Jump to content

Manginapudi beach


Recommended Posts

Guest Urban Legend

:super:

 

chaala neglect chesaru inni rojulu with out any proper facilities

 

and ikkada water ndhuko clean ga vundadhu

Link to comment
Share on other sites

 

Beach development plan has been prepared for Machilipatnam with an intention to develop the town as one of the best spot for tourism destinations.

The plan includes beach resorts, parks, entertainment zones, sports and hotels to attract tourists. Several works have already started for tourism development ahead of upcoming Krishna Pushkarams.

Water Sports:

While government is preparing its plans, a private agency, Water Sports Simple India Private Limited has imported boats from America, to entertain the tourists with various water sports in Manginipudi Beach. These boats are designed in such a way that, the boat will adjust to Ocean conditions. Boat Shikaar, Speed Boats, Round Fishing Boat etc.. are some water sports available. The organizers are making arrangements to start the water sports from June month end.

Link to comment
Share on other sites

anni bane unayi gani packages information mundu APTDC lo pettandi

 

Manam hitech city CM ani chepukuntam but Aptdc website ni upgrade cheyandi babu ga

 

 

True, ippatiki vacchi oka one stop informaton source ledhu...............pani M leni vaatiki apps develop chese badulu ittanti vaatiki develop cheste baaguntadhi!

 

Promo videos chesi other states lo publicity ivvali( cinema halls, events, public locations like airports etc).

Link to comment
Share on other sites

  • 4 weeks later...

water-sports-manginipudi-beach-09062016-Water Sports Launched at Manginipudi Beach


 


Excise Minister K. Ravindra on Saturday said that the government would give a fillip to beach tourism in Krishna district.


Mr. Ravindra inaugurated a boating facility at the Manginapudi beach near Machilipatnam.


Water Sports Simple India Private Limited came forward to operate boats at the beach in collaboration with the Tourism Department.


Water Sports Simple India Private Limited has imported boats from America, to entertain the tourists with various water sports in Manginipudi Beach. These boats are designed in such a way that, the boat will adjust to Ocean conditions. Boat Shikaar, Speed Boats, Round Fishing Boat etc.. are some water sports available.


Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 3 weeks later...

మంగినపూడి బీచ్‌ అభివృద్ధికి ప్రణాళికలు

kri-gen8a.jpg

మంగినపూడి (చిలకలపూడి), న్యూస్‌టుడే: మంగినపూడి బీచ్‌ పర్యాటక అభివృద్ధి ప్రణాళికల అమలుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మండల పరిధిలోని మంగినపూడి బీచ్‌ను పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శ్రీకాంత్‌, ఇతర అధికారులతో కలిసి మంగినపూడి, గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌లను శనివారం సందర్శించి, పర్యాటక అభివృద్ధి అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.50 కోట్లతో మంగినపూడి బీచ్‌ ముఖ అభివృద్ధి, వాటర్‌ స్పోర్ట్స్‌, పర్యాటక రిసార్ట్సు తదితర నిర్మాణాలు చేపట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బీచ్‌ ముఖ స్థలంలో మెరక చేయించి, చుట్టూ రహదారి అభివృద్ధి చేస్తున్నటు తెలిపారు. మిగతా పనులకు అంచనాలు రూపొందించి నిధులు మంజూరుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. బందరు పోర్టు రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, తద్వారా పర్యాటక రంగంగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీచ్‌లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రాజధానికి సమీపంలో ఉండేది కాబట్టి ఎంతో వేగంగా అభివృద్ధి చెందగలదని, అందుకు తగిన ప్రణాళికలతో అభివృద్ధి చేయించాలన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రదేశాల్లో పర్యాటక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అదే విధంగా సాగరమాల కింద బీచ్‌లో జెట్టి ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించేందుకు మెరైన్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో అంచనాలు రూపొందిస్తామని తెలిపారు. దశలవారీగా పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలిపారు. కార్యక్రమంలో బందరు ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ వూసా వెంకట సుబ్బారావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఇలియాస్‌ పాషా, నాయకులు కుర్రా నరేంద్ర, పర్యాటక ఎస్‌ఈ పి.వెంకటేశ్వర్లు, పర్యాటక కార్పొరేషన్‌ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఎంపీడీవో సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు నాగమల్లేశ్వరరావు,కౌన్సిలర్లు నారగాని ఆంజనేయప్రసాద్‌, శేషులు పాల్గొన్నారు

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 months later...

గ్రామీణ మండలంలోని మంగినపూడి బీచ్‌ నుంచి బందరుకు వచ్చే రహదారిని కూడా విస్తరించనున్నారు. రూ. 60 కోట్లతో నాలుగు వరుసల రోడ్డుగా నిర్మించనున్నారు. ఇది బీచ్‌ నుంచి పోర్టు మీదుగా పట్టణానికి వెళ్తుంది.

Link to comment
Share on other sites

  • 1 year later...
  • 1 month later...
కడలి తీరం ఆహ్లాద భరితం 
మంగినపూడి బీచ్‌కు మహర్దశ 
రూ.20కోట్ల్ల కేటాయింపు 
పర్యాటకశాఖ ద్వారా మరో రూ.5 కోట్లు 
kri-sty1a.jpg

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం చరిత్రాత్మక ప్రాంతం. పట్టణంలో ఎటు చూసినా చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. స్వాంతంత్య్రం రాకముందునుంచే ప్రపంచ పటంలో బందరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవిభజన తరువాత పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తున్న క్రమంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మంగినపూడి బీచ్‌కు కూడా  మహర్దశ రానుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే  రూ.కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతోపాటు పట్టణానికి వచ్చిన  ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు రూ.20కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తానని ప్రకటించడం..అధికారులు వెంటనే ప్రతిపాదనలు రూపొందించడం చూస్తుంటే  అనతికాలంలోనే బీచ్‌ అతిసుందరంగా మారుతుందనే నమ్మకం కలుగుతోంది.

న్యూస్‌టుడే, గొడుగుపేట

జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ వందలాదిమంది పర్యాటకులు బీచ్‌ను సందర్శిస్తారు. బీచ్‌లను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం ఆదిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే రాజధానికి సమీపంలో ఉన్న మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. గతంలో పేరుకు బీచ్‌ అన్నమాటే కానీ ఎలాంటి వసతులు ఉండేవి కావు. దీంతో కార్తీకపౌర్ణమి తదితర పండుగల సమయాల్లోనే ఎక్కువ సంఖ్యలో భక్తులు, సందర్శకులు కనిపించేవారు. ప్రస్తుతం సెలవురోజులతోపాటు, సాధారణ సమయాల్లో కూడా పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. జిల్లాకే తలమానికంగా  మారిన బీచ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగానే రూ.5కోట్ల వరకు వెచ్చించి ఆ ప్రాంత లెవలింగ్‌ పనులు, సీసీరోడ్ల నిర్మాణంలాంటి పనులు చేపట్టింది. ప్రస్తుతం మరిన్ని పనులు చేపట్టాలని నిశ్చయించింది. 
 

ఇప్పటికే రూ.13కోట్లు  మళ్లీ రూ.20కోట్లు 
మచిలీపట్నం నుంచి మంగినపూడి బీచ్‌కు 10కిలోమీటర్లు ఉంటుంది. రహదారి సౌకర్యం ఉన్నా అంతంత మాత్రంగా ఉండడంతో మధ్యలో ఉండే ఆయా గ్రామాల ప్రజలతోపాటు పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన పాలకులు తొలుత రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే మచిలీపట్నం జిల్లా పరిషత్‌ సెంటరు నుంచి బీచ్‌వరకు ఉన్న రహదారిని నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించాలని భావించి రూ.13కోట్లు మంజూరు చేశారు. వాటితో మచిలీపట్నం, చిలకలపూడి మీదుగా ఎస్వీహెచ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంతం వరకు రహదారిని అభివృద్ధి చేశారు. ఇంకా దాదాపు 6కిలోమీటర్ల వరకు రోడ్డు విస్తరించాల్సి ఉంది. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీచ్‌ఫెస్టివల్‌ సమయంలో రద్దీ కారణంగా మంత్రులు సైతం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ప్రత్యక్షంగా చూసిన యనమల రోడ్డు నిర్మాణానికి ఎంత అవుతుందని అధికారులను ప్రశ్నించగా రూ.20కోట్లు అని చెప్పడంతో మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సెక్రటరియేట్‌నుంచి అధికారులకు ఆదేశాలు రావడంతో ఆపనిలో నిమగ్నమయ్యారు.

పర్యాటకంగా కూడా.. 
బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటకశాఖ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఆశాఖ ద్వారా రూ.5కోట్లతో బీచ్‌లో పలు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను ఆశాఖ ఉన్నతాధికారులు ఇటీవల బీచ్‌లో పర్యటించి కల్పించాల్సిన వసతులపై నివేదిక రూపొందించారు. దీని ప్రకారం ప్రాధాన్యత క్రమంలో అన్ని వసతులు కల్పించి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిశ్చయించారు. ఇప్పటికే వివిధ సంస్థల ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బైక్‌రైడ్‌, గుర్రపుస్వారీ తదితరాలున్నాయి. వాటికి మంచి ఆద]రణ లభించడంతోపాటు ఇటీవల నిర్వహించిన బీచ్‌ఫెస్టివల్‌ మరింత భరోసా కల్పించింది. ఈ వేడుకల్లో  ఖరీదైన హెలీరైడ్‌ లాంటివాటికి కూడా పర్యాటకులనుంచి అనూహ్య స్పందన వచ్చింది. బందరు బీచ్‌కు వసతులు అవసరమా అని అనుమానం వ్యక్తం చేసే పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు బీచ్‌ఫెస్టివల్‌ నమ్మకం కలిగించింది. అంతే అనుకున్నదే తడవుగా వివిధ వసతులు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. మరో రూ.3కోట్లతో వివిధ పనులు చేపట్లడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

ఆకట్టుకునేలా..ఆహ్లాదం పంచేలా 
ఆధునిక వసతులతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న బీచ్‌లను సందర్శించి అక్కడ ఉన్న వసతులు మంగినపూడిబీచ్‌లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తీరంలో కూర్చుని బీచ్‌ సోయగాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక కుర్చీలు,వివిధ క్రీడలు ఆడుకునే యువతకు కావాల్సిన వసతులు, సైకతశిల్పాలు రూపొందించేవారికి ప్రోత్సాహం.చిన్నపిల్లలకోసం క్రీడాప్రాంగణాలు తదితర సౌకర్యాలు కల్పించడానికి సిద్ధమయ్యారు. ఈ పనులకే రూ.2.50కోట్లు వెచ్చించనున్నారు. ఇలా అనేక వసతులతోపాటు ఆధునిక హంగులు కల్పించడంతోపాటు మచిలీపట్నం నుంచి బీచ్‌వరకు రహదారిని విస్తరించడం తదితర పనులు చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టారు.

* ప్రతిరోజూ బీచ్‌ను సందర్శిస్తున్న  పర్యాటకులు: 200-400 
* సెలవు దినాల్లో: 500-1000 
* పుణ్య స్నానాల   సమయంలో: 10,000-15,000 
బీచ్‌లోనే  అన్ని వసతులు

ప్రస్తుతం బీచ్‌లో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు లేక అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు, తాగునీరు లాంటి వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వేడుకలు, పండుగల సమయాల్లో రద్దీనిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప శాశ్వత ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయివేటు వ్యక్తులు ఏర్పాటుచేసిన రెస్టారెంట్లు, లాడ్జిలను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా బీచ్‌కు దూరంగా ఉండటంతో అసౌకర్యానికి గురవుతున్నారు. అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు బీచ్‌ ఆవరణలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో హైమాక్స్‌ విద్యుద్దీపాలు, దుస్తులు మార్చుకునే గదులు, తాగునీటి సౌకరర్యంకోసం వాటర్‌ప్లాంట్‌ ఇలా పలు సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సౌకర్యాలకు మరింత మెరుగులు అద్ది అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్నారు.

నెలలో  ఆమోదం 
ఆర్థికశాఖామంత్రి చొరవతో మంజూరైన రూ.20కోట్లతో చేపట్టే పనులకు సంబంధించి ప్రస్తుతం అంచనాలు రూపొందిస్తున్నాం. త్వరలోనే ఆ నిధులతో బీచ్‌రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.దీంతోపాటు బీచ్‌లో చేపట్టనున్న రూ.2.50కోట్ల పనులకు నెలలో ఆమోదం రానుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. బీచ్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేయడానికి పర్యాటకశాఖ కూడా ముందుకువచ్చింది. వసతులు కల్పించడమే కాకుండా వాటిని పర్యాటకులు సద్వినియోగం చేసుకునేలా సెలవుదినాల్లో ఆనందాల ఆదివారం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తున్నాం.

- కొల్లు రవీంద్ర, మంత్రి
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...