Jump to content

Applus+ IDIADA in Donakonda, AP


Recommended Posts

దొనకొండలో ఆటోమొబైల్‌ పరిశ్రమ
Applus IDIADA automotive testing and research development centre
 
ఒంగోలు, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పారిశ్రామిక కారిడార్‌లో పరిశ్రమల ఏర్పాటుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. చైనా, జపాన్‌ తదితర పలు విదేశీ కంపెనీల ప్రతినిధులు వచ్చి స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. తాజాగా స్పెయిన్‌కు చెందిన ‘ఇడియాడ్‌’ కంపెనీ ఆటోమొబైల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధులు లూయిస్‌ యాంబిల్‌, పునీత్‌ బల్లాన్‌, మందిప్‌టక్‌లతో కూడిన బృందం మంగళ, బుధవారాల్లో జిల్లాలో పర్యటించింది. ఇండ్ల చెరువు, రుద్రసముద్రం గ్రామాల్లో భూములను, వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం వీరు మంత్రి శిద్దా రాఘవరావుతో భేటీ అయ్యారు. సుమారు రూ.2వేల కోట్లతో దొనకొండ ప్రాంతంలో కంపెనీ ఏర్పాటుచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటుచేసే వసతుల గురించి ఆ బృందానికి మంత్రి వివరించారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...