Jump to content

Prakruthi vyavasayam


Recommended Posts

 

  • సేంద్రియ సాగుతో సిరులు పండిస్తున్న ఏనెబావి రైతులు
పల్లెలకు పాఠం- రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి
నిదర్శనం జనగామ జిల్లా ఏనెబావి గ్రామం. క్రిమి
సంహారకాలు లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఏనెబావినే ఉదాహరణగా చూపుతారు. రసాయనరహిత గ్రామంగా పేరొందిన ఆ గ్రామ రైతుల ప్రస్థానం ఇది.
 
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఏనెబావి గ్రామ రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ సిరులు పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా చీడపీడల బాధ లేకుండా అధిక దిగుబడులు పొందుతూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ‘క్రాప్స్‌’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్వతహాగా ఇంట్లోనే సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గ్రామానికి చెందిన 45 మంది రైతులు తమకున్న 145 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. చెరువు నుంచి తెచ్చిన మట్టి, ఆవుపేడ, గొర్రెలు, మేకల ఎరువు, గోమూత్రం, వేప కషాయంతో ఈ రైతులు స్వయంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. వానపాములతో వర్మి కంపోస్టు తయారుచేస్తూ పంటలకు బలమైన పోషకాలను అందిస్తున్నారు. ఫలితంగా అధిక దిగుబడులు పొందుతున్నారు. క్రాప్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన శిక్షణతో ఏనెబావి గ్రామంలో ఇంటింటా వర్మి కంపోస్టు తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అప్పటినుంచి గ్రామాన్ని రసాయన రహిత గ్రామంగా పిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి సేంద్రియ సేద్యమే కారణం అంటున్నారు ఈ గ్రామ రైతులు. ఎకరం కూరగాయల తోట సాగుకు 5 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సేంద్రియ పంట కావడంతో మంచి ధర పలుకుతున్నది. దిగుబడులు అధికంగా రావడంతో రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల సేంద్రియ వరి ధాన్యం, కూరగాయలను నగరాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సేంద్రియ ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.
 
 
అవగాహన పెంచాలి
సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అధిక పెట్టుబడులతో రైతులను నష్టాల బాట పట్టిస్తున్న రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా మానుకునే విధంగా ప్రోత్సహించాలి. ఐదెకరాల్లో పదేళ్లుగా కందులు, కూరగాయల పంటలు వేసి లాభం పొందుతున్నాను.
- పొన్నాల తిరుమలేషం, రైతు
Link to comment
Share on other sites

  • Replies 351
  • Created
  • Last Reply

Top Posters In This Topic

 

  • సేంద్రియ సాగుతో సిరులు పండిస్తున్న ఏనెబావి రైతులు
పల్లెలకు పాఠం- రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి
నిదర్శనం జనగామ జిల్లా ఏనెబావి గ్రామం. క్రిమి
సంహారకాలు లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఏనెబావినే ఉదాహరణగా చూపుతారు. రసాయనరహిత గ్రామంగా పేరొందిన ఆ గ్రామ రైతుల ప్రస్థానం ఇది.
 
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఏనెబావి గ్రామ రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ సిరులు పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా చీడపీడల బాధ లేకుండా అధిక దిగుబడులు పొందుతూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ‘క్రాప్స్‌’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్వతహాగా ఇంట్లోనే సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గ్రామానికి చెందిన 45 మంది రైతులు తమకున్న 145 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. చెరువు నుంచి తెచ్చిన మట్టి, ఆవుపేడ, గొర్రెలు, మేకల ఎరువు, గోమూత్రం, వేప కషాయంతో ఈ రైతులు స్వయంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. వానపాములతో వర్మి కంపోస్టు తయారుచేస్తూ పంటలకు బలమైన పోషకాలను అందిస్తున్నారు. ఫలితంగా అధిక దిగుబడులు పొందుతున్నారు. క్రాప్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన శిక్షణతో ఏనెబావి గ్రామంలో ఇంటింటా వర్మి కంపోస్టు తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అప్పటినుంచి గ్రామాన్ని రసాయన రహిత గ్రామంగా పిలుస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి సేంద్రియ సేద్యమే కారణం అంటున్నారు ఈ గ్రామ రైతులు. ఎకరం కూరగాయల తోట సాగుకు 5 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సేంద్రియ పంట కావడంతో మంచి ధర పలుకుతున్నది. దిగుబడులు అధికంగా రావడంతో రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల సేంద్రియ వరి ధాన్యం, కూరగాయలను నగరాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సేంద్రియ ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.
 
 
అవగాహన పెంచాలి
సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అధిక పెట్టుబడులతో రైతులను నష్టాల బాట పట్టిస్తున్న రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా మానుకునే విధంగా ప్రోత్సహించాలి. ఐదెకరాల్లో పదేళ్లుగా కందులు, కూరగాయల పంటలు వేసి లాభం పొందుతున్నాను.
- పొన్నాల తిరుమలేషం, రైతు
Link to comment
Share on other sites

 

 

Home-Icon
 
ముమ్మరంగా పాలేకర్‌ సదస్సు ఏర్పాట్లు
24-12-2017 11:12:32
 
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ నెల 31 నుంచి జనవరి 8 వరకు జరగనున్న శుభాష్‌ ఫాలేకర్‌ ప్రకృతి సేద్యం రైతు అవగాహన సదస్సు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు పకృతి సేద్యం జిల్లా అధికారి రామ్మోహన్‌ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 8వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు జరిగే సదస్సుకు రాష్ట్రప్రభుత్వం రూ. 7.68 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. మొదటి విడతగా రూ. 3 కోట్లు విడుదల చేశారు. జిల్లాలోని వ్యవసా య శాఖ డీడీలు, ఏడీలు, ఏవోలు, ఏఈవోలు, ఎంపీఈవోలు సుమారు 200 మంది బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో స దస్సు నిర్వహణకు మౌలిక వసతుల కల్పన, ఏర్పాట్లు, ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులకు వసతి కల్పిస్తారు. రోజు సుమారు 9 వేల మందికి బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లోనే భోజన సౌకర్యం కల్పిస్తారు. గుంటూరు జిల్లా నుంచి సదస్సుకు 560 మంది రైతులు హాజరవుతున్నారు. వీరిలో 80 మంది మహిళా రైతు లు ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రకృతి సేద్యం విభాగంలో ఎంపిక చేసిన క్లస్టర్లు నుంచి శుభాష్‌ పాలేకర్‌ సదస్సుకు ప్రతినిధులను ఎంపిక చేశారు. సదస్సు నిర్వహణకు వాహనాలు, ఇతర సౌకర్యాలను జిల్లా అధికారులు పర్యవేక్షిస్తారు.
Link to comment
Share on other sites

సాగులో పాలేకర్‌ సలహాలు పాటించాలి 
atp-brk7a.jpg

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంలో సుభాష్‌ పాలేకర్‌ సూచనలు అన్నతదాతలు పాటించాలని రాష్ట్ర సెర్ఫ్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై తొమ్మిది రోజుల పాటు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి శిక్షణకు శుక్రవారం జిల్ల్లా వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి 588 మంది రైతులను 17 అర్టీసీ బస్సుల్లో పంపారు. మంత్రి సునీత, జేసీ రమమాణి, రెండో జేసీ సయ్యద్‌ఖాజా పచ్చజెండా ఊపి వీరిని సాగనంపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పాత పద్ధతుల్లో గోమూత్రం, పశువుల ఎరువుతో సహజసిద్ధంగా పంటలను పండించాలని సూచించారు. తొమ్మిది రోజుల పాటు గుంటూరులో జరిగే శిక్షణలో పాలేకర్‌ సూచనలు, సలహాలు శ్రద్ధగా విని సాగులో పాటించాలని సూచించారు. సలహాలను తోటి రైతులకు చేరవేసి, వాటిని ఆచరించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేడీఏ శ్రీరామ్మూర్తి, డీడీఏలు శ్రీనివాసరావు, సురేంద్రబెనర్జీ, తిరుపతయ్య, డాక్టర్‌ నాగన్న, డీపీఎం లక్ష్మానాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ప్రకృతి సేద్య సంవత్సరంగా 2018 

ప్రకృతి సేద్యం ప్రభుత్వ సలహాదారుగా సుభాష్‌ పాలేకర్‌: ముఖ్యమంత్రి 

 

ఈనాడు, గుంటూరు: ప్రకృతి సేద్యానికి రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తామని, 2018ని ప్రకృతి సేద్యం సంవత్సరంగా ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ప్రకృతి వ్యవసాయంపై ఎనిమిది వేల మంది రైతులకు నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల శిక్షణ శిబిరాన్ని ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలోనే ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామన్నారు. ఈ సేద్యంపై ప్రభుత్వ సలహాదారుగా సుభాష్‌పాలేకర్‌ను నియమిస్తున్నామని ప్రకటించారు. ఫైబర్‌నెట్‌ ద్వారా నెలకోరోజు మూడు గంటలపాటు పాలేకర్‌తో శిక్షణ కార్యక్రమం ప్రసారం చేస్తామని, మూడు నెలలకోసారి రైతు శిబిరాలు కూడా నిర్వహిస్తామని వివరించారు. ఈ రోజు నుంచి తాను ప్రకృతి సేద్యం ఉత్పత్తుల భోజనమే తింటానన్నారు. ఈ సేద్యంలో వచ్చే సమస్యలపై శాస్త్రవేత్తలతో సమావేశమై చర్చిస్తామన్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం(యూఎన్‌ఈపీ), ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో), వరల్డ్‌ అగ్రోఫారెస్ట్రీ సెంటర్‌ వారు రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి సహకరించడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రకృతిసేద్యంపై జూన్‌ 5న యూఎన్‌ఈపీతో ఒప్పందం చేసుకుంటామన్నారు.

ప్రకృతిసేద్యంతో రైతు ఆత్మహత్యల నివారణ 

శూన్య పెట్టుబడితో వ్యవసాయం చేస్తే రైతు ఆత్మహత్యలు నివారించవచ్చని భారత్‌లో మారిషస్‌ హైకమిషనర్‌ జగదీశ్వర్‌ గోవర్థన్‌ అన్నారు. సుభాష్‌ పాలేకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశీయ ఆవులను కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాలని, మండలానికో గ్రామాన్ని ఎంపికచేసి అక్కడ విత్తనోత్పత్తి చేయించి పంపిణీ చేయాలని సూచించారు. సహజసిద్ధమైన నీటి రక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యానికి ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు రాష్ట్రం రూ.700 కోట్లు ఖర్చు పెడుతుండగా, అజీంప్రేమ్‌జీ ఫౌండేషన్‌ రూ.వంద కోట్లు కేటాయించిందని తెలిపారు. కార్యక్రమంలో సభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారితదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

మటుమాయం  

సుభాష్‌ పాలేకర్‌ 

 

ఈనాడు-అమరావతి, గామీణ మంగళగిరి, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగుమందుల వినియోగంతో పెట్టుబడులు పెరిగి రైతుల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని ప్రకృతిసేద్యం పితాహమహుడు సుభాష్‌పాలేకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు.. ఆ బాటలోనున్న దేశాలకు వ్యవసాయ విజ్ఞానం పేరిట రసాయన ఎరువులను దిగుమతి చేస్తూ దోచుకుంటున్నాయన్నారు. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు శిక్షణ శిబిరం సోమవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా రసాయన, ఆర్గానిక్‌ సాగు వల్ల కలిగే నష్టాలను పాలేకర్‌ వివరించారు. ప్రకృతి సేద్య విధానాన్ని రైతులకు వివరించారు. సాగుకు అవసరమైనవి నగరాలకు వెళ్లి తెచ్చుకోవటం వల్ల గ్రామాల్లో డబ్బు అక్కడకు మళ్లిపోతోందన్నారు. విదేశాల నుంచి సాగు ఉత్పాదకాల దిగుమతుల వల్ల రూ.54లక్షల కోట్లు సొమ్ము విదేశాలకు తరలిపోతోందన్నారు. ఈ సంపద మన వద్దనే ఉంటే ప్రతి గ్రామానికి రూ.9కోట్లు వంతున వస్తాయన్నారు. రైతుల వద్ద సంపద ఉన్నప్పుడే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడి పేదరికం తగ్గుతుందన్నారు. ఇది సాధించాలంటే ప్రకృతి సేద్యమే పరిష్కారమన్నారు.రసాయన, ఆర్గానిక్‌ సాగు రెండూ ప్రమాదకరమైనవేనని,  అందుకే ఎవరిపై ఆధారపడకుండా ప్రకృతి సాగును ప్రోత్సహించాలని సూచించారు.మనం తీసుకుంటున్న ఆహారం, గాలి, నీరు వల్లనే జబ్బులు వస్తున్నాయని గుర్తుచేశారు. సోమవారం శిక్షణలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 6491 మంది రైతులు, ఐటీ నిపుణులు 194 మంది, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి 128మంది రైతులు కలిపి మొత్తం 6813 మంది హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు విజయకుమార్‌, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఆసక్తితో హాజరు: ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకునేందుకు శిబిరానికి వస్తున్నట్లు కృష్ణా జిల్లాకు చెందిన కె.వెంకటేశ్వరరావు వివరించారు. హైదరాబాద్‌లో పాలేకర్‌ శిక్షణకు రాలేకపోయామని అందుకే ఇక్కడిదాకా వచ్చినట్లు ప్రవీణ్‌, స్వామి తెలిపారు. ఈ విధానంలో పంటలు సాగుచేయాలని ఆరెకరాల పొలాన్ని సిద్ధం చేశామన్నారు.

 

నాణ్యత బాగు: సన్నెగౌడ్‌, ఉగ్రేపల్లి, మడకశిర మండలం అనంతపురం 

మా కాలనీలో 40మంది రైతులు మందులేం వాడకుండా వేరుశనగ పండించాం. మొదటి రెండేళ్లు దిగుబడి తగ్గింది. తర్వాత రసాయన మందులు చల్లిన వారికి దీటుగా దిగుబడి వచ్చింది. కాయల్లో నాణ్యత పెరిగింది. ఇతర రైతులు బస్తా కాయలు తూకం వేస్తే 35 కిలోలు వస్తే మా పంట 45 కిలోలు వచ్చింది. ఎకరానికి 15 బస్తాల దాకా సాధించాం. వేరుశనగతోపాటే అంతర పంటలు సాగుచేస్తున్నాం

Link to comment
Share on other sites

అధిక దిగుబడులు: పాలేకర్‌
ఈనాడు, అమరావతి: భూమి సహజసిద్ధంగా సారవంతమైనప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చని, ఆ దిశగా రైతులు పంటల ఆచ్ఛాదనను భూమిలోకి కలిపేయడం ద్వారా భూమిని సారవంతం చేయాలని ప్రకృతిసేద్య నిపుణుడు సుభాష్‌పాలేకర్‌ సూచించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జరుగుతున్న రైతు శిక్షణ శిబిరంలో మూడోరోజు సహజసిద్ధంగా భూమిని సారవంతం చేయడం, సేంద్రియ కర్భనం తయారయ్యే విధానాన్ని పాలేకర్‌ వివరించారు. బీజామృతం, ఘనబీజామృతం తయారీపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో ప్రకృతి సేద్యం విస్తరణకు నిర్దుష్టమైన కార్యాచరణను రూపొందిస్తున్నాం. ఏప్రిల్‌, మే నెలల్లో ప్రతి గ్రామపంచాయతీలో ఒక రైతుకు శిక్షణ ఇస్తాం. ప్రతి గ్రామం నుంచి ప్రకృతి రైతు ఉండేలా, ఐదేళ్లలో రాష్ట్రం మొత్తం ప్రకృతిసేద్యం ఆచరించేలా చేస్తాం’’ అని పాలేకర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

ప్రకృతి సేద్యమైనా ఫలించేనా? 
ప్రత్యామ్నాయం వైపు మొగ్గు 
  పెట్టుబడి లేక రైతుల ఆసక్తి 
  అనుభవాలు తెలుసుకున్న ‘ఈనాడు’ 
ఈనాడు, గుంటూరు 
gnt-top2a.jpg

అధిక దిగుబడుల సాధనకు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి నష్టాల బాటలో కొనసాగుతున్న రైతులు పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపుతున్నారు. ఈపాటికే కొందరు సదరు సాగు చేపట్టి కొంత వరకు ఫలితాలు సాధించినా మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి ప్రకృతి వ్యవసాయ పితామహుడు పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ ఆధ్వర్యాన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం వద్ద జరుగుతున్న శిక్షణకు హాజరవుతున్నారు. మరికొందరు కొత్త విధానంలోనైనా సాగు లాభసాటిగా మారుతుందేమో ఒకసారి చూద్దామనే ధోరణితో వస్తున్నారు. సందేహాలు నివృత్తి చేసుకుంటూనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దిగుబడులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే లాభదాయకంగా ఉంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల అనుభవాలను ‘ఈనాడు’ తెలుసుకుంది. అవి వారి మాటల్లోనే...

తక్కువ పెట్టుబడితో లాభదాయకం 
ఏడేళ్లుగా ప్రకృతి సేద్యం విధానంలో వరి సాగు చేస్తున్నా. దిగుబడులు కొంతమేర తగ్గుతున్నా పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండటంతో అనుసరిస్తున్నా. దుక్కులు నుంచి కోత వరకు ఎకరాకు రూ.10 వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. సాంబ మసూరి రకం ఎకరానికి 25, స్వర్ణ 30, 1001 రకం 30 బస్తాల వరకు దిగుబడి ఇస్తున్నాయి. బీజామృతం, ఘన బీజామృతం, పంచగవ్వ తదితరాలను తయారు చేసుకుని పంటలకు వేస్తున్నా. ఎకరానికి ఒక బస్తా డీఏపీ వాడుతున్నా. పశువుల పేడ ఎకరాకు రెండు ట్రాక్టర్లు వినియోగిస్తున్నా. పురుగుమందులు పిచికారీ చేయడం లేదు. ఈ విధానంలో ఇప్పటివరకు నష్టాలు వచ్చిన దాఖలాలు లేకపోవడంతో మా గ్రామం మొత్తం ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రభుత్వం నుంచి పురస్కారం పొందింది. హైదరాబాద్‌ నుంచి శ్రేష్ఠ సంస్థ వచ్చి యంత్రంతో తేమ, రసాయనాల శాతం పరీక్షించి ధాన్యం కొనుగోలు చేస్తోంది. మార్కెట్లో మిగిలిన వారితో పోల్చితే అధిక ధర ఇస్తోంది. ఇది లాభదాయకంగా ఉండటంతో అందరం ప్రకృతి సేద్యం చేస్తున్నాం.

- జి.సుందరరావు, పూసర్లపాడు, గార మండలం, శ్రీకాకుళం జిల్లా

పొలం నుంచే అన్ని ఉత్పత్తులు 
పదకొండేళ్లుగా 17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నా. బోరు ఉన్న చోట వరి వేస్తున్నా. మెట్ట భూమిలో వేరుసెనగ, కంది తదితర పంటలు పండిస్తున్నా. ఎకరాలో బీపీటీ-5204 రకం వరి 39 బస్తాల దిగుబడి ఇచ్చింది. ఒక్కొక్క బస్తా 90 కిలోల బరువు తూగుతోంది. ఉల్లి 1.25 ఎకరాల్లో వేస్తే సాధారణం 150కన్నా తక్కువగా 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరాకు అందరికీ వేరుసెనగ 8- 9 బస్తాలు దిగుబడి వస్తే మాకు మాత్రం 12 బస్తాల దిగుబడి రావడంతోపాటు ఒక్కోటీ 45 కిలోల బరువు వచ్చింది. ఇంటికి సంబంధించి అన్ని కూరగాయలు, ధాన్యం పొలంలోనే పండించుకుంటాం. రెండు ఆవులతోనే సాగు చేస్తున్నాం. బెల్లం, కాఫీ పొడి మాత్రమే బయట కొనుగోలు చేస్తాం. మేము పండించిన బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి వ్యాపారులు వచ్చి క్వింటా రూ.7 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇంటి వద్దే మొత్తం విక్రయిస్తున్నాం. మిగిలిన పంట ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే గిట్టుబాటు అవుతాయి. 2010లో నంది అవార్డు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది.

- పి.నంజుండప్ప, చింతర్లపల్లి, కల్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా

ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి 
ప్రకృతి సేద్యంలో పెట్టుబడి తక్కువగానే ఉన్నా సాగులో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి. ఎకరాలో పందిళ్లు వేసి దొండ, కాకర సాగు చేశా. తొలుత కాపు బాగానే వచ్చింది. ఎండుకొమ్మ, పండు తెగుళ్లు, బిళ్ల పురుగు వస్తున్నాయి. వీటి నివారణ చర్యలు తెలుసుకుని సస్యరక్షణ చేపట్టే సరికి పంట దెబ్బతింటోంది. రూ.2 లక్షలు రావాల్సిన చోట రూ.50 వేలు మాత్రమే వచ్చాయి. ప్రకృతి సేద్యపు ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్‌ లేకపోవడంతో సాధారణంగా విక్రయిస్తుండగా పెద్దగా ధర రావడం లేదు. తెగుళ్లు వచ్చిన వెంటనే నివారణకు మార్గాలు తెలియజేస్తే ఉపయోగం ఉంటుంది. దీనికి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో శిక్షణకు వచ్చాను. ఆ తŸర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తా.

- రామ్మోహన్‌రెడ్డి, జిల్లెళ్లపాడు, వెలిగండ్ల మండలం, ప్రకాశం జిల్లా

దిగుబడి తగ్గినా లాభదాయకమే 
రెండేళ్లుగా ప్రకృతి సేద్యం విధానంలో పత్తి వేస్తున్నాను. ఈ ఏడాదీ రెండెకరాల్లో సాగు చేశాను. ఇప్పటివరకు ఏడు క్వింటాళ్ల పత్తి తీసి అమ్మాను. మరో రెండు క్వింటాళ్ల వరకు తీయాల్సివుంది. పక్క పొలాల రైతులు రసాయన విధానంలో సేద్యం చేసి ఎకరాకు 8-10 క్వింటాళ్లు పండించారు. వారితో పోల్చుకున్నప్పుడు పెట్టుబడి తక్కువ కావడంతో దిగుబడి తగ్గినా నష్టాలు రాలేదు. ఈసారి భారీవర్షాలకు నీరు పొలంలో నిలిచిపోవడంతో దిగుబడి తగ్గింది. కషాయాలు పిచికారీ చేస్తే పొలం పచ్చగా పెరుగుతోంది. గతంలో పురుగుమందులు వాడి తీవ్రంగా నష్టపోయాం. ప్రకృతి సేద్యంలో పెట్టుబడి తక్కువగా ఉండటంతో పొరుగు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. తొలుత దిగుబడులు తగ్గుతున్నా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విధానంలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఈ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నా.

- పి.నాగరాజు, ఉయ్యాలవాడ, ఓర్వకల్లు మండలం, కర్నూలు జిల్లా

రోజూ 200 కి.మీ. ప్రయాణం 
చెన్నైలో ఉంటున్నా. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఐతంపాడులో 60 ఎకరాలు కొనుగోలు చేసి ప్రకృతి సేద్యం చేస్తున్నా. మూడేళ్లుగా రసాయనాలు వేయకుండా మామిడి, నేరేడు, జామ తోటలు పండిస్తున్నా. ఇప్పటివరకు వివిధ కారణాలవల్ల పెట్టుబడి పెడుతున్నా ఆశించిన లాభాలు రావడం లేదు. కూరగాయల పంటలు వేస్తున్నా. నిత్యం చెన్నె నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పొలానికి వచ్చి తిరిగి సాయంత్రం వెళుతున్నా. ప్రకృతి సేద్యం ద్వారా పొలం ఉన్న గ్రామం నుంచి మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. ఇప్పుడిప్పుడే కొంత ఫలితాలు వస్తున్నాయి. పంట దిగుబడులు వస్తున్నా మార్కెటింగ్‌ సౌకర్యం లేక దళారులకు అడిగినంత ఇవ్వాల్సివస్తోంది. ఈ క్రమంలో చెన్నైలో ఆర్గానిక్‌ ఉత్పత్తులు విక్రయించే వారితో మాట్లాడి ఒప్పందం చేసుకుంటున్నా. ఎకరాలో పది రకాల కూరగాయలు వివిధ రోజుల్లో కోతకు వచ్చేలా సాగు చేయాలని సూచించారు. వారి సూచనల మేరకు పండిస్తే గిట్టుబాటు ధర లభించే అవకాశముంది. ఆ దిశగా ప్రణాళికను రూపొందించుకుంటున్నా. ప్రకృతి సేద్యంలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికే శిక్షణకు హాజరవుతున్నా. మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు.. సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అనుసరించి పలువురికి మార్గదర్శకంగా నిలవాలని ఉంది.

- అనుమోలు సుగుణ, చెన్నై, ప్రకృతి సేద్యం మహిళా రైతు
Link to comment
Share on other sites

దేశీయ ఆవులే మేలు
05-01-2018 07:09:16

ఆవు పేడలో పంటలకు
మేలు చేసే సూక్ష్మజీవులు
 జెర్సీ జాతి ఆవు ప్రమాదకర జంతువు
 బయోలను ప్రోత్సహిస్తున్న శాస్త్రవేత్తలు
 ప్రకృతి సేద్యం సృష్టికర్త సుభాష్‌ పాలేకర్‌
 
(గుంటూరు): దేశీయ ఆవుల్లోనే పంటకు మేలు చేసే పేడ, మూత్రం ఉంటాయని పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం సృష్టికర్త సుభాష్‌ పాలేకర్‌ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు గురువారం ఐదవ రోజు ప్రకృతి సేద్యంపై శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవు పేడలో పంటలకు మేలు చేసే కోట్ల సూక్ష్మ జీవులు ఉన్నాయన్నారు. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్న జెర్సీ ఆవులు జాతి ఆవులు కాదన్నారు. అది ఒక విష జంతువు అని చెప్పారు. ప్రపంచంలో ఎవరైన జెర్సీ జాతిని ఆవుగా రుజువు చేయాలని పాలేకర్‌ సవాల్‌ విసిరారు. మన ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు జెర్సీ ఆవులను ప్రోత్సహిస్తూ, సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలిపారు. జెర్సీ జాతి మూత్రం, పేడలో మొక్కలకు పనికి వచ్చే పోషక పదార్థాలు లేవన్నారు.
 
రైతులు ఎకరానికి పది కిలోల ఆవు పేడను మూత్రంతో కలిపి వేయాలని సూచించారు. ప్రస్తుతం రైతులు ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగు మందులు పంటలకు మేలు చేయవన్నారు. శక్తి వంతమైన ఎరువులు, పురుగు మందులను భూమిపై వేయడం వలన మట్టిలో ఉండే మొక్కలకు మేలు చేసే వివిధ రకాల సూక్ష్మ జీవులు, పోషక పదార్థాలు నశిస్తాయని సుభాష్‌ ఫాలేకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సేంద్రియ, బయో ఎరువులు వేయడం మంచిదని సూచిస్తూ శాస్త్రవేత్తలు ప్రభుత్వాలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బయోలు, సేంద్రియాలకు రూ.కోట్లలో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నారు. అయినా వ్యవసాయ ఉత్పత్తులు ఎందుకు పెరగటం లేదని ప్రశ్నించారు. శాస్త్రవేత్తల పరిశోధనలతో రైతులు ఎందుకు లబ్ధి పొందలేదన్నారు. బయోలు, సేంద్రీయ ఎరువుల కంటే అపరాల పిండిలో ఎక్కువ పదార్థాలు ఉన్నట్లు చెప్పారు.
 
పాలేకర్‌ విధానాలే శరణ్యం...
రైతులకు సుభాష్‌ పాలేకర్‌ విధానాలే మంచిదని కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ కడియాల రాఘరావు సూచించారు. ఐదేళ్ల క్రితం కృష్ణా జిల్లాలో మొదటిగా నిర్వహించిన శిక్షణా తరగతులు దశల వారిగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు చెప్పారు. యడ్లపాడుకు చెందిన ప్రాకృతిక రైతు పోపూరి రామారావు మాట్లాడుతూ ప్రకృతి సేద్యం వలన ప్రజలకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ డాక్టర్‌ హరి జవహర్‌లాల్‌ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దటానికే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెసి-2 ముంగా వెంకటేశ్వరరావు, హోం సైన్స్‌ డీన్‌ డాక్టర్‌ నీరజ, వ్యవసాయ శాఖ డీడీలు తిరుపయ్య, రామలింగయ్య, ప్రకృతి సేద్యం జిల్లా అధికారి రామ్మోహన్‌ తదితరులు ప్రసంగించారు.
 
మెరుగైన సేవలు..
శిక్షణ తరగతులు జరిగే ప్రాంతంలో కాజ పంచాయతీ, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జీరో బడ్జెట్‌కు చెందిన 200 మంది వాలంటీర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారు. గుంటూరు డివిజన్‌ డీఎల్‌పీవో సుబ్రహ్మణ్యం సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ డీడీలు తిరుపయ్య, రామలింగయ్య, ప్రకృతి సేద్యం జిల్లా అధికారి రామ్మోహన్‌లు గ్రౌండ్‌లో భోజనం, అల్పాహార పంపిణీ వద్ద బాధ్యతలు తీసుకున్నారు. వీరికి జేసీ-2 ముంగా వెంకటేశ్వరరావు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నారు. గురువారం ఉదయం సుమారు 200 మందికి అల్పాహారం తగ్గింది. వెంటనే అధికారులంతా అక్కడే ఉండి అరగంటలో అల్పాహారం తయారు చేయించి సమస్యను పరిష్కరించారు. సుమారు 10 కౌంటర్లు ఏర్పాటు చేసి మినరల్‌ వాటర్‌ను ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నారు.

Link to comment
Share on other sites

ప్రకృతి సేద్యంతోనే భవిత 
తక్కువ పెట్టుబడితో రైతుకు రెట్టింపు ఆదాయం 
లాభసాటి సాగుతో గ్రామాల్లోనే యువతకు ఉపాధి 
‘ఈనాడు’తో ప్రకృతిసేద్యం ఆధునిక రూపకర్త సుభాష్‌పాలేకర్‌ 
ఈనాడు - అమరావతి 

వ్యవసాయంలో లాభాలను సృష్టించి, పట్టణాలకు గ్రామీణ యువత పోకుండా ఉపాధి కల్పించడం ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమని ప్రకృతిసేద్యం ఆధునిక రూపకర్త పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ అన్నారు. సాగు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తక్కువ పెట్టుబడితో ప్రజారోగ్యాన్నిచ్చే నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలన్నదే ప్రకృతి వ్యవసాయం లక్ష్యమన్నారు. రైతులకు ప్రకృతిసాగుపై తొమ్మిదిరోజులు శిక్షణ ఇవ్వడానికి గుంటూరు వచ్చిన ఆయన ‘ఈనాడు’తో  మాట్లాడారు.
ప్రశ్న: గిట్టుబాటు ధరలు దక్కాలంటే ప్రకృతిసేద్యమే ప్రత్యామ్నాయమా? 
పంట ఉత్పత్తుల్లో విషపూరిత అవశేషాల వల్ల వినియోగదారులు తగిన ధర చెల్లించడం లేదు. ఈ విధానం గిట్టుబాటు కాకపోవడంతో రైతులెవరూ కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. భారీఎత్తున గ్రామీణ యువత ఉపాధి కోసం పట్టణాలకు వలసవెళుతున్నారు. గ్రామీణ యువత మేము చెబుతున్న శూన్యపెట్టుబడితో ప్రకృతిసాగుకు మళ్లితే చాలు. ఒక దేశవాళీ ఆవుతో 30 ఎకరాల్లో సాగుచేయవచ్చు. సాగుకు అవసరమైన ఉత్పాదకాలను రైతులే తయారు చేసుకోవచ్చు. 10 శాతం నీరుతో పంట పండించవచ్చు. ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు లేకపోవడం, పోషక, ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల రెట్టింపు ధరలకు వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ తరహా సాగు విధానాన్ని యువత గుర్తిస్తే వలసపోయే పరిస్థితి ఉండదు.
ఏడాదికి ఎకరాకు రూ.6 లక్షలు ఆదాయం ఆర్జించడం ఎలా సాధ్యం? 
కేవలం 10శాతం నీటిలభ్యత ఉంటే ఎకరాకు రూ.6లక్షల ఆదాయం తీయవచ్చు. ఇది ఎలా సాధ్యమైందన్నది మహారాష్ట్రలో చేసి చూపించాం. పండ్లతోటలు, అందులో అంతరపంటల ద్వారా ఇది సాధ్యమైంది. ఎవరికైనా సందేహాలుంటే అక్కడకొచ్చి పరిశీలించుకోవచ్చు.
దిగుబడుల వృద్ధి, చీడపీడల నివారణకు శాస్త్రీయ ఆధారాలేమైనా ఉన్నాయా? 
కచ్చితంగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం సలహాదారు విజయ్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయశాస్త్రవేత్తతో శాస్త్రీయ అధ్యయనం చేయించారు. రసాయనాలతో సాగుచేసిన పంటల కంటే ఒకటిన్నర రెట్లు దిగుబడులు ప్రకృతిసాగులో వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. దిగుబడుల వృద్ధికి కారణాలేంటన్నదీ శాస్త్రీయంగా పరిశీలించారు.
రసాయన, సేంద్రియ, ప్రకృతిసేద్య విధానంలో పెట్టుబడుల మధ్య వ్యత్యాసం ఏమిటి? 
రసాయన సేద్యంలో ఎకరా వరిసాగుకు రూ.36వేలు రైతులు వెచ్చిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పంట ఉత్పత్తి ఖర్చు ఉండదు. ఎందుకంటే సాగు ఉత్పాదకాలుగా వ్యర్థాలు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులే వాడుతాం. ఇక సేంద్రియ వ్యవసాయంలో రసాయన సేద్యం కంటే ఖర్చు చాలా ఎక్కువ. వీటితో ప్రకృతిసాగును ఏమాత్రం పోల్చలేం.
ప్రకృతి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం ఎలా? 
రైతులు పండించిన ఉత్పత్తులకు వారే ధర నిర్ణయించే మార్కెట్‌ కోసం మహారాష్ట్రలో ఓ విధానాన్ని అభివృద్ధి చేశాం. ఉత్పత్తులను దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తాం. అప్పుడు మార్కెట్‌లో ఉన్న ధర రైతు జేబుకు చేరుతుంది.
ప్రకృతి సాగులో గరిష్ఠంగా వచ్చే దిగుబడి ఎంత? 
మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల్లో ఎకరాకు 18-24 క్వింటాళ్ల బాస్మతి ధాన్యం పండిస్తున్నాం. రసాయన సేద్యంలో 12 క్వింటాళ్లకు మించి దిగుబడులు నమోదుకాలేదు. చెరకులో 400 క్వింటాళ్ల నుంచి 1000 క్వింటాళ్ల వరకు పండిస్తున్నాం. రసాయనసేద్యంలో 300 క్వింటాళ్ల మించి దిగుబడులు లేవు. వేరుసెనగ, శనగ సహా అన్ని పంటల్లోనూ గరిష్ఠ దిగుబడులే వచ్చాయి. ఈ ఏడాది బీటీ పత్తి దిగుబడి ఎకరాకు 3 నుంచి 6క్వింటాళ్లకు మించలేదు. అదే ప్రకృతిసేద్యంలో మెట్టప్రాంతంలో 6 నుంచి  12క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నీటిపారుదల ఉన్నచోట 20క్వింటాళ్ల దిగుబడి లభించింది.
ఏపీలో ప్రకృతి వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు? ఇక్కడ విస్తరణకు ప్రణాళికలేంటి? 
2018లో ఏపీని ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈనెల 8న అధికారులు వార్షిక  ప్రణాళిక ఇస్తారు. వారికి నేను తయారుచేసుకున్న ప్రణాళిను వివరిస్తాను. ఏప్రిల్‌, మే నెలల్లో రెండు కార్యశాలలు నిర్వహించి ప్రతి గ్రామానికి ఒక ప్రకృతి రైతును తయారుచేస్తాం. ఆ తర్వాత స్వల్పకాలంలోనే రాష్ట్రమంతా ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం.

Link to comment
Share on other sites

ప్రకృతి ఒడి.. ఫలితాల మడి! 
ప్రత్యేక సేద్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం 
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం 
ఆదర్శంగా నిలుస్తున్న మన్యం రైతులు 
న్యూస్‌టుడే- సీతంపేట, వీరఘట్టం గ్రామీణం 
skl-sty1a.jpg

ప్రకృతి సేద్యం విధానంలో ఒక దేశవాళీ ఆవుతో 30 ఎకరాల్లో సాగు చేయవచ్చు. 10 శాతం నీరుతో పంట పండించవచ్చు. ప్రజారోగ్యాన్నిచ్చే నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించవచ్చు.

- ప్రకృతి సేద్యం ఆధునిక రూపకర్త సుభాష్‌ పాలేకర్‌

 

వ్యవసాయాన్ని లాభసాటి చేయడంతో పాటు హాని తలపెట్టని ఆహార ఉత్పత్తుల తయారీకి తోడ్పడే ప్రకృతి వ్యవసాయం వైపు జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం (జడ్‌బీఎన్‌ఎఫ్‌) వైపు జిల్లాతో పాటు సీతంపేట మన్యం రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏటేటా ఈ విధానంలో సాగుచేసే రైతుల సంఖ్య రెట్టింపైంది. గుంటూరు (అమరావతి)లో తొమ్మిది రోజుల పాటు ప్రకృతి సాగుపై ప్రకృతి సేద్యం ఆధునిక రూపకర్త సుభాష్‌ పాలేకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లాకు చెందిన రైతులు, సీఆర్పీలు, సీఏలు, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభాలు పొందిన రైతులు మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని చూసి మరికొంత మంది ఇదే విధానంలో సాగుకు ఉపక్రమిస్తున్నారు.అంతర పంటలు  సైతం 
సీతంపేట మండలం కె.కొత్తగూడకు చెందిన సవర భాస్కరరావు అనే గిరిజన రైత ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర పంటలు పండిస్తున్నారు. తనకున్న సుమారు మూడెకరాల విస్తీర్ణంలో నేలపనస, పసుపు, ఉసిరికి, జీడి, సీతాఫలం తదితర పంటలను రెండేళ్లుగా పూర్తిగా ఈ విధానంలోనే సాగు చేస్తున్నారు. పెట్టుబడి తక్కువ కావడం వల్ల మేలు కలుగుతోందని ఆయన అంటున్నారు.

వీరఘట్టం మండలంలో.. 
వీరఘట్టం మండలం చిదిమి గ్రామానికి చెందిన బి.గౌరీశ్వరరావు అనే రైతు గత ఖరీఫ్‌లో 90 సెంట్ల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేశారు. రూ. నాలుగు వేల పెట్టుబడి పెట్టారు. 28 బస్తాల ధాన,్యం దిగుబడి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇదే మండలం కంబర గ్రామానికి చెందిన ఎం.రఘురాములునాయుడు 2 ఎకరాల 50 సెంట్లలో వరి పండించారు. రూ. పది వేల పెట్టుబడి పెట్టారు. 70 బస్తాల దిగుబడి సాధించారు.

మంచి ఆదాయం 
సీతంపేట మండలం నౌగూడకు చెందిన సవర ఆనందరావు గత ఖరీఫ్‌లో గులిరాగి పద్ధతిలో ఎకరన్నర విస్తీర్ణంలో రాగులు పండించారు. 13 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధించారు. కేవలం రూ. అయిదు వేల పెట్టుబడి పెట్టానని, పెట్టుబడి పోనూ సుమారు రూ. 25 వేల ఆదాయం పొందినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మరో మూడెకరాల్లో ఇదే విధానంలో సాగు చేస్తున్నారు. కూరగాయలు 0.75 సెంట్లలో, జీడిమామిడి నాలుగు ఎకరాల్లో పండిస్తున్నారు. గిరిజనులకు పాడి ఆవులు రుణంపై అందిస్తే మరింత మేలు కలుగుతుందని ఆనందరావు అంటున్నారు.

జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఇలా.. 
* క్లస్టర్లు: 26 
* గ్రామాలు: 66 
* గత ఖరీఫ్‌లో లక్ష్యం: సుమారు 15 వేల హెక్టార్లు 
* రైతులు: 7500 మంది 
* గుంటూరులో శిక్షణకు వెళ్లినవారు: సుమారు 390 మంది 
* ప్రకృతి సేద్యానికి అవసరమైన వస్తువులు: దేశవాళీ ఆవు పేడ, మూత్రం, మరికొన్ని పదార్థాలతో కూడిన ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం 
* ఉపయోగం: రైతులకు పెట్టుబడి చాలా తక్కువ కావడం. దీని ద్వారా పండే ఆహార పదార్థాలపై ఎలాంటి రసాయనిక ఎరువుల ప్రభావం ఉండదు. ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. 
* అవసరం: ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పశువులు ఉండాలి. దేశవాళీ ఆవు ఉంటే మరీ మంచిది.

ప్రాధాన్యం మరింత పెరిగింది 
గతంతో పోల్చితే ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ విధానం అవలంబిస్తున్న రైతులు ఏటా పెరుగుతున్నారు. పెట్టుబడి స్వల్పం, ఆదాయం రెట్టింపు స్థాయిలో రావడంతో పాటు తిండి గింజలకు సంబంధించి ఎలాంటి హాని ఈ విధానంలో పండించే పంటలు చేయకపోవడంతో అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది.

-బి.రాజగోపాల్‌, సహాయ సంచాలకులు (ఏడీ), వ్యవసాయ శాఖ, పాలకొండ
Link to comment
Share on other sites

ఐదంచెల విధానంతో.. వలసలు ఉండవు 
ప్రకృతి సేద్యం పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ 

ఈనాడు డిజిటల్‌, గుంటూరు: ప్రకృతి వ్యవసాయంలో ఐదంచెల విధానంలో సాగు చేయడం ద్వారా ఉపాధి కోసం గ్రామీణ యువత పట్టణాలకు వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రకృతి సేద్యం పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ ఉద్ఘాటించారు. ఐదంచెల విధానంలో పెంచే తోట అధిక ఆదాయాన్ని ఇస్తుందని తెలిపారు. మామిడి, కొబ్బరి తోటల్లో ఒక క్రమపద్ధతిలో అంతర పంటలను సాగు చేయాలన్నారు. మొక్కలను ఏ వరుసలో పెట్టాలో, విత్తనాలు ఎలా నాటుకోవాలో, భూమిని ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. ఇలా ఐదంచెల విధానంలో సాగు చేసిన ఎకరం తోటలో రూ.10లక్షల నుంచి రూ.12లక్షల రూపాయల ఆదాయం రైతులకు వస్తుందని తెలిపారు. ఈ నమూనా రైతు కుటుంబానికి స్వయం సమృద్ధిని కలగజేస్తుందని, నిత్యావసరాల కోసం మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జరుగుతున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం శిక్షణా శిబిరాల్లో ఆదివారం ఆయన ’పంటలకు చీడ పీడలు సోకినపుడు క్రిమిసంహారక మందులు వినియోగించకుండా ఏవిధంగా పంటలను కాపాడుకోవాలి’ అనే అంశంపై మాట్లాడారు. ప్రకృతిలో మన చుట్టూ దాదాపు 32 రకాల ఆకులకు శిలీంధ్రాలను నాశనం చేసే శక్తి ఉంటుందన్నారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి, సప్తపర్ణి, సప్తధాన్య, దశపత్ర, సప్తపత్ర తదితర శిలీంధ్ర నాశన కషాయాలను ఎలా తయారు చేసుకోవాలో, ఉపయోగించాలో రైతులకు వివరించారు. ఈ కషాయాల తయారీకి గోమూత్రం ప్రధాన మూలకమని తెలిపారు. మామిడి, ఇతర పండ్ల తోటలకు తెగుళ్లు ఆశించకుండా నెలకొకసారి చెట్ల కాండంపై వేప లేపనం చేయాలని చెప్పారు. వేప లేపనం తయారీ విధానాన్ని వివరించారు. నల్లచెరువుకు చెందిన కలాం థెరిస్సా ఐడియల్‌ పాఠశాల విద్యార్థులు సుభాష్‌ పాలేకర్‌ను కలిసి, ప్రకృతి వ్యవసాయం ఫ్లకార్డులను ప్రదర్శించారు. తమ పాఠశాల ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయం విధానంలో కూరగాయలు, ఆకుకూరలను పండిస్తున్నట్లు వివరించారు.

Link to comment
Share on other sites

ఏర్పాట్లను పరిశీలించిన జమ్మూ కశ్మీర్‌ మంత్రి: జమ్మూ కశ్మీర్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు, అక్కడి రైతులకు అవగాహన కల్పించేందుకు జమ్మూ కశ్మీర్‌ వ్యవసాయశాఖ మంత్రి దల్జీత్‌సింగ్‌ చిబ్‌ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. తొలుత సుభాష్‌ పాలేకర్‌తో ప్రకృతి వ్యవసాయం గురించి చర్చించారు. త్వరలో జమ్మూకశ్మీర్‌లో సైతం అవగాహన కల్పించాలని ఆయన్ను అడిగారు. అనంతరం శిక్షణ శిబిరంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. శిబిరం మొత్తం నడుచుకుంటూ తిరుగుతూ రైతులకు ఏవిధమైన సౌకర్యాలు కల్పించారో ఆరా తీశారు. ఆహారం, వసతి, వైద్యం, ఇతర సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రిని ప్రశంసించారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌ వ్యవసాయశాఖ అదనపు డైరెక్టరు రామ్‌శబ్‌ద జైస్వారా శిబిరంలో రైతులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనరు హరిజవహర్‌లాల్‌, ప్రభుత్వ సలహాదారు విజయ్‌కుమార్‌, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. జేసీ-2 వెంకటేశ్వరరావు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

Link to comment
Share on other sites

4వేల మందికి పైగా వైద్యసాయం: రాష్ట్రంలోని పదమూడు జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి శిక్షణకు వచ్చిన రైతులను వాతావరణం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. శిబిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు ఆరోగ్య కేంద్రాలు రైతులకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. దాదాపు 4వేలకు పైగా రైతులు ఈ కేంద్రాల్లో వైద్యసాయం తీసుకున్నారు. ప్రతి రోజూ మూడు విడతల్లో ముగ్గురు జీజీహెచ్‌ వైద్యులు అందుబాటులో ఉన్నారు. వీరితోపాటు ఒక్కో విడతలో నలుగురు ఏఎన్‌ఎమ్‌లు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వలంటీర్లు రోగులకు వైద్యసాయాన్ని అందించారు. పది మంచాలను అందుబాటులో ఉంచడంతో నీరసించిన రైతులకు వైద్యం చేశారు. తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు 20 మంది రైతులను జీజీహెచ్‌కు పంపించారు. మొదట్లో రైతులకు వాతావరణం అనుకూలించక, ఆహారం సరిపోలక విరోచనాలు, అలర్జీలు, జ్వరాలు వచ్చాయి. ప్రస్తుతం దగ్గు, జలుబు, జ్వరం, తదితర ఇబ్బందులకు వైద్యుల్ని సంప్రదించి మందుల్ని వాడుతున్నారు

Link to comment
Share on other sites

నేటితో ముగియనున్న శిక్షణ 
డిసెంబరు 31 నుంచి జరుగుతున్న ఈ శిక్షణ శిబిరాలు నేటితో ముగియనున్నాయి. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కలిగే లాభాలు, మెళకువలపై పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ రైతులకు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ శిబిరాల్లో పాల్గొన్నారు. రైతులు, విద్యార్థులు, వ్యవసాయశాఖ సిబ్బంది ప్రతి రోజూ పాలేకర్‌ చెబుతున్న విషయాలను శ్రద్ధగా రాసుకుంటూ.. ప్రతి సందేహాన్ని సాయంత్రం ఏర్పాటు చేసిన బృంద చర్చల్లో నివృత్తి చేసుకున్నారు. శిబిరాల్లో పాల్గొన్న రైతులకు ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు.

జమ్మూలో తెలుగు సీఆర్‌పీలు 
ఈనాడు డిజిటల్‌, గుంటూరు: ప్రకృతి వ్యవసాయంపై జమ్ము రైతులకు అవగాహన కల్పించడం, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించడం, అధిక దిగుబడులను సాధించడమే లక్ష్యంగా ఏడుగురు సీఆర్‌పీల(క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌) బృందం పనిచేస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని ఉమిద్‌ ప్రాజెక్టులో భాగంగా అక్కడ బిష్న మండలంలోని రైతులకు సుస్థిర వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తున్నారు. సెర్ప్‌ ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన గుంటూరు, వరంగల్‌, అనంతపురం, జనగామ, కరీంనగర్‌లకు చెందిన సీఆర్‌పీలను నాలుగు సంవత్సరాల క్రితం సీఎమ్‌ఎస్‌ఏ (కమ్యూనిటీ మేనేజ్డ్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌) డైరెక్టర్‌ రాయుడు ఎంపిక చేసి జమ్ముకు పంపించారు. అక్కడి రైతులకు ప్రకృతి సేద్యం గురించి,  దేశవాళీ ఆవుల మూత్రం వల్ల కలిగే లాభాలు, కషాయాల తయారీవిధానం, పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడి ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సలహాలను వివరిస్తున్నారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల దిగుబడులు తగ్గడమే కాక పెట్టుబడి పెరిగి రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ నేపథ్యంలో బిష్న మండలంలోని రైతులకు ప్రకృతి సేద్యం పరిచయం చేసి అధిక దిగుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 400 ఎకరాలు ప్రకృతి సేద్యంలోకి తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా శ్రీవరి, శ్రీగోధుమ, 36-36 నమూనా, పలు రకాల కూరగాయల పంటలపై అక్కడి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు సీఆర్‌పీ ఇన్‌ఛార్జ్‌ ఫక్రుద్దీన్‌ తెలిపారు. అంతకుముందు కొంతమంది సీఆర్‌పీలు రాజస్థాన్‌లోని పలువురు రైతులకు ఇదే విధంగా ప్రకృతి సాగుపై అవగాహన కల్పించారు.

ఏపీని స్ఫూర్తిగా తీసుకుంటాం: కశ్మీర్‌ మంత్రి 
ఈనాడు డిజిటల్‌, గుంటూరు: రసాయనిక ఎరువుల వినియోగం వల్ల రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రత్యామ్నాయంగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మరలాల్సిన ఆవశ్యకత ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకృతి సేద్యంపై చూపిస్తున్న ఆసక్తి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని జమ్మూ కశ్మీర్‌ వ్యవసాయశాఖ మంత్రి దల్జీత్‌ సింగ్‌ చిబ్‌ పేర్కొన్నారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రకృతి వ్యవసాయంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా ఆపిల్‌, బాసుమతి బియ్యం ఎగుమతి చేస్తామని తెలిపారు. రసాయనిక ఎరువుల వినియోగం వల్ల వరి, గోధుమ, పప్పు, మామిడి, యాపిల్‌, రజ్మా తదితర పంటలు దిగుబడులు తగ్గుతున్నాయని గ్రహించామని తెలిపారు.  తమ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని, గత సంవత్సరం లక్షరూపాయలు రుణం తీసుకున్న రైతులకు 50శాతం రుణమాఫీ వర్తింపచేసినట్టు తెలిపారు. అక్కడి రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్టు వివరించారు.

Link to comment
Share on other sites

ప్రతి అంశం యూట్యూబ్‌లో...: ప్రకృతి వ్యవసాయంపై సుభాష్‌ పాలేకర్‌ చెబుతున్న అంశాలన్నింటినీ ప్రభుత్వం వీడియో తీయిస్తోంది. వీడియోలను క్రమపద్ధతిలో తీసుకొచ్చిన తరవాత అంశాల వారీగా యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏపీజడ్‌బీఎన్‌ఎఫ్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ వీడియోలను వీక్షించవచ్చు. రైతులెవరైనా పాలేకర్‌ చెప్పిన అంశాలను మళ్లీ మళ్లీ వినాలంటే ఈ వీడియోలు ఉపకరించనున్నాయి.

Link to comment
Share on other sites

పాలేకర్‌ను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోండి 
ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం డిమాండ్‌ 
8ap-state13a.jpg

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: అశాస్త్రీయ వాదనతో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న పాలేకర్‌ను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.కమలాకర శర్మ, కార్యదర్శి డి.ప్రవీణ్‌ మాట్లాడారు. రసాయన ఎరువుల అవశేషాలు ఆహార ధాన్యాల్లో ఉండవని శాస్త్రీయంగా నిరూపణ అయ్యిందని తెలిపారు. కేవలం పురుగు మందుల అవశేషాలు మాత్రమే ఆహార ధాన్యాల్లో ఉంటాయని, అదీ 15 రోజులు దాటితే ఉండవని శాస్త్రీయంగా నిరూపణ అయ్యిందని వివరించారు. పాలేకర్‌ చెబుతున్న వ్యవసాయం సేంద్రియ వ్యవసాయమే కాదని విమర్శించారు. ఆయన వాదన వంద శాతం అశాస్త్రీయమైనదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలేకర్‌ వాదనను నమ్మడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. వ్యవసాయరంగ సలహాదారుగా ఉన్న విజయ్‌కుమార్‌, పాలేకర్‌లు కలిసి రూ.కోట్ల ప్రజాధనాన్ని సేంద్రియ ముసుగులో ఎన్జీవోలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కాకినాడ, తిరుపతి కేంద్రాల్లో ఎనిమిది వేల మంది రైతులకు శిక్షణ పేరుతో రూ.10కోట్ల చొప్పున ఖర్చు చేశారని, ఆ శిబిరాల్లో పాలేకర్‌ అనువాదం చేసిన పుస్తకాలను రూ.48లక్షలతో కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో కనీసం డిగ్రీ కూడా ఉత్తీర్ణత కాని పాలేకర్‌ వాదనను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మహారాష్ట్రకు చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా సంఘం అధ్యక్షుడు కె.జె.డి.రాజన్‌, రాజమహేంద్రవరం ఏడీ రాంసాయి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...