Jump to content

Neeru Chettu


Recommended Posts

  • Replies 283
  • Created
  • Last Reply

Top Posters In This Topic

i just saw morning article in EEnadu paper, they starting another camping for "Tree plantation", last time "Rainwater Harvesting" pits lo janalanu educate cheyyatam lo it did very good part.

Government "Neeru Chettu" lo prajalu palgonatam lo it worked very well. Ye Tree Plantation kuda danila success avvalani Gov. help avvalani asiddam..

migatha ye vaina ye point meda ne EEnadu FAN aipoya, journalism VALUES yenka yemanna migilithe yen vokka papaer lone anukuntaa  :)

Link to comment
Share on other sites

నర్సీపట్నంలో చెరువులు తవ్వించేందుకు రూ.80 కోట్లు : మంత్రి అయ్యన్నపాత్రుడు
 
విశాఖ: నర్సీపట్నం నియోజకవర్గంలో 320 చెరువులు తవ్వించేందుకు రూ.80కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి రెండు సంవత్సరాల్లో రూ.600కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు.  ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్లు, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంత ఉండాలని మంత్రి కోరారు. ఏపీలో 50కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అయ్యన్నపాత్రుడు వివరించారు.
Link to comment
Share on other sites

ఏబిఎన్ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి విశేష స్పందన
 
636016934513209066.jpg
విశాఖ : ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన వనం కోసం మనం కార్యక్రమంలో భాగంగా గురువారం విశాఖ బీచ్ రోడ్డులో మొక్కలు నాటింది. నవ్యాంధ్రప్రదేశ్‌ను హరితవనంలా మార్చాలన్న పిలుపు అందుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏపీలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో గురువారం ఉదయం పలు మండలాల్లో వనం కోసం మనం కార్యక్రమం జరిగింది. పెదగంట్యాడ మండలం సత్యనారాయణపురంలో వనం కోసం మనం కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నర్సీపట్నం 27వ వార్డులో వనం కోసం మనం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. బుచ్చయ్యపేట మండలం డిబ్బిడిలో వనం కోసం మనం కార్యక్రమం జరిగింది. దేవరాపల్లి, కోటవురట్ల, మాకవరపాలెం, పాయకరావుపేట, నాతవరం, కొయ్యూరు మండలాల్లో వనం కోసం మనం కార్యక్రమం జరిగింది.
Link to comment
Share on other sites

 

ఏబిఎన్ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి విశేష స్పందన

 

636016934513209066.jpg
విశాఖ : ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన వనం కోసం మనం కార్యక్రమంలో భాగంగా గురువారం విశాఖ బీచ్ రోడ్డులో మొక్కలు నాటింది. నవ్యాంధ్రప్రదేశ్‌ను హరితవనంలా మార్చాలన్న పిలుపు అందుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏపీలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో గురువారం ఉదయం పలు మండలాల్లో వనం కోసం మనం కార్యక్రమం జరిగింది. పెదగంట్యాడ మండలం సత్యనారాయణపురంలో వనం కోసం మనం కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నర్సీపట్నం 27వ వార్డులో వనం కోసం మనం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. బుచ్చయ్యపేట మండలం డిబ్బిడిలో వనం కోసం మనం కార్యక్రమం జరిగింది. దేవరాపల్లి, కోటవురట్ల, మాకవరపాలెం, పాయకరావుపేట, నాతవరం, కొయ్యూరు మండలాల్లో వనం కోసం మనం కార్యక్రమం జరిగింది.

 

 

 

Arey ABN vizag Beach road lo plants natina avi 1 week lo ne die because of huge air from sea adi waste 

 

emana unte 1st natalsina chota natandi

Link to comment
Share on other sites

అనంతపురంలో వనం కోసం మనం...3 లక్షల మొక్కలు నాటారు...
 
అనంతపురం: అనంతపురంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో 'వనం కోసం మనం కార్యక్రమం' జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా  నగరంలో 3 లక్షల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

గిద్దలూరులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
 
ప్రకాశం: గిద్దలూరు గిరిజన సంక్షేమ హాస్టల్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో వనం కోసం మనం కార్యక్రమం కింద  మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, డీఎఫ్‌ఓ ఖాదర్‌, మునిసిపల్‌ కమీషనర్‌ శంకర్‌రావులు పాల్గొన్నారు. 
Link to comment
Share on other sites

విశాఖపట్నం : ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేపట్టిన 'వనం కోసం మనం' కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. శనివారం నర్సీపట్నం బీఆర్‌ కాలేజీలో వనం కోసం మనం కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్ సన్యాసిపాత్రుడు, కౌన్సిలర్లు, అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

Link to comment
Share on other sites

అనంతపురం: అనంతపురం నగరంలోని అరవిందనగర్‌లో నీరు- చెట్టులో భాగంగా మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలు మొక్కలు నాటారు. రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా ఆదర్శంగా నిలవాలని  పరిటాల సునీత కోరారు.

Link to comment
Share on other sites

విశాఖ: అచ్యుతాపురం మండలంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో వనం కోసం మనం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యే రమేష్‌బాబు ప్రశాంతి పాలిటెక్నిక్‌ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలో లక్ష మొక్కలు నాటుతామని ఎమ్మెల్యే రమేష్‌బాబు చెప్పారు.

Link to comment
Share on other sites

పచ్చని.. ప్రణాళిక
19-06-2016 10:18:28
636019283063073322.jpg
  • రాజధాని 19 నర్సరీల్లో మొక్కల పెంపకం 
  • సీఆర్‌డీఏ పరిధిలో 56 మండలాల్లో గ్రీనరీ పెంపునకు ఏర్పాట్లు 
ఆంధ్రజ్యోతి, విజయవాడ : రాజధాని ప్రాంత పరిధిలోని 19 నర్సరీ కేంద్రాల్లో పెంచిన మొక్కలను పూర్తి స్థాయిలో వినియోగించాలని సీఆర్డీఏ నుంచి అటవీ శాఖకు సూచనలు వెళ్లినట్టు సమాచారం. ఈ సూచనల ప్రకారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో గత ఏడాది లక్ష్యంలో భాగంగా నర్సరీ కేంద్రాల్లో పెంచిన మొక్కలను వినియోగించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాజధానిలోని వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణమవుతున్న తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో అవసరాల మేరకు ఈ మొక్కలను నాటించాలని యంత్రాంగం ప్రయత్నిస్తోంది. 41.9 ఎకరాల విశాల ప్రాంగణంలో సచివాలయ భవనాలు నిర్మాణమవుతున్న విషయం తెలిసిందే. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం వెచ్చించే ప్రాంతం మినహా మిగిలిన స్థలంలో అధికారులు ఈ మొక్కలను నాటించేలా చూడనున్నారు. ఈ కార్యక్రమాన్ని సచివాలయ నిర్మాణం పూర్తయిన తరువాత చేపట్టేలా అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు రాజధాని గ్రామాల్లో రహదారుల వెంబడి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోనున్నారని సమాచారం. కానీ ఈ పనులను తక్షణమే ఆరంభించడానికి ప్రస్తుతం ఉన్న రహదారులు, ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటితే భవిష్యత్తులో ఆమోదిత మాస్టర్‌ ప్లాన ప్రకారం ఆయా ప్రాంతాల్లో రానున్న నిర్మాణాలకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది.
 
రాజధాని నర్సరీల్లో 45 లక్షల మొక్కల పెంపకం..
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గత రెండేళ్ల నుంచి గుంటూరు జిల్లాలో అటవీ శాఖ అధికారులు ఏటా కోటి మొక్కలను పెంచుతున్నారు. వీటిని రాజధాని ప్రాంతంలో ఉన్న 19 నర్సరీ కేంద్రాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న అటవీ
మొక్కల పెంపకం క్షేత్రాలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో పెంచుతున్నారు. ఇందులో దాదాపు 45 లక్షల మొక్కల పెంపకాన్ని కేవలం రాజధాని ప్రాంత గ్రామాల్లోనే పెంచుతున్నారు. పలు కార్యక్రమాల ద్వారా సీఆర్డీఏ పరిధిలోని 56 మండలాల్లో పెద్దఎత్తున పచ్చదనం పెంపునకు అటవీ శాఖ ప్రణాళికలు రచిస్తోంది.
Link to comment
Share on other sites

ఆంధ్రజ్యోతి’ స్ఫూర్తితో 10లక్షల మొక్కలు నాటుతాం : ఎంపీ అవంతి

 

విశాఖపట్టణం : ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ స్ఫూర్తితో నియోజకవర్గంలో 10లక్షల మొక్కలను నాటుతామని పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. కసీంకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో వనం కోసం మనం కార్యక్రమంపై అవగాహన ర్యాలీ, మానవహారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పీలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోవింద్ మాట్లాడుతూ... అనకాపల్లి నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటుతామన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...