Jump to content

Prakruthi vyavasayam


Recommended Posts

  • Replies 351
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...

ప్రకృతి సాగు విధానమే బాగు

అంతర్జాతీయ సంస్థల కితాబు

దావోస్‌ వేదికగా ప్రపంచానికి పరిచయం

రాష్ట్రవ్యాప్త విస్తరణకు సహకారం

నిధులు అందించేందుకు సంసిద్ధం

17ap-main18a.jpg

ఈనాడు, అమరావతి: వాతావరణ మార్పుల పుణ్యమాని భూసారం తగ్గిపోవడం, ఉద్గారాల ప్రభావం, కాలుష్య సమస్యలు వ్యవసాయంపై పెనుప్రభావం చూపిస్తున్నాయి. సాగు మనుగడనే దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘పెట్టుబడితో పనిలేని ప్రకృతి వ్యవసాయ(జడ్‌బీఎన్‌ఎఫ్‌)’ విధానాన్ని ఉత్తమ పరిష్కారంగా అంతర్జాతీయ సంస్థలు గుర్తిస్తున్నాయి. మన రాష్ట్రంలో తాజాగా ఈ సాగు విధానాన్ని పరిశీలించిన సంస్థల ప్రతినిధులు.. రాష్ట్రవ్యాప్తంగా దాన్ని విస్తరింపజేసేందుకు సహకరిస్తామంటూ ముందుకొచ్చారు. ప్రపంచస్థాయిలోనే ఓ చక్కని విధానంగా దాన్ని పరిచయం చేస్తామన్నారు. జనవరిలో దావోస్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రధానాంశం చేయాలనే అభిప్రాయానికి వచ్చారు.

సాగులో 1.38 లక్షల మంది

రాష్ట్రంలో పలువురు రైతులు అయిదేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. గతేడాది నుంచి మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. రైతులకు ఏటా కనీసం రూ.50వేల ఆదాయం వచ్చేలా చేయాలనేది లక్ష్యం. 2వేల గ్రామాల్లో 5లక్షల మంది రైతుల ద్వారా 5లక్షల హెక్టార్లలో సేద్యం చేయాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు అజీజ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ అయిదేళ్లలో రూ.100కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది. గతేడాది 704 గ్రామాల్లో 40,656 మంది రైతులు సాగు చేపట్టారు. ఈ ఏడాది 410 క్లస్టర్ల ద్వారా 972 గ్రామాల్లో అమలుచేస్తున్నారు. ప్రస్తుతం 1.38లక్షల మంది 1.2లక్షల హెక్టార్లలో గోమూత్ర ఆధారిత మందులు, కషాయాలు చల్లి పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరుకు 2లక్షల మంది ఈ బాటలో నడుస్తారని అంచనా వేస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి బృందం పరిశీలన

ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో వివిధ సంస్థల ప్రతినిధుల బృందం ఈనెల 15 నుంచి కృష్ణాజిల్లాలో సేంద్రియ సాగు చేస్తున్న పొలాలను పరిశీలించింది. రైతుల అభిప్రాయాలు, పంటల దిగుబడులు పరిశీలించి సంతృప్తి వెలిబుచ్చింది. 16న సీఎం చంద్రబాబును కలిసి జడ్‌బీఎన్‌ఎఫ్‌ సాగుకు సహకారం అందించేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 60లక్షల మంది రైతుల్ని ఈ విధానంలోకి మళ్లించేందుకు శిక్షణ, అవసరమైన నిధులు అందించేందుకు సంసిద్ధత ప్రకటించింది. 2018-19 నుంచి 2024-25 దాకా అమలయ్యే కార్యక్రమానికి ప్రాథమికంగా రూ.10వేల కోట్ల దాకా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి ఆర్థిక సహకారం అందించేందుకు బీఎన్‌పీ పారిబాస్‌ బ్యాంకు ముందుకొచ్చింది.

అంతర్జాతీయ ఆసక్తి.. ప్రకృతి వ్యవసాయ విధానాలపై అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ వివరించారు. ప్రపంచ దేశాలతో పాటు ఆఫ్రికా దేశాల్లోనూ దీన్ని అమలుచేసేందుకు మక్కువ చూపుతున్నట్లు చెప్పారు. అవసరమైన నిధులు అందించేందుకు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న దుష్ప్రభావాలను నుంచి వ్యవసాయాన్ని రక్షించేందుకు ఎన్నో విధానాలు పరిశీలించాక ఈ విధానమే మేలైనదిగా పేర్కొన్నారన్నారు. విశాఖలో వచ్చే నెల నిర్వహించే వ్యవసాయ సదస్సును ప్రపంచస్థాయిలో జరపబోతున్నట్లు రాజశేఖర్‌ తెలిపారు. అందులో పది అత్యుత్తుమ సాంకేతిక విధానాలను ఎంపిక చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్‌గేట్స్‌ కలిసి అందులో మూడింటిని ఎంపిక చేస్తారన్నారు. అయిదేళ్లలో రూ.100 కోట్లు.. ఈ విధానం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక రైతు నుంచి మరో రైతుకు విస్తరిస్తోంది. మహిళలు, చదువుకున్న యువత కూడా ఆసక్తి కనబరుస్తోంది. ప్రేమ్‌జీ ఈ విధానంపై ఎంతో మక్కువ కనబరచి ఒకరోజు అనంతపురంలోనూ ఉన్నారు. అయిదేళ్లలో రూ.100కోట్లు వెచ్చించేలా ఒప్పందం కుదుర్చుకున్నాం.
-పద్మనాభన్‌, సీఈవో, ప్రేమ్‌జీ ఫౌండేషన్‌
రసాయన రహిత ఆహారభద్రత కావాలి..  రైతులకు ఆహార భద్రత అవసరం. వారి పంటలు రసాయన రహితం కావాలి. అందుకు పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ విధానాలే మేలైనవి. అన్నదాతలు ముందుకొచ్చి అద్భుతాలు సాధిస్తున్నారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తాం..అనుసరించేలా చూస్తాం.
- సత్య ఎస్‌.త్రిపాఠి, సలహాదారు, ఐరాస పర్యావరణ విభాగం
రైతు కొనసాగేలా చూడాలి ఒక రైతును ప్రకృతి వ్యవసాయంలోకి మార్చి అందులోనే కొనసాగేట్లు చూడాలంటే అయిదేళ్లు పడుతుంది. ఇందుకు ఒక్కో రైతుకు రూ.15వేల వరకు ఖర్చు కావచ్చు. గత రెండేళ్ల ఫలితాలు బాగున్నాయి. పెట్టుబడులు తగ్గించి, దిగుబడులు పెంచేలా పథకాలు రచిస్తున్నాం. ప్రభుత్వం, రైతులపై భారం పడకుండా ఔత్సాహిక సంస్థల నుంచి నిధులు తీసుకునేలా ఆలోచిస్తున్నాం.
- విజయకుమార్‌, వ్యవసాయశాఖ సలహాదారు
Link to comment
Share on other sites

  • 1 month later...
31 నుంచి గుంటూరులో సుభాష్‌ పాలేకర్‌ సదస్సు
07-12-2017 00:34:43
 
గుంటూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 31 నుంచి జనవరి 9వ తేదీ వరకు గుంటూరులో ప్రకృతి సేద్యంపై సుభాష్‌ పాలేకర్‌ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని బైబిల్‌ మిషన్‌ స్థలంలో నిర్వహించే ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 8వేల మంది రైతులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొంటారు. సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

Mana farmers antha deni side vasthe baguntadi....  losses tagguthai.. janala health ki manchidi.... vurlu vellinappudu tappakunda we should discuss  this topic and share information on how to do.

net lo lot of materiel available. lets pledge to do OUR PART.  :) . My humble request request to all DB people.

Link to comment
Share on other sites

23 hours ago, sonykongara said:
31 నుంచి గుంటూరులో సుభాష్‌ పాలేకర్‌ సదస్సు
07-12-2017 00:34:43
 
గుంటూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 31 నుంచి జనవరి 9వ తేదీ వరకు గుంటూరులో ప్రకృతి సేద్యంపై సుభాష్‌ పాలేకర్‌ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని బైబిల్‌ మిషన్‌ స్థలంలో నిర్వహించే ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 8వేల మంది రైతులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొంటారు. సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

bro. can u please share the contact information for attending the above seminor

Link to comment
Share on other sites

గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై సదస్సు

ఈనాడు, అమరావతి: ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 31 నుంచి జనవరి 8 వరకు సదస్సు నిర్వహించనున్నారు. సుభాష్‌ పాలేకర్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో 8 వేల మంది రైతులు, అధికారులు పాల్గొననున్నారు. దీనికి రూ.7.89 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన నుంచి రూ.4.89కోట్లు, పరంపరాగత కృషి వికాస యోజన కింద రూ.3కోట్లు చొప్పున విడుదల చేయనున్నారు.

Link to comment
Share on other sites

సేంద్రియ సాగుతో అద్భుతాలు
09-12-2017 00:53:15
 
636483775969495955.jpg
  • ఏకలవ్య ఫౌండేషన్‌ ఘనత.. నేడు కేంద్ర మంత్రి సందర్శన
తాండూరు రూరల్‌, డిసెంబరు 8: వ్య‌వసాయ రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ ఏకలవ్య ఫౌండేషన్‌ సంస్థ సేంద్రియ వ్యవసాయంతోపాటు వ్యవసాయ రంగ అధ్యాయనానికి శ్రీకారం చుట్టింది. తాండూరు మండలం జినుగుర్తి గ్రామ శివారులో ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 72 ఎకరాలు కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ రంగ అధ్యాయనానికి సంబంధించి ఉన్నత విద్యాబోధన కొనసాగుతోంది. బీడు భూముల్లో కూరగాయలు, ఇతర పంటలు పండిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. సాగు ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా డిప్లామా కోర్సులతోపాటు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు బోధన సాగిస్తున్నారు. 20 రోజుల క్రితం బషీరాబాద్‌ మండలంలోని కుప్పన్‌కోట్‌, యాలాల మండలంలోని ముకుందాపూర్‌ గ్రామాల రైతులు పరంపరాగత్‌ కృషి విజ్ఞాన కేంద్రాలను సందర్శించి పంటల గురించి తెలుసుకున్నారు. శనివారం కేంద్ర మంత్రి వీరేంద్రసింగ్‌ చౌహాన్‌ సందర్శించనున్నారు.
 
డిప్లొమా కళాశాలలో తరగతులు
సేంద్రియ వ్యవసాయంపై ఏకలవ్య ఫౌండేషన్‌లో రెండేళ్ల కోర్సును ప్రవేశపెట్టి తరగతులు కొనసాగిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి 50 మంది విద్యార్థులు అధ్యాయనం చేస్తున్నారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ చదువుకునేందుకు వెసులుబాటు కల్పించి శిక్షణ అందిస్తున్నారు.
 
 
పది బ్లాక్‌ లలో కూరగాయల సాగు
భరధ్వజ ప్లాట్‌ 3 ఎకరాల్లో వంకాయ, విశ్వమిత్రా ప్లాట్‌లో 5 కాకర కాయ, ఆగస్త్య ప్లాట్‌ నెంబర్‌-1లో ఐదెకరాల పచ్చిగడ్డి, ప్లాట్‌ నెంబర్‌-2లో 5 ఎకరాల్లో కోత గడ్డి, ఆగస్త్య ప్లాట్‌ నెంబర్‌-3లో 5 ఎకరాల్లో పండ్ల మొక్కలు, ప్లాట్‌ నెంబర్‌-4లో 4 ఎకరాల్లో మునగ, 2 ఎకరాల్లో మిరప, రెండు ఎకరాల్లో టమాట, అన్నపూర్ణ ప్లాట్‌లోని 3 ఎకరాల్లో వరి, వశిష్ట ప్లాట్‌లో 4 ఎకరాల్లో పసుపు, గౌతం ప్లాట్‌లో 12 ఎకరాల్లో ఎండుమిర్చి, బలరాం ప్లాట్‌లో 15 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

ఆత్మసాక్షిగా.. భవిత భేషుగ్గా.. 
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ప్రోత్సాహం 
మున్ముందు జిల్లావ్యాప్తంగా అమలు యోచన 
కృష్ణదేవిపేట,న్యూస్‌టుడే 
vsp-STY1A.jpg

సేద్యంలో రసాయన  ఎరువుల వినియోగం రైతుల పాలిట గుదిబండగా మారింది. దీంతో వీటికి బదులుగా సహజసిద్ధమైన వనరులతో ప్రకృతి వ్యవసాయం చేయడంపై దృష్టి సారించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే విధానంపై తొలిదశలో రైతులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం తలపెట్టింది ప్రభుత్వం. గ్రామీణ జిల్లాలో సుమారుగా 10 మండలాల్లో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు.

వ్యవసాయ శాఖ అనుబంధంగా సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. కళ్లాల వద్ద    లభ్యమయ్యే ఆవుపేడ, ఆవుమూత్రం, వేప ఆకులు, పొగాకుతోపాటు బెల్లం, శెనగపిండి తదితర నిత్యావసర సరకులతో పంటలకు సారాన్నిచ్చే సేంద్రియ ఎరువులు, తెగుళ్లు, పురుగుల నివారణకు మందులు తయారు చేసుకునే వీలుంది. ఇవన్నీ తక్కువ ధరలకే లభించేవే. జిల్లాలో ఆత్మ, వ్యవసాయశాఖ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. దీంతో అన్ని ప్రాంతాల్లో మున్ముందు ప్రకృతి వ్యవసాయం అమలు చేయాలని ప్రతిపాదించారు. రైతులు అధిక పెట్టుబడుల భారం నుంచి ఒడ్డెక్కి, మెరుగైన దిగుబడులు సాధించే అవకాశముందని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదించింది.

ఎప్పటికప్పుడు సూచనలు 
తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు ప్రోత్సహిస్తున్న ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో రైతులకు సూచనలు చేసే దిగువస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తమదైన శైలిలో సరికొత్త విధానాలు వివరిస్తున్నారు. వ్యవసాయశాఖ డివిజన్‌ పరిధిలో 5 మండలాల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు మోహన్‌రావు నేతృతంలో ఆయా మండల వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. సిబ్బంది పరంగా అందిస్తున్న సూచనల్లో తేడాలొస్తే వాటిని సరిచేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ పరంగా మున్ముందు ప్రకృతి వ్యవసాయం అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటే పెట్టుబడులు బెడద నుంచి ఉపశమనం పొందినట్టేనని పలువురు సన్నకారు రైతులు అభిప్రాయపడుతున్నారు.

మెరుగైన దిగుబడులు 
పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మండలాల్లో రైతులు మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ వ్యవసాయం ద్వారా పంటలకు సోకే తెగుళ్లు, ఆశించే పురుగుల ప్రభావం ఎక్కడా కన్పించలేదు. ఈ పెట్టుబడులు లేని వ్యవసాయంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దశలవారీగా అన్ని మండలాల్లో ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే ప్రతిపాదన ఉంది.

- టి.మధుసూదనరావు, వ్యవసాయాధికారి, గొలుగొండ మండలం

స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు 
ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా ఉండటంతో తమ భూముల్లోనూ ఇదే తరహా సాగు చేస్తామంటూ రైతులు ముందుకొస్తున్నారు. తొలుత ఈ సాగుపై అవగాహన లేక వెనుకంజ వేసిన రైతులు రసాయనిక ఎరువులు కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పట్టారు. రసాయన ఎరువులు వాడిన పొలాలు, సేంద్రియ ఎరువులు వినియోగించిన పంటలు బేరీజు వేసుకొని సత్ఫలితాలు ఇస్తున్న ప్రకృతి వ్యవసాయంపైనే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆయా మండలాల్లో రైతుల స్పందన బాగుంది.

- సీహెచ్‌.లక్ష్మీకిషోర్‌, బీటీఎం, ఆత్మ, నర్సీపట్నం
Link to comment
Share on other sites

 

ఇంజనీరింగ్‌ చదివి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ దర్జాగా కాలం గడిపే అవకాశం వున్నా, వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని వదలకూడదనుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన దేవరపల్లి హరికృష్ణ. సేంద్రియ సేద్యం చేస్తూ రైతులోకానికి ఆదర్శంగా నిలిచిన ఆ యువ రైతు విజయగాథ.
 
సర్వత్రా సేంద్రియం
రైతులు తమ కుటుంబాలకు అవసరమైన మేరకైనా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలి. బియ్యం, కూరలు సేంద్రియంగా పండిస్తే క్రమంగా రాష్ట్రమంతా సేంద్రియ సేద్యం విస్తరిస్తుంది. పుడమితల్లితో పాటు ప్రజలు కూడా ఆరోగ్యంగా వుంటారు. నేను నా పొలంలో సేంద్రియంగా పండించిన వాటినే హైదరాబాద్‌ తెచ్చుకుంటాను. సేంద్రియంతో ఖర్చులు తగ్గడంతో పాటు లాభాల కూడా పుష్కలంగా వుంటాయి.
- హరికృష్ణ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, సేంద్రియ రైతు
 
హైదరాబాద్‌లో మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు హరికృష్ణ. శుక్రవారం ఆఫీసు పని పూర్తయిన మరుక్షణం నుంచి ఆయన ధ్యాసంతా స్వగ్రామంలోని పొలం మీదే వుంటుంది. ఆయన అడుగులు చకచకా అటువైపు పడతాయి. పొలం చేరుకుని పైరుపచ్చల్ని చూస్తే ఆయనలో నవజీవం తొణికిసలాడుతుంది. మిగిలిన వారిలా కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనుకున్నారాయన. నేలతల్లిని కాపాడుకుంటూ లాభసాటిగా సాగు చేసేందుకు సేంద్రియమే ఏకైక మార్గమని గ్రహించారు. జిల్లాలోనే తొలిసారిగా సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. తాను పండిస్తున్న వరి, కొబ్బరి, కో-కో, పామాయిల్‌ సాగుకు పూర్తిస్థాయిలో సేంద్రియ ఎరువులను, క్రిమిసంహారకాలనే వినియోగిస్తున్నారు. సేంద్రియ సాగు కోసం దేశీ ఆవులను పెంచుతున్నారు. దేశీ ఆవుపాలతో మనం, ఆవు వ్యర్ధాలతో చేసే ఎరువులు, క్రిమిసంహారక మందులతో నేలతల్లి ఆరోగ్యంగా వుంటారంటారు హరికృష్ణ.
 
రైతులకు కామధేనువులు
రెండు మూడు దేశీ ఆవులతో సుమారు 25-30 ఎకరాలు వ్యవసాయం చేయవచ్చు. ఇవి ఇచ్చే పాలపై వచ్చే ఆదాయం ఆవుల పోషణకు సరిపోతుంది. దేశీ ఆవులు సేంద్రియ సాగుకు ఉత్తమం. మోపురం, గంగడోలు ఉండే జాతులు యోగ్యమైనవి. సేంద్రియ సాగులో గో మూత్రం, ఆవుపేడలను నిర్ణీత ప్రమాణాల్లో వినియోగించాలి. వీటి ద్వారా జీవామృతం, ఘనామృతం, కొన్ని రకాల ఆకులు, అలములతో క్రిమిసంహారక మందులను తయారు చేసుకోవాలి. దశాబ్దాలుగా రసాయనాల వినియోగం వల్ల భూములు నిస్సారం అయ్యాయి. ఆ పంటలు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీంతోపాటు సాగు ఖర్చులు భారీగా పెరిగిపోయి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. సేంద్రియ ఎరువులతో నిస్సారమైన భూమిలో కూడా సిరులు పండుతాయి. క్రిమి సంహారకాల స్థానంలో గో మూత్రానికి, వివిధ రకాల ఆకులు, కాయలు కలిపి తయారుచేసిన కషాయాన్ని పంటలపై పిచికారీ చేసి చీడపీడలను సమర్థవంతంగా నివారించవచ్చంటున్నారు హరికృష్ణ. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో పాటు సాగులో యంత్రాలను ఉపయోగిస్తూ కూలీల సమస్యను అధిగమిస్తున్నారు ఈ రైతు. సొంతంగా తయారుచేసుకున్న జీవామృతాన్ని ఫిల్టర్‌ బెడ్‌ల ద్వారా శుద్ధిచేసి డ్రిప్‌ ద్వారా కొబ్బరి, కో-కో, పామాయిల్‌ పంటలకు అందిస్తూ అద్భుతాలు చేస్తున్నారు ఈ యువరైతు. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు చేతుల మీదుగా హరికృష్ణ సేంద్రియ సాగులో ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్నారు. లాభసాటిగా సాగు చేస్తూ రైతులకు, నవ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయనకు రైతునేస్తం పురస్కారం కూడా లభించింది.
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, దమ్మపేట
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...