Jump to content

Recommended Posts

Posted

వస్తాయ్ వస్తాయ్ అంటున్నారు కానీ ఎప్పుడొస్తాయ్ అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఏపీలో రెండు ప్రైవేటు వర్సిటీలు మొదలు కాబోతున్నాయ్. ఇదో న్యూ బిగినింగ్. అమరావతితోపాటు విశాఖ లాంటి కీలక ప్రాంతాల్లో కేంపస్ లతో ఏపీ ఎడ్యుకేషన్ లో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతోంది. ఇప్పటివరకూ పేపర్ మీదున్న ప్రపోజల్స్ లో సగం పట్టాలెక్కినా అమరావతి కూడా లండన్ లాంటి ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది. నిజంగానే !


చదువుకోడానికిి చాలామంది అమెరికా, డొప్లొమో కోర్సుల కోసం ఆస్ట్రేలియా, సింగపూర్ వెళ్తారు కానీ నిజానికి ఎడ్యుకేషన్ హబ్ లండన్. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్, అద్భుతమైన ఫెలిసిలిటీలు, నంబరాఫ్ ఆప్షన్స్ అక్కడే ఉన్నాయ్. పైగా నాన్ కన్వెన్షల్ సెక్టర్ లో కూడా లండన్ టాప్ రేంజ్ లో ఉంటుంది. అలాంటి వేరియేషన్ ఇప్పుడు అమరావతిలో కనిపిస్తోంది. ఏదో చెప్పాలని చెప్పడం కాదు. కావాలంటే లిస్టు చూడండి. ప్రైవేటు వర్సిటీలకి ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ ఏడాది నుంచే రెండు కేంపస్ లు మొదలవుతున్నాయ్. ఒకటి అమిటి. రెండోది విట్. 2016 – 17 నుంచే మా అడ్మిషన్లు మొదలు అంటూ లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఈ వర్సిటీలు ఏపీకి ఇచ్చేశాయ్. ప్రవేశాలు ఈ చేత్తో చేస్తూనే మరోపక్కన సౌకర్యాలు కల్పించడం మీద దృష్టిపెట్టబోతున్నాయ్ ఈ రెండు సంస్థలు. నేషనల్ లెవెల్లో హయ్యెస్ట్ రెప్యుటేషన్ ఉన్న వర్సిటీలు రావడం నిజానికి మంచి ప్రారంభం అనుకోవాలి ఏపీలో. అమిటి వర్సిటీ వచ్చే పదేళ్లలో 11 వేల మంది విద్యార్థులకి అడ్మిషన్స్ ఇవ్వబోతోంది. ఏపీలో 425 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. అమరావతితోపాటు విశాఖలో కూడా కేంపస్ పెట్టి ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ, లాజిస్టిక్స్ లాంటి కోర్సులు ఇవ్వబోతోంది. ఇప్పటి వరకూ ఏపీకి తెలియని జోనర్స్ ఇవి. విట్ పరిధికి ఇంకా విస్తృతం. వచ్చే పదేళ్లలో 32 వేలమందికి అడ్మిషన్స్ ఇవ్వబోతున్న విట్… ఏపీలో ఏకంగా 3400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.


ఈ రెండూ ఈ ఏడాదే మొదలు అయిపోతున్నాయ్. వీటితోపాటు ఎస్ ఆర్ ఎం, ఆనంద్, సెంచూరియన్ లాంటి కేంపస్ లు కూడా ఏపీకి వస్తున్నాయ్. 700 కోట్లు పెట్టుబడులు పెట్టే ఎస్ ఆర్ ఎం మెరైన్ బయాలజీతోపాటు మెడికల్ కోర్సులు కూడా మొదలుపెట్టబోతోంది. భీమవరంలో ఫిషరీస్ వర్సిటీ పెట్టబోతున్న ఆనంద్ దాదాపు పది కొత్త కోర్సులు పరిచయం చేయబోతోంది. విజయనగరంలో వస్తున్న ఒడిషా సంస్థ సెంచూరియన్ వంద కోట్లు పెట్టుబడితో స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు ఆఫర్ చేస్తామంటోంది. ఇప్పటి వరకూ లెక్కలోకి వచ్చింది ఐదు వర్సిటీలే. మరో పది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయ్. ప్రభుత్వం ఎప్పుడు ఓకే అంటే అప్పుడు రంగంలోకి దిగుతామంటున్నాయ్. అంటే తొందర్లోనే డజనుకిపైగా కొత్త ప్రైవేటు వర్సిటీలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయ్.


ఎడ్యుకేషన్ హబ్ ఏపీ…


కొత్త ప్రైవేటు వర్సిటీలు ఏపీకి వస్తున్నాయ్ అంటే…మన పిల్లల్ని చేర్చుకోవడం మాత్రమే కాదు… ఇంకా అనేక కోణాల్లో వీటి ప్రభావం కనిపించబోతోంది. దాదాపు 5 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్టు లెక్క. అంటే వాటి కోసం వందల ఎకరాల్లో కేంపస్ లు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఇన్ ఫ్రా డెవెలప్ అవుతుంది రాష్ట్రంలో. చూశారుగా ఐదారు వర్సిటీలు వస్తేనే దాదాపు నాల్గు జిల్లాల్లో పెను మార్పులు వస్తాయ్. పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, విశాఖ, విజయ నగరం… ఇలా కేంపస్ వచ్చిందంటే ఆ ప్రాంత స్వరూప స్వభావాలు మారినట్టే. వీటన్నిటికీ తోడు ఏపీకి ఫ్లోటింగ్ పెరుగుతుంది. ఎలాగంటే… ఈ వర్సిటీల్లో వందలు కాదు వేల కొద్దీ సీట్లున్నాయ్. అంటే మన పిల్లలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి అడ్మిషన్ల కోసం వచ్చేవాళ్లు పెరుగుతారు. స్కిల్ డెవెలప్ మెంట్, మెరైన్ బయాలజీ లాంటి ఫ్యూచర్ యాస్పెక్ట్ ఉన్న కోర్సులు మన దేశంలో చాలా చాలా తక్కువ. అందుకే అవకాశాలు అందుకోవాలంటే ముందు ఇలాంటి వాటిపై దృష్టిపెట్టాలి. అందుకోసం ఏపీ రావాల్సిందే. మిగతా రాష్ట్రాలు కూడా ఇలా ఏపీవైపు చూసే పరిస్థితే వస్తే కల్చర్, టూరిజం, ఫైనాన్షియల్ యాక్టివిటీ… ఇలా వరసపెట్టి మార్పులు వచ్చేస్తాయ్. అందుకే ప్రైవేటు వర్సిటీలు ఏపీని వరల్డ్ క్లాస్ హబ్ మారుస్తాయ్ అంటున్నది. పైగా వస్తున్నది చిన్నాచితక బ్రాండ్లు కాదు. అందుకే మన దగ్గర అవకాశాలు అపారం. అంచనాలు అత్యున్నతం.




 
Posted

Out of all mow many universities maintains good standards?.. I really doubt the standards of these universities..

 

Avi anni.. thopu universities... asalu boubt ye avasaram ledu...

 

Main SRM, VIT, Amrutha , AMITY and Isha...

Posted
అమరావతిలో విద్యా, వైద్య సంస్థలకు స్థలాల కేటాయింపు
 
636011432145859588.jpg
విజయవాడ: అమరావతిలో విద్యా, వైద్య సంస్థలకు స్థలాల కేటాయింపు ప్రారంభం అయింది. ఈ మేరకు సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విట్‌కు 200 ఎకరాలు, ఎస్‌ఆర్‌ఎంకు 150 ఎకరాలు, ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌కు 150 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 99 ఏళ్ల వరకు లీజుకు తీసుకుంటే ఎకరాకు రూ.25 లక్షల చొప్పున, కొనుగోలు చేస్తే ఎకరానికి రూ.50 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. రెండు రెవెన్యూ గ్రామాల్లో స్థలాలను కేటాయించారు. వచ్చే ఏడాది నుంచి తరగతులు నిర్వహించాలని, దీనిపై 15న జరిగే కేబినెట్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రానున్న 8 ఏళ్లలో విట్‌లో 50వేల మంది, ఎస్‌ఆర్‌ఎంలో 40 వేల మందికి విద్య అందించనున్నారు.
  • 2 weeks later...
Posted

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాల, వెటర్నరీ, ఉద్యాన కళాశాలల ఏర్పాటుకు అనుమతులిచ్చే ఆర్డినెన్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. విట్‌కు 200 ఎకరాలు, ఇండో యూకే అత్యాధునిక ఆసుపత్రికి 150 ఎకరాల కేటాయింపునకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసే అవకాశముంది.

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...