Jump to content

సోలార్‌ పంపు సెట్లతో తీరుతున్ననీటి కష్టాలు


Recommended Posts

సోలార్‌ పంపు సెట్లతో తీరుతున్ననీటి కష్టాలు
 
636004455671714668.jpg
  • ఒక్కసారి పెట్టుబడితో బిల్లుల ఆదా 
  • రుణాలు అందిస్తున్న నెడ్‌క్యాప్‌ 
  • ఆసక్తి చూపుతున్న అన్నదాతలు
తెనాలి రూరల్‌: సోలార్‌ పంపు సెట్లతో రైతుల కష్టాలు తీరుతున్నాయి. ముఖ్యంగా మెట్ట, తోటల్లో రైతులు ఎన్నో ఏళ్లుగా విద్యుత్‌ కష్టాలను ఎదుర్కొంటున్నారు. సోలార్‌ పంపు సెట్ల రాకతో రైతుల అవసరాలు గట్టెక్కుతుండటంతో పలువురు వీటిని ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. నెడ్‌క్యాప్‌ సంస్థ 90 శాతం రాయితీతో వీటిని అందించడంతో పొలాల్లో సోలార్‌ మోటార్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం ఏడు గంటల విద్యుత్‌ షెడ్యూల్స్‌ మార్చడం, కోతలు విధించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ సోలార్‌ పంపు సెట్లు చెక్‌ పెడుతున్నాయి. పగటి పూటంతా సౌర ఫలకాలు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. సోలార్‌ స్థాయిని బట్టి రైతులు మోటార్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో నెడ్‌క్యాప్‌ ద్వారా కేవలం సబ్‌ మెర్సిబుల్‌ పంపులకే అవకాశం ఉన్నా మోనోబ్లాక్‌ పంపులకు కూడా రుణాలు జారీ చేస్తున్నారు.
ఇప్పటికే 60 పంపు సెట్లు
భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న రైతులంతా వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. తెనాలి ప్రాంతంలో ఇప్పటికే 60 మంది రైతులు సోలార్‌ పంపు సెట్లతో సాగు చేస్తున్నారు. నెడ్‌క్యాప్‌, ఏపీఎ్‌సపీడీసీఎల్‌ సోలార్‌ పంపు సెట్లను వినియోగించే దిశగా రైతులను చైతన్యపరుస్తోంది. రూ.ఐదు లక్షలు వ్యయం చేసే 5హెచ్‌పీ సోలార్‌ సెట్‌ కోసం రైతులు రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని సంస్థలు సబ్సిడీగా అందజేస్తున్నాయి. రైతులు ఒక్కసారి పెట్టుబడితే విద్యుత్‌ బిల్లులతో పనిలేదని, విద్యుత్‌ కొరత సమస్య ఉండదని, నిరంతరం విద్యుత్‌ సరఫరా అవుతుందని ట్రాన్స కో అధికారులు చెబుతున్నారు.
 
పుష్కలంగా నీరు ..
సోలార్‌ పంపుసెట్లతో తోటలకు పుష్కలంగా నీరు అందుతోంది. గతంలో ఇబ్బందులన్ని తీరుతున్నాయి. రాత్రి సమయాల్లో పొలానికి రావాల్సిన అవసరం, కరెంట్‌ కోసం ఎదురు చూసే పని లేకుండా పోయింది. ఈ సౌకర్యం చూసి రైతులంతా వివరాలు అడుగుతున్నారు.
- నాగభూషణం,
 
రైతుబహుళ ప్రయోజనాలు ..
సోలార్‌ పంపుసెట్ల ఏర్పాట్లతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. విద్యుత్‌ సమస్యలను పూర్తి స్థాయిలో అధిగమించడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఒక్కసారి పంపు సెట్‌ ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల పాటు ప్రయోజనం కలుగుతుంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు సోలార్‌ యూనిట్లు అందిస్తాం.
- మురళీకృష్ణ యాదవ్‌, డీఈ

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...