Jump to content

Krishna Pushkaram 2016


Recommended Posts

  • Replies 3.5k
  • Created
  • Last Reply
Guest Urban Legend

  ప్రత్యేక పుష్కర సెల్‌

gnt-gen1a.jpg

ఈనాడు, అమరావతి : పుష్కరాల నిర్వహణకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది గోదావరి పుష్కరాలు నిర్వహించిన అనుభవంతో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకొంటోంది. ప్రస్తుతం పుష్కర ఘాట్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయి. మరో 45 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పనులు ముమ్మరం చేశారు. వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా ‘పుష్కర సెల్‌’ను ఏర్పాటు చేశారు. పనుల వివరాలను, యాత్రికులకు అవసరమైన సమాచారాన్ని ఈ విభాగం అందిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. చరవాణి, దూరవాణి ద్వారా సమచారం తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టరు బాబు.ఎ. సూచించారు. మంగళవారంనాడు పుష్కర ప్రత్యేక సెల్‌ను ఆయన ప్రారంభించారు. కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఉద్యోగులను నియమించారు. పుష్కరసెల్‌ విభాగానికి సమన్వయకర్తగా జిల్లా అభివృద్ధి అధికారిగా ఉన్న అనంతకృష్ణను, ఆయన సహాయకారిగా శ్యాంసుందర్‌లను నియమించారు. పుష్కరాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు, విరాళాలు అందించాలను కొనేవారు ఈ సెల్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. పుష్కరాల సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు భక్తుల కోసం ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పించడం సంప్రదాయంగా వస్తోంది. లక్షలాది భక్తులు తరలి రానుండడంతో వారికి అన్న పానీయాలు అందించేందుకు పలువురు ముందుకు వస్తారు. వలంటీర్లుగా కొంతమంది పనిచేసేందుకు ఇష్టపడతారు. ఇలాంటి వారంతా ముందస్తుగా పుష్కరసెల్‌లో సంప్రదించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈసెల్‌ పుష్కర పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి పురోగతి వివరాలను నమోదు చేస్తారు. దీని కోపం ప్రత్యేక ట్విట్టర్‌ ఖాతాను, ఫేస్‌బుక్‌ను ప్రారంభించారు. పుష్కర సమాచారం కోసం, విరాళాలు అందించేందుకు డీడీవో అనంతకృష్ణను సంప్రదించాల్సి ఉంది.

సంప్రదించాల్సిన చరవాణి నెంబర్లు: 7702221597, 7702221598

దూరవాణి నెంబర్లు: 0866-2474700, 2474701

ట్విట్టరు ఖాతా:- krishna_dist

ఫేస్‌బుక్‌ ఖాతా :- krishnadistrictoffcial gmail.com

Link to comment
Share on other sites

Guest Urban Legend

Pushkaram Cell at Collector Camp Officie, VJA works @ 24/7.
For any Information and for voluntary services to render,

please contact Pushkaram Cell Numbers are: 0866-2474700
0866-2474701

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...