Jump to content

AP Chief Minister Relief Fund


Recommended Posts

సీఎం చంద్రబాబును కలిసిన జ్ఞానసాయి తల్లిదండ్రులు

 

636341899955737918.jpg

 

 

అమరావతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహకారంతో పునర్జన్మ పొందిన జ్ఞానసాయి, ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ప్రాణాంతకమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న జ్ఞానసాయికి తాము వైద్యం చేయించలేమని, మెర్సీకిల్లింగ్ కు అనుమతివ్వాలని కోరుతూ పాప తల్లిదండ్రులు చిత్తూరు కోర్టుకు గత ఏడాది క్రితం విన్నవించారు. కాగా... పాప దీనస్ధితిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పలు కథనాలను ప్రచురించడమేగాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దృష్టికి సైతం తీసుకెళ్ళడంతో స్పందించిన ఆయన పాపకు ప్రభుత్వమే వైద్య ఖర్చులను భరిస్తుందని ప్రకటించారు. అనంతరం చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో జ్ఞానసాయికి కాలేయ మార్పిడి విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉండగా గత శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహించారు. కాగా... జ్ఞానసాయి, ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాపకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.26 లక్షలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా జ్ఞానసాయి తండ్రికి సచివాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

 

Edited by sonykongara
Link to comment
Share on other sites

CBN any issue how to address it at best anntlu untudi.

 

 

a papa father ki longterm struggle lekunda secreteriat outsourcing job icharu :super:

monna athanu abn ki vachinappudu govt ki req chesadu..same ade ivala cbn daggara raise chesuntaru..cbn positive ga respond ayyadu..
Link to comment
Share on other sites

మూడు గంటల వ్యవధిలో, 10 లక్షల సాయం... వెంటనే వైద్యానికి హాస్పిటల్ కు తరలింపు... Super User 30 June 2017 Hits: 237  
cbn-help-30062017.jpg
share.png

చిన్న వయసు... చదువులో టాప్... పేదరికం ఓ వైపు... కబళిస్తున్న కాన్సర్ రోగం మరోవైపు... ఆ యువతిని మానసిక వేదనకు గురిచేస్తుండగా.. తల్లితండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షలు సాయం మంజూరు కావడం, వైద్యం కోసం ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ఆ కుటుంబంలో ఆశలు చిగురుస్తున్నాయి.

కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఉషారాణి డిగ్రీ చదువుతోంది. తండ్రి రామకృష్ణ ఆటోనగర్ లో వెల్డర్. చదువులో ప్రతిభ చూపిస్తున్న ఉషారాణికి లుకేమియా సోకి ప్రాణాపాయ పరిస్థితిలో ఉందని వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం పాండిచ్చేరి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో అప్పులు చేసి 20 రోజుల క్రితం అక్కడకు తీసుకువెళ్లారు. సొమ్ములు అయిపోవడం, భాషా సమస్య ఎదురుకావడంతో వారు తిరిగి ఇంటికి చేరుకొన్నారు.

 

రోజు రోజుకూ ఉషారాణి ఆరోగ్యం క్షీణిస్తుండడం, వైద్యానికి అయ్యే ఖర్చు రూ.13 లక్షలు భరించే పరిస్థితి లేకపోవడంతో తీవ్రంగా కలత చెందారు. ఈ క్రమంలో వారు 28-06-2017 వ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వద్దకు వెళ్లి సాయం అడి గారు. దీంతో ఆయన 29-06-2017 న ఉదయం , తల్లితండ్రులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లి ఉషారాణి ఎదుర్కొంటున్న ప్రాణాంతక పరిస్థితిని వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చేలించిపోయారు. ఆ పాపను ఎలా అయినా బ్రతికించాలని, పాప కోలుకుని మంచిగా చదవాలి అని, అప్పటికప్పుడే స్పందించి ఉషారాణి వైద్యానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదంతా కేవలం మూడు గంటల వ్యవధిలో జరిగిపోయింది.

ఉషారాణి, ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఉషారాణిని చికిత్స కోసం తన వాహనంలోనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

Link to comment
Share on other sites

I'm glad to see CM help her. There are many more like her.

 

Its time to think as a nation and take a more comprehensive approach.

 

Indian govt has any plans/thoughts on how it wants to deal with healthcare for its citizens? Its much bigger issue. 

 

We could pass a law under the disguise of free market and unfold xxx eat xxx world ... or take some lessons from rest of the world 'ex us' (as in financial markets)  who are doing it successfully with compassion.

 

Nah ... govt hospitals in India is not the answer ... like I said before, I'd rather die on the streets than go to 'prabhutva asupatri' ... its like a mortuary. 

Link to comment
Share on other sites

మరోసారి ఉదారత చాటుకున్న చంద్రబాబు
07-07-2017 19:10:13
 
636350519565797908.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి చంద్రబాబు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతపురం జిల్లాకు చెందిన పలువురు రోగులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తేజస్వినికి రూ.3 లక్షలు ఇవ్వనున్నారు.
 
 
నెలలు నిండకుండానే పుట్టిన శిశువు సుదీప్తికి వైద్యం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని తెలిపారు. కేర్సినోమా పెనిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఏలూరు వాసి గురిజాల నాగేశ్వరరావు చికిత్స కోసం రూ.2.5 లక్షలు అందజేస్తామన్నారు.
 
విజయవాడ రాజేశ్వరీదేవిపేట అగ్నిప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన కె.దుర్గారావుకు క్రీడల కోటాలో ఉద్యోగం ఇప్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భర్తను కోల్పోయిన వత్సవాయి మండలం పోచవరం గ్రామస్తురాలు కె. జయ కుటుంబం దయనీయస్థితిని చూసి చంద్రబాబు చలించిపోయారు. ఆ కుటుంబానికి చంద్రబాబు రూ. 4 లక్షలు సహాయాన్ని ప్రకటించారు.
 
అరుదైన వ్యాధితో బాధపడుతున్న గుంటూరుకు చెందిన శ్రీమతి సయ్యద్ నూర్జహాన్‌కు వైద్య చికిత్స కోసం సీఎం రూ. 3.5 లక్షల సహాయాన్ని ప్రకటించారు.నందిగామకు చెందిన బత్తుల విజయలక్ష్మికి కుడికాలి ఆపరేషన్ తర్వాత వచ్చిన సమస్యల చికిత్సకు రూ 58 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామానికి చెందిన వలేటి దీపిక ఇంజనీరింగ్ చదువు కోసం రూ లక్ష సహాయం అందజేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
Link to comment
Share on other sites

లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం
అధికారులకు చంద్రబాబు ఆదేశం
cbn.jpg

అమరావతి: తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువుల్ని కోల్పోయిన అనంతపురం జిల్లాకు చెందిన యువతి లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జులై 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు రూ.20లక్షల ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఆమెకు అండగా నిలుస్తామంటూ ధైర్యం చెప్పారు. సీఎం సూచన మేరకు వెలగపూడిలోని సచివాలయానికి లక్ష్మీప్రసన్నను జేసీ సోదరులు మంగళవారం తీసుకువచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నతో మాట్లాడిన చంద్రబాబు ఆమె విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చదివానని చెప్పిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరోసారి సూచించారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని, ఉద్యోగం వచ్చినా ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గ్రూప్‌-2 ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు.

చలించిన చంద్రబాబు
cbn2.jpg

Link to comment
Share on other sites

లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం

అధికారులకు చంద్రబాబు ఆదేశం

11break113a.jpg

అమరావతి: తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువుల్ని కోల్పోయిన అనంతపురం జిల్లాకు చెందిన యువతి లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జులై 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు రూ.20లక్షల ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఆమెకు అండగా నిలుస్తామంటూ ధైర్యం చెప్పారు. సీఎం సూచన మేరకు వెలగపూడిలోని సచివాలయానికి లక్ష్మీప్రసన్నను జేసీ సోదరులు మంగళవారం తీసుకువచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నతో మాట్లాడిన చంద్రబాబు ఆమె విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చదివానని చెప్పిన లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరోసారి సూచించారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని, ఉద్యోగం వచ్చినా ఎంతవరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గ్రూప్‌-2 ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు.

చలించిన చంద్రబాబు

11break113b.jpg

Its not a good thing anipistundi naku... dabbulu ivachu kani mari udyogalu icheyatam ante :run_dog:

Link to comment
Share on other sites

లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం
12-07-2017 01:38:23
 
636354203238336293.jpg
  • సీఎం చంద్రబాబు ఆదేశం
 
 
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): తండ్రి దాష్టీకంతో తల్లి, ఇద్దరు తోబుట్టువులను కోల్పోయిన అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటన బాధితురాలు లక్ష్మీప్రసన్నకు గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధికారులను ఆదేశించారు. ఈ నెల 5న అనంతపురం జిల్లా ముక్తాపురం గ్రామసభలో లక్ష్మీప్రసన్నకు రూ.20 లక్షల ఆర్థికసాయం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి... ఆమెకు అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు. సీఎం సూచన మేరకు లక్ష్మీప్రసన్నను మంగళవారం జేసీ సోదరులు సచివాలయానికి తీసుకొచ్చారు. సచివాలయానికి వచ్చిన లక్ష్మీప్రసన్నతో సీఎం మాట్లాడి విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చదువుకున్నానని ఆమె చెప్పారు. దీంతో అధికారులతో మాట్లాడి గ్రూప్‌-2 ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని లక్ష్మీప్రసన్నకు చెప్పారు. ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చినా ఎంత వరకు చదివితే అంతవరకు చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని, బాగా చదువుకుని ఉన్నత పదవులు సంపాదించాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు. ఆరు నెలలకు ఒకసారి వచ్చి కలవాలని ఆమెకు చెప్పారు. తనకు ఉద్యోగం ఇచ్చి అన్నివిధాలుగా అండగా ఉన్న సీఎం చంద్రబాబుకు లక్ష్మీప్రసన్న పదే పదే కృతజ్ఞతలు తెలిపారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
చంద్రబాబు పెద్ద మనసు
10-08-2017 20:04:05
 
636379922466846325.jpg
అమరావతి: ఏపీ సిఎం చంద్రబాబు మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. గుండె మార్పిడి రోగికి రూ 15 లక్షల సాయం అందించారు. నాలుగేళ్లుగా గుండెజబ్బుతో బాధపడుతున్న అంచుల కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. రోజు రోజుకూ క్షీణిస్తుండటంతో వైద్య పరీక్షలు చేయించాడు. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీస్‌లో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించగా గుండె మార్పిడితోనే మనుగడ సాగించగలడని తేల్చారు. ఇందుకు రూ. 20 నుంచి 25 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశారు.
 
 
 
అసలే పేదరికం. ఉన్న కొద్దిపాటి ఆస్తి గుండె వైద్యానికే కరిగిపోయింది. ఈ పరిస్థితిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. తన బిడ్డను ఆదుకోవాలని కిరణ్ కుమార్ తల్లి అంచుల రాజమ్మ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. కిరణ్ భార్య, ముగ్గును చిన్నారులను చూసి ముఖ్యమంత్రి చలించారు. కిరణ్ గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
చంద్రబాబు పెద్ద మనసు
28-08-2017 22:57:39
 
636395578674614926.jpg
అమరావతి: గుంటూరు జిల్లా పొత్తూరుకు సుమన్(17) చిన్నప్పుడు నిద్రలో ఉండగా మంచంపై నుంచి కిందపడి మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో వీల్ చెయిర్‌కే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు గుమ్మడి విజేంద్రమణి, గుమ్మడి హనుమంతరావు పేదవారు కావడంతో వైద్యానికి ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేశారు. ప్రత్యేక చికిత్స చేస్తే అతడికి తెలివి వస్తుందని వైద్యులు చెప్పారని విజేంద్రమణి ముఖ్యమంత్రికి విన్నవించగా సీఎం చలించారు. వెంటనే అతడి వైద్య చికిత్సకు రూ.2 లక్షలు మంజూరు చేశారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
మరోసారి ఉదారతను చాటుకున్న సీఎం చంద్రబాబు
22-09-2017 22:14:41
 
636417153014165911.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఉదారతను చాటుకున్నారు. గుంటూరుకు చెందిన షేక్ హసీనా అనే మహిళ అరుదైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నారు. హసీనా నిరుపేదరాలు కావడంతో చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.. తన చికిత్సకు సహాయం చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. దీంతో స్పందించిన ఆయన రూ. 10లక్షల రూపాయలు మంజూరు చేశారు
Link to comment
Share on other sites

  • 2 weeks later...
చిన్నారుల వైకల్యానికి చలించిన ముఖ్యమంత్రి...
cm-help-04102017.jpg
share.png

అతడు ప్రమాదానికి గురై మతిస్థిమితం కోల్పోయాడు. జీవచ్ఛవంలా మారిన బాలుడు షేక్ నాగుల్ మీరా. మంచానికే పరిమితమయ్యాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామం నుంచి కుటుంబసభ్యులతో వచ్చి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశాడు. వైద్యచికిత్సకు కొద్దిపాటి ఆస్థిని కరిగించామని, అయినా తమ బిడ్డకు బాహ్య ప్రపంచం తెలియనివాడిగా మిగిలాడని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ బాధను చెప్పుకున్నారు.

బాలుని పరిస్థితి చూసి చలించిన ముఖ్యమంత్రి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. ఆ డబ్బును నాగుల్ మీరా పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, నెలనెలా వచ్చే వడ్డీతో అతడి వైద్య ఖర్చులకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

 

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు నుంచి వచ్చిన త్రివేణి (15), వెంకట్ (12) మూగపిల్లలు. తమ బాధను చెప్పుకోలేని నిస్సహాయులు. శస్త్ర చికిత్స చేస్తే మాటలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పిన మాటలు వారికి ఒయాసిస్సుల్లా అనిపించాయి. మాట వస్తుందన్న ఆశ ముందుకు నడిపిస్తుండగా శస్త్ర చికిత్సకు ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

వారి శస్త్ర చికిత్సకు రూ. 10 లక్షల వ్యయం అవుతుందని వైద్యులు తేల్చారు. శస్త్ర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలిద్దరి బాగోగులను చూసుకుంటామని హామీ ఇచ్చారు. పేదరికంలో ఉన్నామని, జరుగుబాటుకు పనిచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని, సాయపడాలని వచ్చిన పలువురికి ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయం అందజేశారు

Link to comment
Share on other sites

  • 7 months later...
మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న ఏపీ సీఎం
23-05-2018 10:47:03
 
636626692248484376.jpg
విశాఖపట్నం: కొన్నేళ్లుగా ఎముకుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న యువకుడికి సీఎం చంద్రబాబు నాయుడు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. శ్రీకాకుళం జిల్లా మండలం అలిని గ్రామానికి చెందిన సిరిపురపు నారాయణ మూర్తి(17)కొన్నేళ్లుగా ఎముకుల సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. కాళ్లు, చేతులు పడిపోయి కదల్లేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న యువకుడి సమస్యను సామాజిక కార్యకర్త పాలూరి సిద్ధార్థ సీఎం చంద్రబాబు దృష్టికి కొద్ది రోజుల కిందట తీసుకెళ్లారు. ధర్మ పోరాట సభలో పాల్గొనేందుకు వచ్చిన సీఎంను సిద్ధార్థతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు వేదికపై కలిసి తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. ఈ సందర్భంగా సీఎంతో మాట్లాడిన యువకుడు మిమ్మల్ని చూడాలని ఇంత దూరం వచ్చానని, నా పరిస్థితి బాగోలేదని, తన చెల్లిని చదివించేందుకు సహకరించాలని అభ్యర్థించాడు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు యువకుడు తక్షణం సహాయంగా మూడు లక్షల రూపాయలను అందించడంతోపాటు ప్రతి నెల మందులు అందించాలని, అతని చెల్లెలను మోడల్‌ స్కూల్‌లో చేర్పించాలని మంత్రి అచ్చెన్నాయుడుని ఆదేశించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...