Jump to content

Vizag Airport


Recommended Posts

Air India rules out ‘night parking’ in Vizag

Air India is operating seven flights a week between visakhapatnam and New Delhi, four flights a week between Delhi-Port Blair-Visakhapatnam-Delhi, Delhi-Visakhaptnam-Port Blair-Delhi thrice a week, Mumbai-Raipur-Visakhapatnam-Mumbai, seven flights a week and Visakhapatnam-Hyderabad-Dubai-Visakhapatnam, seven days a week, according to the CMD of Air India, Pradeep Singh Kharola.

He was responding to a letter written by Visakhapatnam MP Kambhampati Haribabu on January 11, 2018, seeking the overnight parking of Air India aircraft in Visakhapatnam.

Mr. Kharola said that keeping in view the existing resources the airline was not in a position to consider the feasibility of night parking of its aircraft at Visakhapatnam at present. He, however, said that in view of the augmentation of its narrow body fleet, AI could consider using the night parking facility at a later stage.

He also noted that AI planned to maintain the existing capacity at Visakhapatnam, thereby ruling out any immediate chances of increasing the frequency of the existing flights.

Meanwhile, Tour and Travel Operators Association of Andhra (TTOA) chairman O. Naresh Kumar said that efforts were being made to impress upon other airlines to introduce new flights.

Link to comment
Share on other sites

విశాఖ-జగదల్‌పూర్‌ మధ్య విమాన సర్వీసు
08-05-2018 02:33:17
 
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి మరో కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఎయిర్‌ ఒడిషా సంస్థ వారంలో ఆరు రోజులు విశాఖపట్నం-జగదల్‌పూర్‌ మధ్య విమాన సర్వీసు నడిపేందుకు ముందుకు వచ్చింది. జూన్‌ 15 నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన సర్వీసు టిక్కెట్ల బుకింగ్‌ కూడా ప్రారంభించింది. టిక్కెట్‌ ధర రూ.1,630గా నిర్ణయించింది. రోజూ జగదల్‌పూర్‌లో ఉదయం 9.10 గంటలకు బయలుదేరి 9.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి 10.10 గంటలకు బయలుదేరి 10.50 గంటలకు జగదల్‌పూర్‌ వెళుతుంది.
Link to comment
Share on other sites

From June 15, you can fly from Visakhapatnam to Jagdalpur

VISAKHAPATNAM: If plans of a new private air operator fructify, soon there will be flight connectivity between Visakhapatnam and Jagdalpur, a city in Bastar district of Chhattisgarh.

 
As per plans, Air Odisha will start Visakhapatnam-Jagdalpur from June 15. According to the tweets, bookings have already started. Flights depart Jagdalpur at 9.10 am and will reach Visakhapatnam airport by 9.45 am. In return direction, the flight departs Visakhapatnam at 10.10 am and will reach Jagdalpur at 10.50 am. "The fares will be cheap. One way will be Rs 1,630 per passenger," tweeted, an air traveller.

According to airport sources, Air Odisha is the new air operator under the UDAN- Regional Connectivity Scheme of union ministry of civil aviation. The objective of the UDAN scheme is to let common citizens of the country fly at an affordable price. TNN

Link to comment
Share on other sites

‘భోగాపురాని’కి రిలయన్స్‌ రెడీ?
15-05-2018 01:43:30
 
636619454109146862.jpg
  • చంద్రబాబుతో అనిల్‌ అంబానీ భేటీ
  • గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రస్తావన
  • టెండర్‌లో పాల్గొంటామని వెల్లడి
  • రాంబిల్లి నావల్‌ షిప్‌ బిల్డింగ్‌పైనా సమీక్ష
  • కృష్ణపట్నం పవర్‌ ప్రాజెక్టుపై నిస్సహాయత
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై రిలయన్స్‌ గ్రూప్‌ ఆసక్తిని చూపుతోంది. సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన రిలయన్స్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. త్వరలో పిలిచే టెండర్లలో తాము కూడా పాల్గొంటామని చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ఈ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎక్కువగా ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత పనులు చేపట్టడంలో జాప్యం చేస్తూ వచ్చింది. ఆపై ఎయిర్‌పోర్టును నిర్మించలేమని చెప్పేసింది. దీంతో ఈ సంస్థను నిర్మాణ బాధ్యతల నుంచి తప్పిస్తూ భోగాపురం ఎయిర్‌పోర్టు కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రఖ్యాత సంస్థలేమైనా ముందుకు వస్తాయేమోనని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబుతో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ సమావేశమయ్యారు.
 
 
ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. విశాఖ జిల్లా రాంబిల్లిలో రూ.5వేల కోట్ల పెట్టుబడులతో నావల్‌ షిప్‌బిల్డింగ్‌కు సంబంధించి 2వేల ఎకరాలు కేటాయించాలని అంబానీ కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని అనిల్‌ పేర్కొన్నారని సమాచారం. 4వేల మెగావాట్ల నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అలా్ట్ర పవర్‌ ప్రాజెక్టుపై ఇక ముందుకెళ్లలేమని అంబానీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల సామర్లకోటలోని రిలయన్స్‌ ఎనర్జీ 220మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని డిస్కమ్‌లు రద్దు చేసుకున్నాయి. ఈ అంశమూ భేటీలో చర్చకు వచ్చింది. పీపీఏల కాలపరిమితి ముగియడంతో రద్దు నోటీసును ఇప్పటికే జారీ చేశామని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌ వివరించారు.
 
 
దుర్గమ్మ సన్నిధిలో అంబానీ
విజయవాడ: అనిల్‌ అంబానీ సోమవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్‌ గౌరంగబాబు, ఈవో పద్మ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం అధికారులు అందజేశారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:
‘భోగాపురాని’కి రిలయన్స్‌ రెడీ?
15-05-2018 01:43:30
 
636619454109146862.jpg
  • చంద్రబాబుతో అనిల్‌ అంబానీ భేటీ
  • గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రస్తావన
  • టెండర్‌లో పాల్గొంటామని వెల్లడి
  • రాంబిల్లి నావల్‌ షిప్‌ బిల్డింగ్‌పైనా సమీక్ష
  • కృష్ణపట్నం పవర్‌ ప్రాజెక్టుపై నిస్సహాయత
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై రిలయన్స్‌ గ్రూప్‌ ఆసక్తిని చూపుతోంది. సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన రిలయన్స్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. త్వరలో పిలిచే టెండర్లలో తాము కూడా పాల్గొంటామని చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ఈ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎక్కువగా ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత పనులు చేపట్టడంలో జాప్యం చేస్తూ వచ్చింది. ఆపై ఎయిర్‌పోర్టును నిర్మించలేమని చెప్పేసింది. దీంతో ఈ సంస్థను నిర్మాణ బాధ్యతల నుంచి తప్పిస్తూ భోగాపురం ఎయిర్‌పోర్టు కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రఖ్యాత సంస్థలేమైనా ముందుకు వస్తాయేమోనని ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబుతో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ సమావేశమయ్యారు.
 
 
ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. విశాఖ జిల్లా రాంబిల్లిలో రూ.5వేల కోట్ల పెట్టుబడులతో నావల్‌ షిప్‌బిల్డింగ్‌కు సంబంధించి 2వేల ఎకరాలు కేటాయించాలని అంబానీ కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని అనిల్‌ పేర్కొన్నారని సమాచారం. 4వేల మెగావాట్ల నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అలా్ట్ర పవర్‌ ప్రాజెక్టుపై ఇక ముందుకెళ్లలేమని అంబానీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల సామర్లకోటలోని రిలయన్స్‌ ఎనర్జీ 220మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల గడువు ముగియడంతో వాటిని డిస్కమ్‌లు రద్దు చేసుకున్నాయి. ఈ అంశమూ భేటీలో చర్చకు వచ్చింది. పీపీఏల కాలపరిమితి ముగియడంతో రద్దు నోటీసును ఇప్పటికే జారీ చేశామని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌ వివరించారు.
 
 
దుర్గమ్మ సన్నిధిలో అంబానీ
విజయవాడ: అనిల్‌ అంబానీ సోమవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్‌ గౌరంగబాబు, ఈవో పద్మ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం అధికారులు అందజేశారు.

vidu valla kadu

Link to comment
Share on other sites

  • 2 weeks later...
16 minutes ago, bnalluri said:

already SPV undhi Govt 1000 cr pump chesi inko partner ni vethukoni complete cheyochu e AAI kani reliance kani vela valla kadhu idi

AAI vallu cheta kani appudu bid  enduku vesaro ardham kavtala lekapothe gmr ki vacchedi

Link to comment
Share on other sites

క్లార్క్‌ ఎయిర్‌పోర్టు రేసులో జిఎంఆర్‌,జివికె
28-05-2018 00:13:38
 
636630632217236029.jpg
హైదరాబాద్‌ : ఫిలిప్పీన్స్‌లోని క్లార్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (సిఐఎ) కార్యకలాపాలు, నిర్వహణ (ఒ అండ్‌ ఎం) కాంట్రాక్టును చేజిక్కించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన మౌలిక వసతుల దిగ్గజ కంపెనీలు జిఎంఆర్‌, జివికె పోటీపడుతున్నాయి. ఫిలిప్పీన్స్‌లోని టాగ్విగ్‌ సిటీలో ఈ నెల 21 నిర్వహించిన ప్రీ బిడ్‌ సమావేశంలో ఔత్సాహిక బిడ్డర్లందరూ పాల్గొన్నారని ఫిలిప్పీన్స్‌కు చెందిన బాసెస్‌ కన్వర్జేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (బిసిడిఎ) వెల్లడించింది. సుమారు 30కి పైగా సంస్థలు ఈ ప్రీ బిడ్‌ సమావేశానికి హాజరయ్యాయని బిసిడిఎ తెలిపింది.
 
ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాకు వంద కిలోమీటర్ల దూరంలో క్లార్క్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (గతంలో డియో్‌సడాడో మకాపాగల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌) ఉంది. మనీలాకు చెందిన భాగస్వామి మెగావైడ్‌తో కలిసి జిఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ.. గత ఏడాది డిసెంబరులో 25 కోట్ల డాలర్లకు క్లార్క్‌ ఎయిర్‌పోర్ట్‌.. ఇపిసి (ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌) కాంట్రాక్టును అందుకుంది. ఇపిసిలో భాగంగా ఏటా 80 లక్షల మంది ప్రయాణి కుల సామర్థ్యం గల కొత్త టెర్మినల్‌ను జిఎంఆర్‌, మెగావైడ్‌ నిర్మించాల్సి ఉంది. కాగా క్లార్క్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. నిర్వహణ, కార్యకలాపాల (ఒ అండ్‌ ఎం)కు సంబంధించి కంపెనీల ఎంపిక ప్రక్రియను రవాణా శాఖతో కలిసి ప్రారంభించినట్లు బిసిడిఎ తెలిపింది. ఒ అండ్‌ ఎం కోసం మెగావైడ్‌-జిఎంఆర్‌ కన్సార్షియం, మెట్రో పసిఫిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌ (ఎంపిఐసి), ఫిల్‌ఇన్వెస్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, జివికె ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌, గ్రూపే ఎడిపి.. బిడ్‌ డాక్యుమెంట్లను సమర్పించాయని వెల్లడించింది. కార్యకలాపాలు, నిర్వహణ వ్యవహారాలను ప్రపంచ స్థాయి విమానాశ్రయ ఆపరేటర్‌కు అప్పగించాలని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం భావిస్తోందని బిసిడిఎ ప్రెసిడెంట్‌, సిఇఒ వివెన్‌సియో డిజాన్‌ తెలిపారు. ఈ కాంట్రాక్టును ఆగస్టు 30 నాటికి కేటాయించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం క్లార్క్‌ విమానాశ్రయం నుంచి వారానికి 332 దేశీయ విమాన సర్వీసులు, 158 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
Link to comment
Share on other sites

ఎయిర్‌పోర్టు అథారిటీకే ‘భోగాపురం’
 
 
  • నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టి 30.2% రెవెన్యూ ఇచ్చేందుకు ఏఏఐ సుముఖం
  • గన్నవరం రన్‌వే విస్తరణకూ కేంద్రం ఓకే
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవరోధాలన్నీ తొలగిపోయాయి. రూ.2260.73 కోట్లతో నిర్మించే ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఇప్పటికే పర్యావరణ, రక్షణ శాఖ అనుమతులు లభించగా... నిర్మాణ, నిర్వహణ పనులను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చేపట్టనుంది. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సోమవారం ఓపెన్‌ చేసిన ఫైనాన్స్‌ బిడ్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ కార్పొరేషన్‌ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో టెండర్లను పిలిచింది. ఎయిర్‌పోర్టును నిర్మించి, నిర్వహణ బాధ్యతలు చేపడుతూనే... ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఇచ్చే విధంగా టెండర్లను పిలిచారు.
 
ఏఏఐతోపాటు విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణలో విశేషానుభవం కలిగిన జీఎంఆర్‌ సంస్థ బిడ్‌లు దాఖలు చేశాయి. ఏఏఐ 30.2ు రెవెన్యూ వాటాను ఇచ్చేందుకు ముందుకు వస్తే... జీఎంఆర్‌ సంస్థ 21.6ు మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తానని ప్రతిపాదించింది. దీంతో.. ఏ-1గా నిలిచిన ఏఏఐకి ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్‌ నిర్ణయించింది. తొలిదశలో ఎయిర్‌బ్‌స-ఏ380 విమనాలు దిగేలా ఎయిర్‌స్ట్రి్‌పను అభివృద్ధి చేస్తారు. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంతో విశాఖపట్నం విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి తగ్గుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా.. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో రూ.144.93 కోట్లతో రన్‌వే విస్తరణకు కేంద్ర పర్యావరణశాఖ అమోదం తెలిపింది
Link to comment
Share on other sites

విశాఖకు విమానమంటే కష్టమే
10-06-2018 02:26:27
 
636641943969489050.jpg
  •  రోజుకు 5గంటలు మూసివేత
  •  నవంబరు నుంచి అమలు
  •  నేవీ అవసరాలే కారణం
  •  16 విమానాలు రద్దయ్యే అవకాశం
  •  ఏపీ ఆర్థిక రాజధానికి ఇబ్బందే
  •  జీడీపీలో 9వ స్థానమూ కష్టమే...
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధానిగా వర్ధిల్లుతున్న విశాఖపట్నంకు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. గత నాలుగేళ్లలో దేశ సరిహద్దులను చెరిపేస్తూ అనేక విదేశీ విమాన సంస్థలకు ఆహ్వానం పలికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను విశాఖ ఆకర్షించింది. తూర్పు నౌకాదళం సారథ్యంలో నడుస్తోన్న విశాఖ విమానాశ్రయం రన్‌ వేను యుద్ధ విమానాల శిక్షణ కోసం ఉపయోగించుకోవాలని నేవీ నిర్ణయించింది. దీని కోసం రోజుకు ఐదు గంటలు పౌర విమాన సేవలు నిలిపివేయాల్సి వస్తుంది. దీనిపై గత నెలలో విమానాశ్రయం అధికారులు, విమాన సంస్థలతో నేవీ సమావేశం ఏర్పాటు చేసింది. తాము సూచించిన వేళల్లో విమానాలు నడపవద్దని కోరింది. నవంబరు ఒకటవ తేదీ నుంచి పూర్తిగా విమానాశ్రయాన్ని స్వాధీనంలోకి తీసుకుంటామని, ప్రస్తుతం నడుస్తున్న విమానాలను రీ షెడ్యూల్‌ చేసుకోవాలని నావికాదళ అధికారులు స్పష్టం చేశారు.
 
కారణం ఇదీ...
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన తూర్పు నావికా దళ స్థావరం వ్యూహాత్మకంగా కీలకమైంది. యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా దీనిని మరింత విస్తరిస్తూ విశాఖకు 50 కిలోమీటర్ల దూరాన రాంబిల్లిలో మరో ప్రత్యామ్నాయ స్థావరం ఏర్పాటు చేశారు. నావికాదళ వైమానిక స్థావరం ఐఎన్‌ఎ్‌స డేగలో విశాఖ విమానాశ్రయం ఓ భాగం. అత్యాధునిక యుద్ధ విమానం మిగ్‌ 29కె స్క్వాడ్రన్‌ ‘డేగ’ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. భవిష్యత్తు అవసరాల రీత్యా ఇక్కడ పైలట్లకు శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. మిగ్‌ 29 కెలను నడపాలంటే ఎటువంటి ఆటంకాలు లేని, పొడవైన రన్‌వే అవసరం. పౌర విమాన సేవలకు వినియోగిస్తున్న 10 వేల మీటర్ల రన్‌వేను నవంబరు నుంచి ఉపయోగించుకోవాలన్న నేవీ నిర్ణయంతో ఇప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
 
నిలిపివేసే వేళలు ఇవే...
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పౌర విమానాలను అనుమతించరు. అలాగే మంగళ, గురువారాల్లో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తారు. రన్‌వే నిర్వహణ కోసం శని, ఆదివారాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రాకపోకలను అనుమతించరు. దీనితో మొత్తం రోజుకు 16 విమానాలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీనితో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్రమైన దెబ్బతగులుతుంది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, కాండ్యుయెంట్‌ వంటి ఐటీ సంస్థల ప్రతినిధులు విశాఖకు రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడిప్పుడే విదేశీయులను ఆకర్షిస్తున్న పర్యాటక రంగంతో పాటు ఫార్మా, సీఫుడ్‌, అపెరల్‌ ఉత్పత్తులపైనా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం జీడీపీలో దేశంలో తొమ్మిదవ స్థానంలో వుంది. నేవీ నిర్ణయం వల్ల ఈ స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.
 
జాతి ప్రయోజనాలు ముఖ్యం
దేశ, జాతి ప్రయోజనాల కోసం నేవీ పనిచేస్తోంది. వారికి అవసరమంటే విమానాశ్రయం ఇవ్వకతప్పదు. నైట్‌ పార్కింగ్‌ సౌకర్యం ఉంది కాబట్టి విమాన సంస్థలు రీషెడ్యూలింగ్‌ చేసుకుంటే బాగుంటుంది.
  - కంభంపాటి హరిబాబు, ఎంపీ, విశాఖ
 
ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు
నౌకాదళ అధికారులు రోజుకు ఐదు గంటలు విమానాశ్రయం కావాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పౌర విమాన శాఖ అధికారులకు తెలియజేశాం. అక్కడి నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు.
- జి.ప్రకాశ్‌రెడ్డి, డైరెక్టర్‌, విమానాశ్రయం
 
భోగాపురం రాక ముందే!
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాక దీనిని తీసుకుంటే అభ్యంతరం లేదు. కాని అక్కడ రాకముందే ఇక్కడ రాకపోకలు తగ్గించేస్తే విశాఖలో వాణిజ్య వ్యవహారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేవీకి అవసరాలకు బాడంగిలో కానీ, రాంబిల్లిలో కానీ రన్‌వేలు నిర్మించుకునే అవకాశాలను పరిశీలించాలి.
- ఓ.నరేశ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు, విమాన ప్రయాణికుల సంఘం
 
విశాఖ తెర వెనక్కే
విశాఖపట్నం అభివృద్ధిలో పోర్టు, నేవీ ఎంత కీలకమో... విమానాశ్రయానికీ అంతే భాగస్వామ్యం ఉంది. విదేశీ వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెరుగుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అభివృద్ధికి గొడ్డలి పెట్టు.
- వర్మ, విమాన ప్రయాణికుల సంఘం ఉపాధ్యక్షులు
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...