Jump to content

AP ports


Recommended Posts

  • 3 weeks later...
  • Replies 153
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...

విశాఖ నుంచి నేపాల్‌!

ప్రయోగాత్మకంగా సరకు రవాణా

సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన రైలు

vsp-sty2a.jpg

విశాఖపట్నం: రైల్వే పంథా మారుతోంది. సేవల్ని కొనసాగిస్తూనే ఆర్థికంగా మరింత బలోపేతమవడానికి ప్రయత్నిస్తోంది. స్టేషన్‌ పునరుద్ధరణ పేరుతో వాణిజ్య ప్రక్రియను ప్రయివేటుకిస్తోంది. రైల్వే స్థలాలను ప్రైవేటీకరించి ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఇప్పటికే అడుగులు వేస్తోంది. తాజాగా నేపాల్‌కు రవాణా అవకాశం దక్కించుకున్న వాల్తేరు డివిజన్‌.. దాన్ని కొనసాగించేందుకు కట్టుదిట్టమైన చర్యలను మొదలుపెట్టింది. మరోపక్క సరుకు రవాణాకు గట్టి పోటీదారుగా ముందుకొస్తోంది.

నేపాల్‌కు రవాణామార్గాలు

1. విశాఖ - బీర్‌గంజ్‌

2. విశాఖ - జోగ్‌బనీ

సరకు రవాణా ఆదాయం..

2016-17లో రూ. 5,864 కోట్లు

తరలించిన సరుకు - 52.70 మిలియన్‌ టన్నులు

ఒక రేక్‌కు (రైలుకు) తరలే కంటైనర్లు - 90

కోల్‌కతాలో ఇబ్బంది కలిసొచ్చింది..

కోల్‌కతా పోర్టులో సరకు రవాణాలో విపరీతమైన రద్దీ. సరకును నౌక నుంచి వచ్చిన కంటైనర్లను పట్టాలెక్కించేందుకే నానా ఇబ్బందీ పడాల్సి వస్తోంది. పైగా కూలీల సమస్య ఎక్కువ. నేపాల్‌వైపుగా కంటైనర్లను తరలించే ఏజెన్సీలకు ఇది తలనొప్పిగా మారింది. వారికి ప్రత్యామ్నాయంగా విశాఖ పోర్టు కనిపించింది. నౌకలను ఇక్కడి వరకు తీసుకొచ్చి రైలు మార్గం ద్వారా నేపాల్‌కు తరలించాలన్నది వారి ఆలోచన.

ఇద్దరికీ లాభం..

కోల్‌కతా నుంచి నేపాల్‌కు దూరం 700 కిలోమీటర్లు. యూరప్‌లోని వివిధ దేశాల నుంచి వస్తువులు నేపాల్‌కు సముద్రమార్గం ద్వారానే రవాణా చేస్తుంటాయి. ఈ నౌకలు శ్రీలంకను దాటి కోల్‌కతాకు వెళ్లాలంటే ఎక్కువ దూరం. అదే మార్గమధ్యలో ఉన్న విశాఖలో దిగుమతి చేసి రైలు మార్గం ద్వారా ఆ దేశానికి తరలించడం సులువనేది ఏజెన్సీల అభిప్రాయం. పైగా విశాఖ నుంచి నేపాల్‌కు సుమారు 1400 కిలోమీటర్ల దూరం. దీనివల్ల రవాణా ఖర్చు సైతం దిగి వస్తుందని యోచిస్తున్నాయి. ఇది అటు నేపాల్‌ ఏజెన్సీలకు, ఇటు వాల్తేరు డివిజన్‌కు లాభదాయకంగానే ఉంది. రవాణా బాధ్యతల్ని విశాఖలోని కాన్‌కర్‌ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ తీసుకుంది.

ఈ రవాణాకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో ఒప్పందాలు కుదరలేదు. విశాఖ నుంచి రైలుమార్గం ద్వారా సరుకులు ఎంత నమ్మకంగా రవాణా అవుతున్నాయన్నదానిపైనే ఇదంతా ఆధారపడి ఉందని ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే నేపాల్‌ నుంచి పలువురు ప్రముఖులు వాల్తేరు డివిజన్‌ అధికారులతో, కాన్‌కర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెలలో ప్రయోగాత్మకంగా 50 కంటైనర్లతో ఒక గూడ్సురైలు విశాఖ నుంచి నేపాల్‌కు సరుకు తీసుకెళ్లింది. ఇందులో పెద్దఎత్తున శనగలు, నూనె ఉన్నాయి. మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, భద్రంగా సరుకు తరలిందని నివేదికలు వచ్చాయి. ఇదే తరహాలో మరో రెండు, మూడునెలలపాటు రవాణా చేశాక పూర్తిస్థాయిలో విశాఖ మీద నమ్మకం పెట్టుకుంటామని నేపాల్‌తరపు ప్రతినిధులు వాల్తేరు రైల్వే అధికారులకు చెప్పారు.

వేగం.. రవాణా నాణ్యత..

విశాఖ పోర్టు నుంచి నేపాల్‌లో గమ్యస్థానానికి సరకును సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత రైల్వేదే. ప్రస్తుతం కాన్‌కర్‌.. మార్స్క్‌ కంటైనర్‌ సంస్థతో తొలిసారిగా నేరుగా నేపాల్‌కు సరుకును భద్రంగా తరలించే ప్రయత్నం చేస్తోంది. కంటైనర్లలో పూర్తి భద్రతావ్యవస్థ ప్రమాణాల్ని పాటిస్తోంది. మార్గమధ్యలో ఎక్కడా కంటైనర్లు కదలడంగానీ, లాక్‌ వూడిరావడంగానీ ఇవేవీ లేకుండా కట్టుదిట్టచర్యలు తీసుకుంది. సమయపాలనపరంగా రైల్వే మార్గాల్లో అనుమతులూ తీసుకుంది. ఈ నెలలో రవాణా అయిన సరుకును నేపాల్‌ సరిహద్దులోని బీర్‌గంజ్‌ స్టేషన్‌ వరకు తరలించి, అక్కడి నుంచి రహదారి మార్గం ద్వారా గమ్య స్థానానికి చేరవేశారు. బీర్‌గంజ్‌మార్గంతో పాటు విశాఖ - జోగ్‌బనీ మార్గాన్నీ ఈ రవాణా కోసం ఎంపిక చేశారు. వచ్చే రెండు మూడు నెలల్లో సరుకు రవాణాపై నేపాల్‌ ఏజెన్సీలు సంతృప్తి చెందితే.. ఆ తర్వాత నెలకు 10 నుంచి 25 రేక్‌లు (గూడ్స్‌ రైళ్లు) బయలుదేరే అవకాశముంటుంది. ఒక్కో రేక్‌లో 90 కంటైనర్లు ఉంటాయని కాన్‌కర్‌ మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ జీఎం యెల్వేందర్‌యాదవ్‌ చెప్పారు.

పెద్ద కంపెనీలతో డీల్‌..

విశాఖ నగరం పార్సిల్‌, కొరియర్‌ సర్వీసుల హబ్‌గా మారబోతోంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇక్కడి నుంచి వివిధ రకాల పార్సిళ్లు తరలేలా పలు కంపెనీలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. దీన్ని తమకు లాభదాయకంగా మలచుకోవాలని వాల్తేరు డివిజన్‌ భావిస్తోంది. దీంతో పార్సిల్‌, కొరియర్‌ కంపెనీలతో చర్చలు మొదలుపెట్టింది. వారికి రాయితీలతో కూడిన ఆఫర్లను కూడా ప్రకటిస్తోంది. చిన్న పార్సిల్‌లను సైతం సకాలంలో అందించేలా రైల్వే మారుతోందని అధికారులు చెబుతున్నారు. రోడ్డుమార్గం కన్నా వేగంగా అందేలా చర్యలూ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు డీఆర్‌ఎం ఎం.ఎస్‌.మాథుర్‌ తెలిపారు. సరుకురవాణా ద్వారా ఇప్పుడున్న ఆదాయానికి మించి అన్నింటిపరంగా 20శాతం మెరుగుదల చూపాలని అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు.

Link to comment
Share on other sites

  • 2 months later...
రూ.2,500 కోట్లతో ఎస్సార్‌ ఎల్‌ఎన్‌జి టెర్మినళ్లు
26-09-2017 02:01:18
 
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): బహుళజాతి సంస్థ ఎస్సార్‌ గ్రూపు రూ.2500 కోట్లతో రెండు ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఎస్సార్‌ పోర్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. వీటిని తూర్పు, పశ్చిమ తీరాల్లో చెరొకటి ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం 18 నెలల్లోనే వీటిని పూర్తిచేసి, 25 నుంచి 50 లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జిని అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎల్‌ఎన్‌జి పెద్దఎత్తున ఉపయోగించే వినియోగదారులున్న ప్రాంతంలోనే టెర్మినళ్లు ఏర్పాటుచేస్తే లాభదాయకమని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇదిలా వుండగా విశాఖపట్నం పోర్టులోని ఐరన్‌ఓర్‌ బెర్తు కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యాన్ని 130 లక్షల టన్నులకు పెంచుతున్నామని, ఇందుకోసం రూ..830 కోట్లు పెట్టుబడి పెట్టామని వివరించారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...
పట్టాలెక్కుతున్న సాగరమాల 
పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో కదలిక 
దశల వారీగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు 
ఈనాడు, కాకినాడ 
eag-top1a.jpg

కాకినాడ కేంద్రంగా సాగరమాల కింద ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులు దశలవారీగా పట్టాలెక్కుతున్నాయి.2018-19 నాటికి ఎక్కువ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.కాకినాడ పోర్టుతో రోడ్డు, రైల్వే అనుసంధానం కోసం నాలుగు వరుసల రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం, వస్తు రవాణాకు డెడికేటెడ్‌ రైల్వే లైనుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.2025 నాటికి కాకినాడ పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా పనులు ప్రతిపాదించారు. కాకినాడ పోర్టులో 2020-25 నాటికి కోస్టల్‌ఫుడ్‌ ఎక్స్‌పోర్టు బెర్త్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.దీనిని కాకినాడకు బదులు ఎస్‌.యానాం వద్ద ఏర్పాటు చేయాలని చివరకు నిర్ణయించారు. ఈ పనులను రూ.150 కోట్ల అంచనాలతో పోర్టు ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.కాకినాడ యాంకరేజి పోర్టులో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫీజుబులిటీ నివేదిక పంపారు. 2018-19 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీని అంచనా రూ.90 కోట్లు కాగా పోర్టు ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తారు. ఎన్‌ఎఫ్‌సీఎల్‌ పశ్చిమం వైపు నుంచి కొత్త బైపాస్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్‌ సిద్ధమైంది. 2018-19 నాటికి బైపాస్‌ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. జాతీయ రహదారుల సంస్థ ద్వారా రూ.70 కోట్లతో దీనిని నిర్మించనున్నారు.దుమ్ములపేట వద్ద ఆర్వోబీ నిర్మాణం, కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు, కాకినాడ యాంకరేజి పోర్టు వద్ద ఆర్వోబీల నిర్మాణాన్ని చేపడతారు. రూ.80 కోట్లతో ఎన్‌హెచ్‌ ద్వారా 2018-19 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ దశలో ఉంది.కుంభాభిషేకం వద్ద పైవంతెన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించారు. 2019-20 నాటికి దీనిని పూర్తి చేయాలని సంకల్పించారు కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి ఉప్పాడ బీచ్‌ రోడ్డును నాలుగు లైన్లుగా నిర్మించనున్నారు. దీనిని ఎన్‌హెచ్‌-16కు అనుసంధానం చేస్తారు.కత్తిపూడి నుంచి కాకినాడ అచ్చంపేట కూడలి వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రాజానగరం నుంచి కాకినాడ పోర్టుకు ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఏపీఆర్‌డీసీ ద్వారా రూ.600 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ల దశలో ఉన్నాయి.

నిరంతరం సమీక్షిస్తున్నాం 
సాగరమాల ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ పోర్టుల తరఫున నిరంతరం సమీక్షిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చీఫ్‌ సెక్రటరీ స్థాయిలో ప్రతి నెలా సమీక్ష జరుగుతోంది. రైల్వే, జాతీయ రహదారుల సంస్థ, పర్యాటక శాఖ, ఏపీఆర్‌డీసీ, మత్స్య శాఖలు, ఇతర ఏజెన్సీలను సమన్వయం చేసుకుని వారు చేయాల్సిన పనులపై పర్యవేక్షిస్తున్నాం. దశల వారీగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

-డాక్టర్‌ కోయ ప్రవీణ్‌, డైరెక్టర్‌,
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Gadkari gaadi binaami or Adaani Gaadu Leni projects ki automatic gaa queries and environment blockings thappav gaa

 

simple gaa polavaram ki funding lo issues R&R payments ivvaru - Pakistan states pittinaaa central gov lo pushpams ki smell vasthundi polavaram aapesthaaru 

Link to comment
Share on other sites

Vpt vallu officers antha waste fellows. 3 years ga port lo oka pvt company ki contract works chesamu sudden ga funds levu ani apesaru. Maku chala evvali,port vallu involve ne kaledhu 2 years nunchi aa place alagane undhi kotha vallaki tenders kuda evvala assala irresponsible vpt officers

Link to comment
Share on other sites

1 hour ago, sagarkurapati said:

Vpt vallu officers antha waste fellows. 3 years ga port lo oka pvt company ki contract works chesamu sudden ga funds levu ani apesaru. Maku chala evvali,port vallu involve ne kaledhu 2 years nunchi aa place alagane undhi kotha vallaki tenders kuda evvala assala irresponsible vpt officers

krishna babu ni  edo podusudu gadu antaru janalau,,,

Link to comment
Share on other sites

హడలిపోతున్నారు... 
మాఫియా ధాటికి మూతపడుతున్న పరిశ్రమలు 
కఠినంగా వ్యవహరించలేకపోతున్న పోలీసులు 
కాకినాడ నుంచి కృష్ణపట్నం పోర్టునకు తరలివెళుతున్న వ్యాపారులు 
ఈనాడు, కాకినాడ 
eag-top1a.jpg

కాకినాడ తీరంలో ఆయిల్‌ మాఫియా ఆగడాలకు విసిగిపోతున్న ఆయిల్‌ పరిశ్రమల యాజమాన్యాలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. తరచూ ఆయిల్‌ దొంగతనాలు చోటు చేసుకుంటుండడం, వ్యవస్థీకృతమైన మాఫియా ఆగడాలను పోలీసులు నిలువరించలేకపోవడం, కొందరి ఆధిపత్యం కారణంగా భారమైన రవాణా ఛార్జీలను మోయలేక వ్యాపారులు కృష్ణపట్నం వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు. రెండు లక్షల టన్నుల ఆయిల్‌ దిగుమతయ్యే కాకినాడలో ఇప్పుడు కేవలం 70 వేల టన్నుల ఆయిల్‌ మాత్రమే దిగుమతి అవుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వంట నూనెల తయారీకి సంబంధించి 11 ఆయిల్‌ పరిశ్రమలుంటే అందులో ఇటీవల కాలంలో ఆరు పరిశ్రమల వరకు మూతపడ్డాయి. మిగిలిన పరిశ్రమలు అదే బాటలో ఉన్నాయని ఓ ఆయిల్‌ వ్యాపారి ‘ఈనాడు’కు వివరించారు.

ప్రధానంగా రవాణాలో మాఫియా ఆగడాలను నిలువరించలేకపోవడం, భద్రత లేకపోవడంతో ఎగుమతి, దిగుమతి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ట్యాంకర్ల ఆగడాలను భరించలేక పైపులైన్ల ద్వారా ఆయిల్‌ రవాణాకు చర్యలు చేపట్టినా వాటికీ రంధ్రాలు పెట్టి దొంగిలించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్లను కాపాడుకునేందుకు ఒక్కో ఆయిల్‌ కంపెనీ తరఫున ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించుకుని 24 గంటల పాటు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ గస్తీ బృందాలను సైతం మాఫియా లోబరుచుకోవడం, భయపెట్టడం ద్వారా వారి కార్యక్రమాలను యథేచ్చగా సాగిస్తున్నారు. ఇటీవల కాకినాడ గ్రామీణం పరిధిలో పైపులైనుకు రంధ్రం చేసి ఆయిల్‌ చోరీ చేసిన ఘటనపై వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మాఫియాకు మద్దతుగా ఉన్న నేతలు నేరుగా రంగంలోకి దిగి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారులపై ఒత్తిడి చేశారంటే వారి సంబంధాలు ఎంతలా వేళ్లూనుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.

కృష్ణపట్నం వైపు చూపు... 
1999 నుంచి కాకినాడలో ఆయిల్‌ మాఫియా ఆగడాలు మొదలయ్యాయి. ప్రైవేటు పోర్టులొచ్చాక సరకు రవాణాలో ట్యాంకర్ల ఆధిపత్యం ఉండేది. దాన్నుంచి బయటపడేందుకు ఈ ప్రాంతంలో వంటనూనెల ఆయిల్‌ పరిశ్రమలను స్థాపించిన వ్యాపారవేత్తలు పైపులైన్ల ద్వారా ఆయిల్‌ రవాణాకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయిల్‌ మాఫియా ఆగడాలు పెరగడం, యూనియన్ల గొడవల వ్యవహారాల్లో హత్యలు సైతం చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారులు ఈ వివాదాల్లో తలదూర్చి మరక అంటించుకున్నారు. గతంలో జిల్లాలో పనిచేసిన ఎస్పీకి, మరో పోలీసు అధికారికి మధ్యన తలెత్తిన ఆయిల్‌ వివాదం అప్పట్లో పోలీసు శాఖ ప్రతిష్ఠను మసకబార్చింది. ఆయిల్‌ దొంగ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల ఆగడాలను నిలువరించడంలో పోలీసులు విఫలమవ్వడం, మాఫియాను ఎదుర్కొనేందుకు మెతక వైఖరి అవలంబిస్తుండటం, ఆయిల్‌ దొంగలకు తుని నుంచి కాకినాడ వరకు నేతల సహకారం పుష్కలంగా ఉండటంతో వారికి అడ్డన్నది లేకుండా పోయింది. ఈ పరిస్థితులతో కాకినాడ పోర్టు కేంద్రంగా ఆయిల్‌ వ్యాపారం చేయాలనుకుంటున్న చాలామంది వ్యాపారులు తమ కార్యకలాపాలను తగ్గించుకుని కాకినాడ నుంచి కృష్ణపట్నం వైపు వెళుతున్నారు.

eag-top1b.jpg

కేసులొస్తే కాసుల పంటే... 
ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయిల్‌ మాఫియాలో తలదూర్చుతున్న పోలీసులకు ఆయిల్‌ మాఫియా అందించే మామూళ్లు కోట్లనే ఉంటున్నాయనే ప్రచారం ఉంది. 20 సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో మధ్య మధ్యలో కొంత బ్రేక్‌ పడుతున్నా ఆయిల్‌ దొంగ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఆయిల్‌ దొంగతనాలను నిలువరించే విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. దీని వెనుకాల రాజకీయ నేతల హస్తం ఉండటం, తుని నుంచి కాకినాడ వరకు నేతలకు మామూళ్లు ముట్టడంతో వారి అండదండలతో ఆయిల్‌ మాఫియా చెలరేగిపోతోంది. గత రెండేళ్ల నుంచి ఈ ఆగడాలు మరింత పెరిగాయని పోలీసు అధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు.

కఠిన చర్యలేవీ... 
పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే కాకినాడలో ఆయిల్‌ మాఫియా కార్యక్రమాలే ఉండవు. అప్పుడప్పుడూ ఏదో ఒక ఒత్తిడితో ఆయిల్‌ దొంగతనాల మీద కేసులు నమోదు చేస్తున్నా పోలీసులు ఆ తరువాత ఆయిల్‌ మాఫియా మూలాలను ఛేదించడంలో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయిల్‌ దందాలో జరిగిన అరెస్టులు, కేసు విచారణలో పోలీసుల ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై విమర్శలకు తావిస్తోంది. గత నెల 28న ఆయిల్‌ దొంగతనంపై పోలీసులు కొంతమంది అరెస్టు చూపించారు. అందులో పైపునకు రంధ్రం చేసిన వారిని, లారీ డ్రైవర్లను, సంపు స్టోరేజీ నుంచి అమ్మిన వారిని, ఆఖరికి సంపు స్టోరేజీ గోదాం అద్దెకిచ్చిన వ్యక్తిని కూడా అరెస్టు చేసిన పోలీసులు దొంగ ఆయిల్‌ కొనుగోలు చేసిన వ్యాపారిని మాత్రం వదిలేశారు. ఈ పరిణామం పోలీసులు నిస్పక్షపాతంగా కేసును విచారణ చేయడం లేదనే ఆరోపణలు ఎదుర్కొనేందుకు అవకాశం కల్పించినట్లైంది. స్థలం అద్దెకు ఇచ్చిన వ్యక్తి కేసులో చిట్టచివరి వ్యక్తి అవుతాడు. వైకేరియస్‌ లయబిలిటీ కింద అతనిపైన కేసు నమోదు చేసి విచారణ చేసే అధికారం పోలీసులకు ఉంది. నేరం చేయాలనే దృఢ సంకల్పం ఉన్నట్లు (మెన్సిరియా)గా రుజువు చేస్తే అతన్ని కేసులో ప్రధాన ముద్దాయిగా పేర్కొనే అవకాశం ఉంది. అద్దెకిచ్చిన వ్యక్తిపై మెన్సిరియాకి సంబంధించి దృఢమైన సంకల్పంతో ఆయిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులో కూడా పెట్టలేకపోయారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ ప్రధాన ముద్దాయి అరెస్టు చూపకుండా ముందస్తు బెయిల్‌ తెచ్చుకునేందుకు అవకాశం కల్పించి చిన్న వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా కేసును నీరుగార్చుతున్నారనే అపవాదు పోలీసుల మీద పడింది.

ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు... 
ట్యాంకర్ల ద్వారా రవాణా చార్జీలు భరించలేకపోతున్న వ్యాపారులు కాకినాడ పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. కార్గో రవాణా గతంతో పోల్చితే ఇప్పుడు ఆయిల్‌ దిగుమతి తగ్గుతూ వస్తోంది. కొంత మంది ట్యాంకర్ల ఆగడాలను భరించలేక పైపులైన్లు వేసుకుని వ్యాపారం చేస్తున్నారు. అక్కడ కూడా దొంగతనాలు పెరగడంతో ఇక్కడ నుంచి కృష్ణపట్నం వైపు వెళ్లిపోతున్నారు. 1999లో ప్రైవేటు పోర్టు వచ్చే సమయంలో కాకినాడ కేంద్రంగా రూ. నాలుగు వేల కోట్ల ఆయిల్‌ వ్యాపారం జరిగేది. ఇప్పుడు అది రూ. 400 కోట్లకు పడిపోయింది. మా పరంగా అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నాం.

- డాక్టర్‌ కోయప్రవీణ్‌, డైరెక్టర్‌ ఏపీ పోర్ట్స్‌, కాకినాడ
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఊరించి... ఉసూరుమనిపించి..! 
బారువ ఓడరేవు ప్రాజెక్టుకు చుక్కెదురు 
సాగరమాల నుంచి జారిపడిన బారువ 
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును పట్టించుకోని వైనం 
న్యూస్‌టుడే- సోంపేట 
skl-top2a.jpg

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సాగరమాల ప్రాజెక్టు నుంచి బారువ అదృశ్యం కావడంపై స్థానికులు తీవ్ర  నిరసన వ్యక్తంచేస్తున్నారు. రూ.48 కోట్లకుపైగా నిధులతో బారువతీరంలో వివిధ నిర్మాణాలు చేపడితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయనుకొన్న ఆశలు అడియాశలయ్యాయి. సాగరమాలలో భాగంగా బారువ తీర ప్రాంతానికి గత వైభవం వస్తుందన్న ఎదురుచూపులు ఎండమావిగా మారాయి. తీర ప్రాంతంలో రూ.వంద కోట్లతో నిర్మించతలపెట్టిన మూలపొలం బ్లాక్‌టైగర్‌ రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏడేళ్లుగా ఊరిస్తుండగా.. కేంద్రప్రభుత్వం ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాగరమాల చేజారడంతో స్థానికులు ఉసూరుమంటున్నారు. సోంపేట తీరంలో పర్యటక, రవాణా, అన్నివిధాలా అభివృద్ధికి ఉన్న అవకాశాలు సద్వినియోగపడకపోవడంపై అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతోనే వేలాది మంది యువత వలసలుపోతున్నారు. సాగరమాల ప్రాజెక్టు ముందుగా బారువ నుంచే మొదలవుతుందని మత్స్యకారులతో పాటు అన్నివర్గాల ప్రజలు ఆశలు పెంచుకోగా, ఇప్పుడు బారువ ప్రసక్తి లేకుండా ఈ ప్రాజెక్టు కార్యాచరణకు సమాయత్తమవుతుండడంతో వెనుకబడిన ప్రాంతాల ప్రగతి హామీలకే పరిమితం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

టైగర్‌ రొయ్య ఉత్పత్తికేంద్రం... భూసేకరణకే పరిమితం 
రూ.వంద కోట్లతో మూలపొలం వద్ద నిర్మించతలపెట్టిన టైగర్‌ రొయ్య పిల్లల ఉత్పత్తికేంద్రం భూసేకరణకే పరిమితమైంది.  బారువ తీరం సమీపంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించి వంద ఎకరాల పంట పొలాలను జాతీయ మత్స్యశాఖాభివృద్ధి సంస్థ సేకరించింది. ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిర్మించతలపెట్టిన టైగర్‌ రొయ్య పిల్లల ఉత్పత్తి, పరిశోధన కేంద్రానికి మౌలిక వసతుల పేరిట పాత జాతీయరహదారి నుంచి రూ.10కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడంతో మెరుగైన జీవనోపాధి పేరిట భూములు ధారాదత్తం చేసిన రైతులు ఉపాధి  లేక వలస పోతున్నారు. సాగరమాల ప్రాజెక్టులో బారువ తీరం అభివృద్ధి చెందితే రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలపొలంలో రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తారన్న ఆశతో తీరప్రాంత ప్రజలు ఉన్నారు. అయితే ఎలాంటి కారణాలు చూపకుండానే సాగరమాల నుంచి బారువ ప్రాజెక్టును తప్పించడంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండూ అందీ అందని ద్రాక్షగా మారాయని స్థానికులు వాపోతున్నారు.

ఓడరేవుగా ప్రసిద్ధి పొందినా ప్రాజెక్టులో దక్కని స్థానం 
రెండో ప్రపంచయుద్ధం ముందువరకు రాష్ట్రంలో ప్రధాన ఓడరేవుగా బారువతీరం ఎంతో ప్రసిద్ధిచెందింది. రంగూన్‌తో పాటు పలు విదేశాలతో వర్తక, వాణిజ్య అంశాలు నిర్వహిస్తూ బారువ ఓడరేవు ప్రాధాన్యం పొందింది. 1917 జులై 1న చిల్కఓడ ఇక్కడే అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ తరువాత 1936 వరకు ఓడరేవు కార్యకలాపాలు నిర్వహించి కాలక్రమేణా రవాణా, ఇతర అంశాలకు గండి పడడంతో ఓడరేవు తన ఉనికిని కోల్పోయింది. 1766 నుంచి 1936 వరకు బారువ ఓడరేవు ఓ వెలుగు వెలిగింది. ఈనేపథ్యంలో బారువతీరం అభివృద్ధి విషయమై పలుమార్లు ప్రతిపాదనలు చేయడం, విభిన్న కారణాల వల్ల అది మూలనపడింది.  ఆరేళ్లక్రితం రూ.3 కోట్ల కేంద్రప్రభుత్వ నిధులతో పర్యటక కాటేజీలు, ఇతర నిర్మాణాలను చేపట్టడంతో గత వైభవానికి మార్గం సుగమమైంది. కేంద్ర ఉపరితల జలరవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో బారువతీరంలో నిర్మించిన లైట్‌హౌస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈనేపథ్యంలో సాగరమాలలో భాగంగా బారువతీరంలో జెట్టీ నిర్మాణంతో పాటు పర్యటక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని తెలిసి స్థానికులు ఆశలు పెంచుకున్నారు. ఇక్కడ జెట్టీ నిర్మాణం చేపడితే టెక్కలి డివిజన్‌తో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల పరంగా లక్షలమందికి ఉపయోగపడే పరిస్థితి. రాష్ట్రంలో 9 సాగరమాల ప్రాజెక్టుల్లో భాగంగా జిల్లాలో బారువ, కళింగపట్నం ఉండడంతో అన్నివిధాలా ప్రయోజనం చేకూరుతుందని భావించారు. ప్రస్తుతం కళింగపట్నం మాత్రమే సాగరమాలలో ఉండడంతో టెక్కలి డివిజన్‌ ప్రాంత వాసులు ఉసూరుమంటున్నారు.

ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు 
బారువ తీరం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారు. సాగరమాలలో భాగంగా బారువ, కళింగపట్నం అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందజేస్తామని పలుమార్లు నాతో చెప్పారు. బారువను ఎందుకు తప్పించాల్సి వచ్చిందనే అంశాన్ని పరిశీలించి భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై ఆయన ఓ నిర్ణయం తీసుకొంటారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల సహకారంతో సాగరమాలలో బారువ ప్రాజెక్టు ఉండేలా నావంతు కృషి చేస్తాను.

- డాక్టర్‌ బెందాళం అశోక్‌, ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...

కృష్ణపట్నంలో స్నోమాన్‌ లాజిస్టిక్స్‌ వేర్‌హౌస్‌
30-01-2018 02:26:40
3600 పాలెట్స్‌ సామర్థ్యంతో ఏర్పాటు
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం వద్ద టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ వేర్‌హౌజింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు స్నోమాన్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. కృష్ణపట్నంలోని గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లో 3600 పాలెట్స్‌ సామర్థ్యం గల టెంపరేచర్‌ కంట్రోల్‌తో పాటు అదనంగా 10 వేల చదరపు అడుగుల్లో డ్రై వేర్‌హౌజింగ్‌ను ఏర్పాటు చేసినట్లు స్నోమాన్‌ తెలిపింది. వేర్‌హౌజింగ్‌ సదుపాయాలతో పాటు ఏడు హ్యాండ్లింగ్‌, లోడింగ్‌ బేస్‌, జి ప్లస్‌ 5 రేకింగ్‌ సిస్టమ్స్‌, బ్లాస్ట్‌ ఫ్రీజింగ్‌, భిన్న రకాల టెంపరేచర్‌ చాంబర్లు, ఆధునిక హ్యాండ్లింగ్‌ పరికరాలు సహా ఇతరత్రా సదుపాయాలను కల్పించినట్లు పేర్కొంది. వీటితో పాటు ప్రత్యేకంగా సముద్ర ఉత్పత్తుల (సీ ఫుడ్‌) ఎగుమతి కోసం ఒక డెడికేటెడ్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు స్నోమాన్‌ వెల్లడించింది. కొత్త వేర్‌హౌజింగ్‌ అందుబాటులోకి రావటంతో కంపెనీ మొత్తం సామర్థ్యం 1,07,200 పాలెట్స్‌కు చేరుకుందని తెలిపింది. కాగా 48 ఎకరాల్లో విస్తరించిన గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ లాజిస్టిక్‌ పార్క్‌లో స్నోమాన్‌ వినియోగదారులు కస్టమ్స్‌ క్లియరెన్స్‌, ఖాళీ కంటైనర్‌ ప్రొక్యూర్‌మెంట్‌, పోర్ట్‌ పికప్‌, డెలివరీ వంటి సేవలను అందుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం స్నోమాన్‌ లాజిస్టిక్స్‌ కోల్‌కతా, విశాఖపట్నం, భువనేశ్వర్‌, కొచ్చిన్‌, చెన్నై, ముంబైల్లో ఈ తరహా వేర్‌హౌజింగ్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది. కృష్ణపట్నంలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించటంతో కీలక సెక్టార్లలో కంపెనీ కార్యకలాపాలను పటిష్ఠం చేసే అవకాశం లభించిందని స్నోమాన్‌ లాజిస్టిక్స్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కిషన్‌ గుప్తా తెలిపారు. ప్రస్తుతం 3600 పాలెట్స్‌ సామర్థ్యంతో ఈ వేర్‌హౌజ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వచ్చే రెండేళ్లలో దశల వారీగా దీన్ని 10 వేల పాలెట్స్‌కు విస్తరించనున్నట్లు సంస్థ సిఇఒ సునీల్‌ నాయర్‌ చెప్పారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...