Jump to content

farmer ki


Recommended Posts

  • 2 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...

Cultivation of Shrimp is Hazardous to Environment

Aquaculture pollution is very high to environment

రొయ్య కాదు.. కాలుష్య కయ్య! 
పంటకాలువలు పాడైపోతున్నాయి 
పొలాలు ఉప్పు తేలుతున్నాయి 
ఒక్క ‘వనామీ’ రైతుకు అనుమతి లేదు 
కోస్తాలో రొయ్యల సాగంతా అనధికారికమే 
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడి 
వరికి రొయ్యల చెరువులతో ముప్పుగా ఉందని ఆందోళన 
ఎ. కిశోర్‌బాబు 
ఈనాడు - అమరావతి

 

‘‘రొయ్యల సాగు కాసులు కురిపించే మాటెలా ఉన్నా కన్నీళ్లు మిగల్చక తప్పదు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇష్టానుసారం చేస్తున్న ఈ సాగుతో భవిష్యత్తు దారుణంగా ఉండబోతోంది. మున్ముందు ఈ భూములు కొన్నేళ్లపాటు ఎందుకూ పనికిరాకుండాపోతాయి. పైసా ఆదాయం ఉండదు. అన్నింటికంటే నీరు, గాలి కాలుష్యభరితమై విపరిణామాలకు దారితీయవచ్చు. కోస్తా జిల్లాల్లో ‘వనామీ’ రొయ్యల సాగు పూర్తిగా అనధికారికంగా సాగుతోంది. పాటించని ప్రమాణాల కారణంగా పెను ముప్పు ముంచుకొస్తోంది...’’ కోస్తాలో రొయ్యల సాగు, దానివల్ల ఎదురవుతున్న కాలుష్య ఘంటికలపై అధ్యయనం చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయ బృందం తయారు చేసిన నివేదికలోని సారాంశం ఇది. గత జూన్‌లో అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అభ్యర్థన మేరకు ఆంధ్ర వర్శిటీ బృంద ప్రతినిధులు పశ్చిమగోదావరి జిల్లాలోని 18 మండలాల్లో 900 చదరపు కిలోమీటర్ల మేర చెరువులను సందర్శించారు. ఎనమదుర్రు కాలువపై ఆక్వా సాగు కాలుష్య ప్రభావం ఎంతగా ఉందనే దానిపైనా దృష్టి సారించారు. ఈ కాలువ దాదాపు ఒక నది తరహాలో దాదాపు 50 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ కాలువ వెంబడి కుప్పలు తెప్పలుగా రొయ్యల చెరువులున్నాయి. ఈ జిల్లాలో 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని రాబోయే రెండేళ్లలో ఇది లక్ష ఎకరాలకు చేరుతుందని ఈ బృందం అంచనా వేసింది. అధికారులతో, రొయ్యలు సాగు చేస్తున్న రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను బృంద సభ్యులు పరిశీలించారు. అక్కడ భూమి ఎలా కాలుష్యం బారిన పడుతుందో పరీక్షలు నిర్వహించారు.

 

shrimp1.jpg

 

నిబంధనల అమలు నాస్తి... 
వనామీ రొయ్యల సాగు చేయాలంటే తప్పని సరిగా కొన్ని ప్రభుత్వ నియమాలు పాటించాలి. అనుమతులు పొందాలి. కానీ ఒక్క వనామీ రైతు కూడా అలాంటి నియమాలేవీ పాటించలేదనేది నివేదిక ద్వారా బహిర్గతమైన కఠోర వాస్తవం. కోస్టల్‌ ఆక్వాజోన్‌కు ఆవల రొయ్యల సాగు చేయాలంటే జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని ‘జిల్లా స్థాయి కమిటీ’ ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి. అధ్యయన బృందం పరిశీలించిన ఏ రొయ్యల చెరువుకు కూడా అలాంటి అనుమతులేవీ లేవు. మత్స్యశాఖ అధికారులు కూడా తమ నుంచి ఏ ఒక్క రైతు కూడా రొయ్యల సాగుకు అనుమతి పొందలేదని వారికి తెలిపారు.

 

ఉప్పు నీరే... 

కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల సాగు జరుగుతోందని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. వాడుతున్న నీటిలో లవణీయత దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వనామీ రొయ్యల సాగు మంచినీటితో చేయాలనే నిబంధనలున్నా, అధ్యయనంలో భాగంగా పరిశీలించిన చెరువుల్లో ఏ ఒక్క దాంట్లోనూ మంచినీటితో రొయ్యల సాగు చేస్తున్న దాఖలాలు లేవు. వినియోగిస్తున్న నీటిలో ‘లవణీయత’ కూడా 6 నుంచి 12పీపీటీ ఉన్నట్లు తేలింది. కేవలం 0.5పీపీటీ మాత్రమే ఉండాలనేది ప్రభుత్వం విధించిన నిబంధన. అక్కడ రైతులు తమకీ నిబంధనలేవీ తెలియవని అధ్యయన బృందానికి తెలిపారు.

 

శుద్ధి మాటే లేదు... 

ప్రతి చేపల చెరువు కూడా తప్పనిసరిగా బయటకు వదిలే నీటిని శుద్ధి చేయడానికి ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలనేది ప్రభుత్వ నిబంధన. ఒక్కచోట కూడా ఇలాంటి ప్లాంటు లేదని, అందరూ చేపల చెరవుల్లోని వ్యర్థ నీటిని నేరుగా పక్కనే ఉన్న కాలువల్లోకి వదిలేస్తున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.

సాగు చేస్తున్న వనామీ రొయ్యల సీడ్‌ను ప్రభుత్వ అనుమతి పొందిన హ్యాచరీస్‌ నుంచే పొందాలనే నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రొయ్యల సాగు వల్ల అన్ని నీటిపారుదల కాలువలు కాలుష్యమయమైపోనున్నాయని అధ్యయనకారులు హెచ్చరించారు.

ప్రమాద ఘంటికలు 
* కౌలు: చాలా మంది రైతులు తమ భూములను రొయ్యల సాగు కోసం కౌలుకు ఇస్తున్నారు. దానివల్ల వారికి ఎకరాపై ఏడాదికి రూ.70వేలు వస్తోంది.

* 7 - 12 ఏళ్లు: రొయ్యల చెరువులో సాగుకు అనుకూల సమయం. ఆ తరువాత ఆ చెరువు ఎందుకూ పనికిరాదు. అలా వదిలేయాల్సిందే.

* 5-12 ఏళ్లు : రొయ్యల సాగు అనంతరం భూమి మామూలు స్థితికి చేరుకోడానికి పట్టే సమయం. ఈ మధ్య కాలంలో ఆ భూమిలో ఎలాంటి సాగు చేయలేరు. అప్పటి వరకు ఆ భూ యజమానికి వచ్చే ఆదాయం సున్నా.

* అశాస్త్రీయం: వనామీ రొయ్యల సాగు పూర్తి అశాస్త్రీయంగా జరుగుతోంది. ప్రతి ఐదు పంటల్లో కేవలం రెండు మాత్రమే మంచి పంటలున్నాయి.

* మంచి నీటి కరవు: రొయ్యల సాగుతో భూగర్భ జలాలు కాలుష్యమైపోతున్నాయి. ఏడాదికేడాది వ్యవసాయానికి, తాగు నీటికి కావాల్సిన నీటి వనరులు హరించుకుపోయే ప్రమాదమేర్పడుతోంది.

 

వరికి భారీ దెబ్బ... 

రొయ్యలు, చేపల చెరువుల సాగుతో వరి ధాన్యపు ధామాలుగా విలసిల్లిన ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపైన తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం పరోక్షంగా పేర్కొంది. ఇందుకు నిదర్శనంగా ఆ సంస్థ వ్యవసాయ శాఖ కోర్‌ డ్యాష్‌బోర్డులో ఈ మూడు జిల్లాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిన గణాంకాలను ఉటంకించింది. 2013-14 నుంచి 2015-16 మధ్య కాలంలో ఈ మూడు జిల్లాల్లో ఏకంగా 181 శాతం వరి విస్తీర్ణం తగ్గిపోయింది. ఇందులో ఒక్క కృష్ణా జిల్లాల్లోనే 142 శాతం వరి సాగు తగ్గిపోయింది.

 

లక్షల ఎకరాల్లో అనధికారిక చేపల చెరువులు కోస్తా జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువుల సాగు నిర్వహిస్తున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ఒక్క కృష్ణా జిల్లాల్లోనే మొత్తం 2,42,000 ఎకారల్లో చేపలు, రొయ్యల సాగు జరుగుతుంటే అందులో అనధికారికంగా చేస్తున్న సాగు విస్తీర్ణం 1,41,000 ఎకరాలు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి ఇదే. అధ్యయనకారులు 2015లో లభించిన సమాచారం ప్రకారమే ఈ గణాంకాలు వెల్లడించారు. తాజా గణాంకాల కోసం అధికార వర్గాలను కోరినా వారు ఇంకా ఇవ్వలేదని ఆంధ్రావర్సిటీ ప్రతినిధులు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఈ విస్తీర్ణం మరింత పెరిగి ఉంటుందనేది వారి అంచనా.

 

shrimp.jpg

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
చిరుధాన్యాల రైతులకు రాయితీతో శుద్ధి యంత్రాలు

ఈనాడు, అమరావతి: చిరుధాన్యాలు పండించే రైతులు వాటిని శుద్ధి చేసి మార్కెట్‌ ధరలకు విక్రయించుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.3 లక్షల రాయితీతో యంత్రాలను అందించబోతోంది. రాష్ట్రంలో 7.5 లక్షల ఎకరాల్లో రాగులు, కొర్రలు, వరిగలు, ఇతర చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వీటి సాగు అధికం. వీటిని మర పట్టించే యంత్రాలు రైతులకు అందుబాటులో లేక కిలో రూ.20కే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొంతకాలంగా నగరాలు, పట్టణాల్లో ఈ ఆహార ఉత్పత్తులకు డిమాండు పెరుగుతోంది. వ్యాపారులు ఈ ధాన్యాల్ని మర పట్టించి మార్కెట్లో కిలో రూ.60కు పైగా విక్రయిస్తున్నారు. మర పట్టించే యంత్రాలు లేక రైతు మూడో వంతు ధర మాత్రమే పొందుతున్న నేపథ్యంలో రైతులకు/సంఘాలకు ఈ యంత్రాలను రాయితీపై పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 8 జిల్లాల పరిధిలోని 45 మండలాల్లో చిరుధాన్యాల సాగు రైతులకు ఈ యంత్రాలను అందించేందుకు సరఫరాదారులను ఆహ్వానించగా రెండు సంస్థలు ముందుకొచ్చాయి. ధాన్యాల పొట్టు తీయడం, రాళ్లు వేరు చేసే పరికరాలతో కలిపి ఒక్కో యంత్రాన్ని రూ.3.90-4.01 లక్షలకు అందించేందుకు ఈ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వీటిని కొనుగోలు చేసే రైతులకు వ్యవసాయశాఖ రూ.3 లక్షలు రాయితీగా ఇవ్వనుంది. మండలానికొకటి చొప్పున ఈ యంత్రాలు అందుబాటులో ఉన్నా రైతులు తమ ఉత్పత్తులను మర పట్టించి మార్కెట్‌ ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
Guest Urban Legend

Anantapur farmers smell profits from floriculture

Official says government is giving subsidy of ₹12 lakh per acre to construct poly houses

Floriculture is new trend that is catching up in Anantapur district, one of the backward districts in the State and which also experiences high temperatures and low rainfall. The farmers are apparently betting big on floriculture in view of growing demand for cut flowers in the country and abroad.

The farmers, who used to cultivate capsicum, British cucumber, onion shallots etc, are diversifying to floriculture with a view to improve their earnings. The farmers in the district used to cultivate capsicum and other exotic vegetables in 37 acre. The farmers used to earn ₹8 lakh to ₹10 lakh per acre when capsicum was being cultivated. But, of late, they found that prices of capsicum would fall if there was a bumper crop in neighbouring Karnataka.

Farmers like Akbar Basha felt that floriculture is an alternative way to tide over the problem and switched over to cultivation of cut roses. He began cultivation of hybrid roses in 2.17 acre land. Thanks to the poly house technique employed for floriculture, now, 10 to 15 acre is under hybrid roses and gerberas are being cultivated.

 

Integrated pack houses

When contacted, Deputy Director (Horticulture) B.A. Subba Rayudu says the floriculture is picking up in places like Penugonda and Konduru village in Lepakshi mandal of the district. The firms like ‘Kusalav Organics’ have also began cultivation of the roses. The farmers are setting up integrated pack houses which include cold rooms, grading and packing facilities. Rose bud nets were also being used to ensure that the flower blossoms after reaching the destination, he says.

Mr. Rayudu says that the government was giving a subsidy of ₹12 lakh per acre to construct the poly houses. Each farmer may spend between ₹34 lakh and ₹35 lakh per acre to develop the poly house.

The farmers were harvesting about 2 lakh flowers per acre. They get around ₹8 lakh to ₹10 lakh per acre. Each flower costs at least ₹5, he explains.

 

source:http://www.thehindu.com/news/national/andhra-pradesh/anantapur-farmers-smell-profits-from-floriculture/article23639784.ece

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...