Jump to content

Krishna Godavari Pavitra sangamam


Recommended Posts

కృష్ణమ్మ తీరాన సంగీత నృత్యోత్సవం

అంతర్జాతీయ కళాకారుల ఆగమనం

09ap-state11a.jpg

అమరావతి: కృష్ణా గోదావరి పవిత్ర సంగమంగా, కృష్ణా హారతితో కాంతులీనుతున్న తీరంగా ఇప్పటికే భాసిల్లుతున్న గోదావరి, కృష్ణా నదుల పవిత్రసంగమ క్షేత్రం అద్భుత సంగీత నృత్య లయ విన్యాసానికి వేదికవుతోంది. దేశ కళాఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన కళాకారులు ఎందరో తమ గానామృతంతో, నృత్యాభినయంతో పులకింపజేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి కళాకారులు, ఇతర దేశాల కళాకారులు సయితం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. పద్మవిభూషణ్‌ పండిట్‌ బిర్జూ మహరాజ్‌ కథక్‌ నృత్యం, డాక్టర్‌ ఎల్‌ సుబ్రమణియం, విక్కు వినాయక్‌ రామ్‌, త్రిలోక్‌ గుర్తుల సంగీతం, కవితా కృష్ణమూర్తి గానం...హేమమాలిని నృత్యం.. అనిండో చటర్జీ....ఇలా లబ్ధ ప్రతిష్టులైన దాదాపు 21 మంది కళాకారులు నాలుగు రోజుల పాటు అమరావతిని అలరించనున్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమ క్షేత్రంలోనే శుక్రవారం నుంచి సోమవారం వరకు సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు సాయంత్రం ఈ అంతర్జాతీయ సంగీత, నృత్య కార్యక్రమమూ జత చేశారు. సంప్రదాయ, పాశ్చాత్య సంగీత సమ్మేళనంగా ఇది ఉర్రూతలూగించనుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భాషా సాంస్కృతికశాఖ కమిషనరు నాగులపల్లి శ్రీకాంత్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

 

కృష్ణా తీరాన సందడి చేసిన హాట్ ఎయిర్ బలూన్స్...

 

Super User

 

 

13 February 2017

 

Hits: 63

 

 

hot-air-13022017.jpg

గత మూడు రోజులుగా ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం వద్ద జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు , అదే విధంగా అమరావతి మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్ సంధ్రభంగా, కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బలూన్స్ , ప్యారాచూట్స్ ప్రదర్శన ఆకట్టుకుంది.

అమరావతిలో, కృష్ణా నది తీరాన, ప్రజలను పర్యాటకంగా ఆకట్టుకుంటానికి త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. విశాఖలో జరిగిన CII సమ్మిట్ లో, కొన్ని కంపెనీలతో ప్రభుత్వం ఇందుకు గాను, అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

Link to comment
Share on other sites

Guest Urban Legend

When sky, wind, river, the entire Mother Nature is in harmony with music, the scene is a bliss and the experience divine. AmaravatiMusicFest

 

C4i_BapUYAEEOnR.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
సాంస్కృతిక తీరం.. కృష్ణా!
 
636242955253133298.jpg
  • రెండు కల్చరల్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
  • ఠాగూర్‌ కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం
  • తాజాగా సుప్రసిద్ధ వయోలిన విద్వాంసులు సుబ్రహ్మణ్యం కల్చరల్‌ సెంటర్‌
  • ప్రభుత్వ భూమిని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ బాబు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కృష్ణానదీ తీరం.. ఇక సాంస్కృతిక కేంద్రం కాబోతోంది! అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత.. కృష్ణా, గోదారిల పవిత్ర ‘సంగమ’ ప్రాంతానికి ఎనలేని గుర్తింపు వచ్చింది. పవిత్ర సంగమం ప్రాంతం దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచస్థాయిలో కూడా గుర్తింపు పొందేలా ఇటీవలికాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అమరావతికి ఒక చరిత్ర ఉన్న నేపథ్యంలో, సాంస్కృతికం కూడా తోడైతే యావత ప్రపంచం చూపంతా ఇటువైపే ఉంటుంది. పర్యాటకంగా అభివృద్ధి చెందటానికి సువర్ణావకాశంగా చెప్పుకోవాల్సిందే. ఇటీవల పవిత్ర సంగమ ప్రాంతంలో అంతర్జాతీయ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ నిర్వహించిన తర్వాత ఈప్రాంత ఇమేజి మరింత పెరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర కృష్ణాతీరాన్ని అందమైన రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దునున్న సంగతి తెలిసిందే. తీరం వెంబడి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.460 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. మొత్తం మూడు రివర్‌ ఫ్రంట్‌లను అభివృద్ధి చేస్తోంది.
 
 
     పద్మావతి, క్రిష్టవేణి ఏకీకృత ఘాట్‌ రివర్‌ ఫ్రంట్‌, దుర్గా-పున్నమి రివర్‌ ఫ్రంట్‌, పవిత్ర సంగమం రివర్‌ ఫ్రంట్‌లను వేర్వేరుగా అభివృద్ధి చేస్తోంది. వీటిలో పవిత్ర సంగమం రివర్‌ ఫ్రంట్‌ ప్రత్యేకమైనది. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమ ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచే అమరావతి రాజధానికి ఐకానిక్‌ బ్రిడ్జి వెళుతుంది. ఈ నేపథ్యంలో, పవిత్ర సంగమ ప్రాంతం సమీపంలో కల్చరల్‌ సెంటర్లను ఏర్పాటు చేయటానికి అనేక సంస్థలు పోటీలు పడుతున్నాయి. సంగీత, నృత్య కేంద్రాల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. భారతదేశం లోనే కాక యావత్ ప్రపంచంలోనే సుప్రశిద్ధ వయోలిన్ విద్వాంసులు ఎల్‌.సుబ్రహ్మణ్యం కల్చరల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చారు. సుబ్రహ్మణ్యం కొద్దిరోజుల కిందట అమరావతి గ్లోబల్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్ ఫెస్టివల్‌లో పాలుపంచుకున్నారు. కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదన రాగానే.. కృష్ణాజిల్లా యంత్రాంగం వెంటనే దానిని అందిపుచ్చుకునేందుకు చర్యలు చేపట్టింది.
 
శనివారం ఎల్‌ సుబ్రహ్మణ్యంతో కృష్ణా కలెక్టర్‌ బాబు అహ్మద్‌ కలిసి ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని భూములను పరిశీలించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఇదే ప్రాంతంలో అమరావతి అమెరికన ఇనసిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఏర్పాటు కాబోతోంది. సాంస్కృతికానికి సంబంధించి ఠాగూర్‌ కల్చరల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు కానుంది. మిగిలిన కల్చరల్‌ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన మరికొన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.
clr.jpg
Link to comment
Share on other sites

@anna garu

his is price less and CBN is going in good direction....Andhra is home for arts&culture....This will make at least some kids to move to these instead of just spending their time on Mobiles and Video Games

 

http://www.sapaindia.com/ ...Subramaniam Academy of Performing Arts,Bangalore laga pedite baguntundi AMaravati lo...a picture lo unna ammayi ayana Daughter....

Pavitra sangam Arts&Culture ki home avvali national ga.

 

Our govt&CBN&Andhraites warmly welcome LV Subramaniam&Kavitha Krishnamurthy family if they can make Amaravati their first home. I know it's not easy for them leaving bangalore but we wish that happens.

 

Subramaniam Academy of Performing Arts

Kuchipudi academy

Annamaya Academy

Music Acadamy for all other(Vijayanagara veena e.t.c)

Link to comment
Share on other sites

పవిత్ర సంగమం వద్దే ఐకానిక్‌ బ్రిడ్జి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని అనుసంధానించే తొలి ఐకానిక్‌ బ్రిడ్జిని కృష్ణా నదిపై పవిత్ర సంగమం వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రిడ్జి ఇటు రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయానికి పశ్చిమంగా మొదలవుతుంది. అటు కృష్ణా జిల్లాలో పవిత్రసంగమం ప్రాంతాన్ని అనుసంధానిస్తుంది. పవిత్ర సంగమ ప్రాంతం నుంచి ఫెర్రీ రోడ్డు ద్వారా ఇబ్రహీంపట్నం కూడలికి చేరుకోవచ్చు. కృష్ణా నదికి అటూ ఇటూ కచ్చితంగా బ్రిడ్జి ఏ పాయింట్‌ల వద్ద వస్తుందన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. విజయవాడ-హైదరాబాద్‌ రహదారిని, ఇబ్రహీంపట్నం కూడలి వద్ద ఛత్తీస్‌గఢ్‌ హైవే కలుస్తుంది. అంటే హైదరాబాద్‌, విజయవాడ, ఛత్తీస్‌గఢ్‌ మార్గాల్లో వచ్చేవారు ఈ ఐకానిక్‌ బ్రిడ్జి ద్వారా రాజధానికి చేరుకోవచ్చు. గోదావరి జలాలు వచ్చి కృష్ణా నదిలో కలిసే పవిత్రసంగమ ప్రాంతాన్ని ప్రభుత్వం గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనుంది. కృష్ణా నదికి హారతి కార్యక్రమం అక్కడే జరుగుతోంది. ఇటీవల జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుని కూడా ప్రభుత్వం అక్కడే పెద్ద ఎత్తున నిర్వహించింది. భవిష్యత్తులో అక్కడ 25 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్లు నిర్మించాలన్నది ప్రభుత్వం యోచన. ఈ నేపథ్యంలో పవిత్ర సంగమం వద్దే కృష్ణా నదిపై రెండంతస్తుల ఐకానిక్‌ బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Link to comment
Share on other sites

  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...