Jump to content

pattiseema


Recommended Posts

trial run annaru ga (to check canal banks in light of recent lining/expansion works). full capacity release cheyyalante inko 2-3 days padutundemo.

 

edo okati we had so many stops in polavaram canal everywhere stop chesukunta veltaru full capacity chesi ekada anna leaks unaya ani chustaru

 

slow ga water will move to krishna

 

this year is key rains baga padatayi so we can give more water to rayalaseema also possible this time.

 

this year isthe it will boost tdp reputation in rayalaseema

Link to comment
Share on other sites

గోదారమ్మ... కృష్ణమ్మను కలిసేందుకు ఈ సంవత్సరం కూడా బయలుదేరింది. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసేందుకు దోహదపడ్, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి వరుసగా రెండో ఏడాది కృష్ణా డెల్టాకు సాగు నీరందించేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ సిద్ధమైంది. సోమవారం ఈ పథకంలోని 24 పంపుసెట్లకూ ట్రయల్‌ రన్‌ నిర్వచించారు.

 

గోదావరి ప్రస్తుత నీటి మట్టం 14.9 అడుగులు ఉంది. పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే 14 అడుగుల మట్టం సరిపోతుంది. ప్రస్తుతం గోదావరి నుంచి 2,400 క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని కృష్ణా డెల్టాకు పంపితే.. ఖరీఫ్‌ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మంచి రోజు కావడంతో పట్టిసీమలోని 24 పంప్‌ సెట్లనుంచి నీటిని ఎత్తిపోస్తారు. గోదావరి మట్టం పెరిగితే.. పట్టిసీమ నుంచి ఎత్తిపోతలను కొనసాగిస్తారు. ఫలితంగా కృష్ణా డెల్టా పరిధిలో 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగు నీరందుతుంది.

భారతదేశ చరిత్రలో నదుల అనుసంధానం జరగాలని ఎందరో కోరుకున్నారు. కానీ ఎక్కడా సాధ్యంకాలేదు. ఇక్కడ మాత్రం కేవలం ఏడాదిలోపే పట్టిసీమ పూర్తయ్యింది. సరికొత్త రికార్డు నమోదైంది. ఇది చంద్రబాబు దూర దృష్టి, పరిపాలనా అనుభవానికి నిదర్సనం .

Link to comment
Share on other sites

Ilantivi live kuda ravatla New channels lo..konchem TDP publicity wing ki cheppandi thelsina vallu evarina..

 

 

idi trail run brother if u give live now if any small leak unte dane 24hrs vestaru adi manaki avasrama

Link to comment
Share on other sites

కృష్ణమ్మ దిశగా గోదారి పరవళ్లు

పట్టిసీమ నుంచి ఈ ఏడాది ముందే నీళ్లు

జులైలో కృష్ణా డెల్టా నారుమళ్లకు నీళ్లిచ్చేందుకు అవకాశం

9 పంపుల ద్వారా ప్రస్తుతం సరఫరా

ఈనాడు - అమరావతి; పోలవరం - న్యూస్‌టుడే

19ap-main11a.jpg

గోదారి నీరు ఈసారి కాస్త ముందుగానే కృష్ణమ్మ దిశగా బిరబిరా తరలిపోతోంది. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటం.. స్థానికంగాను, ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలో ప్రవాహాలు పెరగడం, సముద్రంలోకి నీటిని వదిలేయాల్సిన పరిస్థితి రావడంతో ఆ జలాలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజికి మళ్లిస్తున్నారు. తొలుత సోమవారం పట్టిసీమ నుంచి ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేయాలనుకున్నారు. నదిలో తగినంత ప్రవాహం ఉండటంతో 9 పంపుల ద్వారా దాదాపు 3,150 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా మళ్లించడం ప్రారంభించారు. ఇది ట్రయల్‌ రన్‌ కాదని, ఇక నిరంతరం పంపులు పనిచేయిస్తూ నీటిని కృష్ణమ్మకు మళ్లించడమేనని పోలవరం కుడి కాలువ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌ ఈనాడుకు చెప్పారు. ఈ సంవత్సరం 80 నుంచి 100 టీఎంసీల నీటిని కృష్ణాకు తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుడికాలువ వెంబడి ఎక్కడా నీటి ప్రవాహనికి అవరోధం లేదని, ఆరో కిలోమీటరు(గుడ్డిగూడెం) రెగ్యులేటర్‌ వద్ద సోమవారం రాత్రికి నీటిని నిలిపి మంగళవారం ఉదయం దిగువకు వదులుతామని చెప్పారు. గోదావరి వరద జలాలతో కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరందించేందుకు పట్టిసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పట్టిసీమ నుంచి చాలా ముందుగానే నీటిని ఎత్తిపోయడం మొదలుపెట్టారు. గతేడాది జులై 7న పట్టిసీమ నుంచి నీళ్లు ఇవ్వడం ప్రారంభించినా పూర్తి స్థాయిలో జులై 14 నుంచి ఎత్తిపోశారు. ఈ ఏడాది జూన్‌ మూడో వారంలోనే గోదావరి నుంచి నీటిని తీసుకుంటున్నారు. డెల్టా అవసరాలు తీరాకే బ్యారేజీ నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని పట్టిసీమ నుంచి మళ్లిస్తున్నారని గోదావరి డెల్టా ఎస్‌ఈ రాంబాబు ఈనాడుతో చెప్పారు.

19ap-main11b.jpg

గోదావరిలో 14,351 క్యూసెక్కుల ప్రవాహాలు

గోదావరిలో సోమవారం ఉదయానికి పైనుంచి 14,351 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఇందులో సీలేరు నుంచి వస్తున్నది 251 క్యూసెక్కులే. మిగిలినదంతా ఇతరత్రా ప్రవాహాల నుంచి చేరుతున్నదే. ఎగువన గోదావరిలో నీరు ఎర్రబడిందని, ఇది తాజా వర్షాలకు గోదావరిలోకి చేరిన ప్రవాహాల వల్లేనని అధికారులు చెబుతున్నారు. గోదావరిలోని తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలకు 9,200 క్యూసెక్కులు పోను మిగిలిన 4919 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్నారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.165 మీటర్లు ఉన్నట్లు చెబుతున్నారు. గోదావరి డెల్టాలో ఇంతవరకు జూన్‌ నెలలో నారుమళ్ల నిమిత్తం 12 టీఎంసీల నీరు వినియోగించారు. జులై నెలలో 20 టీఎంసీలకు మించి నీరు అవసరమవుతుందని లెక్కిస్తున్నారు. గత చరిత్ర ప్రకారం జులైలో వరద నీరే ఉంటుంది. ఈ మేరకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు

జులై నుంచి కృష్ణా నారుమళ్లకు నీళ్లు...

పట్టిసీమ నుంచి ప్రస్తుతం నీటి విడుదల ప్రారంభమైనా ప్రకాశం బ్యారేజి చేరేందుకు 177 కిలోమీటర్ల మేర కుడి కాలువలో ప్రయాణించాల్సి వస్తుంది. మధ్యలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రవాహాలు సాగితే జూన్‌ 25కల్లా ప్రకాశం బ్యారేజికి గోదారి నీరు చేరుతుంది. ఈ మధ్యలోనే కొంత నీరు మోటార్లు పెట్టి తోడేసే అవకాశం ఉంది. ఈ లోపు గోదారిలో ప్రవాహాలు మరింత పెరిగి పట్టిసీమ పంపులు 24 పనిచేయించి నీరు వదిలితే ప్రకాశం బ్యారేజికి చేరుతుంది. జులై ఒకటి నుంచి కృష్ణా కాలువల ద్వారా నారుమళ్లకు నీటిని అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యారేజిలో 1.8 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. పులిచింతలలో 1.6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గోదారి నీటితో ప్రకాశం బ్యారేజి నిండాక కాలువలకు సాగునీరు అందిస్తారు. ఈ ఏడాది గోదావరి, కృష్ణా డెల్టాలు రెండుచోట్లా నారుమళ్లు చాలా ముందుగానే పూర్తయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Godavari Water entering krishna district

live in ETv Andhrapradesh

 

UMA will attend the event and offer prayers

Link to comment
Share on other sites

veellu pattiseema vishayam lo peekallothu munigaaru aannaai, inkaa donga kanneelllo pattiseema neello yevarkee thedaa kuudaa theleetallaa :)

Adhey kada bro.... this year and next year is key w.r.t pattiseema.... seema ki water ivvagaligithey chaalu
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...