యూనివర్సిటీకి రూ.302 కోట్లు

పెట్రోలియం శాఖ విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీకి రూ.302 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం కేటాయించిన రూ.50 కోట్లకంటే ఇది అధికం.

  • 1 month later...

bullet train vanity project. india ki white elephant avvuddhi.

Mumbai Ahmedabad bullet train initial estimate 1 lakh crore. final figure 2 lakh crore avutundi. length 508 km. approximate cost per km 400 crores. present vunna railway network ni 10 crore per km tho upgrade chesthe average speed 110 kmph to 130 kmph ki penchavachu.  cargo kosam dedicated freight corridor dfc ni construct cheyyaali.

 

  • Author

విజయవాడ - విశాఖపట్నం మధ్య బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 04 Mar 2026 06:03 IST
Ee
Font size
 
3 min read
 
 

విజయవాడ నుంచి కర్నూలుకు సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌
హైదరాబాద్‌-శ్రీశైలం-మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్‌ 
8 రూట్లలో ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు రైల్వేశాఖ ప్రతిపాదనలు 
ఈనాడు - అమరావతి 

AP030326main-2a.webp

రాష్ట్రంలో రెండు కీలక నగరాలైన విజయవాడ-విశాఖపట్నం మధ్య బుల్లెట్‌ రైల్‌ నడిపేందుకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. దీనికోసం ఫైనల్‌ లొకేషన్‌ సర్వే చేయాలని భావిస్తోంది. అలాగే విజయవాడ-కర్నూలు మధ్య నేరుగా రైళ్లు నడపటమే కాకుండా, తక్కువ ప్రయాణ సమయం ఉండేలా చూసేందుకు సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కూడా నిర్మించాలనుకుంటోంది. వీటితోపాటు మరో ఆరు మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించడంపై దృష్టిపెట్టింది. వీటన్నింటికీ ఫైనల్‌ లొకేషన్‌ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రైల్వే అధికారులు.. రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపారు. బోర్డు నుంచి క్లియరెన్స్‌ వస్తే వీటిపై ముందడుగు పడనుంది. 

రాష్ట్రంలో నాలుగో మార్గంలో బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌: దేశంలో వివిధ నగరాల మధ్య ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు నిర్మించనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో మన రాష్ట్రంలో.. రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్‌-చెన్నై కారిడార్, కర్నూలు, అనంతపురం మీదుగా హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్, చిత్తూరు మీదుగా చెన్నై-బెంగళూరు కారిడార్‌ కలిపి మొత్తం మూడు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా మరో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. 350 కి.మీ. ఉండే ఈ కారిడార్‌ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా వెళ్లేలా చూడనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గరిష్ఠంగా గంటకు 320 కి.మీ. వేగంతో బుల్లెట్‌ రైళ్లు రెండు నగరాల మధ్య పరుగులు పెడతాయి. అయితే ఈ కారిడార్‌ అమరావతి-విజయవాడ-విశాఖపట్నం మధ్య ఉండేలా చూస్తే.. హైదరాబాద్‌-అమరావతి-చెన్నై కారిడార్‌కు అనుసంధానం అయినట్లు అవుతుంది.


విజయవాడ-కర్నూలు మధ్య  ఇంటర్‌ సిటీ రవాణా కోసం.. 

విజయవాడ-కర్నూలు మధ్య ప్రస్తుతం నేరుగా నడిచే రైళ్లు లేవు. డోన్‌లో గానీ, నంద్యాలలో గానీ దిగి కర్నూలుకు మరో రైలులో వెళ్లాల్సి ఉంటోంది. ఇప్పుడు ఈ రెండు నగరాల మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, కంభం, నంద్యాల మీదుగా మొత్తం 350 కి.మీ. మేర ఈ లైన్‌ నిర్మించాలనుకుంటోంది. సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో రైళ్లు గరిష్ఠంగా గంటకు 220 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. భవిష్యత్‌లో ఇది అందుబాటులోకి వస్తే.. విజయవాడ నుంచి కర్నూలుకు 2 గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది.


మాచర్ల నుంచి గద్వాల్‌ వరకు..

  • పల్నాడు జిల్లా మాచర్ల నుంచి తెలంగాణలోని గద్వాల్‌ వరకు 184 కి.మీ. కొత్త లైన్‌కు ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ, కర్ణాటక వైపు నుంచి ఏపీలోని నౌకాశ్రయాలకు అనుసంధానం కల్పించేందుకు వీలుగా ఈ రైల్వే లైన్‌ కీలకంగా ఉంటుంది.
  • నెల్లూరు నుంచి రాజంపేటకు 120 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి రాజంపేట, కడపవైపు రైలులో వెళ్లాలంటే రేణిగుంట, రైల్వేకోడూరు మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి బదులు నేరుగా నెల్లూరు నుంచి రాజంపేటకు రైల్వేలైన్‌ ఉండేలా చూడాలని భావిస్తున్నారు.
  • సామర్లకోట నుంచి చింతూరుకు 150 కి.మీ. కొత్త లైన్‌ నిర్మించేలా ప్రతిపాదించారు. 
  • కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి 58 కి.మీ. కొత్త లైన్‌ నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే రాయదుర్గం-కళ్యాణదుర్గం మధ్య రైల్వేలైన్‌ ఉంది. కొత్తది నిర్మిస్తే రాయదుర్గం నుంచి అనంతపురానికి రైల్వే లైన్‌ అందుబాటులోకి వస్తుంది. 
  • గూడూరు నుంచి దుగరాజపట్నం వద్ద నిర్మించే పోర్టుకు రైల్వే లైన్‌ నిర్మాణం కోసం సర్వే చేసేందుకు ప్రతిపాదించారు. దీనికి 2016లోనే డీపీఆర్‌ రూపొందించారు. అయితే ఇది గిట్టుబాటు కాదంటూ అప్పట్లో పక్కనపెట్టారు. ఇప్పుడు దుగరాజపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు, షిప్‌ బిల్డింగ్‌ యూనిట్‌ నిర్మాణ ప్రతిపాదనలు ఉండటంతో.. రైల్వే లైన్‌ కోసం మళ్లీ సర్వేచేసి, ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు.
  • శ్రీశైల మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్‌ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు. 
  • హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం మీదుగా మార్కాపురం వరకు 290 కి.మీ. మేర కొత్త లైన్‌ నిర్మించేందుకు ప్రతిపాదించారు. 
  • దీనివల్ల అటు హైదరాబాద్‌ నుంచి, ఇటు మార్కాపురం వైపు నుంచి శ్రీశైలానికి రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది.
 
  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...

india needs to build dedicated freight corridors(dfc) and upgrading existing railway network. india don't need white elephant bullet train. china high speed rail running on losses with debt 900 billion dollars. india can't afford costly mistake unlike china.

ETInfra.com
No image preview

Budget 2026: Economics of high-speed rail corridors vs th...

Explore the critical financial allocations and strategic implications of India's 2026 budget on high-speed rail corridors and dedicated freight corridors, and their significance for the Indian economy

Edited by ravindras

  • Author

గంటకు 600 కి.మీ. వేగంతో వెళ్లేలా..

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 10 May 2026 05:06 IST

Ee

Font size

3 min read

బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ డిజైన్‌లో మార్పులతో డీపీఆర్‌ 
అయితే గరిష్ఠంగా 320 కి.మీ.వేగంతోనే పరుగులు
హైదరాబాద్‌- చెన్నై కారిడార్‌ అమరావతి విమానాశ్రయం మీదుగా వెళ్లేందుకు ఓకే

ap090526main3a.webp

ఈనాడు - అమరావతి: హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా చెన్నై, బెంగళూరు, చెన్నై నుంచి బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ నిర్మించ తలపెట్టిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలో.. గంటకు 600 కి.మీ. వేగంతో రైళ్లు వెళ్లే డిజైన్‌తో రూపొందించనున్నారు. ఇప్పటి వరకు గంటకు 350 కి.మీ. వేగంతో రైళ్లు వెళ్లే డిజైన్‌తో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే, డీపీఆర్‌ తయారు చేస్తున్నారు. 600 కి.మీ. వేగంతో ఉండేలా డిజైన్‌లో మార్పు చేయాలంటూ నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) తాజాగా ఆదేశించింది. రైల్వే అధికారులు ఆ మార్పులతో డీపీఆర్‌ తయారు చేస్తున్నారు. గంటకు 600 కి.మీ. వేగం డిజైన్‌తో కారిడార్లు నిర్మించినా బుల్లెట్‌ రైళ్లను మాత్రం గరిష్ఠంగా గంటకు 320 కి.మీ. వేగంతోనే నడుపుతారు.

అమరావతి విమానాశ్రయం మీదుగా..

  • హైదరాబాద్‌- అమరావతి- చెన్నై మధ్య హైస్పీడ్‌ రైల్వే లైన్‌ను అమరావతిలో నిర్మించనున్న విమానాశ్రయం మీదుగా వెళ్లేలా ఎలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు గత ఏడాది అక్టోబరులో రైల్వే శాఖ అధికారులతో సమీక్షలో సూచించారు. ఈ మేరకు అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపగా, రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది.

  • హైదరాబాద్‌- చెన్నై లైన్‌కు రెండు ఎలైన్‌మెంట్లు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లోని ముంబయి వైపు వెళ్లే హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పాయింట్‌ నుంచి శంషాబాద్, బాటసింగారం, నార్కెట్‌పల్లి, ఖమ్మం/ కోదాడ మీదుగా ఏపీలోకి ప్రవేశించి అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి విమానాశ్రయం స్టేషన్ల మీదుగా చెన్నై సెంట్రల్‌ వరకు ఎలైన్‌మెంట్‌ను రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ సర్వీస్‌ (రైట్స్‌) ప్రతిపాదించింది.

  • తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌లోని ముంబయి వైపు వెళ్లే హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పాయింట్‌ నుంచి శంషాబాద్, భారత్‌సిటీ (ఫ్యూచర్‌ సిటీ), ఏపీలో దాచేపల్లి, అమరావతి మీదుగా.. అక్కడి నుంచి రైట్స్‌ ప్రతిపాదించిన మార్గాన్ని సూచించింది.

  • మొత్తంగా హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్‌ దాదాపు 760 కి.మీ. ఉండనుంది. ఇందులో ఏపీ పరిధిలో 504 కి.మీ. మేర ఉంటుంది.

605 కి.మీ.హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌

  • హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌ విషయంలో ఏపీ పరిధిలో ఎలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చినా తెలంగాణలో రెండు మార్గాలను పరిశీలిస్తున్నారు.

  • హైదరాబాద్‌లోని ముంబయి వైపు వెళ్లే హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పాయింట్‌ నుంచి శంషాబాద్, భారత్‌సిటీ, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్‌ మీదుగా ఏపీలోని కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ (కియా సమీపంలో), హిందూపురం, కర్ణాటకలో అలిపుర, దేవనహళ్లి, కొడిహళ్లి (వైట్‌ఫీల్డ్‌) మీదుగా బెంగళూరు వరకు ఎలైన్‌మెంట్‌ను రైల్వే శాఖ ప్రతిపాదించింది.

  • తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌లో ముంబయి వైపు వెళ్లే హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పాయింట్‌ నుంచి శంషాబాద్, భారత్‌సిటీ, మన్ననూర్, సోమశిల రోడ్‌ మీదుగా ఏపీలో కర్నూలు వైపు వెళ్లే ఎలైన్‌మెంట్‌ను సూచించింది.

  • ఈ కారిడార్‌ సుమారు 605 కి.మీ. మేర ఉంటుంది. ఇందులో ఏపీలో 263 కి.మీ. ఉండనుంది.

చెన్నై- బెంగళూరు కారిడార్‌లో చిత్తూరు- తిరుపతి కనెక్టివిటీ

ap090526main3b.webp

  • చెన్నై- బెంగళూరు మధ్య 306 కి.మీ. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. ఇది ఏపీలోని చిత్తూరు, పలమనేరు మీదుగా 90 కి.మీ. ఉంటుంది.

  • ఇందులో చిత్తూరు నుంచి తిరుపతికి 70 కి.మీ. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మిస్తే. అటు చెన్నై- బెంగళూరు కారిడార్‌కు, ఇటు హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్‌కు అనుసంధానం కలుగుతుందని సీఎం చంద్రబాబు గతంలో రైల్వే అధికారులకు సూచించారు.

  • రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గత నెల విశాఖపట్నం వచ్చినప్పుడు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిత్తూరు- తిరుపతి మధ్య హైస్పీడ్‌ కారిడార్‌ను పరిశీలిస్తామని రైల్వే మంత్రి తెలిపారు.

విజయవాడ- విశాఖ కారిడార్‌ తర్వాత దశలో..

విజయవాడ నుంచి విశాఖపట్నానికి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గత నెలలో జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి దీనిపై కూడా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు (ఏపీ మీదుగా వెళ్లే మూడుతో కలిపి) నిర్మించనున్నామని, అవి కొలిక్కి వచ్చాక విజయవాడ-విశాఖపట్నం కారిడార్‌ను తర్వాత దశలో పరిశీలిస్తామని తెలిపారు

  • 1 month later...
  • Author

రాజధాని అమరావతి మీదుగానే బుల్లెట్‌ రైలు

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 21 Jun 2026 03:58 IST

Ee

Font size

3 min read

gg-pref.gif

కొత్త విమానాశ్రయం సమీపం నుంచి ఎలైన్‌మెంట్‌ ప్రతిపాదన వెనక్కి
తిరుపతి-చిత్తూరు లింక్‌ కారిడార్‌ డీపీఆర్‌ తయారీకి అనుమతి

ap200626main3a.webp

ఈనాడు, అమరావతి: బుల్లెట్‌ రైళ్లు పరుగులు పెట్టేందుకు నిర్మించనున్న హైదరాబాద్‌-అమరావతి-చెన్నై హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌.. రాజధాని అమరావతి మీదుగానే వెళ్లనుంది. అమరావతికి కొంత దూరంలో రావెల వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనుండగా.. దానికి ఆనుకొని హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఉండాలని కొంతకాలం క్రితం సీఎం చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే, డీపీఆర్‌ తయారీకి నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) సిద్ధమైంది. అయితే విమానాశ్రయానికి ఆనుకొని ఎలైన్‌మెంట్‌ ఖరారుచేస్తే.. ఆ కారిడార్‌ రాజధాని నగరానికి, విజయవాడకు దూరమైపోతుంది. విమానాశ్రయం సమీపం నుంచి గుంటూరు వైపు వెళ్లాల్సి ఉంటుందని గుర్తించారు. దీంతో రాజధాని నగరానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో.. మొదట నిర్దేశించినట్లు అమరావతి మీదుగానే కారిడార్‌ వెళ్లేలా ఫైనల్‌ లొకేషన్‌ సర్వే, డీపీఆర్‌ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సూచించింది.


దాచేపల్లి వద్ద తొలి స్టేషన్‌

  • హైదరాబాద్‌-అమరావతి-చెన్నై కారిడార్‌.. తెలంగాణ, ఏపీ, తమిళనాడుల్లో కలిపి మొత్తం 760.09 కి.మీ. ఉంటుంది. 18 స్టేషన్లు నిర్మిస్తారు.

  • తెలంగాణలో 180.32 కి.మీ.కాగా, హైదరాబాద్, శంషాబాద్, భారత్‌ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి వద్ద స్టేషన్లు నిర్మిస్తారు. 

  • ఏపీలో 518.54 కి.మీ. కారిడార్‌ ఉంటుంది. ఇందులో దాచేపల్లి మొదటి స్టేషన్‌ అవుతుంది. తర్వాత అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి (విమానాశ్రయం వద్ద) స్టేషన్లు నిర్మిస్తారు.

  • తమిళనాడులో 61.23 కి.మీ. మేర కారిడార్‌ నిర్మించనుండగా, అందులో తిరువళ్లూరు, చెన్నై ఔటర్‌ రింగ్‌రోడ్‌/మింజూర్, చెన్నె సెంట్రల్‌ స్టేషన్లు ఉంటాయి.


పలమనేరు సమీపంలో 11.8 కి.మీ. సొరంగం

  • చెన్నై-బెంగళూరు కారిడార్‌లో నాలుగు సొరంగాలు నిర్మిస్తున్నారు. చెన్నై నగర పరిధిలో సెంట్రల్‌ స్టేషన్‌ వద్ద 1.73 కి.మీ. సొరంగ మార్గం ఉంటుంది.

  • అటు బెంగళూరులో రెండు చోట్ల 14.79 కి.మీ. మేర సొరంగ మార్గాలు నిర్మిస్తున్నారు.

  • మధ్యలో చిత్తూరు జిల్లాలో కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మీదుగా ఈ కారిడార్‌ వెళ్తుంది. దీంతో పలమనేరు సమీపంలోని అటవీ ప్రాంతంలో 11.8 కి.మీ. మేర సొరంగం నిర్మించి, దానిలో నుంచి కారిడార్‌ వెళ్లేలా చూస్తారు.

  • చెన్నై- బెంగళూరు కారిడార్‌ మొత్తం 306 కి.మీ. కాగా, అందులో తమిళనాడులో 133 కి.మీ., ఏపీలో 72 కి.మీ., కర్ణాటకలో 101 కి.మీ. ఉంటుంది.

  • తమిళనాడులో చెన్నై సెంట్రల్, పూనమల్లె, పరందూరు, ఏపీలో చిత్తూరు, కర్ణాటకలో కోలార్, కొడిహళ్లి, వైట్‌ఫీల్డ్, బయప్పనహళ్లి స్టేషన్లు కలిపి మొత్తం 7 స్టేషన్లు ఉంటాయి.


తిరుపతి-చిత్తూరు మధ్య అనుసంధాన కారిడార్‌

హైదరాబాద్‌- అమరావతి- చెన్నై కారిడార్‌ తిరుపతి విమానాశ్రయం మీదుగా వెళ్తుండగా, చెన్నై-బెంగళూరు కారిడార్‌ చిత్తూరు మీదుగా వెళ్తుంది. ఈ రెండు కారిడార్లకు లింక్‌ ఉండేలా తిరుపతి- చిత్తూరు మధ్య అనుసంధాన హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మించాలని సీఎం చంద్రబాబు గతంలో సూచించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ అధికారులు.. ఈ ఎలైన్‌మెంట్‌కు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే, డీపీఆర్‌ తయారీపై దృష్టిపెట్టారు.


హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో 15 స్టేషన్లు

  • మన రాష్ట్రం మీదుగా వెళ్లే హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్‌ మొత్తం 597 కి.మీ. ఉంటుంది. ఇందులో తెలంగాణలో 239 కి.మీ., ఏపీలో 264 కి.మీ., కర్ణాటకలో 94 కి.మీ. మేరకు నిర్మిస్తారు.

  • తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్, భారత్‌ సిటీ, ఆమనగల్లు, మన్ననూర్‌/పెన్మిల, సోమశిల, ఏపీలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం, కర్ణాటకలో అలిపురా, దేవనహళ్లి, కొడిహళ్లి స్టేషన్లు కలిపి మొత్తం 15 స్టేషన్లు నిర్మించనున్నారు.

  • 4 weeks later...
  • Author

ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్‌ రైలు!

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 18 Jul 2026 05:07 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌ ఎలైన్‌మెంట్‌లో మార్పులు కోరిన ఏపీ ప్రభుత్వం
11.4 కి.మీ. మారిస్తే.. రెండు ప్రాంతాలకు మేలు

AP17072026main-32a_1.webp

ఈనాడు, అమరావతి: పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన ధర్మవరం, ఆధ్యాత్మిక క్షేత్రమైన పుట్టపర్తి మీదుగా బుల్లెట్‌ రైలు పరుగులు పెట్టనుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బుల్లెట్‌ రైలు నడిపేందుకు నిర్మించనున్న హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను.. ఈ రెండు పట్టణాల మీదుగా చేపట్టేలా ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయనున్నారు. ఇటీవల నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌) అధికారులతో రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మార్పుపై చర్చించారు. హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌పై చేస్తున్న ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌), డీపీఆర్‌ తయారీలో.. రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లుగా ముందుకెళ్లాలని కోరారు. దీనిపై రైల్వే బోర్డ్‌ ఛైర్మన్‌కు కూడా ప్రభుత్వం లేఖరాసింది. దీంతో ఎలైన్‌మెంట్‌ మార్పును ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌ ప్రాధాన్యాంశంగా పరిగణిస్తోంది.

చిన్న మార్పు.. పెద్ద ప్రయోజనం

  • గతంలో అనుకున్న ఎలైన్‌మెంట్‌లో అనంతపురం- హిందూపురం మధ్య దుద్దేబండ వద్ద మాత్రమే స్టేషన్‌ వస్తుంది. అది కియా పరిశ్రమకు వచ్చేవారికి ఉపయోగపడుతుంది.

  • దానికి బదులు ధర్మవరం, పుట్టపర్తి మీదుగా కారిడార్‌ను మార్చి, ఈ రెండు చోట్లా స్టేషన్లు నిర్మిస్తే బహుళ ప్రయోజనాలుంటాయి. దేశవిదేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే భక్తులు బెంగళూరు, హైదరాబాద్‌ వైపు నుంచి సులభంగా చేరుకోవచ్చు. పుట్టపర్తి సమీపంలో యుద్ధవిమానాల తయారీ ప్రాజెక్ట్‌ ఏర్పాటవుతుండగా, మరికొన్ని సంస్థలు రానున్నాయి.

  • ధర్మవరం, పుట్టపర్తి సమీప ప్రాంతాల ప్రజలకు బుల్లెట్‌ రైల్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. పైగా కియా పరిశ్రమ నుంచి 20 కి.మీ. దూరంలోనే పుట్టపర్తి దగ్గర్లో హైస్పీడ్‌ రైల్వే స్టేషన్‌ ఉంటుంది. వీటన్నింటి దృష్ట్యా ప్రభుత్వం ఎలైన్‌మెంట్‌లో మార్పు కోరింది.


90.7 కి.మీ.కు బదులు 102.1 కి.మీ.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 597 కి.మీ. మేర హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. ఈ మార్గం తెలంగాణలో 239 కి.మీ., ఏపీలో 264 కి.మీ., కర్ణాటకలో 94 కి.మీ. ఉంది. ఇది హైదరాబాద్‌- కర్నూలు- అనంతపురం- బెంగళూరు హైవేకి చాలావరకు సమాంతరంగా వెళ్తుంది. మన రాష్ట్ర పరిధిలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, కియా సమీపంలోని దుద్దేబండ, హిందూపురంలో రైల్వే స్టేషన్లు నిర్మించాలని తొలుత ప్రతిపాదించారు.

ఈ ఎలైన్‌మెంట్‌లో అనంతపురం నుంచి హిందూపురం వరకు 90.7 కి.మీ. దూరం ఉండగా.. మధ్యలో దుద్దేబండ వద్ద మాత్రమే స్టేషన్‌ వస్తుంది. దీనికి బదులు అనంతపురం నుంచి ధర్మవరం, పుట్టపర్తిలకు దగ్గర్లోంచి హిందూపురం వైపు వెళ్లేలా ప్రభుత్వం ప్రతిపాదించింది. తద్వారా అనంతపురం నుంచి హిందూపురానికి 102.1 కి.మీ. అవుతుంది. ముందుగా అనుకున్న ఎలైన్‌మెంట్‌ కంటే 11.4 కి.మీ. మాత్రమే

  • 3 weeks later...
  • 2 months later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.