Jump to content

AP Integrated Municipal Solid Waste Management ..


Recommended Posts

  • Replies 105
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...
స్వచ్ఛాంధ్ర సాధనలో
 
636056744110700867.jpg
విజయవాడ: స్వచ్ఛాంధ్ర సాధనలో మరో కీలక ఘట్టం ఆరంభమైంది. చెత్త నుండి విద్యుత్ తయారీ కోసం 10 ప్లాంట్ల నుండి 66 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కాగా.. చైనాలో ఈజూ ప్రావిన్స్‌, ఏపీకి మధ్య సంబంధాల కోసం ప్రభుత్వం కమిటీని ఎంపిక చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా మంత్రి నారాయణను నియమించింది. సభ్యులుగా సీఆర్‌డీఏ కమిషన్‌ శ్రీధర్‌, ఐఏఎస్‌లు అజయ్‌ జైన్‌, కృష్ణకిశోర్‌, విశాంత్ర ఐఏఎస్‌ లక్ష్మీపార్థసారధిలను ప్రకటించింది.
Link to comment
Share on other sites

చెత్త నుంచి66 మెగావాట్ల విద్యుత్తు
 
  • 10 ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం: నారాయణ 
 
అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా చెత్త నుంచి విద్యుత ఉత్పత్తి చేసే ప్లాంట్లు రాష్ట్రంలో నెలకొల్పాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇం దులో భాగంగా తాడేపల్లిగూడెం, మచిలీపట్నం క్లస్టర్ల కోసం ఎస్సెల్‌ గ్రూపుతో మంత్రి నారాయణ సమక్షంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ మురళీధర్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం కీలక ఒప్పందాలు జరిగాయి. మచిలీపట్నం కేంద్రంగా రుద్రారంలో ఏర్పాటుచేయనున్న ప్లాంట్‌ ద్వారా 4 మెగావాట్లు, తాడేపల్లిగూడెం ప్లాంటులో 342 టన్నుల చెత్తను మండించి 5 మెగావాట్లు ఉత్పత్తి చేయనున్నారు. మొత్తం రాష్ట్రంలో ఏర్పాటుచేసే 10 విద్యుత ప్లాంట్లతో దాదాపు 66 మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేయవచ్చని నారాయణ వెల్లడించారు. ఇప్పటికే విజయనగరం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల వేదికగా ఇప్పటికే పలు ఒప్పందాలు జరిగాయి. కర్నూలు జిల్లా ప్లాంట్లకు త్వరలో ఒప్పందం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
Guest Urban Legend

waste segregation gurinchi kuda people lo awareness penchali

 

hyd lo aithey dry waste and wet waste kosam rendu bins ichayi ghmc for every flat in our apartment

kondharu use chestunnaru kondharu same old ways anni kalipestunnaru

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 months later...

విజయవాడ: స్లమ్‌లు లేకుండా లక్షా 20 వేల మల్టీస్టోర్డ్‌ ఇళ్ల నిర్మాణ చేపడతామని మంత్రి చెప్పారు. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలను త్వరలో పూర్తిచేస్తామని మంత్రి అన్నారు. 10 మున్సిపాల్టీలలో యాసిడ్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామని నారాయణ తెలిపారు. మెగా సిటీలలో లిక్విడ్ వేస్ట్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 28న టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏడాదిన్నరలో ఇళ్ల నిర్మాణాల పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...

ఎంత చెత్తకి అంత డబ్బు!

 

భారత్‌లోని ప్రధాన సమస్యల్లో ‘చెత్త’ స్థానం ఎప్పుడూ ముందే. ఏదైనా రోడ్డు తళతళలాడుతుంటే, ‘విదేశీ నగరంలా ఉందే’ అనుకుంటాం తప్ప, తలచుకుంటే మన వీధుల్ని కూడా అద్దాల్లా ఉంచుకోవచ్చనే ఆలోచనే రాదు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పర మున్సిపాలిటీ అలాంటి ఉద్దేశంతోనే వీధుల్ని చెత్త రహితంగా ఉంచాలని కంకణం కట్టుకుంది. ఆ ప్రయత్నమే అంతర్జాతీయ మేయర్ల సమావేశంలో ఆక్లాండ్‌, మిలాన్‌ లాంటి నగరాలను దాటి ‘వ్యర్థాల నిర్వహణ’లో ఉత్తర్‌పరను తొలిస్థానంలో నిలబెట్టింది.

కోల్‌కతా పరిసరాల్లోని ఓ చిన్న పట్టణం ఉత్తర్‌పర. ఆసియాలోనే అత్యంత పురాతన గ్రంథాలయం అక్కడే ఉంది. ఇప్పుడు దేశం గర్వించదగ్గ మరో అరుదైన ఘనతనూ అది సాధించింది. ఇటీవల మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ ‘సీ40 మేయర్స్‌ సమ్మిట్‌’లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న నగరాలతో పోటీ పడి చెత్తను పూర్తిగా పునర్వినియోగంలోకి తెస్తున్న అత్యుత్తమ పట్టణంగా ఎంపికైంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్థాలను వాటి స్వరూపాన్ని బట్టి వేర్వేరు కుండీల్లో వేయడం, అందరూ స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనడం... ఈ పనులన్నీ అక్కడి వాళ్ల జీవన విధానంలో భాగమైపోయాయి. ఉత్తర్‌పర మున్సిపాలిటీ మొదలుపెట్టిన ‘వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు’ ప్రజల ఆలోచనలూ, జీవన శైలిలో మార్పులకు శ్రీకారం చుట్టి, ఆకర్షణీయ పట్టణంగా దాన్ని తీర్చిదిద్దింది.

 

50వేల ఇళ్లకు తిరిగి...

ఏటా దేశంలోని దాదాపు ఎనిమిదివేల నగరాలూ, పట్టణాల నుంచి 62 మిలియన్‌ టన్నుల చెత్త ఉత్పత్తవుతుంటే, 43 మిలియన్‌ టన్నుల్ని మాత్రమే మున్సిపాలిటీలు సేకరిస్తున్నాయి. అందులో 75శాతం చెత్త డంపింగ్‌ యార్డుల్లో నిరుపయోగంగా పోగవుతుంది. కానీ ఉత్తర్‌పరలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. అక్కడ వంద శాతం వ్యర్థాలు ఇంటి బయట ఏర్పాటు చేసిన వేర్వేరు చెత్త డబ్బాల్లోకి చేరతాయి. అక్కడి నుంచి చెత్తంతా మున్సిపాలిటీ నిర్వహించే ప్రత్యేక కేంద్రానికి వెళ్తుంది. ఆపైన దాదాపు తొంబై ఐదు శాతం వ్యర్థాల్ని మున్సిపాలిటీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ఉత్తర్‌పరలో వ్యర్థాల్ని శుద్ధి చేసే భారీ కేంద్రాన్ని నిర్మించారు. ప్రతి ఇంటికీ మూడు చెత్త డబ్బాల్ని పంపిణీ చేసి తడి, పొడి, ప్లాస్టిక్‌ చెత్తను వేరు చేసి ఒక్కో డబ్బాలో వేయిస్తున్నారు. జనాల్లో చెత్త నిర్వహణపైన అవగాహన పెంచడానికీ, పరిశుభ్రత ప్రాధాన్యం తెలియజేయడానికీ స్వయంగా ఆ మున్సిపాలిటీ ఛైర్మన్‌ దిలీప్‌ యాదవ్‌ యాభై వేల ఇళ్లకు తిరిగి, వాళ్లతో మాట్లాడారు. వంద శాతం ఇళ్లకు చెత్త బుట్టలందేలా చూసి, ప్రతి రోజూ తూచ తప్పకుండా వాటిని సేకరించే ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ వాహనాల్లో కూడా మూడు వేర్వేరు కుండీలను పెట్టి వ్యర్థాల స్వరూపాన్ని బట్టి వేరు చేస్తున్నారు. అలా సేకరించిన వ్యర్థాల్ని శుద్ధి కేంద్రాలకు తరలించి పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు.

చెత్త నుంచి ఎరువులు

చెత్త నిర్వహణను పూర్తిగా మున్సిపాలిటీ చూసుకుంటుండటంతో చెత్త ఏరుకునే వాళ్ల ఉపాధిపైన దెబ్బ పడింది. ఆ సమస్యకూ అధికారులే పరిష్కారం చూపారు. పట్టణంలో చెత్త ఏరుకునే వాళ్లందరికీ తమ శుద్ధి కేంద్రాల్లో ఉపాధి కల్పించారు. వాళ్లకు బూట్లూ, గ్లవ్‌జులూ, యూనిఫామ్‌లూ, మాస్క్‌ల లాంటి వాటిని అందించి చెత్తను వేరు చేసే పనిని అప్పగించారు. తడి చెత్తను వినియోగంలోకి తేవడానికి భారీ కంపోస్ట్‌ ప్లాంట్‌ని నిర్మించారు. రోజుకి పన్నెండు టన్నుల చెత్తని సేకరిస్తే, అందులోంచి నాలుగు టన్నుల జీవ ఎరువుల్ని తయారు చేస్తున్నారు. పది టన్నుల ఎరువుల్ని తయారు చేసే సామర్థ్యం ఉండటంతో పరిసర పట్టణాల నుంచి కూడా చెత్తను ఈ కేంద్రాలకు తరలిస్తూ, వాళ్ల సమస్యనూ కొంత తగ్గిస్తున్నారు. ఆఖరికి కాలువలూ, మ్యాన్‌హోళ్ల నుంచి కూడా పంపులను ఏర్పాటు చేసి, సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువులుగా మారుస్తుండటం విశేషం. శుద్ధి కేంద్రాల్లో తడి చెత్త పోగా, మిగతా వాటిలో ప్లాస్టిక్‌, ఇనుము, ఇతర వస్తువుల్ని వేరు చేసి తుక్కుగా మార్చి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ముందు పట్టణ డంపింగ్‌ యార్డులో దాదాపు యాభై అడుగుల ఎత్తులో పేరుకున్న చెత్త ప్రస్తుతం పది అడుగుల మట్టానికి చేరింది. ఇళ్ల నుంచే నేరుగా చెత్తను సేకరిస్తుండటంతో వీధుల్లో కుండీలనూ తొలగించారు. దాని వల్ల దోమలూ, పందుల లాంటి వాటి బెడదా తగ్గింది. మున్సిపాలిటీ ఖజానాకు ఒకప్పుడు గండిగా ఉన్న చెత్త, ఇప్పుడు సిరులు కురిపించే ప్రధాన వనరుగా మారింది.

 

ఉత్తర్‌పర శివార్లలోని భాగీరథి నదీ తీరం గతంలో మినీ డంపింగ్‌ యార్డులా ఉండేది. దాని వల్ల అక్కడి జలచరాలతో పాటు కొన్ని జాతుల కీటకాలూ కనుమరుగయ్యాయి. కానీ ఏడాది క్రితం చెత్తని తొలగించి, కచ్చితమైన ఆంక్షల్ని అమలు చేయడంతో ప్రస్తుతం గంగ నీళ్లూ తేటగా మారి జీవవైవిధ్యం మెరుగైంది. ప్రాజెక్టుని అమలు చేసిన రెండు నెలల నుంచే పట్టణంలో భూగర్భ జలాల కాలుష్యం, చెత్తను తగలబెట్టడం వల్ల వ్యాపించే వాయు కాలుష్యం భారీగా తగ్గింది. ఇప్పుడు అదే విధానాన్ని చుట్టుపక్కల మరో ఆరు పట్టణాలూ అనుసరిస్తున్నాయి. అన్ని ఇళ్లలో ఉత్పత్తయిన చెత్తని పూర్తిగా వినియోగంలోకి తెస్తూ, వీధుల్ని వ్యర్థాల రహితంగా పరిశుభ్రంగా మారుస్తూ, దేశంలో ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతంగా ఉత్తర్‌పర గుర్తింపు సాధించింది. అదే విదేశీ నగరాల్ని సైతం వెనక్కినెట్టి ఆ పట్ణణాన్ని వ్యర్థాల నిర్వహణలో అగ్రస్థానంలో నిలబెట్టింది. అధికారుల చిత్తశుద్దీ, ప్రజల భాగస్వామ్యం కలగలిసి సాధించిన విజయమిది. అలాంటి నాయకత్వం లభిస్తే మన వీధుల్నీ అందంగా చూడటం పెద్ద కష్టం కాకపోవచ్చు..!

 

http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break67

Link to comment
Share on other sites

విశాఖలో వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్లు
 
  • పీయూష్‌ గోయల్‌ వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఏపీకి 47 మెగావాట్ల సామర్థ్యంగల 8 వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్లను మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వాటిని న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌కు అందజేసినట్టు చె ప్పారు. అందులో కొన్ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని, వ్యర్థాల సరఫరా కోసం విశాఖ గ్రేటర్‌తో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని, విద్యుత అందించడానికి ఏపీఈపీడీసీఎల్‌తో అగ్రిమెంట్‌ కుదుర్చుకుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు 28 నెలల్లో పూర్తవుతాయని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ-బీహెచ్‌ఈఎస్‌ సంయుక్తంగా చేపడుతున్న బొగ్గు ఆధారిత విద్యుత ప్లాంటును తరలించడం లేదని, ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. కోల్‌ హ్యాండిలింగ్‌ ప్లాంట్‌ పరికరాలను అమర్చడానికి రూ.128 కోట్ల నిధులు వచ్చాయని, అందులో రూ.100 కోట్లు ఈ సంస్థలు భరిస్తున్నాయని పేర్కొన్నారు. సీహెచ్‌పీ మే 2015 నుంచి కమర్షియల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభమైందన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...