Jump to content

Top Private universities in Amaravati


Recommended Posts

విద్యాసంస్థలు వస్తున్నాయ్‌!
 
636116568660051287.jpg
  • 3న విట్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన
  • త్వరలో రాజధానికి ఎస్‌ఆర్‌ఎం, అమృతానంద
  • కార్పొరేట్‌ బడుల ఏర్పాటుకు 13 సంస్థలు రెడీ
  • తొలి దశలో 25 వేల కోట్ల పెట్టుబడులు
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. కొన్నేళ్లుగా విజయవాడ, గుంటూరు విద్యాకేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వీటికి అమరావతి కూడా తోడైతే ఈ ప్రాంతం విద్యా కేంద్రాల హబ్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమరావతికి ఒక్క విద్యారంగంలోనే సుమారు రూ.25వేల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయని అంచనా. ఇది కూడా తొలి దశలోనే. ఇప్పటికే వెల్లూరు ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌), ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృతానందమయి తదితర సంస్థల వర్సిటీలు నెలకొల్పేందుకు అమరావతిలో భూమిని కేటాయించారు. రాజధాని ప్రాంతంలోని ఐనవోలు, శాఖమూరు ప్రాంతాల్లో వీటికి భూములిచ్చారు. మరోవైపు అమరావతిలో కార్పొరేట్‌ పాఠశాలలు నెలకొల్పేందుకు 13 విద్యాసంస్థలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం భూమిని కేటాయిస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ప్రకటించాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నవ నగరాల సమాహారంగా నిర్మించాలని యోచిస్తోంది. అందులో విద్యానగరం ఒకటి. అమరావతిలో విద్యాసంస్థల ఏర్పాటు శరవేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబరు 3న వెల్లూరు ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తమకు కేటాయించిన భూమిలో శంకుస్థాపన చేయనుంది. సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. విట్‌ సంస్థ తనకు 300 ఎకరాలు కేటాయించాలని కోరగా.. ప్రభుత్వం ఐనవోలు గ్రామ సమీపంలో 200 ఎకరాలు ఇచ్చింది. దీనిలో తొలిదశలో వంద ఎకరాల్లో నిర్మాణాలు చేపడతారు. ఐదేళ్లలో 18 వేలమంది విద్యార్థులను ఇందులో చేర్చుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది. అది నెరవేర్చాక మరో వంద ఎకరాలను స్వాధీనం చేస్తుంది. మొదటి దశలో విట్‌ రూ.350 కోట్లను వ్యయం చేయనుంది. భూమి చదును నుంచి, విశ్వవిద్యాలయాల భవనాల నిర్మాణం, గార్డెనింగ్‌, వివిధ విభాగాల్లో అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటు ఇలాంటి వాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం కూడా ఇంతే మొత్తం పెట్టుబడి పెట్టనుంది. మాతా అమృతానందమయి ప్రైవేటు విశ్వవిద్యాలయం కూడా భారీగానే పెట్టుబడి పెట్టనుంది. భూమిని అప్పగిస్తే ఈ రెండు సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
 
ముందుకొస్తున్న కార్పొరేట్‌ పాఠశాలలు
ఇటీవల సీఆర్డీయే.. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ యాజమాన్యాలతో ఒక సమావేశం ఏర్పాటుచేయగా పలు విద్యాసంస్థలు అమరావతిలో కార్పొరేట్‌ పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 13 విద్యాసంస్థలు తమకు భూమి కేటాయిస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు నెలకొల్పుతామని చెప్పాయి. ఇటీవల కాలంలో మరిన్ని సంస్థలు ఈ దిశగా ముందుకొస్తున్నాయి. ర్యాన ఇంటర్నేషనల్‌, చిరెక్‌ ఇంటర్నేషనల్‌, ఇండస్‌ ఇంటర్నేషనల్‌, సింగపూర్‌కు చెందిన గ్లోబల్‌ స్కూల్‌ ఫౌండేషన, అమిటి ఇంటర్నేషనల్‌, పాతవే్‌స, జెమ్స్‌ ఎడ్యుకేషన, పోడార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, డీపీఎస్‌ ఇంటర్నేషనల్‌, మ్యాక్స్‌ గ్రూప్‌, కేనడార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, హెచఎల్‌సీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ తదితర పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం సుమారు 15వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు. వీరికి తోడు పలు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఇటీవలకాలంలో అమరావతికి వచ్చారు. వీరి పిల్లలకు ఇక్కడ ఇప్పటికే ఉన్న విద్యాసంస్థల్లో ప్రవేశాలు ఒక దశలో కష్టతరం అయ్యాయి. అయితే ప్రభుత్వం చొరవతో...ప్రతి తరగతిలోను విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యాసంస్థలు ప్రవేశాలు కల్పించాయి. మరోవైపు ఇంకా పలువురు ఉద్యోగులు ఈ ఏడాదికి హైదరాబాద్‌లోనే తమ పిల్లల్ని చదివిస్తూ.. వచ్చే ఏడాది ఇక్కడికి తీసుకురానున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే మరోవైపు రాజధాని ప్రాంతంలో వచ్చిన ఆర్థిక విప్లవం అక్కడి రైతుల పిల్లల్ని అత్యుత్తమ పాఠశాలల్లో చేర్చేలా ప్రేరేపిస్తోంది. దీనికితోడు తొలిరోజుల నుంచీ ఈ ప్రాంతంలోని పాఠశాలలకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి చదవడం ఆనవాయితీగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అమరావతిలో విద్యాసంస్థల ఏర్పాటు లాభదాయకమేనని యాజమాన్యాలు కూడా భావిస్తున్నాయి. ఒకవైపు రాజధాని అభివృద్దితో పాటు.. మరోవైపు అత్యున్నత విద్యా ప్రమాణాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహిస్తోంది.
Link to comment
Share on other sites

  • Replies 346
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
అమరావతిలో పెట్టుబడుల తొలి లావాదేవీ

విజయవాడ: అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి తొలి లావాదేవీ జరిగింది. అమరావతిలో విట్‌ ఏర్పాటుకు భూమి కేటాయించినందుకు ఆ విశ్వవిద్యాలయం ప్రతినిధులు రూ.50కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు. విట్‌ వర్శిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌ విశ్వనాథన్‌ అందించిన చెక్‌ను సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌కు ముఖ్యమంత్రి అందజేశారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

N Chandrababu Naidu

@ncbn

VIT Vice-President Sekhar Viswanathan presented a cheque for the land cost in setting up the institute in #Amaravati pic.twitter.com/KFOU1fvhXO

9:56 AM - 26 Oct 2016

Link to comment
Share on other sites

VIT is coming to Andhra Pradesh!

 

Sekar Viswanathan, Vice-President, University Affairs, VIT University, today presented a cheque of Rs. 50 Crores to CBN towards cost of land allocated to the premier university in the capital region. VIT University was recently ranked the No. 1 Private Engineering Institution in India by Ministry of Human Resource Development, Government of India. The university is expected to provide higher education in various streams to at least 5,000 students in eight years from the start.

 

14632862_1443387989008121_66495675993577

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...