Jump to content

Guntur-Vijayawada-Gannavaram (National Highway 16) Beautification


Recommended Posts

 

CRDA to start Vijayawada - Guntur Express way Beautification

With good response from citizens over Gannavaram - Vijayawada beautification, CRDA is planning to beautify the express way from Vijayawada to Guntur. CRDA and NHAI has done beautification from Gannavaram to Vijayawada, of 21.2 km stretch. CRDA is emphasised over the need for the green corridor of international standards.

According to CRDA, the Vijayawada - Guntur Express way beautification will be done by Krishna Pushkarams. Tenders have been called and the notification is kept on CRDA website. The last date for tenders is June 6th. On the same day the works would be allocated. The total project cost would be Rs.15.97 crores. The total project would be done in three packages, to complete the works at the earliest.

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
రూ.3.38కోట్లతో హైవే లింక్‌ రోడ్లకు మెరుగులు
 
636029552658974928.jpg
హైవేలను కలిసే రహదారులను అందంగా తీర్చిదిద్దాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. 16వ నెంబర్‌ జాతీయ రహదారిని కలిపే వివిధ రహదారులను అభివృద్ధి పరిచేందుకు నిర్ణయించింది. గోతులను పూడ్చివేసి.. మార్జిన్లను మెరుగుపరచనుంది. ఇందుకోసం సుమారు 3.38 కోట్లు వెచ్చించనుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఇప్పటివరకు తన పరిధిలోని వివిధ జాతీయ రహదారుల సుందరీకరణ, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిన ఏపీసీఆర్డీయే త్వరలో వాటిని కలిసే రోడ్ల మెరుగుదలకూ చర్యలు తీసుకోనుంది. హైవేలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన విధంగానే అవి కలిసే రహదారులనూ నేత్రపర్వంగా చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాలతో ఆ దిశగా కదిలింది. ఇందులో భాగంగా తొలివిడతలో కృష్ణాజిల్లాలోని నిడమానూరు నుంచి గన్నవరం మధ్య 16వ నెంబరు జాతీయ రహదారిని వివిధ గ్రామాలు, కాలనీల వద్ద కలిసే పలు రోడ్లను అభివృద్ధి పరచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సుమారు రూ.3.38 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేసిన ఈ సంస్థ సదరు పనులకు టెండర్లను కూడా ఆహ్వానించింది.

హైవేల మాదిరే ఆకట్టుకునేలా ఉండాలి..

కోట్లాది రూపాయలను వెచ్చించి సీఆర్డీయే ఏర్పాటు చేసిన మొక్కలు, సెంట్రల్‌ లైటింగ్‌, మెరుగు పరచిన మార్జిన్లతో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి విజయవాడ శివార్ల నుంచి గన్నవరం విమానాశ్రయం వరకూ దానిపై ప్రయాణించే వారికి మధురానుభూతిని కలిగిస్తున్న సంగతి విదితమే. అదే కోవలో కనకదుర్గమ్మ వారధి- గుంటూరు ఆవల ఉన్న పొత్తూరు, భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకూ కూడా వరుసగా చెన్నై- కోల్‌కతా, విజయవాడ- హైదరాబాద్‌ హైవేలను అంతర్జాతీయ ప్రమాణాలతో కళకళలాడేలా చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు వస్తున్న సీఎం చంద్రబాబు మార్గమధ్యంలో వివిధ గ్రామాలు, జనావాసాల వద్ద హైవేలను కలిసే రోడ్లలో అత్యధికం బాగా లేని విషయాన్ని గమనించారు. హైవేల వరకూ ఎంతో బాగున్నా, వాటిపైనుంచి ఊళ్లకు వెళ్లే రోడ్లు ఇలా ఉండడం సరికాదని భావించిన ఆయన ఇలాంటి రోడ్లన్నింటినీ అవి హైవేలను కలిసే ప్రదేశాల నుంచి కొంత దూరం వరకూ చూడచక్కని విధంగా అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు.
 
 
హైవేల నుంచి కొంత దూరం వరకూ..
ఇందులో భాగంగా ఊళ్ల నుంచి వచ్చే రోడ్లు హైవేను కలిసే చోట అక్కడి పరిస్థితులను బట్టి కొన్ని వందల మీటర్లమేర వాటిని మెరుగు పరుస్తారు. గోతులేమైనా ఉంటే పూడ్పించి, చక్కటి రోడ్లను వేస్తారు. మార్జిన్లను అభివృద్ధి చేస్తారు. వాటిపై వర్షపు నీరు నిలవకుండా చూడడంతోపాటు పక్కన మురుగుకాల్వలను నిర్మిస్తారు. అంతేకాకుండా ఏవైనా వంతెనల వద్ద రోడ్లు మరీ ఏటవాలుగా ఉన్నట్టయితే సరిచేస్తారు. మొక్కలనూ నాటుతారు. ప్రస్తుతానికి ఈ విధంగా నిడమానూరు-గన్నవరం మధ్య చేయనున్నప్పటికీ కాలక్రమంలో తన పరిధిలోని హైవేల పక్కన ఉండే గ్రామాలు, కాలనీల నుంచి జాతీయ రహదారిని కలిసే రోడ్లన్నింటినీ కూడా ఇదే తరహాలో అభివృద్ధి పరచాలన్నది సీఆర్డీయే నిర్ణయమని తెలుస్తోంది.
 
 
 
  •  
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 7 months later...
  • 4 weeks later...
  • 1 month later...
ఆకర్షణీయంగా కనకదుర్గమ్మ వారధి కూడలి
 
 
636319062142414694.jpg
  • అమరావతి ముఖ ద్వారాల్లో ఇది ప్రముఖం
  • రెండు నమూనాలను సిద్ధం చేసిన అధికారులు
కనకదుర్గమ్మ వారధి జంక్షన్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు డిజైన్లను సిద్ధం చేశారు. ఒకటి అమరావతి చారిత్రక వారసత్వాన్ని, బౌద్ధమతానికి దర్పణం పట్టనుండగా, మరొకటి సుందర ఉద్యానవనాన్ని తలపించేలా ఉన్నాయి. వీటిల్లో ఒక దానిని ఖరారు చేసి త్వరలో పనులు ప్రారంభించనున్నారని సమాచారం.(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధాని అమరావతికి దారి తీసేందుకు మాస్టర్‌ప్లానలో ప్రతిపాదించిన వివిధ దిశల్లోని ముఖ ద్వారాల్లో విజయవాడ కనకదుర్గమ్మ కూడలి అత్యంత ముఖ్యమైనది. ఇక్కడే చెన్నై, కోల్‌కతా, మచిలీపట్నం, హైదరాబాద్‌ల వైపు నుంచి వివిధ జాతీయ రహదారుల మీదుగా వచ్చే వాహనాలు కలుసుకుని తమ గమ్యస్థానాలకు వెళ్తాయి. విజయవాడ పరిసరాల్లోని పలు ప్రదేశాల నుంచి గుంటూరు, తెనాలి, అమరావతి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకూ ఇదే కూడలి. దీంతో ఈ జంక్షన నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. ఈమధ్యనే ఈ కూడలిలో గుంటూరు వైపు రాకపోకలు సాగించే వాహనాలు నేరుగా వారధిని చేరుకునేందుకు వీలుగా కృష్ణలంక వైపు నుంచి ఒక ఫ్లైవోవర్‌ను నిర్మించారు. ఈ జంక్షనలో అప్పటికే ఉన్న రహదారులకు మధ్యన సువిశాలమైన ట్రాఫిక్‌ ఐల్యాండ్లు ఏర్పడ్డాయి. వీటిల్లో పచ్చదనాన్ని పెంచేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటిల్లోని మొక్కలు పశువుల బారిన పడి, నామరూపాలు లేకుండా పోవడంతోట్రాఫిక్‌ ఐల్యాండ్లన్నీ కళావిహీనంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి ఆదేశాలతో..
రాజధానికి దారి తీసే అన్ని ముఖద్వారాలనూ అత్యంత ఆకర్షణీయంగా రూపొందించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో అధికారులను ఆదేశించారు. స్పందించిన ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్ధసారథి విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి జంక్షనను ముందుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఏడీసీ అధికారులు, కన్సల్టెంట్ల సమష్టి కృషితో రెండు డిజైన్లు సిద్ధమయ్యాయి.
బౌద్ధానికి ప్రతీకగా ఒకటి..
పచ్చదనంతో ఇంకొకటి..
ఏడీసీ రూపొందించిన రెండు డిజైన్లూ వారధి జంక్షన వద్ద ఉన్న ట్రాఫిక్‌ ఐల్యాండ్లను హరిత శోభితంగా మార్చేవే. ఒకటి గతంలో బౌద్ధానికి సూచికగా భారీ ధర్మచక్రం, ఇతర ఆకర్షణలతో కూడి ఉంది. ఈ నమూనాలో వలయాకారంలో ఉన్న స్థూపంపై పురాతన శిల్పకళను ప్రతిబింబించే మందిరాల మధ్య ధర్మచక్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ స్థూపం చుట్టూ ఆకట్టుకునే పలు రకాల క్రోటన్లు, పూలమొక్కలతోపాటు అక్కడక్కడ పెద్ద చెట్లను సైతం పెంచుతారు. సందర్శకులు నడిచేందుకు వీలుగా వాకింగ్‌ టైల్స్‌తో కూడిన బాటలను ఏర్పాటు చేస్తారు. రెండో డిజైనలో కేవలం చక్కటి పచ్చిక బయళ్లూ, వాటి మధ్యన చెట్ల వరుసలూ మాత్రమే ఉంటాయి. ఈ లాన్లను కూడా ఆకుపచ్చ రంగులో మాత్రమే కాకుండా వివిధ వర్ణాల్లో ఉండే క్రోటన్లు, ఇతర మొక్కలతో రంగురంగుల్లో ఉండేలా చూస్తారు. ట్రాఫిక్‌ ఐల్యాండ్ల స్వరూపానికి అనుగుణంగా పచ్చిక బయళ్లను చక్కటి ఆకృతుల్లో అభివృద్ధి పరుస్తారు.
Link to comment
Share on other sites

  • 2 months later...
  • 3 months later...
  • 2 months later...

హరిత వారధి
20-02-2018 07:23:32

 నేత్రపర్వంగా తాడేపల్లి కూడలి సుందరీకరణ
 ఫౌంటెన్ల ఏర్పాటుతోపాటు పచ్చిక బయళ్లు, పూలమొక్కలు, వృక్షాల పెంపకం
 సీఆర్డీయే ఆధ్వర్యంలో చురుగ్గా పనులు
అమరావతి: గుంటూరు జిల్లా వైపు, కనకదుర్గమ్మ వారధి ముఖద్వారం వద్ద చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారికి మధ్యన ఉన్న విశాలమైన ప్రదేశాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి పరచేందుకు సీఆర్డీయే చర్యలు తీసుకుంది. విజయవాడ వైపు నుంచి గుంటూరు, అమరావతికి వారధి మీదుగా రాకపోకలు సాగించే వారితోపాటు చెన్నై, గుంటూరు, అమరావతి వైపు నుంచి విజయవాడ, హైదరాబాద్‌, కోల్‌కతా వైపు వెళ్లే వారికి మనోల్లాసం కలిగించేలా దీనిని తీర్చిదిద్దుతోంది. సుమారు రూ.35 లక్షల అంచనా వ్యయంతో హైవేకు మధ్యన ఉన్న సెంట్రల్‌ డివైడర్‌లో ఫౌంటెన్లను ఏర్పాటు చేయడంతోపాటు దేశ, విదేశీ మొక్కలతో పచ్చిక బయళ్లు, పచ్చదనాన్ని అభివృద్ధి పరచనుంది.
 
వెడల్పయిన సెంట్రల్‌ డివైడర్‌..
జాతీయ రహదారుల సెంట్రల్‌ డివైడర్‌ (మీడియన్‌) వెడల్పు సాధారణంగా 3 మీటర్ల నుంచి 7, 8 మీటర్ల వరకూ ఉంటుంది. విజయవాడ శివార్లలోని నిడమానూరు- రామవరప్పాడు వంటి చోట్లయితే ఇది 1-2 మీటర్లకు మించదు. అయితే కనకదుర్గమ్మ వారధికి ఆవలి వైపున (గుంటూరు వైపు) కొంతమేర మాత్రం హైవే సెంట్రల్‌ డివైడర్‌ వెడల్పు ఏకంగా 15 నుంచి 30 మీటర్ల మధ్య ఉంది! సుమారు 40 మీటర్ల పొడవున ఇంతటి వెడల్పుతో ఉండే ఈ స్థలం విస్తీర్ణం సుమారు 40 సెంట్లు. ఇప్పటికే విజయవాడ- గన్నవరం విమానాశ్రయం మధ్య హైవేను చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్ది, ప్రస్తుతం విజయవాడ- గుంటూరుల మధ్య కూడా సదరు పనులను చురుగ్గా చేపడుతున్న సీఆర్డీయే పైన పేర్కొన్న వెడల్పాటి స్థలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగపరచుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ స్థలంలో నిర్మితమైన పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ రూం పోను మిగిలిన దానిని ఆధునిక ఫౌంటెన్లు, పచ్చిక బయళ్లు, వృక్షాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది.
 
డాండీలియన్‌ ఫౌంటెన్లు, రంగురంగుల లాన్లు..
ఈ ప్రాంత సుందరీకరణలో భాగంగా 6 డాండీలియన్‌ ఫౌంటెన్లను ఏర్పాటు చేయనున్నారు. గుండ్రంగా ఉండే డాండీలియన్‌ అనే పువ్వును పోలి ఉండే ఇలాంటి వాటిని ఇప్పటికే ఇదే హైవేపై విజయవాడ శివార్లలోని రామవరప్పాడు కూడలి వద్ద సీఆర్డీయే ఏర్పాటు చేయించింది. అయితే తాడేపల్లి వద్ద అమర్చబోయేవి అక్కడి కంటే పెద్దవని తెలిసింది. పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ చుట్టూరా ఎత్తుగా పెరిగే వృక్షాలను పెంచుతారు. ఈ ప్రదేశానికి అన్ని వైపులా ఆకుపచ్చని మొక్కలతో కూడిన చక్కటి లాన్లను, అక్కడక్కడ పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఊదారంగు మొక్కలతో కూడిన పచ్చదనాన్ని అభివృద్ధి పరుస్తారు. ఫౌంటెన్లను అమర్చే ప్రదేశానికి ఇరువైపులా పసుపుపచ్చ మొక్కలతో చూడచక్కటి ఆకృతుల్లో గ్రీనరీ పెంచుతారు. ఈ మొక్కలన్నింటికీ అవసరమైన నీటిని అందించేందుకు ప్రత్యేకంగా బోర్లను వేస్తున్నారు. అయితే నిత్యం అమిత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సందర్శకుల వాహనాలను నిలిపే అవకాశం లేదు.

Link to comment
Share on other sites

On 4/11/2017 at 3:05 AM, Naren_EGDT said:

100 votes Anna padtaya

CBN chesina panulu annee votlu lekkesukoney chesaaru antaavaa Brother. 

 

ilaa chesey prathi pani  lo votlu vethukkunteyy we  would have  just called  him Politician BUT we call him leader 

Edited by DVSDev
Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...