Jump to content

AP government to make state a renewable energy hub


Recommended Posts

  • Replies 233
  • Created
  • Last Reply

రికార్డు స్థాయిలో తగ్గిన సౌర ధర!

కడప సౌరపార్కులో యూనిట్‌ ధర రూ.3.15 పైసలు

ఈనాడు, అమరావతి: సౌర విద్యుత్‌ ధర రికార్డు స్థాయిలో తగ్గింది. కడప సౌర పార్కు ఇందుకు వేదికైంది. జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ) 250 మెగావాట్లకు నిర్వహించిన టెండరులో సొలైర్‌డైరెక్ట్‌ అందరి కంటే తక్కువ ధరను కోట్‌ చేసింది. ఎన్టీపీసీ తాజాగా నిర్వహించిన రివర్స్‌ ఆక్షన్‌లో యూనిట్‌ ధరను రూ.3.15 పైసలు మాత్రమే కోట్‌ చేసి టెండరును దక్కించుకుంది. ఇది దేశంలోనే సౌర విద్యుత్‌ రంగంలో అతి తక్కువ ధర. కడప జిల్లాలో వెయ్యి మెగావాట్ల సౌర పార్కును ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇందులో 250 మెగావాట్లను ఎన్టీపీసీకి అప్పగించింది. మిగిలిన 750 మెగావాట్ల సౌర యూనిట్ల నిర్మాణ బాధ్యతను సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌(సెకీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఇందులో వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) కింద యూనిట్‌ రూ.4.50 పైసలకే దాదాపు 650 మెగావాట్లను అభివృద్ధి చేయాలని సెకీ అనుకుంది. అయితే సౌర రంగంలో రేట్లు పడిపోయిన నేపథ్యంలో వీజీఎఫ్‌ పద్ధతిపై సెకీ పునరాలోచనలో పడింది. వంద మెగావాట్లు బ్యాటరీ ఆధారంగా నిర్మించాలని టెండరు పిలిచినా ఆ ప్రక్రియకూ తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లు తెలిసింది

Link to comment
Share on other sites

  • 2 weeks later...
సౌర, పవన విద్యుత్‌లో రాష్ట్రానిదే అగ్రస్థానం
 
636289474572940661.jpg
  •  ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ 
ఎర్రగుంట్ల, ఏప్రిల్‌ 27: ఇంధన రంగంలో పెనుమార్పులు వస్తున్నాయని, దానికి అనుగుణంగా సౌర,పవన్‌ విద్యుత్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీజెన్‌కో చైర్మన్‌ అజయ్‌జైన్‌ పేర్కొన్నారు. కడప జిల్లా ఆర్టీపీపీలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం 2014లో 22.5 మిలియన్‌ యూనిట్స్‌ ఒక రోజుకు లోటు ఉండేదని, అయితే సీఎం కీలక నిర్ణయాలతో రాష్ట్రం పవర్‌ సర్‌ప్లస్‌ రాష్ట్రంగా మారిందన్నారు. రెండేళ్లక్రితం విద్యుదుత్పత్తిలో 7వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాయలసీమలో పెద్దఎత్తున సోలార్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాగుకు ఉపయోగపడని భూమి ఉన్నందున ఇక్కడ సోలార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా 22ప్రాజెక్టులు మంజూరు చేస్తే రాష్ట్రానికి 4 మంజూరు చేసినట్లు తెలిపారు. దీన్ని అనంతపురం జిల్లా కదిరిలో 1000 మెగావాట్లతో ఎన్టీపీసీ వారు కడుతున్నారు. 250 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే ఉత్పత్తిలో ఉందన్నారు. అప్పుడు ఒక యూనిట్‌కు రూ.5.96 టారీఫ్‌ వచ్చిందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద వేయి మెగావాట్ల ప్లాంటు మంజూరు అయ్యిందన్నారు. దీనికి 4.63 టారీఫ్‌ వచ్చింది. ఒకే చోట వేయి మెగావాట్ల ప్లాంటు ఉండటం ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్‌ అన్నారు. ఇప్పటికే 900 మెగావాట్ల ఉత్పత్తి అవుతోందన్నారు. కడప జిల్లా గాలివీడు వద్ద 500 మెగావాట్ల ప్లాంటుకు అనుమతి రాగా 400 మెగావాట్లకు అవార్డు చేసినట్లు తెలిపారు. ఇందులో ఒకయూనిట్‌ రూ.4.50 టారిఫ్‌ కోడ్‌ చేసినట్లు తెలిపారు. జెన్‌కో ఆధ్వర్యంలో తాడిపత్రి వద్ద 500 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందన్నారు. అక్కడ కూడా 400 మెగావాట్లకు అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. దీనికి టారీఫ్‌ 3.90 వచ్చినట్లు తెలిపారు. కడప జిల్లా మైలవరంలో 250 మెగావాట్లకు ఎన్టీపీసీ టెండర్‌ పిలిచినట్లు తెలిపారు.
Link to comment
Share on other sites

నెల్లూరు జిల్లాలో పవన విద్యుత్‌ కేంద్రం

ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లా అనంతవరం వద్ద పవన విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకు జస్ట్‌యాంప్‌ పవర్‌గేర్‌ విండ్‌స్టీల్‌ సంస్థ ముందుకొచ్చింది. అనంతవరం వద్ద 65 ఎకరాల విస్తీర్ణంలో పవన విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయనుంది. పవన విద్యుదుత్పత్తికి ఈ స్థలంలో 300 గాలిమరలను ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఆ సంస్థ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం పవన్‌ విద్యుత్‌ కేంద్రానికి భూమి కేటాయిస్తూ సోమవారం ఆదేశాలిచ్చింది. ఎకరానికి రూ.16లక్షలు మార్కెట్‌ ధరగా నిర్ణయించింది.

Link to comment
Share on other sites

Guest Urban Legend

china lo kuda vunnai annai one of the anna andhuke

original source lo worlds biggest ani vundhi :D

 

 

Ok bro

 

 

correction brother

This is the Worlds Largest Solar Park :no1:

Link to comment
Share on other sites

  • 2 weeks later...

సౌర విద్యుత్తు రేట్లపై సమీక్ష!

రోజురోజుకు చౌక అవుతుండడమే కారణం

ఈనాడు, అమరావతి: సౌర విద్యుత్తు రేట్లు గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో ఇప్పటి వరకూ చేపట్టిన వాటిపై సమీక్ష నిర్వహించే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వముంది. కడపలోని గాలివీడుకు నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) నిర్వహించిన వేలంలో యూనిట్‌ రేటు రూ.3.15గా వచ్చింది. దీని విషయంలో కూడా ఇంకా ధర తగ్గుతుందేమో పరిశీలించాలని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అనంతపురం జిల్లాలోని కదిరి సౌర పార్కులో 250 మెగావాట్లు ఇప్పటికే సౌర విద్యుత్తు ఉత్పాదన జరుగుతోంది. ఇందులో యూనిట్‌ రేటు రూ.5.96. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో కర్నూలు జిల్లాలోని గని-శకునాల సౌరపార్కులో కూడా 900 మెగావాట్ల మేర నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం, కర్నూలు సౌర పార్కుల్లో ఇప్పటి వరకూ అయిన ప్రాజెక్టుల విషయంలో ధర సవరణకు అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని విద్యుత్తు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా గాలివీడులో యూనిట్‌ రూ.4.43 చొప్పున 400 మెగావాట్లకు ఆంధ్రప్రదేశ్‌ సౌర విద్యుత్తు సంస్థ అభివృద్ధిదారులతో ఈ మధ్యనే ఒప్పందం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలోని తలారిచెరువులో ఏపీజెన్‌కో 500 మెగావాట్ల సౌర పార్కును నెలకొల్పుతోంది. ఈపీసీ పద్ధతిలో దీని నిర్మాణాన్ని ఏపీజెన్‌కో చేపట్టింది. 400 మెగావాట్లకు ఆసక్తి వ్యక్తీకరణ లేఖను (ఎల్‌ఓఐ) జారీ చేసింది. మెగావాట్‌కు రూ.4.40 కోట్లు అవుతుందని అంచనా. ఈ ప్రకారం యూనిట్‌ ధర రూ.3.99 కావొచ్చని తెలుస్తోంది. టెండరు ప్రకారం వినియోగ సామర్థ్య కారకం (సీయుఎఫ్‌) 19 శాతమే. అయితే గని-శకునాలలో సౌర విద్యుత్తు (సీయుఎఫ్‌) 27 శాతం వరకు వస్తోంది. తలారిచెరువులో కూడా సీయుఎఫ్‌ 25 శాతం వరకూ వస్తే అపుడు యూనిట్‌ రేటు రూ.3.60 కొవొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజస్థాన్‌లో అతి తక్కువ ధర (యూనిట్‌ రూ.2.44) వచ్చిన నేపథ్యంలో సౌర విద్యుత్తు ధరలు రాష్ట్రంలో కూడా తగ్గవచ్చని, తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై ఏం చేయబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Link to comment
Share on other sites

సౌర వనాలు..ప్రగతి ఫలాలు

విద్యుత్తు రంగంలో రాష్ట్రం స్వావలంబన

సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం

నాలుగువేల మెగావాట్ల పార్కులకు బీజం

పవన విద్యుత్తు సామర్థ్యం 3,603 మెగావాట్లు

ఈనాడు - అమరావతి

6ap-main2a.jpg

సౌర విద్యుదుత్పాదనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిచింది. పవన రంగంలోనూ దూకుడు ప్రదర్శించింది. మూడేళ్లలో పవన, సౌర విద్యుదుత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. 2014 సెప్టెంబరులో అనంతపురం(ఎన్‌పీ కుంట) సౌర పార్కు నిర్మాణంపై జాతీయ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ)తో అవగాహన ఒప్పందం కుదిరింది. అలా మొదలైన సౌర పార్కుల ప్రస్థానం భారీగా విస్తరించింది. నాలుగు వేల మెగావాట్ల పార్కులకు బీజం పడింది. సౌర, పవన విధానాలను ప్రోత్సహించడంతో ఈ ఏడాది మే నాటికి రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల స్థాపక సామర్థ్యం 6,152 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్తు సామర్థ్యం 3,603 మెగావాట్లు కాగా సౌర సామర్థ్యం 1,980 మెగావాట్లు. మూడేళ్లలో పెరిగిన సౌర సామర్థ్యం 1,813.22 మెగావాట్లు కాగా పెరిగిన పవన సామర్థ్యం 2,872.75 మెగావాట్లు.

పునరుత్పాదక ఇంధన వనరులు.. ముఖ్యంగా సౌర రంగంపై ప్రపంచమంతా దృష్టి సారిస్తోంది. ఈ రంగంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సౌర విద్యుత్తు ధర బొగ్గు ప్రాజెక్టుల విద్యుత్తు ధర స్థాయికి దిగివచ్చింది. ఇదే తరుణంలో సౌర విద్యుత్తును నిల్వ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సౌర నిల్వకు టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రయోగం సఫలమైతే దాన్ని విస్తరించాలనే సంకల్పంలో ఉంది. సౌర మినీగ్రిడ్‌ల ద్వారా ఎక్కడికక్కడ స్థానికంగానే విద్యుత్తు అందించాలనేది ఆశయం.

సౌర పంపుసెట్లలోనూ..

రాష్ట్రంలో సుమారు 14 వేల సౌర పంపుసెట్లను రైతులకు ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రాయితీ(రూ.1.62 లక్షలు)కి తోడు విద్యుత్‌ పంపిణీ సంస్థలు కొంత మొత్తాన్ని భరిస్తున్నాయి. రూ.55 వేలు రైతు చెల్లిస్తే సరిపోతుంది. రైతుల వద్ద మిగిలే సౌర విద్యుత్‌ కొనే ప్రయత్నాలకు ఇంకా బీజం పడలేదు. రాష్ట్రంలో లక్ష పంపుసెట్లకు సౌర విద్యుత్‌ కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

6ap-main2b.jpg

తోడ్పడిన అంశాలు

ఒక మెగావాట్‌ సౌర విద్యుత్‌ యూనిట్‌ నిర్మాణానికి సుమారు ఐదెకరాల భూమి కావాలి. భూసేకరణ అత్యంత ఇబ్బందికరమైన అంశం. ఈ ఇబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు అధిగమించింది. దాదాపు 27 వేల ఎకరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో కొద్దిగా మినహా సేకరణ కూడా పూర్తయింది.

* సౌరపార్కుల అభివృద్ధికి కేంద్రం చేయూతనిచ్చింది. వీటిల్లో మౌలిక వసతులకుగాను మెగావాటúకు రూ.20 లక్షల చొప్పున సాయం చేసింది.

* ప్రపంచవ్యాప్తంగా సౌర ఫలకాల ధర తగ్గడం వరమైంది. ఉత్పత్తిదారుల్లో పోటీ పెరిగి సౌర విద్యుత్‌ ధర తగ్గింది. తద్వారా దాన్ని ఉపయోగించుకోవడం సులువయింది.

* సౌర విద్యుత్‌ను తప్పనిసరిగా వాడుకుంటామనే భరోసాతో ‘మస్ట్‌రన్‌’ హోదాను ప్రభుత్వం సౌర ప్రాజెక్టులకు కల్పించింది. పరిశ్రమ హోదానిచ్చింది.

* రాష్ట్ర పరిధిలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ ఛార్జీల నుంచి సౌర ప్రాజెక్టులకు మినహాయింపు లభించింది. విద్యుత్‌ నష్టాల భారమూ లేదు.

6ap-main2e.jpg

పవన రంగంలో....

పవన రంగంలో విద్యుత్‌ ఛార్జీలను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ఖరారు చేస్తోంది. పవన విద్యుత్‌ ఛార్జీల ఖరారు నిబంధన (2015) ఇందుకు అవకాశం కల్పిస్తోంది. 2015 ఆగస్టు నుంచి 2016 మార్చి వరకు ఆచరణలోకి వచ్చే పవన ప్రాజెక్టుల విద్యుత్‌ ప్రాజెక్టుల ఛార్జీని ఈఆర్‌సీ ఖరారు చేసింది. దాని ప్రకారం యూనిట్‌ ధర రూ.4.84 పైసలు. వేగవంతమైన తరుగుదల (యాక్సిలరేటెడ్‌ డిప్రిసియేషన్‌)తో అయితే ఈ ధర యూనిట్‌ రూ.4.25 పైసలు. అయితే కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం అందిస్తున్నందున ఆ మొత్తం పవన విద్యుదుత్పత్తిదారు నుంచి తమకు వచ్చేలా పవన విద్యుత్‌ ఛార్జీని సవరించాలని డిస్కమ్స్‌ ప్రతిపాదించాయి. అయితే ఏ సంవత్సరం రేటు ఆ సంవత్సరం ఖరారవుతున్న నేపథ్యంలో ఇపుడు తగ్గించాలని కోరడం సహేతుకం కాదన్న వాదన వినిపిస్తోంది.

* పవన విద్యుత్తులో సుజలాన్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. పవన ఛార్జీల ధర తగ్గడంతో ఈ ఒప్పందం నుంచి బయటపడాలని యోచిస్తోంది.

* పవన విద్యుత్‌లో తమిళనాడు దేశంలో ముందుంది. అయితే 2016-17లో 2,190 మెగావాట్లను అదనంగా చేర్చడం ద్వారా రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచింది.

ఆర్‌పీవో షరతు!

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా తాను ఉపయోగించే విద్యుత్‌లో తప్పనిసరిగా పునరుత్పాదక ఇంధన వనరుల విద్యుత్‌ వాటా కలిగిఉండాలి. ఇదే పునరుత్పాదక కొనుగోలు నిబంధన (ఆర్‌పీవో). ఇది ఎంత ఉండాలనేది ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయించింది. దీని ప్రకారం 2021-22నాటికి రాష్ట్ర విద్యుత్‌ వాడకంలో సౌర విద్యుత్‌ వాటా ఏడు శాతం ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మూడు శాతం ఉంటే సరిపోతుంది. సౌరేతర వాటా 2021-22 నాటికి పది శాతం ఉండాలి. పవన విద్యుత్‌ కూడా ఇందులో ఉంటుంది. ఆ ఏడాదికి మొత్తం మీద పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 17 శాతం అవ్వాలి. సౌర విద్యుత్‌ స్థాపక సామర్థ్యంలో దూకుడు ప్రదర్శించినందున ప్రస్తుత సంవత్సరంలో ఆర్‌పీవోను చేరుకోవడం ఇబ్బంది కాకపోవచ్చు.

* దేశస్థాపక సామర్థ్యం ప్రస్తుతం 12 వేల మెగావాట్లకు పైగా చేరుకుంది. గత జనవరిలో ఇది 9,235 మెగావాట్లే. ఈవిషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగంలో నిలిచింది. తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు దీనికి పెద్ద పీట వేస్తున్నాయి.

* అనంతపురం- ఎన్‌పీ కుంట, కర్నూలు- గని శకునాల సౌర పార్కులో ప్రస్తుతం రోజుకు వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి అవుతోంది. దీని వినియోగ సామర్థ్య కారకం 25 శాతం వరకూ ఉంటుంది.

సౌర పార్కులకు భూసేకరణ తీరు

6ap-main2c.jpg

రాష్ట్రంలో సౌర పార్కుల సాకారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌ సౌర విద్యుత్‌ సంస్థను నెలకొల్పాయి. దీని ద్వారానే భూసేకరణ, ‘పార్కుల’ అభివృద్ధి జరుగుతోంది.

* అనంతపురం సౌర పార్కులో 250 మెగావాట్లు, కర్నూలు సౌరపార్కులో 900 మెగావాట్లు ఇప్పటికే సాకారమయ్యాయి. కర్నూలులో మరో వంద మెగావాట్లూ త్వరలో అందుబాటులోకి రానుంది. మరో 1,050 మెగావాట్లకు టెండర్ల ప్రక్రియ ముగిసింది.

* రాష్ట్రంలో ఇళ్ల పైకప్పు సౌర విద్యుత్‌ (సోలార్‌ రూఫ్‌టాప్‌) స్థాపక సామర్థ్యం 15 మెగావాట్లకు చేరుకుంది. ఈ విద్యుత్‌ను వాడుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం నెట్‌మీటరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. వినియోగదారుడు తన అవసరాలకు సౌర విద్యుత్‌ను వాడుకోవచ్చు. మిగిలితే విద్యుత్‌సంస్థలకు విక్రయించవచ్చు. సోలార్‌ రూఫ్‌టాప్‌ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి.

* కేంద్రం ఇచ్చే 30 శాతం రాయితీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం ఇస్తే మరింత మంది ముందుకువచ్చే అవకాశం ఉంది.

* కర్నూలు సౌర పార్కు ఒక రకంగా దేశాన్ని మలుపుతిప్పింది. ధరల తగ్గుదలకు నాంది పలికింది. సౌరఫలకాల ధర తగ్గడం ఒక ఎత్తయితే భూమి సిద్ధంగా ఉండడం వల్ల వెంటనే ప్రాజెక్టులను నెలకొల్పే అవకాశమూ కలిగింది. తద్వారా పెట్టిన పెట్టుబడికి వెంటనే ఆదాయం వచ్చింది.

సౌర, పవన ప్రాజెక్టులు రాయలసీమలోనే ప్రధానంగా కేంద్రీకృతమయ్యాయి. వీటిల్లో ఉత్పత్తయిన విద్యుత్‌ను ఉపయోగించుకునేందుకు ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ కావాలి. దీని ఏర్పాటులోనూ రాష్ట్రం చొరవ చూపింది.

6ap-main2d.jpg

సౌర విద్యుత్‌ స్థాపక సామర్థ్యంలో మనదే అగ్రస్థానం

6ap-main2f.jpg

దేశంలో పునరుత్పాదక ఇంధన వనరులను 175 గిగావాట్లకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని రాష్ట్రం అందిపుచ్చుకుంది. రాష్ట్రంలో 18 గిగావాట్లు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు. పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహంలో భాగంగానే సౌర, పవన విద్యుత్‌ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు జిల్లాలోని గని-శకునాలలో ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సౌర పార్కు నిర్మించింది. ఇది ప్రపంచంలోనే పెద్దది. సౌర విద్యుత్‌ స్థాపక సామర్థ్యంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పవన విద్యుత్‌ను రాష్ట్రంలో భారీగా పెంచుతున్నాం. దీనివల్ల విద్యుత్‌ సుస్థిరతను సాధించవచ్చు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలపై ఆధారపడడం క్రమంగా తగ్గుతుంది. థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు సమృద్ధిగా లేకపోయినప్పటికీ సౌర, పవన విద్యుత్‌ ద్వారా రాష్ట్ర అవసరాల మేర విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నాం. సౌర విద్యుత్‌ను నిల్వ చేసుకునే ప్రయత్నాలకు రాష్ట్రం శ్రీకారం చుట్టింది.

-అజయ్‌జైన్‌, ఇంధన, మౌలికవసతులు, పెట్టుబడులశాఖ ముఖ్యకార్యదర్శి.

 
Link to comment
Share on other sites

Azure Power commissions 100 MW NTPC solar power plant in Andhra Pradesh

 

Azure Power will supply power to NTPC for 25 years at a tariff of Rs. 5.12 per kWh.
 
solar-power-plant-AP-PTI.jpg
 

Azure Power has commissioned a 100 MW solar power plant in Andhra Pradesh. The project was auctioned by state-run power producer NTPC, Azure Power said in a statement today. According to the statement, the solar plant has been set up at Kurnool Ultra Mega Solar Park with a total capacity of 1,000 MW. The solar park is being developed by Solar Park Implementation Agency (SPIA) and Andhra Pradesh Solar Power Corporation Limited (APSPCL). Azure Power will supply power to NTPC for 25 years at a tariff of Rs 5.12 (USD 7.9 cents) per kWh. Spread across 500 acres of land in Andhra Pradesh, the project will help in electrifying the nearby areas, it said. Inderpreet Wadhwa, founder and chief executive officer of Azure Power said, “We are delighted to make a contribution towards realisation of our Prime Minister’s commitment towards clean and green energy, through solar power generation.” Azure Power is a leading solar power producer in India with a portfolio of over 1,000 MWs across 18 states.

Link to comment
Share on other sites

Azure Power commissions 100 MW NTPC solar power plant in Andhra Pradesh

 

Azure Power will supply power to NTPC for 25 years at a tariff of Rs. 5.12 per kWh.
 
 

Azure Power has commissioned a 100 MW solar power plant in Andhra Pradesh. The project was auctioned by state-run power producer NTPC, Azure Power said in a statement today. According to the statement, the solar plant has been set up at Kurnool Ultra Mega Solar Park with a total capacity of 1,000 MW. The solar park is being developed by Solar Park Implementation Agency (SPIA) and Andhra Pradesh Solar Power Corporation Limited (APSPCL). Azure Power will supply power to NTPC for 25 years at a tariff of Rs 5.12 (USD 7.9 cents) per kWh. Spread across 500 acres of land in Andhra Pradesh, the project will help in electrifying the nearby areas, it said. Inderpreet Wadhwa, founder and chief executive officer of Azure Power said, “We are delighted to make a contribution towards realisation of our Prime Minister’s commitment towards clean and green energy, through solar power generation.” Azure Power is a leading solar power producer in India with a portfolio of over 1,000 MWs across 18 states.

unit Rs5.12 antunadu... idhi ekkuva kadha

Link to comment
Share on other sites

In first, Andhra to store solar energy for farmers

 

Andhra Pradesh is going to be the first State in the country and Asia to store solar energy to facilitate power supply to agriculture sector, bringing an end to farmers’ dependence on grid-based power supply for cultivation.

 

The move to store around 100 MW power was taken month after Chief Minister N Chandrababu Naidu returned from the US.

 

The solar energy storage facilities are available in the US and in some of the European countries.

 

The CM drafted the blueprint for the action plan after holding a detailed discussion  with Energy Department Principle Secretary Ajay Jain and CMD of AP Transco K Vijayanand.

 

Following which, the Power Transmission Corporation of Andhra Pradesh took up a pilot project and floated an international tender for lithium ion batteries with storage capacity of 1 mega watt.

 

Some of companies, like Power Grid Corporation of India and L&T, have only experimented this concept with 500 KV and 300 KV storage capacity.

 

AP Transco is establishing 1 MW solar energy storage system in Kassumarra village of Nellore District and Makkuva village of Vizayanagaram District.

 

The Transco will set up two solar plants with installed capacity of 5MW in both villages under 33/11 KV substations. Later on the solar plants will be integrated with Lithium Ion Battery Storage System. The power generated from solar plants will be supplied to agriculture sector directly in day time and surplus power will be stored in Li batteries. And on cloudy days, the power stored in Li batteries will be supplied to agricultural pumps.

 

“Power will be supplied to agri-pumps in special conditions if Li batteries are discharges only,” K Raja Babu, Chief Engineer of AP Transco, informed The Pioneer.

 

He said Naidu also wants to reduce the losses of transmission and distribution and lessen the upstream transmission expenditure incurring on 220KV, 400 KV substations.

 

K Vijayanand, CMD, AP Transco and Principle Secretary to IT Department, who is monitoring the pilot project, has taken steps to complete the pilot project within six months not beyond January 2018.

 

AP Transco has already held pre-bid meeting on  supply of Li Batteries recently.

 

If the experiment of Andhra Pradesh becomes a success, the Indian Power Sector might undergo a major change, said officials. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...