Jump to content

Godavari- krishna-pennar rivers interlink study


Recommended Posts

3 minutes ago, rk09 said:

For sure, ivi ayithe only season(July - Vov) lone operate chesthayi - i think the minimum draw level is 12-15 meters

- Pattiseema lift, Tadipudi lift, Chintalapudi lift, Pushkara lift, Purushothapatnam lift 

Once polavaram is in place, do you think 15mt level rule is applicable? Cant we extend the pumps?

Link to comment
Share on other sites

6 minutes ago, Jeevgorantla said:

Annagaru...I am optimistic that govt will save around 30 tmc of water till mid-may and start releasing water for early Kharif. in order to send water, we still might need these pumps.

YES, if our time becomes that bad we have to put lift inside RESERVOIR to the bottom in SUMMER....but I don't think we are planning that level

PATTISEEMA&PURUSHOTHA patnam LIFT are down the RESERVOIR.......Once polavaram is complete they are not used but TUNNELS from regulator provide water to RIGHT&LEFT...

 

You can see pattiseema PIPELINE under ground and TUNNEL below DAM.

Same you can see LEFT LIFT canal below DAM but HILL TUNNEL above DAM

https://www.google.com/maps/place/Polavaram,+Andhra+Pradesh+534315,+India/@17.2383101,81.6280377,11217m/data=!3m1!1e3!4m5!3m4!1s0x3a37044d8a93cb1d:0xf63e7f91cf8f3a5!8m2!3d17.2478932!4d81.6432353

Link to comment
Share on other sites

1 minute ago, Jeevgorantla said:

Once polavaram is in place, do you think 15mt level rule is applicable? Cant we extend the pumps?

yes - it will be political - why to give opposition a chance - saying taking all Godavari water

 

 

Link to comment
Share on other sites

for say - to draw water at Pattiseema , the minimum level should be at 14/15 meters. Where as Dowleswaram Barrage gates level is also at 14 meters. Any excess will be flown into sea unless you make those pump level even deeper.

Link to comment
Share on other sites

Just now, rk09 said:

for say - to draw water at Pattiseema , the minimum level should be at 14/15 meters. Where as Dowleswaram Barrage gates level is also at 14 meters. Any excess will be flown into sea unless you make those pump level even deeper.

no need to dig any deeper. just control discharge at polavaram equal to pumping capacities of lifts + discharge at dowleswaram.

Link to comment
Share on other sites

And also, remember for last couple of years there is no proper water supply during second crop in Godavari delta.

This year also around 20-30 tmc shortage.

First thing should be first - Godavari delta should get water fully for their needs then other areas

Link to comment
Share on other sites

3 minutes ago, swarnandhra said:

no need to dig any deeper. just control discharge at polavaram equal to pumping capacities of lifts + discharge at dowleswaram.

at 14m - each pump will pump only 200+ cusecs

where as at 16m + - the same pump will pump 300+ cusecs

- may be some pressure issue, i guess - 

Edited by rk09
Link to comment
Share on other sites

1 minute ago, swarnandhra said:

no need to dig any deeper. just control discharge at polavaram equal to pumping capacities of lifts + discharge at dowleswaram.

Agree with Swarnaandhra brother..I had the same thought.

Does anyone know how much water is left in sileru reservoir by nov end?

Link to comment
Share on other sites

3 minutes ago, rk09 said:

for drinking, govt need to plan with Krishna basin water during Feb - June period.

and also, i'm sure there will not be any issues for drikinking water because - all the needed tanks will be filled during end of the season.

Link to comment
Share on other sites

9 minutes ago, rk09 said:

at 14m - each pump will pump only 200+ cusecs

where as at 16m + - the same pump will pump 300+ cusecs

- may be some pressure issue, i guess - 

You may be right about these numbers. but is n't currently pattiseema lifts full capacity when there is no overflow at Dowleswaram?  if so, why is it hard to maintain water level at dowleswaram to the brink?

I am not saying full capacity lifting is needed. just could not understand the physics of it.

Edited by swarnandhra
Link to comment
Share on other sites

5 minutes ago, swarnandhra said:

You may be right about these numbers. but is n't currently pattiseema lifts full capacity when there is no overflow at Dowleswaram?  if so, why is it hard to maintain water level at dowleswaram to the brink?

I am not saying full capacity lifting is needed. just could not understand the physics of it.

as per records - No

Link to comment
Share on other sites

3 minutes ago, swarnandhra said:

you will be surprised at water evaporation rate in Indian summers that too in shallow tanks.

I agree - but need to plan accordingly by the local govts. and also mainly ground water.

 

Link to comment
Share on other sites

On 9/3/2017 at 9:36 AM, sonykongara said:

penna.jpg

in this article kambhampati  paparao telling that reservoir can be built at jalleru(which is near polavaram and papikondalu) , but state irrigation department suggesting reservoir bollapalle. advantage of reservoir at jalleru is canal can be built at less capacity. but wapcos/irrigation department choosing bollapalle.

what is the disadvantage of jalleru?

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

in this article kambhampati  paparao telling that reservoir can be built at jalleru(which is near polavaram and papikondalu) , but state irrigation department suggesting reservoir bollapalle. advantage of reservoir at jalleru is canal can be built at less capacity. but wapcos/irrigation department choosing bollapalle.

what is the disadvantage of jalleru?

May Bollapalle larger capacity tank and easy water management ???

Link to comment
Share on other sites

సీమకూ గోదారి!
27-01-2018 01:28:01
 
636526132857460305.jpg
  • చివరి అంచు దాకా గలగలలు
  • పెన్నాతో అనుసంధాన ప్రక్రియ వేగవంతం
  • బొల్లేపల్లిలో 360 టీఎంసీల రిజర్వాయరు
  • అక్కడి నుంచి సోమశిలకు తరలింపు
  • ఆపై.. రాయలసీమ మొత్తానికీ
  • హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ కాలువల సద్వినియోగం
  • ఫిబ్రవరి 5న వాప్కోస్‌ సమగ్ర నివేదిక
  • సాగర్‌ కుడి ఆయకట్టుకూ గోదావరే
  • ప్రకాశంలో కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీరు
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ చివరి అంచుదాకా.. ఆఖరికి నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు కూడా గోదావరి జలాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన అనుభవంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్‌ అధ్యయనం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్ర జల వనరుల శాఖకు సమర్పించనుంది.
 
 
గోదావరి జలాలను కేవలం పెన్నాకు తరలించడంతో సరిపెట్టుకోరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీరు తరలింపుతో వ్యవసాయోత్పత్తుల దిగుబడుల్లో వచ్చిన వృద్ధిని చూశాక.. రాయలసీమలోనూ ఈ జలాలను పారిస్తే మహాద్భుతాన్ని సృష్టించవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల కాలువలను సద్వినియోగం చేసుకుని రాయలసీమలోని నాలుగు జిల్లాలకూ గోదావరి నీటిని తరలించాలని యోచిస్తున్నారు. ఈ ఆలోచన కార్యరూపం దాల్చి రాయలసీమ చివరి ఆయకట్టుదాకా గోదావరి ప్రవహిస్తే.. కరువు సీమ ముద్ర చెరిగిపోతుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
 
పోలవరం నుంచి సోమశిల దాకా గోదావరి జలాలను ఎత్తిపోసే కార్యక్రమానికి ఇప్పటికే ప్రాథమిక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండకు సమీపంలోని బొల్లేపల్లి వద్ద 360 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయరును నిర్మిస్తారు. గోదావరి జలాల ఉధృతి అధికంగా ఉన్న సమయంలో రోజు కు 4 టీఎంసీల చొప్పున ఇక్కడకు తరలించి.. ఇక్కడి నుంచి సోమశిలకు పంపుతారు. వాస్తవానికి ఈ పథకాన్ని నాలుగు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశలో పోలవరం నుంచి 200 టీఎంసీలు మళ్లిస్తారు. 240కి.మీ మేర గ్రావిటీ కెనాల్‌ను రూ.17,796 కోట్లతో నిర్మిస్తారు.
 
రెండోదశలో.. పంపుద్వారా ఎత్తిపోసే ప్రెజర్‌ మెయిన్‌ను 0.82 కి.మీ మేర రూ.2,292 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మూడోదశలో 14.40 కి.మీ మేర సొరంగాన్ని రూ.2,859 కోట్లతో నిర్మిస్తారు. దీనికి రూ.22,947 కోట్లదాకా వ్యయమవుతుంది. 4వ దశలో కృష్ణానది అడ్డొచ్చే ప్రాంతంలో.. క్రాసింగ్‌ అక్విడెక్ట్‌ను రూ.2,180 కోట్ల ఖర్చుతో 3.67 కి.మీ మేర నిర్మిస్తారు.
 
 
ప్రయోజనం ఇదీ..
గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా.. బొల్లేపల్లి వద్ద నిర్మించే రిజర్వాయరు ద్వారా సోమశిలకు నీరు పంపడంతో ప్రాజెక్టు పూర్తవుతుంది. అయితే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ పథకాల కోసం తవ్విన కాలువల ద్వారా సోమశిల నుంచి గోదావరి జలాలను తరలించాలని సీఎం భావిస్తున్నారు.
 
ఇందుకోసం ప్రత్యేకంగా వ్యయం చేయాల్సిన అవసరమూ ఉండదు. పైగా.. సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 8 టీఎంసీలు, వెలిగొండలో 40 టీఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్టుకు 30 టీఎంసీలు, హంద్రీ-నీవా, వెలిగల్లు రిజర్వాయరులో 20 టీఎంసీల మేర నిల్వ చేసేందుకు వీలవుతుంది. కడప, చిత్తూరు జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీరివ్వొచ్చు. చిత్తూరు జిల్లా మల్లెవాగు, వేణుగోపాలస్వామి రిజర్వాయరులలో సుమారు 9 టీఎంసీలను నిల్వ చేసేందుకు వీలు కలుగుతుంది.
 
 
మన సంగతి మనం చూసుకుందాం
మహానది-గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగం గా తెలంగాణలోని అకినేపల్లి నుంచి నాగార్జునసాగర్‌, సోమశిల గుండా కావేరీ నదికి జలాలను తరలించే తొలి దశ పథకానికి కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. అయితే తమకు 1500 టీఎంసీల నీటిని కేటాయిస్తేనే ఇందుకు అంగీకరిస్తామని తెలంగాణ పట్టుబడుతోంది.
 
ఆరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం పెట్టి ప్రాజెక్టును ఖరారు చేయాలని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ భావిస్తున్నారు. అయితే నిధులు మాత్రం జలాలు అవసరమున్న రాష్ట్రాలే భరించాలని అంటున్నారు. అటు తెలంగాణ కొర్రీలు, ఇటు కేంద్రం తీరు నేపథ్యంలో ఈ అనుసంధాన ప్రాజెక్టు ఎంతవరకు పట్టాలెక్కుతుందో అనుమానమే! దానికోసం వేచిచూడడం కంటే సొంత పథకాలతో రాష్ట్రమంతటికీ సాగునీరు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు.
 
 
వైకుంఠపురం నుంచి ఆరు ఎత్తిపోతలు
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా కృష్ణా డెల్టాకు పట్టిసీమ పథకం ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. ఈ జలాలను నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాలువ ఆయకట్టుకు కూడా తరలించాలని చంద్రబాబు సంకల్పించారు. రూ.5000 కోట్ల వ్యయంతో.. వైకుంఠపురం బ్యారేజీ నుంచి ఆరు ఎత్తిపోతల పథకాలను నిర్మించి.. పట్టిసీమ ద్వారా తరలించే జలాలతో 11.5 లక్షల ఎకరాల సాగర్‌ కుడి ఆయకట్టుకు, ప్రకాశం జిల్లాలో కొత్తగా 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జల వనరుల శాఖను ఆదేశించారు. కృష్ణా నదీ ప్రవాహం క్రమేపీ తగ్గిపోతున్న దరిమిలా.. సాగర్‌ కుడి కాలువ రైతులకూ గోదావరి జలాలను అందించాలన్న నిర్ణయానికి సీఎం వచ్చారు.
Link to comment
Share on other sites

34 minutes ago, DVSDev said:

Inka ee thread close chesko vacchu - baffas support nill and paisal nill :close:

jaitley alloted 1 crore for river linking . so we can't rely on center . ap needs have to arrange funds for this project, by reducing allocations to welfare,roads or any other wasteful expenditure

Link to comment
Share on other sites

8 hours ago, ravindras said:

jaitley alloted 1 crore for river linking . so we can't rely on center . ap needs have to arrange funds for this project, by reducing allocations to welfare,roads or any other wasteful expenditure

How about CBN giving call to corporates and individuals to donate huge amount of funds and exempt from Tax - and give opportunity to name major areas with respect to their ancestors and family names for years - at least for irrigation projects or Amaravathi infra projects and buildings etc etc ...!

Link to comment
Share on other sites

మహా సంధానానికి రెడీ
06-02-2018 01:34:14

6 నెలల్లో గోదావరి-పెన్నా తొలి దశ
ఈ నెలలోనే టెండర్లకు ఆహ్వానం
రూ.4617 కోట్లతో పనులు.. సీఎం ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ద్వారా దేశంలోనే తొలిసారి నదుల అనుసంధానాన్ని సాకారం చేసిన నవ్యాంధ్ర సర్కారు... మరో మహా సంధానం దిశగా అడుగులు వేస్తోంది. గోదావరి - పెన్నా నదుల సంధానంలో భాగంగా తొలి దశ నిర్మాణం కోసం ఈ నెలలోనే టెండర్లను పిలవాలని నిర్ణయించింది. రూ.4617 కోట్ల వ్యయంతో చేపట్టే తొలిదశ పనులను ఆరునెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి దశలో నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలిస్తారు.
 
మరోవైపు... గుంటూరు జిల్లా వైపున కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించి రాజధాని నగరం అమరావతికి మంచినీటిని సరఫరా చేయాలని జల వనరులశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. సచివాలయంలో సోమవారం జరిపిన సమీక్షలో.. మహా సంధానంపైనా చంద్రబాబు చర్చించారు. ఈనెలలోనే తొలి దశకు టెండర్లను పిలిచి.. జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు సాగు, తాగు నీటిని పుష్కలంగా అందించాలంటే గోదావరి - పెన్నా అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టడమే మార్గమన్నారు.
 
ఇదీ మొదటి దశ...
గోదావరి-పెన్నా సంధానాన్ని ఐదు దశల్లో చేపట్టాలని వ్యాప్కోస్‌ సూచించింది. మొదటి దశలో పోలవరం కుడి ప్రధాన కాలువను ఆధారంగా చేసుకుని గోదావరి జలాలను ప్రస్తుతం ఉన్న చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాల ద్వారా సాగర్‌ కుడికాలువకు నీటిని అందిస్తారు. సాగర్‌ కుడి కాలువలోకి 120 రోజులపాటు రోజుకు 7వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 73 టీఎంసీలు తరలిస్తారు.
 
హరిశ్చంద్రపురం వద్ద నీటిని ఎత్తిపోసి...
నాగార్జునసాగర్‌ కుడికాలువకు అనుసంధానిస్తూ 61.90 కిలోమీటర్ల పొడవునా కెనాల్‌ నిర్మిస్తారు. ఇందుకు 989 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే... ప్రెజర్‌ మెయిన్‌ అండ్‌ పంప్‌ హౌస్‌ల నిర్మాణానికి భూసేకరణ వ్యయంతో కలిపి 3628 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బుడమేరు, పాలేరు, మున్నేరు జలాలను కూడా తీసుకుంటూ కృష్ణా డెల్టాను స్థిరీకరిస్తారు. గోదావరి-పెన్నా తదుపరి దశల్లో బొల్లాపల్లి వద్ద రిజర్వాయరు నిర్మిస్తారు. అక్కడి నుంచి సోమశిలకు నీటిని చేరవేసి... గోదావరి-పెన్నా అనుసంధానం పూర్తి చేస్తారు. ఇదే క్రమంలో బొల్లాపల్లి నుంచి ప్రకాశం జిల్లాలోని వెలిగొండ రిజర్వాయరుకూ నీటిని అందిస్తారు.
 
వైకుంఠపురం బ్యారేజీపై...
రాష్ట్ర రాజధాని తాగు నీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా వైకుంఠపురం వద్ద ఒక బ్యారేజీని నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసిన జల వనరుల శాఖ .. సోమవారం చంద్రబాబుకు ఆ వివరాలు తెలిపింది. వాప్కోస్‌ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించింది. ఈ బ్యారేజీ సామర్థ్యం 10 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.1985 కోట్లు అవసరమని వాప్కోస్‌ అంచనా వేసింది. ఈ పథకం కోసం 9740 ఎకరాలను సమీకరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సమీక్షలో జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

గోదావరి పెన్నా 5 దశల్లో అనుసంధానం 
రూ.4,617 కోట్లతో తొలి దశ పనులు 
మార్చి ప్రారంభంలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం 
తొలుత గోదావరి నుంచి సాగర్‌ ఆయకట్టుకు మళ్లింపు 
ముఖ్యమంత్రి వద్ద సమావేశంలో కీలక నిర్ణయం..
ఈనాడు, అమరావతి: గోదావరి పెన్నా అనుసంధానం అయిదు దశల్లో చేపట్టనున్నారు.  రూ.4617 కోట్ల ఖర్చుతో తొలి దశ పనులకు తక్షణం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఆదేశించారు. ఈ తొలి దశలో గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా మరింత అదనపు నీరు తీసుకువచ్చి కృష్ణా డెల్టాకు ఇవ్వడంతో పాటు ప్రకాశం బ్యారేజి ఎగువన హరిశ్చంద్రపురం నుంచి వివిధ దశల్లో నీటిని ఎత్తిపోసి నాగార్జునసాగర్‌ కుడి కాలువకు మళ్లిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టును ముఖ్యమంత్రికి అధికారులు సోమవారం వివరించారు. మార్చిలో టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. జులైకల్లా పనులు కొలిక్కి తేవాలని చెప్పారు. గోదావరి పెన్నా తొలిదశను ఈ తరహాలో చేపట్టబోతున్నట్లు ‘ఈనాడు’ ముందే రాసింది.
మలిదశల్లో 247 టీఎంసీల మళ్లింపు...! 
ఈ ప్రాజెక్టు తొలి దశలో 73టీఎంసీలు, మిగిలిన నాలుగు దశల్లో మరో 247టీఎంసీలు మళ్లించే ప్రణాళిక సిద్ధం చేశారు. దారి మధ్యలో 150 టీఎంసీలు నిల్వచేస్తారు... 
* తొలిదశలో ఏడుచోట్ల, తర్వాత దశల్లో మరో 3చోట్ల ఎత్తిపోసేలా నిర్మాణాలు చేపట్టాలి. 
* కొత్తగా బొల్లాపల్లి వద్ద ఒక జలాశయం ఏర్పాటుచేస్తారు. మరో 3 పాత జలాశయాల్లో నీటిని నింపుతారు. 
* మొత్తం 11 గ్రామాలు ప్రభావితం అవుతాయి 
* తొలిదశలో 30 మెగావాట్ల, తర్వాత దశల్లో 2413 మెగావాట్ల విద్యుత్తు అవసరమని తేల్చారు.
 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...