October 3Oct 3 5 hours ago, sonykongara said:MAdras IIT branch pettali anna, aedho okati, okae raastram lo rendu IIT lo pedathaara ? Hyd IIIT laantidhi gannavaram branch pedathaaru annaru, intha varaku 2 aellu ayina dhaani meedha paluku ledhu.aa IIIT hyd branch okati Amaravati lo pedite adhi super, ISB branch okati.
October 4Oct 4 Author 6 hours ago, AndhraBullodu said:MAdras IIT branch pettali anna, aedho okati, okae raastram lo rendu IIT lo pedathaara ? Hyd IIIT laantidhi gannavaram branch pedathaaru annaru, intha varaku 2 aellu ayina dhaani meedha paluku ledhu.aa IIIT hyd branch okati Amaravati lo pedite adhi super, ISB branch okati.Adi try cheyyalasindi bro
October 4Oct 4 Author 7 hours ago, AndhraBullodu said:MAdras IIT branch pettali anna, aedho okati, okae raastram lo rendu IIT lo pedathaara ? Hyd IIIT laantidhi gannavaram branch pedathaaru annaru, intha varaku 2 aellu ayina dhaani meedha paluku ledhu.aa IIIT hyd branch okati Amaravati lo pedite adhi super, ISB branch okati.Tirupati IIT ne enduku ante quantum algorithms Bhadyatha ni quantum mission india valla ki icchindi vallu tirupati lo unte Quantum Valley lo ikkada emi chestharu
October 4Oct 4 Author అమరావతిలో తిరుపతి ఐఐటీ బ్రాంచ్ క్యాంపస్By Andhra Pradesh News DeskPublished : 04 Oct 2026 05:18 ISTEeFont size4 min readఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో తిరుపతి ఐఐటీ బ్రాంచ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, త్వరలోనే అది ఆచరణలోకి వస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో శనివారం పాన్ ఐఐటీ సదస్సు ప్రారంభోత్సవంలో సత్యనారాయణ మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి లేఖ రాసినట్టు తెలిపారు. అమరావతి బ్రాంచ్ క్యాంపస్.. ఇతర ఐఐటీలకు యాంకర్ సంస్థగా ఉంటుందని, రాష్ట్రానికి, పాన్ ఐఐటీకి మధ్య అనుసంధానానికి దోహదం చేస్తుందన్నారు. అమరావతిలో తిరుపతి ఐఐటీ బ్రాంచ్‌కు స్థలం కేటాయింపు, అవసరమైన అనుమతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. స్టూడెంట్ ట్యూటర్ బాట్ తీసుకొస్తున్నాంప్రొఫెసర్ వి.కామకోటి, డైరెక్టర్, మద్రాస్ ఐఐటీఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ యాంకర్ పాయింట్‌గా మారుతుంది. ప్రతి విద్యార్థి వినియోగించేలా ‘స్టూడెంట్ ట్యూటర్ బాట్’ తయారు చేస్తున్నాం. బోధనలో ఏఐని సమర్థంగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాదికి 100 క్వాంటమ్ యూజ్ కేసులు సిద్ధం చేస్తాం. ఇక్కడకు డిసెంబరులో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. అమరావతిని అర్‌అండ్‌డీ హబ్‌గా చేయండిడా.శరత్‌కుమార్ షరాఫ్, సీఎండీ, టెక్నోక్రాఫ్ట్ గ్రూప్ఐఐటీ పూర్వ విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ను ఏర్పాటు చేయండి. వారు అక్కడ పరిశ్రమలు, కన్సల్టేషన్, ఐటీ, రీసెర్చ్ వంటి విభాగాలు ఏర్పాటు చేస్తారు. పూర్వ విద్యార్థులు యూనిట్‌లు స్థాపించేలా మేం కృషి చేస్తాం. ఏపీ ప్రభుత్వం, పాన్ ఐఐటీ కలసి అమరావతిని దేశంలోనే అతి పెద్ద విద్య, ఆర్‌అండ్‌డీ కేంద్రంగా చేయాలి. అప్పుడు దేశానికి ఏపీ గ్రోత్ ఇంజిన్ అవుతుంది. ఏపీ నాయకత్వం వహించాలిఆనంద్కుమార్, ఎండీ, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇండియా సెమీకండక్టర్ రంగంలోని ప్రతిభావంతుల్లో 20 శాతానికిపైగా భారత్‌లో ఉన్నారు. భారతదేశ సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) 1.0 తర్వాత ఇప్పుడు 2.0 నడుస్తోంది. ఈ రంగంలో మనం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం. దీనికి కొత్త నైపుణ్యాలు కావాలి. విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిస్తే ప్రపంచస్థాయి నిపుణుల్ని తయారుచేయొచ్చు. భారత సెమీకండక్టర్ విప్లవానికి ఏపీ సారథ్యం వహించాలి. ప్రభుత్వానికి స్పష్టత, స్థిరత్వం ఉండాలిఅరవింద్ బన్సల్, సీఈఓ, కంటిన్యూమ్ గ్రీన్ ఎనర్జీ ఎక్కడ స్పష్టమైన చట్టాలు, విధానాలు ఉంటాయో అక్కడికే పెట్టుబడులు వస్తాయి. గతంలో పవన విద్యుత్ విధానంలోని ఒక పేరాపై నెలకొన్న సందిగ్ధత వల్ల పదేళ్ల పాటు పెట్టుబడులు నిలిచిపోయిన పరిస్థితిని చూశాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నిబంధన, నియంత్రణకు కారణం వివరించాలి. పెట్టుబడికి రిస్క్ ఉండదన్న భరోసా ఇవ్వగలగాలి. దాని ముందు ప్రోత్సాహకాలు, రాయితీలు పెద్ద విషయం కాదు. డేటాసెంటర్లకు అవసరమైన విద్యుత్‌లో 80-90 శాతం పునరుత్పాదక ఇంధనం, స్టోరేజీ నుంచి వాడేలా నిబంధన తేవాలి. సిలికాన్ వ్యాలీ టు డీప్‌టెక్ వ్యాలీప్రభాత్కుమార్, ఛైర్మన్, పాన్ ఐఐటీ అలుమ్ని ఇండియాఐఐటీల పూర్వ విద్యార్థులు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అనేక అద్భుత విజయాలు సాధించారు. వారిలో అనేకమంది తెలుగువారున్నారు. వారంతా ఇప్పుడు సొంత రాష్ట్రానికి రావాల్సిన సమయం వచ్చింది. అందుకే నేను ‘సిలికాన్ వ్యాలీ నుంచి అమరావతి డీప్‌టెక్ వ్యాలీ’ అని పిలుపునిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ పెద్ద ముందడుగు.అమరావతి టేకాఫ్ అవుతున్న విమానంసీఆర్డీఏ అదనపు కమిషనర్ రాహుల్కుమార్రెడ్డిరాజధాని అమరావతిలో నిర్మించే భవనాలు, రహదారులు, ప్రధాన మౌలిక వసతులు ‘హార్డ్‌వేర్’ అయితే.. ఆపరేటింగ్ సిస్టమ్ ‘డీప్ టెక్’ అని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పాన్ ఐఐటీ సదస్సులో ఆయన అమరావతిపై ప్రజంటేషన్ ఇచ్చారు. ‘‘అమరావతిలో ఇంజినీరింగ్ అద్భుతాల నిర్మాణం జరుగుతోంది. యూనికార్న్‌లు, సీఎక్స్‌ఓలు వాటి సొల్యూషన్స్‌ని, ప్రొటోటైప్‌లను పరీక్షించుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనువైన ప్రాంతం. క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ, డేటా ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను అమరావతి పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పనలో వినియోగిస్తున్నాం. రాజధాని నడిబొడ్డున 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్నాం. రోబోటిక్స్, సెమీకండక్టర్ల తయారీ, ఆరోగ్య రంగం, మాలిక్యులర్ సైన్సెస్ వంటి 100 యూజ్ కేసుల కోసం అమరావతి క్వాంటమ్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్‌ను రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. అమరావతి టేకాఫ్ అవుతున్న విమానం వంటిదని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని పాన్ ఐఐటీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
October 4Oct 4 Author పాన్ ఐఐటీ శాశ్వత కౌన్సిల్.. అమరావతిలో ఏర్పాటుBy Andhra Pradesh News DeskPublished : 04 Oct 2026 06:14 ISTEeFont size4 min readరాష్ట్ర వర్సిటీలు, ఐఐటీల మధ్య విద్యార్థుల ఎక్స్ఛేంజ్100 మంది ఐఐటీ దిగ్గజాలతో గ్లోబల్ మెంటార్ నెట్వర్క్రూ.500 కోట్లతో పాన్‌ఐఐటీ వెంచర్‌ఫండ్ వచ్చే ఏడాది ఆరో తరగతి నుంచి ఏఐ పాఠాలుసీఎం చంద్రబాబు వెల్లడి పాన్ ఐఐటీ సమిట్‌లో 5 క్వాంటమ్ కంప్యూటర్ల ఆవిష్కరణపాన్ ఐఐటీ సమిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఆక్సి ఏరోస్పేస్ రూపొందించిన డ్రోన్‌పై సంతకం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనాడు, అమరావతి: అమరావతిలో పాన్ ఐఐటీ శాశ్వత కౌన్సిల్ ఏర్పాటు కానుందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అకడమిక్ నెట్‌వర్క్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం, పాన్ ఐఐటీ అలుమ్ని ఇండియా కలిపి ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని 23 ఐఐటీల నుంచి పెద్ద ఎత్తున ఐఐటీయన్లు అమరావతికి రావడమే రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ అని తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన పాన్ ఐఐటీ ఏపీ సమిట్-2026 ముగింపు కార్యక్రమం, విలేకర్ల సమావేశంలో సీఎం మాట్లాడారు. క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటమ్ కంప్యూటర్లు, 4కెల్విన్ ప్రాసెసర్, క్వాంటమ్‌పై రాసిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.. పరిశ్రమ, విద్యా సంస్థలు, ప్రభుత్వం కలిసి.. పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసికట్టుగా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించాలి. వెంచర్‌ఫండ్ కార్పస్‌ను స్టార్టప్‌ల ప్రోత్సాహం కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఐఐటీయన్ల అత్యుత్తమ మేధస్సుతో అమరావతి ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తయారవుతుంది. ఇక నుంచి ఏటా పాన్ ఐఐటీ అమరావతి సమిట్ ఏర్పాటు చేసి, వివిధ అంశాలపై చర్చిద్దాం. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే అభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకోగలం. ఏఐ వినియోగంతో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయాన్ని 18 శాతం పెంచగలగడమే ఇందుకు నిదర్శనం. ఏపీని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా పాన్‌ఐఐటీ మేధస్సు సహకారం అందిస్తుందని ఆకాంక్షిస్తున్నా.పాన్ ఐఐటీ సదస్సు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఐఐటీ అలుమ్నీ ఛైర్మన్ ప్రభాత్‌కుమార్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు50 లక్షల మంది ఏఐ నిపుణుల్ని అందిస్తాంప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా ఏపీ నుంచి 50 లక్షల మంది ఏఐ నిపుణులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఆరో తరగతి నుంచే ఏఐ సిలబస్ తీసుకొస్తాం. ఏఐతో పాటు ఆంత్రప్రెన్యూర్ నైపుణ్యాలు నేర్పిస్తాం. ఐఐటీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల మధ్య విద్యార్థుల ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. కొన్ని రోజులు రాష్ట్ర వర్సిటీల్లో, మరికొన్ని రోజులు ఐఐటీలో చదువుతారు. దీనికయ్యే ఖర్చులో ప్రభుత్వం 50% భరిస్తుంది. ఐఐటీ సిలబస్‌ను ఉన్నత విద్యలో అమలు చేస్తారు. దీంతో విద్యార్థుల నైపుణ్యం మరింత పెరుగుతుంది. అధ్యాపకులకు ఐఐటీయన్లు శిక్షణ ఇస్తారు. ఐఐటీయన్ల ఆలోచనలు సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి మరో స్థాయికి వెళ్తుంది. రెండేళ్లలో కమర్షియల్ క్వాంటమ్ కంప్యూటర్లువచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఆపరేషన్స్ మొదలవుతాయి. ఐబీఎం- టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి నుంచి ఆపరేట్ అవుతుంది. 156 క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్ వచ్చేలోగానే అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి అవసరమైన మౌలిక వసతులు సిద్ధమవుతాయి. క్యూ-శివ లాంటి మినీ క్వాంటమ్ కంప్యూటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలు, క్వాంటమ్ కంప్యూటర్లు ఎగుమతి చేసే స్థాయికీ ఎదుగుతాం. వచ్చే రెండేళ్లలో కమర్షియల్ క్వాంటమ్ కంప్యూటర్లను ఉత్పత్తి చేస్తామని క్వాంటమ్ సంస్థలు చెబుతున్నాయి. సైబరాబాద్ ప్లస్‌గా, నెట్ జీరో గ్రీన్ ఎనర్జీ, 50% పచ్చదనంతో అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. జాతి నిర్మాణంలో ఐఐటీయన్లు అంతా భాగమవుతున్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేలా ఐఐటీయన్లు సహకరించాలి. ఇప్పుడిక సిలికాన్ వ్యాలీ గురించి కాదు.. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచం చర్చించుకుంటుంది’ అని తెలిపారు.పాన్ ఐఐటీ డిక్లరేషన్ విడుదల అనంతరం పాన్‌ఐఐటీ అమరావతి సమిట్ డిక్లరేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. అమరావతిలో ఏపీ ప్రభుత్వం-పాన్ ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో శాశ్వత పాన్‌ఐఐటీ కౌన్సిల్ ఏర్పాటు. డీప్‌టెక్ అభివృద్ధికి నోడల్ సంస్థగా పాన్‌ఐఐటీ అమరావతి కౌన్సిల్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్లతో పాన్‌ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్ ఏర్పాటురాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో 10 ఇండస్ట్రీ చైర్లు ఏర్పాటుస్టార్టప్లు, ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేసేందుకు 100 మంది ఐఐటీ దిగ్గజాలతో గ్లోబల్ మెంటార్ నెట్‌వర్క్ ఏర్పాటు. 2030 నాటికి రాష్ట్రంలో కనీసం 50 స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక ఐఐటీల నుంచి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు టెక్నాలజీ బదిలీ. ఇందులో భాగంగా వర్సిటీల్లో ఎక్స్‌లెన్స్ సెంటర్లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు డీప్‌టెక్ పాలసీ ప్యాకేజీలో భాగంగా క్వాంటమ్-ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్-డిఫెన్స్, హెల్త్, అగ్రిటెక్‌లాంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు.
October 5Oct 5 On 10/3/2026 at 10:08 PM, sonykongara said:Adi try cheyyalasindi broaa IIIT hyd branch meedha aemanna mundhuki kadhilindha anna, gannavaram lo pedathaaru, aa MLA , Lokesh tho maatlaadaaru ani 2 aella kritham annaru, tvaralo vachae nela annaru appudu, mari, emayyindho.
Tuesday at 04:28 PM5 days Author On 10/5/2026 at 11:38 AM, AndhraBullodu said:aa IIIT hyd branch meedha aemanna mundhuki kadhilindha anna, gannavaram lo pedathaaru, aa MLA , Lokesh tho maatlaadaaru ani 2 aella kritham annaru, tvaralo vachae nela annaru appudu, mari, emayyindho.Ledu bro
Create an account or sign in to comment