Jump to content

Krishna Pushkaram 2016


Recommended Posts

  • Replies 3.5k
  • Created
  • Last Reply
పుష్కరాలకు మూడున్నర కోట్ల మంది వస్తారు: దేవినేని
 
636036733042912729.jpg
విజయవాడ: పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖలతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఘాట్ల నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పన, పిండప్రదానం, బందోబస్తు అంశాలపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు మూడున్నర కోట్ల మంది వస్తారని అంచనావేస్తున్నామని మంత్రి తెలిపారు. విజయవాడకు 2 కోట్ల మంది వస్తారని, 35 పుష్కర నగర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. కృష్ణా జిల్లా పురోహితులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. పిండ ప్రదాన నిర్వహణకు అందుబాటులో 2 వేల మంది పురోహితులను నియమించామని తెలిపారు. అందుబాటులో భక్తులకు పిండ ప్రదాన టికెట్లు, ఘాట్ల వారీ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో పుష్కరాల బందోబస్తుకు ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా 17 వేల మంది పోలీసులను సిద్ధం చేశామని దేవినేని ఉమ చెప్పారు.AUJq9eV.jpg
Link to comment
Share on other sites

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బృందాలు
 
636036446297305845.jpg
ఆంధ్రజ్యోతి - గుంటూరు: కృష్ణా పుష్కరాల పనులు సత్వరం పూర్తి చేసేందుకు.. పుష్కరాల్లో ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతం చేసేందుకు.. ఆయా శాఖల పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ప్రత్యేకాధికారి రాజశేఖర్‌ తెలిపారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై గుంటూరు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ పుష్కరాలు సమీపిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ఇంకా పనులు పూర్తికాలేదన్నారు. ఈ పరిస్థితుల్లో పనులను వేగవంతం చేయాలన్నారు. పుష్కరాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు అవసరమైన వసతి సౌకర్యాలను గుర్తించాలన్నారు. ఘాట్ల సమీపంలో ఉన్న దేవాలయాలకు మరమ్మతులు చేయాలని తెలిపారు. అమరావతి, ఉండవల్లి వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరఘాట్ల వద్ద ఇన్‌చార్జిలను ఏర్పాటు చేసి ప్రస్తుతం జరిగే పనుల్లో వారినే భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ఎన్నారైల సహకారం తీసుకోవాలన్నారు. ఘాట్ల వివరాల కోసం, రవాణా, వసతులను తెలియజేసేందుకు యాప్‌, గూగుల్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
 
పుష్కరాలు ముంచుకొస్తున్నా..
ఇంకా సమీక్షలేనా..

ఐదువారాల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నా ఇంకా సమీక్షలతో అధికారులు కాలయాపన చేస్తున్నారని దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఘాట్ల వద్ద పనులు ఏ మేరకు పూర్తయ్యాయో స్పష్టత లేదన్నారు. జిల్లాలో ఇంత వరకు ఘాట్ల వద్ద ఇన్‌చార్జిలను నియమించలేదన్నారు. ప్రతి ఘాట్‌కు లే అవుట్‌ను సిద్ధం చేయాలన్నారు. సహకరించేందుకు ముం దుకు వస్తున్న సంస్థలు, దాతల సహాయం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రోజుకు 10 లక్షల మంది పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 80 ఘాట్లను గుర్తించగా వాటిలో ఏ కేటగిరీలో 8, బీ కేటగిరీలో 13, సీలో 54, వీఐపీలకు 1, ఏ ప్లస్‌ ప్లస్‌లో 4 ఘాట్లను కేటాయించామన్నారు. పురోహితులకు దేవాదాయశాఖద్వారా గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. పుష్కరాల ఏర్పాట్లకు దేవాదాయశాఖ ద్వారా రూ.50 లక్షలు విడుదల చేస్తామని తెలిపారు. కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే మాట్లాడుతూ అమరావతి, గుంటూరు ఇతర ప్రాంతాల్లో పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. రూరల్‌ ఎస్పీ నారాయణ్‌నాయక్‌ మాట్లాడుతూ గుంటూరు, అమరావతి, సాగర్‌, పెనుమూడి వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఆర్వో నాగబాబు మాట్లాడుతూ 2004 పుష్కరాలకు వచ్చిన జనాభాను దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏజేసీ ముంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, పోలీసు, అగ్నిప్రమాదశాఖ, ఇతర అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు ఐకమత్యంగా పని చేయాలన్నారు. గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా నగరంలోని అతిథిగృహాలు, హోటళ్లను అందుబాటులో ఉంచామన్నారు. తాగునీరు, పారిశుధ్యం వంటి కార్యక్రమాలపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెనాలి ఆర్డీవో నరసింహులు మాట్లాడుతూ పెనుమూడి వద్ద అతిథి గృహాన్ని మరమ్మతులు చేయాలని కోరారు. గురజాల ఆర్డీవో మురళీ మాట్లాడుతూ సత్రశాల, దైదల వద్ద దేవాలయాలను మరమ్మతులు చేయాలని కోరారు. సమావేశంలో 2016 కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులకు వివరించారు. సమావేశంలో ఎస్‌ఈలు రాఘవేంద్రరావు (ఆర్‌అండ్‌బీ), జయరాజ్‌(పంచాయతీరాజ్‌), చౌదరి(ఇరిగేషన్‌), ప్రసాద్‌ (ఆర్‌ డబ్ల్యూఎస్‌), గుంటూరు ఆర్డీవో బండ్ల శ్రీని వాస్‌, డీఎస్‌వో చిట్టిబాబు, మార్కెటింగ్‌ శాఖ ఏడీ వరలక్ష్మి, మున్సిపల్‌ ఆర్డీ అనురాధ, డీపీ వో శ్రీదేవి శాఖాపరంగా పుష్కరాల ఏర్పాట్లను అధికారుల దృష్టికి తెచ్చారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...