Jump to content

AP government to make state a renewable energy hub


Recommended Posts

  • Replies 233
  • Created
  • Last Reply
సౌర మకుటం 

 

ప్రారంభానికి సిద్ధమైన కర్నూలు సౌర విద్యుత్తు పార్కు 
ప్రపంచంలోనే మూడో పెద్ద కేంద్రం 
రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 
రాష్ట్రంలో ఇప్పటికే 2,840 మెగావాట్ల ఉత్పతి 
ఈనాడు - అమరావతి

6ap-main10a_1.jpg

ర్నూలు జిల్లాకు మరో మణి కిరీటం అమరుతోంది. రాళ్లు, రప్పలతో నిండిన భూములు సౌర కాంతుల్ని వెదజల్లబోతున్నాయి. జిల్లాలోని గని, శకునాల గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర విద్యుత్తు పార్కు సిద్ధమైంది. 5,683 ఎకరాల్లో రూ.7 వేల కోట్లతో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ అల్ట్రా మెగా సోలార్‌ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రారంభించనున్నారు. 

ఏపీఎస్‌పీసీఎల్‌ ఆధ్వర్యంలో 
రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం.. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 50 శాతం, ఏపీ జెన్‌కో 41 శాతం, ఎన్‌ఆర్‌ఈడీఏపీ 9 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ విద్యుత్తు కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌పీసీఎల్‌)ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్లాంట్‌ల ఏర్పాటుకు అవసరమైన భూములు కేటాయించడంతోపాటు మౌలిక సౌకర్యాలు సమకూరుస్తోంది. కొత్త విధానాలు అందుబాటులోకి తెస్తుండటంతో ఉత్పత్తి సంస్థలు ముందుకొస్తున్నాయి. కర్నూలు సోలార్‌ పార్క్‌లో 4 ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. 
24 వేల ఎకరాల్లో 4 వేల మెగావాట్లు 
రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 24 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 4 సౌర పార్కుల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఇప్పటికే 2,840 మెగావాట్ల వరకు అందుబాటులోకి వచ్చింది. వీటిలో కేంద్ర విధానంలో 1,996.43, రాష్ట్ర విధానంలో 844.35 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. సోలార్‌ పార్కుల ఏర్పాటు కోసం అధిక శాతం ప్రభుత్వ భూములనే తీసుకున్నారు. ఇవన్నీ సాగుకు ఉపయోగపడని రాతి  నేలలే. రైతుల నుంచి పట్టా, అసైన్డ్‌  భూములకు గరిష్ఠంగా ఎకరాకు రూ.7.5 లక్షల వరకు చెల్లించారు. రాబోయే మూడేళ్లలో మరో 10 వేల మెగావాట్లను  ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం  లక్ష్యంగా నిర్ణయించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో 38 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉందని  ఏపీఎస్‌పీసీఎల్‌ సీఈఓ ఆదిశేషు తెలిపారు. 
రాజస్థాన్‌లో సౌర విద్యుత్తు యూనిట్‌ కనిష్ఠ ధర రూ.2.34. అక్కడ  ఎడారి ప్రాంతంలో ఎక్కువ పగటి సమయం, అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో ధరలు తక్కువగా ఉన్నాయనేది అధికారుల అభిప్రాయం.

6ap-main10b.jpg

6ap-main10c.jpg

6ap-main10d.jpg

 

 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని పెంచుకునేందుకు ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్తు ఫలకాలు బిగించడం ద్వారా ప్రతి జిల్లాలో స్థానికంగానే కనీసం 2 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

ఇప్పటికే పైలట్ ప్రొజెక్ట్ గా తిరుపతి, విజయవాడ నగరాల్లో ఈ పథకాన్ని అమలుచేసి సత్ఫలితాలు సాధించారు.ఈ పథకంలో భాగంగా తమ ఇళ్ళపై సౌరఫలకాలు బిగించుకునే వారికి ప్రోత్సాహకాలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ’ - ఏపీఎస్పీడీసీఎల్‌

దానిప్రకారం ఒక కిలోవాట్‌ విద్యుదుత్పత్తి చేసే ఫలకాలను అమర్చుకోడానికి అయ్యే రూ.60,000లలో వినియోగదారుడి నుంచి రూ.15,000 వసూలు చేసి, మిగిలిన భారాన్ని డిస్కం భరిస్తుంది.

ఏడాదిలో 900 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులకు 0.5 కిలోవాట్‌ సౌర విద్యుత్తు ఫలకాలు, పరికరాలను కేవలం రూ.5,000కి అందిస్తున్నారు. ఇతరులకు 0.5 కిలోవాట్‌ ఫలకాలను రూ.7500కి ఇస్తున్నారు. ఒక కిలోవాట్‌ సామర్థ్యం ఉన్నవాటిని రూ.15,000కి ఇస్తున్నారు.

https://pbs.twimg.com/media/DzxTRqqVAAEzUn1.jpg:large

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...

Tribal Schools of Andhra to get Solar Power

VIJAYAWADA: The Tribal Welfare Department of state will soon equip all the tribal schools in the state with solar street light at a cost of Rs 16.50 crores.

According to Gandham Chandrudu, Director, Tribal Welfare Department, there are 743 tribal welfare schools across the State. The decision to install solar lights will provide safe environment for the students.Chandrudu said,“The matter was discussed with project officers who explained the need for facilitating the schools with solar lights. Eight lights will be installed in each school.”

The Principal Secretary has approved the project and it is estimated that there will be 5,944 lights to be installed in the schools.

The state government has also issued an order regarding the estimated cost of the project which is about Rs 16.50cr, the cost of project was estimated by the Non-Conventional Energy Development Corporation of Andhra Pradesh (NEDCAP) Limited.

Of the total 743 tribal schools, 196 are located in Visakhapatnam, 142 in East Godavari, 85 in Vizianagaram, 75 in Srikakulam, 42 in West Godavari, 41 in Prakasam and 35 in Guntur district.

NEDCAP will also take up work to install solar lights in the remaining institutions that are located in Ananthapur, Chittoor, Kadapa, Krishna, Kurnool and Nellore districts.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...