Jump to content

AP Integrated Municipal Solid Waste Management ..


Recommended Posts

  • Replies 105
  • Created
  • Last Reply

Top Posters In This Topic

చెత్త నుంచి విద్యుత్తు తయారీకి ఇంకెంత కాలం?

 

ప్రారంభం కాని ప్లాంట్లు
గడువు ముగిసినా నత్తనడక పనులు

ఈనాడు-అమరావతి: పట్టణాల్లో చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు మూడు అడుగులు ముందుకు ఆరడుగుల వెనక్కి అన్నట్లుగా తయారైంది. రెండేళ్ల క్రితం 9 ప్లాంట్లకు టెండర్లు పిలిచి ప్రైవేటు ఏజెన్సీలు ఖరారు చేసినా ఇప్పటికి విశాఖపట్నం, గుంటూరులో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా చోట్ల భూసేకరణ, ఇతరత్రా సమస్యలతో పనులు ముందుకెళ్లడం లేదు. 2018 డిసెంబరుకు ప్లాంట్ల ఏర్పాటు పూర్తి కావాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు మార్చికి కూడా ప్లాంట్ల ఏర్పాటు గగనమే.

13ap-story1b.jpg

 

13ap-story1c.jpg

వ్యర్థాల నివారణకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒకటైన చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి కోసం విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, నెల్లూరు, అనంతపురం, కడప, రాజమహేంద్రవరం, కర్నూలులో ప్లాంట్ల ఏర్పాటుకు 2017లో టెండర్లు పిలవడం, ఏజెన్సీలను ఖరారు చేయడం చకచకా జరిగిపోయాయి. వీటికి అవసరమైన భూమిని రెవెన్యూ, పురపాలకశాఖల నుంచి సమీకరించే బాధ్యత, పట్టణాల నుంచి వ్యర్థాలను ప్లాంటుకు పంపే బాధ్యత స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ సంస్థది. మిషనరీ ఏర్పాటు బాధ్యత, ఉత్పత్తి చేసిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు సరఫరా చేసే బాధ్యత ప్లాంట్‌ నిర్వాహకులది.
తిరుపతిలో ప్లాంట్‌ ఏర్పాటుకు భూమి కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. గాజుల మన్యం, తూకివాకంలో భూమిని పరిశీలించి ఖరారు చేసే దశలో రేణిగుంట విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నందున భారత విమానయాన సంస్థ అభ్యంతరం చెప్పింది. చంద్రగిరి మండలం తాటికోనలో ప్రస్తుతం భూ సేకరణ కోసం అధికారులు యత్నిస్తున్నారు. నెల్లూరులో ఇటీవలే సివిల్‌ పనులు ప్రారంభమయ్యాయి. కర్నూలులో ప్లాంట్‌ ఏర్పాటు జాప్యం కావడంతో గుత్తేదారుతో ఒప్పందాన్ని అధికారులు రద్దు చేశారు. దీంతో ఆ ఏజెన్సీ హైకోర్టును ఆశ్రయించింది.
కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలో ప్లాంట్‌ ఏర్పాటు టెండర్‌ దక్కించుకున్న ఒక సంస్థ పనులు ప్రారంభించినా పురోగతి అంతంత మాత్రమే. రాజమహేంద్రవరంలో ప్లాంట్‌ ఏర్పాటుపై మొదట ముందుకొచ్చిన సంస్థ ఆర్థికంగా వెసులుబాటు కాదని తరువాత వెనక్కి వెళ్లింది.

13ap-story1a.jpg

సాధ్యమైనంత వేగంగా ప్రారంభించేలా చర్యలు
‘విద్యుత్తు ప్లాంట్ల పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. డిసెంబరులోగా విశాఖపట్నం, గుంటూరులో ప్రారంభించాలనుకున్నా చివరి క్షణంలో వాయిదా పడింది. మార్చిలో రెండు చోట్ల ప్లాంట్లు ప్రారంభమై విద్యుత్తు ఉత్పత్తి మొదలవుతుంది. తిరుపతిలో భూ సమీకరణ ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే ప్రయివేట్‌ ఏజెన్సీకి అప్పగిస్తాం. కొన్ని కారణాలతో కర్నూలు, రాజమహేంద్రవరంలో పనులు ప్రారంభం కాలేదు. మిగతా చోట్ల జాప్యానికి కారణాలు తెలుసుకుంటున్నాం’

- డి.మురళీధర్‌రెడ్డి, ఎండీ, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌

Link to comment
Share on other sites

  • 1 month later...

తణుకు మండలం మహాలక్ష్మి చెరువు గ్రామంలో 3 లక్షల 70 వేల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రమును ప్రారంభించడం జరిగింది.

https://pbs.twimg.com/media/D0eeZfrVsAAeqPP.jpg

https://pbs.twimg.com/media/D0eeZwjUwAIQXey.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...