Jump to content

AP Government Released 10,000 Jobs Notification


Recommended Posts

SAIలో గ్రాడ్స్‌కు ఉద్యోగాలు
 
636047107672818053.jpg
రిక్రూటర్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)
పోస్టు : యంగ్ ప్రొఫెషనల్స్
పేస్కేల్ : రూ.40,000
అర్హతలు : మస్టర్స్ / ఎంబిఎ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ / లేదా ఎంబిఎ విత్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా గ్రాడ్యుయేట్ విత్ ఎంబిఎ లేదా సైన్స్ / ఎకనామిక్స్ డిగ్రీ
వయోపరిమితి : 30 సం.లు.
నియామకం : దేశవ్యాప్తంగా...
దరఖాస్తుకు తుదిగడువు : 12-08-2016
Link to comment
Share on other sites

ఎరిక్సన్‌లో గ్రాడ్యుయేట్లకు జాబ్స్
 
636047118015194039.jpg
రిక్రూటర్ : ఎరిక్సన్
పోస్టులు : రిపోర్టింగ్ ఎనలిస్ట్
అర్హతలు : ఎనీ గ్రాడ్యుయేట్
అనుభవం : ఫ్రెషర్స్
శాలరీ : బెస్ట్ ఇన్ మార్కెట్
ఇండస్ట్రీ : ఐటి - సాఫ్ట్ వేర్
స్కిల్స్ : అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్, ఫైనాన్సియల్ మోడల్ నాలెడ్జ్
ఎంపిక : ఆప్టిట్యూడ్ టెస్ట్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ
Link to comment
Share on other sites

ఏఏఐలో ఇంటర్, డిప్లొమాలకు జాబ్స్
 
636047094576631720.jpg
రిక్రూటర్ : ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టులు : జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్)
మొత్తం పోస్టులు : 106
వయోపరిమితి : 18 - 30 సం.లు
పేస్కేల్ : రూ.12,500 - 28,500లు
అర్హతలు : టెన్త్ ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల డిప్లొమా ఇన్ మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
ఎంపిక : ఆన్ లైన్ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్ మెంట్, డ్రయివింగ్ టెస్ట్
దరఖాస్తు : ఆన్ లైన్
తుదిగడువు : 05-09-2016
పూర్తి వివరాలకు : http://www.aai.aero/employment_news/JrAsst(FS)ER-190716.pdf
Link to comment
Share on other sites

కోర్టులో అటెండర్ ఉద్యోగాలు
 
636047086630694223.jpg
రిక్రూటర్ : విజయనగరం జిల్లా జడ్జి కార్యాలయం
పోస్టులు : ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్), ప్రాసెస్ సర్వర్
వయోపరిమితి : 18 - 34 సం.లు.
అర్హతలు : ఏడవ తరగతి ఉత్తీర్ణత
పేస్కేల్ : అటెండర్... రూ.13,000 - 40,270లు
ప్రాసెస్ సర్వర్... రూ.15,460 - 47,330లు
ఎంపిక : వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తుకు తుదిగడువు : 03-08-2016
పూర్తి వివరాలకు : http://ecourts.gov.in/india/andhra-pradesh/vizianagaram/recruitment
దరఖాస్తుకు తుదిగడువు : 30-08-2016
Link to comment
Share on other sites

జయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. శుక్రవారం ఏపీ డీజీపీ రాముడు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేరుతో వెబ్‌సైట్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. మొత్తం 4,548 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. అక్టోబర్‌ 16న ప్రాథమిక పరీక్ష ఉంటుందని డీజీపీ తెలిపారు. సివిల్ కానిస్టేబుళ్లు - 3,216‌, ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్లు‌‌- 1,067 పోస్టులు, జైల్‌ వార్డర్‌ (పురుషులు)- 240, వార్డర్‌ (మహిళలు)- 25 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పోలీస్‌శాఖలో మూడో వంతు ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తున్నామని డీజీపీ రాముడు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

కొలువుల జాతర

కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

సివిల్‌, ఏఆర్‌ విభాగాల్లో మొత్తం 4,548 పోస్టులు

ఆన్‌లైన్‌లో ప్రకటన విడుదల చేసిన డీజీపీ రాముడు

వయోపరిమితి పరిశీలనలో ఉందని వెల్లడి

తొలిసారిగా అభ్యర్థులకు ప్రాథమిక పరీక్ష

ఈనాడు - అమరావతి

22ap-main14a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలైంది. హోంశాఖ పరిధిలోని సివిల్‌, అర్మడ్‌ రిజర్వు విభాగాలు, జైళ్ల శాఖలో 4,548 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన విడుదలైంది. ఏపీ డీజీపీ జేవీ రాముడు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసి..ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సౌలభ్యం కోసం రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి(ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) రూపొందించిన recruitment.appolice.gov.in వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ, హాల్‌ టిక్కెట్ల జారీ, సందేహాల నివృత్తి వంటివి ఈ వెబ్‌సైట్‌ ద్వారానే జరుగుతాయని డీజీపీ వెల్లడించారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ రెండేళ్లు ఆలస్యమైనందున ఆ మేరకు అభ్యర్థులకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని, అవి పరిశీలనలో ఉన్నాయని వివరించారు. తొలిసారిగా అభ్యర్థుల ఎంపికకు ప్రాథమిక పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం ప్రధాన పరీక్ష చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి శిక్షణనిచ్చేందుకు సరిపడా వసతులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో దశలవారీగా పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తున్నామన్నారు.

ఏయే తేదీల్లో ఏం చేయాలంటే

* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే తేదీ: 03.08.2016 ఉదయం 10 గంటల నుంచి

* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 14.09.2016, సాయంత్రం 5 గంటల వరకూ

* ప్రాథమిక పరీక్ష నిర్వహణ తేదీ: 16.10.2016 (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ

* పరీక్ష తేదీకి సరిగ్గా పది రోజులు ముందునుంచే వెబ్‌సైట్‌ ద్వారా ప్రాథమిక పరీక్ష హాల్‌టిక్కెట్లను పొందవచ్చు

అర్హతలు

* సివిల్‌, అర్మడ్‌ రిజర్వు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 01.07.2016 నాటికి 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. (02.07.1994-01.07.1998 మధ్య పుట్టిన వారై ఉండాలి)

* జైలు వార్డర్లు (పురుషులు, మహిళలు) ఉద్యోగాలకు 01.07.2016 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి (02.07.1986-01.07.1998 మధ్య పుట్టిన వారై ఉండాలి)

* ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే పై ఉద్యోగాలకు నిర్దేశించిన వయసు కంటే అయిదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు

* ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత (01.07.2016 నాటికి పూర్తి చేసి ఉండాలి)

* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఉండాలి

* రిజిస్ట్రేషన్‌ రుసుము: రూ.300 (ఓసీ, బీసీ అభ్యర్థులకు)

* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే: రూ.150

* ఏపీఆన్‌లైన్‌/టీఎస్‌ఆన్‌లైన్‌/మీ సేవా కేంద్రాల్లో రుసుము చెల్లించవచ్చు.

శారీరక దారుఢ్యం

* సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి పురుషులైతే 167.6 సెం.మీ ఎత్తు, 86.3 సెం.మీ ఛాతీ ఉండాలి. వూపిరి పీల్చితే ఛాతీ అయిదు సెం.మీ పెరగాలి

* మహిళలైతే 152.5 సెం.మీ ఎత్తు, 40 కిలోల కంటే తక్కువ కాకుండా బరువు ఉండాలి

* జైలు వార్డురు పురుష అభ్యర్థులకైతే 164 సెం.మీ కంటే తక్కువ కాకుండా ఎత్తు, 83 సెం.మీ కంటే తక్కువ కాకుండా ఛాతీ ఉండాలి

* మహిళా అభ్యర్థులకైతే 153 సెం.మీ కంటే తక్కువ కాకుండా ఎత్తు, 45.5 కిలోల కంటే తక్కువ కాకుండా బరువు ఉండాలి.

ప్రాథమిక పరీక్ష

* అభ్యర్థులందరికీ ప్రాథమిక పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. మూడు గంటల్లోపు ఈ పరీక్ష రాయాలి

* ఓసీ అభ్యర్థులైతే 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికులు అయితే 30 శాతం మేర అర్హత మార్కులు సాధించాలి.

* ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలోనే ఉంటాయి.

* ఈ మార్కులేవీ తుది జాబితాలో కలపరు.

ఇతర అంశాలు

* ప్రాథమిక పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి 200 మార్కులకు ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) ఉంటుంది. (సివిల్‌ కానిస్టేబుల్‌, మహిళా, పురుష జైలు వార్డరు అభ్యర్థులు)

* ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పోటీ పడేవారికి 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. మరో 100 మార్కులకు శారీరక దారుఢ్య పరీక్ష ఉంటుంది.

రాత పరీక్ష సిలబస్‌

* ఆంగ్లం, అంకగణితం(అరిథ్‌మెటిక్‌), జనరల్‌ సైన్సు, భారత చరిత్ర, భారత సంస్కృతి, భారత జాతీయోద్యమం, భారత భౌగోళిక శాస్త్రం, రాజనీతిశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన వర్తమాన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష

కొత్త సంస్కరణలివి

* సివిల్‌ పోలీసు విభాగంలో మహిళ అభ్యర్థులకు 33 1/3 శాతం, ఏఆర్‌ విభాగంలో 20 శాతం రిజర్వేషను కల్పించారు. ఆయా పోస్టులకు సరిపడా మహిళలు రాకపోతే వాటిని పురుష అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

* 5 కిలోమీటర్ల పరుగు పందెం పూర్తిగా రద్దు చేశారు.

* గతంలో అయిదు విభాగాల్లో శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించేవాళ్లు. వాటిని మూడింటికి తగ్గించారు. హైజంప్‌, షార్ట్‌పుట్‌లను తొలగించారు.

* సాంకేతిక విభాగాలకు సంబంధించిన పోస్టులకు ఎలాంటి ప్రాథమిక పరీక్ష ఉండదు.

* అభ్యర్థులు ఏవైనా అంశాలపై ఫిర్యాదు చేయాలంటే 9441450639 నెంబర్‌కు సంక్షిప్త సందేశం ద్వారా, కాల్‌ చేసి చెప్పవచ్చు.

* recruitmentappolice2016@gmail.com కు మెయిల్‌ చేయవచ్చు.

22ap-main14b.jpg

22ap-main14c.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఏపీలో ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
 
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజ‌నీర్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గురువారం నోటిఫికేష‌న్ జారీచేసింది. మొత్తం 748 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 21 చివరి తేదీ కాగా నవంబర్‌లో పరీక్ష జరగనుంది. కాగా... తొలిసారిగా ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించబోతోంది.
Link to comment
Share on other sites

సెప్టెంబర్‌ నెలాఖరులోగా అన్ని నోటిఫికేషన్లు ఇస్తాం
 
636076884565600138.jpg
  • వయోపరిమితి 40 ఏళ్లు
  • ఆన్‌లైన్‌లోనే పరీక్షలన్నీ
  • స్ర్కీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది
  • నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు 
  •  నోటిఫికేషన్‌ వచ్చిన ఆరు నెలల్లో నియామకాలు 
  • నియామకాలపై వచ్చే ఏడాది నుంచి కేలండర్‌
  • ఏపీపీఎస్సీ  చైర్మన్‌ ఆచార్య ఉదయభాస్కర్‌ వెల్లడి 
విశాఖపట్నం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా అన్ని కేటగిరీల్లో కలిపి 4009 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ  చైర్మన్‌ ఆచార్య పి.ఉదయభాస్కర్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం లభించిన 4009 పోస్టులకు నోటిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అన్ని నియామకాలకు సెప్టెంబర్‌ నెలాఖరులోగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అన్ని పోస్టులకు వయోపరిమితి 40 సంవత్సరాలని తెలిపారు. వయోపరిమితిని 34 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి సెప్టెంబర్‌ నెలాఖరుతో ముగుస్తుందని, అప్పటిలోగా అన్ని నోటిఫికేషన్లూ విడుదల చేస్తున్నందున నిరుద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని సూచించారు. బుధవారం ఆయన ఇక్కడి సర్క్యూట్‌హౌ్‌సలో విలేకరులతో మాట్లాడారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఒకటి, రెండు ప్రకటనలు విడుదల కాకపోయినా వాటికి సంబంధించి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు 40 ఏళ్ల వయోపరిమితి వర్తింపజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు అందిన వెంటనే ప్రకటనలు విడుదల చేస్తామన్నారు. సివిల్‌ ఇంజనీర్‌ పోస్టుల వివరాలు అందగానే నోటిఫికేషన్‌ విడుదల చేశామని గుర్తుచేశారు. సర్వీస్‌ కమిషన్‌ అనగానే నియామకాలకు కాలయాపన ఉంటుందన్న అపప్రథ పోగొట్టడానికి ప్రకటన విడుదల చేసిన నుంచి ఆరు నెలల్లో పోస్టింగ్‌లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. కోర్టు కేసుల ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘నియామకాలకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి కేలండర్‌ రూపొందించి అమలు చేస్తాం. అంటే ఒక సంవత్సరం ఒక తేదీన ఒక కేడర్‌ పోస్టులకు ప్రకటన విడుదల చేస్తే మరుసటి ఏడాది అదే తేదీన ప్రకటన వస్తుంది’ అని తెలిపారు.
 
ఆన్‌లైన్‌ పరీక్షలతో సమస్యల్లేవు
సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఉదయభాస్కర్‌ చెప్పారు. ఇటీవల డిపార్ట్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించామని, ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాలేదన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలో ఒక అభ్యర్థికి మరో అభ్యర్థికి ఇచ్చే పేపర్‌లో అనేక మార్పులుంటాయని, దీనివల్ల మాస్‌కాపీయింగ్‌కు కూడా అవకాశం ఉండదని చెప్పారు. ఐదేళ్ల తరువాత వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్నందున భారీగా పోటీ ఉంటుందని అంచనా వేశామన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిదానికి ముందుగా స్ర్కీనింగ్‌ టెస్టు నిర్వహించి 1:50 నిష్పత్తిలో వడపోత ఉంటుందని తెలిపారు. తరువాత చివరి పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. యూపీఎస్సీలో 1:12 విధానం ఉందని, భవిష్యత్తులో దీనిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. గ్రూప్‌-1 తప్ప మిగిలిన పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం నిర్వహించనున్న గ్రూప్‌-1, 2 పరీక్షలకు సంబంధించిన సిలబ్‌సను సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో పెట్టామన్నారు. 1999లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షల ప్రతిష్ఠంభనపై సవరించిన నిబంధనల మేరకు పోస్టుల నియామకానికి త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపిస్తామన్నారు. అప్పట్లో పరీక్షలను ఏపీపీఎ్‌ససీ నిర్వహించినందున తెలంగాణలో ఉన్న అభ్యర్థులకు కూడా తామే ఇంటర్య్వూలు నిర్వహిస్తామని ఉదయభాస్కర్‌ వెల్లడించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...