Jump to content

Guntur-Vijayawada-Gannavaram (National Highway 16) Beautification


Recommended Posts

  • 1 month later...
  • 3 weeks later...
  • 3 weeks later...
వీఐపీ కారిడార్‌’కు ఎన్‌హెచ్‌ శ్రీకారం
08-08-2018 07:19:13
 
636693095925652371.jpg
  • జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) ప్రణాళిక
  • రూ.35 కోట్ల వ్యయంతో 25 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులు
  • సేఫ్టీ సిగ్నేజ్‌ బోర్డులు, జంక్షన్ల దగ్గర ఆధునికీకరణ
 
అంతర్జాతీయ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న బెజవాడలో ఆహ్లాదకరమైన రహదారి. అదే ‘వీఐపీ మార్గం’. ఈ మార్గంలో కుదుపులు లేని, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఎన్‌హెచ్‌ అధికారులు సమాయత్తమవుతున్నారు. నగర పరిధిలోని ఎన్‌హెచ్‌ - 16పై కనకదుర్గ వారధి నుంచి చిన్న అవుటపల్లి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మార్గాన్ని ‘వీఐపీ కారిడార్‌’గా రూపుదిద్దేందుకు ఎన్‌హెచ్‌ శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో వీఐపీలు ప్రయాణించే ఈ మార్గాన్ని అత్యున్నత ప్రమాణాలతో ఎన్‌హెచ్‌ అభివృద్ధి చేస్తుంది.
 
 
విజయవాడ: అమరావతి రాజధానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీఐపీలు వస్తున్నారు. వీఐపీలంతా ముందుగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు ప్రయా ణం చేయాల్సి ఉండటంతో ఈ రోడ్డును అత్యు న్నతంగా తీర్చిదిద్దటానికి ఎన్‌హెచ్‌ విజయవాడ డివిజన్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. ఎయి ర్‌పోర్టు నుంచి విజయవాడవరకు రోడ్డు బాగా లేదని, అభివృద్ధి చేయాలని ఇటీవల రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ఎన్‌హెచ్‌ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో విజయవాడ డివిజన్‌ అధికారులు స్పందించారు. విజయవాడ పరిధిలోకి వచ్చే ఎన్‌హెచ్‌-16 మార్గంలో కనకదుర్గ వారధి నుంచి ఎయిర్‌పోర్టు దాటి చిన్న అవుటపల్లి వరకు దాదాపుగా 25 కిలోమీటర్ల మార్గాన్ని వీఐపీ కారిడా ర్‌గా ఎంచుకుంది. ఎయిర్‌పోర్టును దాటి చిన అవుటపల్లి వరకు వెళ్లటానికి ఒక కారణం ఉంది.
 
చిన అవుటపల్లి దగ్గర విజయవాడ బైపాస్‌ ప్రారంభం అవుతుంది. అమరావతి రాజధానికి ఈవల వైపు ముఖద్వారంగా ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం నుంచి ఐకానిక్‌ బ్రిడ్జి వెళుతుంది. రాజధాని నుంచి విజయవాడలోకి రాకుండానే భవి ష్యత్తులో ఈ మార్గం నుంచి కూడా ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌హెచ్‌ అధికారులు అక్కడి వరకు వీఐపీ కారిడార్‌ను పొడిగించారు. విజయ వాడ బైపాస్‌ను ఎలాగూ ఐకానిక్‌గా ఆరు వరసల విధానంలో ఏర్పాటు చేయటానికి వీలుగా డీపీఆర్‌ తయారు చేయటానికి కన్సల్‌టెంట్ల కోసం ఎన్‌హెచ్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ఇంకా ఇవి ఖరారు కాలేదు. ఈ వైపు రోడ్డు ఏర్పాటు చేయటానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి.. ప్రస్తుతం చిన అవుటపల్లి నుంచి కనకదుర్గ వారధి వరకు వీఐపీ కారిడార్‌గా ఉంటుంది.
 
ఎన్‌హెచ్‌ ప్రణాళికలు
వీఐపీ కారిడార్‌ అభివృద్ధి ప్రణాళికలను ఎన్‌హెచ్‌ అధికారులు రూపొందించారు. సెంట్రల్‌ డివైడర్‌కు రెండువైపులా బీటీ రోడ్డు అభివృద్ధితో పాటు రోడ్డు సేఫ్టీ సిగ్నేజ్‌ బోర్డులు, రూట్‌ డైరెక్షన్‌ బోర్డులతో పాటు, జంక్షన్ల దగ్గర ఆధునికీకరణ పనులను చేపట్టడానికి రూ.35 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. ప్రస్తుతం ఉన్న బీటీ లేయ ర్‌పైనే అదనంగా మరో బీటీ లేయర్‌ను వేస్తారు. బీటీ లేయర్‌ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో సంబంధం లేదు. విజయవాడ రీజనల్‌ ఆఫీసు కార్యాలయం పరిధిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అంచ నాలు రూపొందించిన నేపథ్యంలో, టెండర్లను పిలవటమే మిగిలిఉంది. మరికొద్ది రోజులలో నేరుగా టెండర్లను పిలవనున్నారు. బీటీ లేయర్‌తో పాటు రోడ్డు సేఫ్టీ సిగ్నేజ్‌ బోర్డులు, రూట్‌ డైరెక్షన్‌ బోర్డులకు సంబంధించిన పనులను కూడా అప్ప గించనున్నారు. జంక్షన్ల దగ్గర కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న దానిపై ఎన్‌హెచ్‌ అధికారులు అధ్యయనం చేశారు. వీటికి సంబంధించి కూడా ప్రణాళికలు రూపొందించారు.
 
హోర్డింగ్స్‌పై ఎన్‌హెచ్‌ అటాక్‌
జాతీయ రహదారుల వెంబడి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌పై చర్యలు తీసుకోవటానికి నేషనల్‌ హైవే అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జాతీయ రహదారుల వెంబడి ఇష్టారాజ్యంగా హోర్డింగ్స్‌ ఏర్పా టు చేస్తున్న వైనంపై కొద్దికాలం కిందట ఆంధ్ర జ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలస్యంగా అయినా ఎన్‌ హెచ్‌ అధికారులు రంగంలోకి దిగారు. అనధికార, అక్రమ హోర్డింగ్స్‌ తొలగింపుకు పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఎన్‌హెచ్‌ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వారంరోజుల్లో సంయుక్త బృందాలుగా ఏర్పడి జాతీయ రహదారి వెంబడి ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌ను తొలగించనున్నారు. ముందుగా వీఐపీ కారిడార్‌ పరిధిలోని హోర్డింగ్స్‌పై దృష్టి పెట్టనున్నారు. ఎవరికివారు హోర్డింగ్స్‌ను తొలగించుకోవాలని ఎన్‌హెచ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
ఏలూరు రహదారికి రూ.35 కోట్లతో మెరుగులు!
టెండర్లను పిలిచిన ఎన్‌హెచ్‌ఏఐ
ప్రముఖులు తిరిగే రహదారిగా గుర్తింపు
చినఆవుటపల్లి వరకు రెండు పొరలు
amr-top2a.jpg

ఈనాడు, విజయవాడ: రహదారి ప్రమాదాలకు కారణమైన ఏలూరు రహదారిని మరింత పటిష్టం చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ చర్యలు తీసుకోనుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ, అమరావతి నగరాలకు నిత్యం ఎంతోమంది ప్రముఖులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి ప్రముఖుల పర్యటనలు ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌16) కొంత ప్రమాదకరంగా మారింది. దీన్ని పటిష్టం చేసేందుకు రూ.35 కోట్లు మంజూరు చేసింది. విజయవాడ నేతాజీ వంతెన నుంచి చినఆవుటపల్లి వరకు ఈ జాతీయ రహదారిని ప్రత్యేక మరమ్మతుల కింద రెండు బెట్‌మెన్‌ పొరలు (బీఎంబీసీ) వేయనున్నారు. దాదాపు 24 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ జాతీయ రహదారి మరింత సుందరంగా తయారు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ టెండర్లను పిలిచింది. ప్రముఖులు వచ్చే వేగానికి అనుగుణంగా రహదారి లేదని నిపుణులు తేల్చారు. రామవరప్పాడు రింగు నుంచి గన్నవరం వరకు పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఎనికేపాడు వద్ద మలుపు సాంకేతికంగా సక్రమంగా లేదనే వాదన ఉంది. ఒకవైపు వాలు ఎక్కువగా ఉంది. ఇలాంటి లోపాలను సరిదిద్దనున్నారు. పలు ప్రతిపాదనల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ రహదారి నిర్మించి పదేళ్లకు పైగా అయింది. దీంతో తరుగుదల (డిప్రిసియేషన్‌) కింద కేంద్ర ప్రభుత్వం ఈ మరమ్మతులకు నిధులను మంజూరు చేసినట్లు జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ ‘ఈనాడు’తో చెప్పారు. దీనికి టెండర్లను పిలిచామని చెప్పారు. అక్టోబరు నాలుగుతో గడువు ముగుస్తుందని వివరించారు. మొత్తం 24 కిలోమీటర్లు రెండు వైపులా రెండు పొరలతో బీటీ పొర ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఎన్‌హెచ్‌16 విస్తరణ టెండర్ల గడువు పెంపు!
జాతీయ రహదారి విస్తరణ టెండర్ల గడువు మరోసారి పెంచారు. సెప్టెంబరు 20న తెరవాల్సిన టెండర్లను జాతీయ రహదారి సంస్థ అక్టోబరు 24వరకు గడువు పెంచింది. చినఆవుటపల్లి నుంచి కలపర్రు వరకు ఒక ప్యాకేజీ, కలపర్రు నుంచి గుండుగొలను వరకు మరో ప్యాకేజీగా విభజించి ఈపీసీ టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. ఈ టెండర్ల గడువు గత మూడు నెలలుగా పొడిగిస్తూ వస్తున్నారు. ఉన్నత స్థాయి స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ పలు అభ్యంతరాలను లేవనెత్తినట్లు తెలిసింది. కమిటీ ఆమోదం లభించిన తర్వాత ధరల బిడ్‌ను తెరిచే అవకాశం ఉందని పీడీ చెబుతున్నారు. అదేవిధంగా కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన, బైపాస్‌ రహదారికి ఇంకా డీపీఆర్‌ తయారీకి సంస్థలను ఖరారు చేయాల్సి ఉంది.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...
జాతీయ రహదారి విస్తరణకు సర్వే
17-11-2018 08:37:19
 
636780406372582553.jpg
  • రామవరప్పాడు రింగ్‌ నుంచి గన్నవరం వరకు విస్తరణకు సర్వే
గుణదల, నవంబరు 16: కరెన్సీనగర్‌ నుంచి నిడమానూరు జాతీయరహదారి వరకు టవర్‌లైన్లకింద 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి సీఆర్‌డీఏ అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే టవర్‌లైన్ల కింద స్థలాలను ఆక్రమించి ఇళ్ళను నిర్మిం చుకున్నవారితో సీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆక్రమణదారులకు ఈవిషయమై ఇప్పటికే సమాచారం అందజేశారు. టవర్‌లైన్ల కింద 80 అడుగుల మేర రోడ్డును నిర్మించడం వల్ల రామవరప్పాడు రింగ్‌ రోడ్డు నుంచి నిడమానూరు జాతీయరహదారి వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ తగ్గనుంది. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. టవర్‌లైన్ల కింద ఆక్రమణదారులకు సీఆర్‌డీఏ నుంచి నష్టపరిహారం ఎంతమేరకు ఇస్తారు అనేది వేచిచూడాల్సి ఉంది. రామవరప్పాడు రింగ్‌ రోడ్డు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు జాతీయరహదారిని విస్తరించేందుకు సీఆర్‌డీఏ అధికారులు సర్వే ప్రారంభించారు. ఎంతమేరకు విస్తరణ చేస్తారో తెలిసిన తర్వాత మార్కింగ్‌ చేయన్నుట్లు సమాచారం. గతంలోనే రామవరప్పాడు రింగ్‌ రోడ్డునుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డుకు ఒక్కో పక్క 16మీటర్లు విస్తరించాలని నిర్ణయించారు.
 
అయితే తాజాగా చేపట్టిన సర్వేప్రకారం ఎంతమేరకు విస్థరణకు మార్గింగ్‌ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. జాతీయరహదారి విస్తరణకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవన యజమానుల జాబితాను తయారుచేసి పంపాలని ఆయా పంచాయతీ కార్యదర్శులకు సీఆర్‌డీఏ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు కార్యదర్శులు రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న భవన యజమానుల ఫోన్‌నెంబర్లతో కూడిన జాబితాను రూపొందించే పనిలో పడ్డారు. మార్కింగ్‌ చేసే సమయంలో సీఆర్‌డీఏ సిబ్బందికి స్థానిక పంచాయతీ సిబ్బంది సహకారం అవసరమని అధికారులు పంచా యతీ కార్యదర్శులను కోరారు. ఈ పనులు ఎన్నికలకు ముందు చేపడతారా లేక ఎన్నికల తర్వాత ప్రారంభిస్తారో తెలియాల్సి ఉంది. తరచూ రామవరప్పాడు రింగ్‌ రోడ్డు నుంచి ఎనికేపాడు వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే స్వయంగా సీఆర్‌డీఏ అధికారులకు విస్తరణ పనులకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
వీఐపీ కారిడార్‌కు.. నూతన శోభ
05-02-2019 12:45:56
 
636849675565417342.jpg
  • టెండర్లను దక్కించుకున్న లక్ష్మీ ఇన్‌ఫ్రా
  • వారంలో పనులు ప్రారంభం
  • ఎన్‌హెచ్‌-16పై చిన అవుటపల్లి - కనకదుర్గవారధి ఆధునికీకరణ
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): బెజవాడ నగరంలో వీఐపీ కారిడార్‌ ఆధునికీకరణకు జాతీయ రహదారుల సంస్థ ఎట్టకేలకు టెండర్లను ఖరారు చేసింది. 16 నెంబరు జాతీయరహదారి (ఎన్‌హెచ్‌-16)పై చిన అవుటపల్లి నుంచి ఎయిర్‌పోర్టు, విజయవాడ మీదుగా కనకదుర్గ వారధి వరకు ‘వీఐపీ కారిడార్‌’ను ఆధునికీకరించటానికి రూ.36 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్‌ పిలిచిన టెండర్లను లక్ష్మీ ఇన్‌ఫ్రా సంస్థ దక్కించుకుంది. సంస్థతో ఎన్‌హెచ్‌ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వారంలో పనులు ప్రారంభించాల్సి ఉంది. ముందుగా జాతీయ రహదారి-16పై ఎక్కడెక్కడ డ్యామేజీలు ఉన్నాయో కాంట్రాక్టు సంస్థ గుర్తిస్తుంది. కుంగిన ప్రాంతాల్లో బీటీ లేయర్‌ను యంత్రాల సహాయంతో కట్‌చేసి బీటీ మిక్స్‌ వేస్తారు. ఇలా చినఅవుటపల్లి నుంచి కనకదుర్గ వారధి వరకు చేసిన తర్వాత మళ్ళీ దీనిపై పూర్తిస్థాయిలో బీటీ లేయర్‌ వేస్తారు. వీఐపీ కారిడార్‌లో ప్రస్తుతం రమేష్‌ హాస్పిటల్స్‌ జంక్షన్‌నుంచి బెంజిసర్కిల్‌ మీదుగా ఎస్‌వీఎస్‌ జంక్షన్‌వరకు బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతోంది.
 
వయాడక్ట్‌ పనులు తుదిదశలో ఉన్నాయి. ఈ పనులను దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ చేపడుతోంది. నేషనల్‌ హైవేను ఆధునికీకరించాల్సిన ప్రాంతంలో గతంలో ఈ కాంట్రాక్టు సంస్థ మెటీరియల్‌ ఉంది. ఇటీవలికాలంలో దిలీప్‌ సంస్థ మెటీరియల్‌ను తొలగించటంతోపాటు హైవే రెండు లేన్ల మార్కింగ్‌ను నిర్ణయించి ఆ మేరకు మార్కింగ్‌ వెంబడి చిన్నపాటి డివైర్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ డివైడర్‌ వరకు ప్రస్తుతం టెండర్లు దక్కించుకున్న లక్ష్మీ ఇన్‌ఫ్రా సంస్థ నూతన లేయర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఫ్లై ఓవర్‌ దిగువ భాగంతో పాటు సర్వీసురోడ్డు విస్తరణ, ఆధునికీకరణ పనులు దిలీ్‌ప బిల్డ్‌కాన్‌ కాంట్రాక్టు పరిధిలోకి వస్తాయి కాబట్టి.. ఆ పనులను వారే చూస్తారు. మిగిలిన వీఐపీ కారిడార్‌ పనులను లక్ష్మీ ఇన్‌ఫ్రా చూస్తుంది. బీటీ లేయర్‌ తోపాటు రోడ్డు సేఫ్టీ పనులను కూడా అప్పగించటంతో.. జీబ్రాక్రా్‌సలు, బస్‌బేలు, పార్కింగ్‌ ఏరియాలకు సంబంధించి వైట్‌మార్కింగ్‌ పనులు, అవసరమైన చోట రోడ్డు మార్జిన్ల వెంబడి రెయిలింగ్‌, సేఫ్టీ సైన్‌బోర్డ్సు వంటివి ఏర్పాటుచేయనుంది. సేఫ్టీప్లాన్‌లో భాగంగా కారిడార్‌లో హైవేపై రేడియం స్టిక్టరింగ్‌తో కూడిన బంపర్స్‌ను హైవే మీద ఏర్పాటు చేయనున్నారు.
 
రాత్రివేళల్లో రంగురంగులుగా ఇవి కనిపిస్తాయి. జాతీయ రహదారి మీద స్పీడ్‌ బ్రేకర్లుగా మందపాటి వైట్‌ ఫినిషింగ్‌ ఇస్తారు. జంక్షన్లను సుందరంగా ఆధునీకరించనున్నారు. వీఐపీ కారిడార్‌ను ఆధునీకరించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం ఎప్పటి నుంచో ఎన్‌హెచ్‌కు సూచిస్తోంది. అమరావతి రాజధానికి వెళ్ళాలంటే వీఐపీలు ఈమార్గం నుంచే వెళ్ళాలి. గన్నవరంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజూ ఎందరో వీఐపీలు ఈమార్గం నుంచే వెళుతుంటారు. ఈ మార్గం అత్యద్భుతంగా ఉండేలా సీఆర్‌డీఏ ద్వారా రెండువైపులా ప్రభుత్వం ల్యాండ్‌ స్కేపింగ్‌ చేయించింది. నగరంలో కార్పొరేషన్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌ చేపట్టింది. అందంగా ఉండే వీఐపీ కారిడార్‌లో అసలఐన రోడ్డు మాత్రం గతుకులు, గుంతలతో ఉంది. హైవే పరిధిలో ఉండటంతో చేత ఈ రోడ్డును తక్షణం ఆధునీకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా జాతీయ రహదారులకు సూచించారు. జాతీయ రహదారులుదీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లను పిలిచింది. ఆ టెండర్లను మళ్ళీ రద్దు చేసింది. కారణాన్ని బహిర్గత పరచలేదు.
 
తిరిగి టెండర్లను పిలిచింది.
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన ఏపీ జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ వీఐపీ కారిడార్‌ ఆధునికీకరణ పనులకు కూడా ప్రారంభోత్సవం చేశారు. టెండర్లు ఖరారు చేయని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవంపై ఆంధ్రజ్యోతి కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలో, జాతీయ రహదారుల సంస్థ వీఐపీ కారిడార్‌కు టెండర్లను ఖరారు చేయటం గమనార్హం.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...