Jump to content

Purushothapatnam lift irrigation project

Recommended Posts

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు శంకుస్థాపన
 
636192291247024317.jpg
పురుషోత్తపట్నం, తూర్పుగోదావరి: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. రూ.1645 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టారు. పురుషోత్తపట్నం వద్ద పంప్ హౌజ్ నిర్మించి పది కిలోమిటర్ల దూరంలో ఉన్న పోలవరం ఎడమ కాల్వలోకి నీరు పంపించనున్నారు.. అక్కడ నుంచి ఏలేరు నదిలోకి నీటిని మళ్లించనున్నారు. ఏలేరు రిజర్వాయర్ కెపాసిటి 24 టీఎంసీలు ఉంది. 1400 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఏలేరు ఆయకట్టు పరిధిలో 53 వేల ఎకరాలు స్థిరీకరణ చేయనున్నారు. 1100 క్యూసెక్కులు పోలవరం ఎడమ కాల్వ ద్వారా విశాఖ జిల్లాలో తాగునీరు, ఖరీఫ్‌కు సాగునీరు సరఫరా చేసే లక్ష్యం పెట్టుకున్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...

భూపరిహారం పెంచితేనే భూములు ఇస్తాం

పురుషోత్తమపట్నం స్టేజ్‌-2 పైపులైను భూనిర్వాసితులు డిమాండ్‌

రామవరం(జగ్గంపేట),న్యూస్‌టుడే: పురుషోత్తమపట్నం నుంచి గోదావరి జలాలను ఏలేరు అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా స్టేజ్‌-2 పైపులైను నిర్మాణానికి సేకరించే భూములకు మెరుగైన పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని సంబంధిత భూనిర్వాసితులు స్పష్టం చేశారు. భూపరిహారం పెంపు కోరుతూ మూడురోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈసందర్భంగా బాధిత రైతాంగం వద్దకు శుక్రవారం తహసిల్దారు శివమ్మ వెళ్లి చర్చలు జరిపారు. ఈసందర్భంగా వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే తమ భూముల ద్వారా విస్కో, పుష్కర, పోలవరం కాలువ నిర్మాణానికి భూములు ఇచ్చి తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. భూములు ఇచ్చినప్పటికీ తమకు సాగునీరు అందడంలేదన్నారు. మళ్లీ పురుషోత్తమపట్నం స్టేజ్‌-2 పైపులైను నిర్మాణానికి భూములు తీసుకోవడంతో రైతు అన్ని విధాల నష్టపోవడం జరుగుతుందన్నారు. పరిహారం భూసేకరణ చట్టం, భూరిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం చెల్లించేపరిహారం తమకు వద్దన్నారు. ప్రస్తుతం తమ భూములు రూ.40లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ధర పలుకుతున్నాయన్నారు. తమకు న్యాయమైన పరిహారం ఇస్తేనే పైపులైను నిర్మాణానికి భూములు అప్పగిస్తామన్నారు. లేనిపక్షంలో భూముల కోసం పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి అడబాల వెంకటేశ్వరరావు, మండపాక సుబ్రహ్మణ్యం, పెద్ద, కటికాల బుల్లయ్య, అడబాల సత్తిబాబు, మండపాక రామకృష్ణ, గుండుపల్లి సత్యనారాయణ, కదా బాబురావు, అడబాల చలపతి, పొన్నగంటి అప్పారావు, జగ్గంపేట ఎస్‌.ఐ. ఎం.డి.ఎ.ఆర్‌.ఆలీఖాన్‌ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

‘పురుషోత్తపట్నాని’కి రైతులు జై
 
  • భూములిచ్చేందుకు రెడీ
హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పురుషోత్తపట్నం ఎత్తిపోతల స్టేజ్‌ -1 పనుల కోసం భూములు ఇచ్చేందుకు రైతులు సం సిద్దత వ్యక్తం చేశారు సోమవారం వెలగపూడిలో రైతులతో జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కు మార్‌ జరిపిన సంప్రదింపులు కొ లిక్కి వచ్చాయి. దీంతో.. భూసేకరణ చేపడుతున్నట్టు శశిభూషణ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు, లబ్ధితో కూడిన ప్యాకేజీ కింద నాగంపల్లిలో ఎకరాలకు రూ.24 లక్షలు, చిన్న కొండేపూడి, పురుషోత్తపట్నం, వంగపూడిలలో ఎకరాకు రూ.28 లక్షలు చెల్లిస్తారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
పురుషోత్తపట్నం రైతులకు రూ.58కోట్ల పరిహారం
 
636286949861551877.jpg
  • 233మందికి మొదలైన పంపిణీ
  • నేరుగా రైతు ఖాతాల్లో నగదు జమ
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 24: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంకోసం భూమిని ఇచ్చిన రైతులకు నష్టపరిహారం పంపిణీ సోమవారం మొదలైంది. ఇందులో 233మంది రైతులకు రూ.58కోట్లు అందజేయనున్నారు. రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సోమవారం రూ.4కోట్ల పరిహారాన్ని నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేశారు.
 
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామం వద్ద గోదావరిలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, రామచంద్రపురం, నాగంపల్లి గ్రామాల్లో 247 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో 43 ఎకరాలు సర్కారుదికాగా మిగిలిన 204 ఎకరాలుుని ప్రైవేట్‌ వ్యక్తులది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నాగంపల్లి గ్రామంలో ఎకరానికి రూ.24లక్షలు, పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, చినకొండేపూడి గ్రామాల్లో ఎకరానికి రూ.28లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 132 ఎకరాలకు సంబంధించి 233 మంది రైతులు అంగీకార పత్రాలు అందజేశారు. ఎక్కువ పరిహారం కా వాలంటూ మిగతా రైతులు కోర్టుకు వెళ్లారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

పురుషోత్తపట్నం రైతులకు రూ.58కోట్ల పరిహారం

nice

Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఇక 95 రోజులే!

నిర్ణీత గడువులో నీటి సరఫరాకు ప్రయత్నం

పరి‘హారం’తో పురుషోత్తపట్నం పథకం పనుల వేగవంతం

ఈనెల 23 తర్వాత మరింత ముమ్మరంగా పనులు

న్యూస్‌టుడే, సీతానగరం

eag-top2a.jpg

తూర్పుగోదావరికి, విశాఖ జిల్లాలకు సాగు..తాగు నీరందించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆగస్టు 15 నాటికల్లా పూర్తిచేసేలా జలవనరుల శాఖ చర్యలు తీసుకోవాలి. భూసేకరణకు అంగీకరించని రైతులకు సంబంధించి మే 12తో గడువు పూర్తికావడంతో చట్ట ప్రకారం భూములను స్వాధీనం చేసుకుని పనులు వేగవంతం చేయాలి. ఖరీఫ్‌ నాటికి ఏలేరు ఆయకట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు వెళ్లాలి.

-ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

మరి ముఖ్యమంత్రి నిర్దేశించినట్లుగా ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యి.. జలరాసులు పొలాల్లో పరుగులు పెడతాయా..? అంటే అవుననే అంటున్నారు జలవనరుల శాఖ అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గడువు విధించినట్లు ఆగస్టు 15 నాటికి 10 పంపుల ద్వారా నీటిని పంపలేకపోయినా కనీసం ఒకటి, రెండింటితోనైనా ఏలేరుకు నీటిని పంపించగలమని జలవనరుల శాఖ ధీమాగా ఉంది. ఈ నెల 23 దాటిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే భూములతో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఓసారి పథకం పనులను.. వాటికి అడ్డంకులను ఓసారి అవలోకనం చేస్తే...

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా రూ.1638 కోట్లతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అడ్డంకుల్ని అధిగమిస్తూ వడివడిగా ముందుకెళుతోంది.. తూర్పు, విశాఖ జిల్లాలోని 4.50 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చడం ఈ పథకం లక్ష్యం. తూర్పు గోదావరి జిల్లాలోనే 2.50 లక్షల ఎకరాల ఆయకట్టులో తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకాల పరిధిలో ఉన్న 1.86 లక్షల ఎకరాలు, తొర్రిగెడ్డ ఎత్తిపోతల పథకం పరిధి 25 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేస్తున్నారు. దీంతోపాటుగాగా ఆయకట్టు పరిధిలో లేకుండా వర్షాధారంపైనే ఆధారపడిన తుని, పిఠాపురం, ప్రత్తిపాడు, కోటనందూరు, గొలప్రోలు, ఏలేశ్వరం, శంఖవరం, తొండంగి తదితర ప్రాంతాల్లో సుమారుగా మరో 40వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు చేరనుంది. ఇదికాకుండా ఏలేరు వాగులోకి నీరు వదిలే సమయంలో మరో 86వేల ఎకరాలు పిఠాపురం బ్రాంచి కెనాలో పెరగనుంది. 23.44 టీఎంసీల నీరు సరఫరాలో నిర్దేశించిన లక్ష్యంతో పాటు ఏలేరు జలాశయానికి మరింత ప్రయోజనం పెరగనుంది.

* సీతానగరం మండలంలోని గోదావరి ఎడమగట్టున రూ. 1638 కోట్లతో చేపట్టిన ఈ పథకం పనులు గతేడాది డిసెంబరులో చేపట్టారు.

* ఫేజ్‌-1 పురుషోత్తపట్నం వద్ద పంపుహౌస్‌తో పాటు విద్యుత్తు కేంద్రం 10 కిలోమీటర్ల మేర పైపులైన్‌ పనులున్నాయి.

* ఫేజ్‌-2 జగ్గంపేట నుంచి ఏలేరు వరకు 12 కిలోమీటర్ల మేర పైపులైన్‌ పనులతో మొత్తంగా 310 ఎకరాల భూమిని సేకరించి ఈ పథకం పూర్తి చేయాల్సి ఉంది.

* గోదావరి వరదల సమయంలో ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కుల నీరు వంతున మొత్తంగా 3,500 క్యూసెక్కులను విడుదల చేయాలనే లక్ష్యంతో పథకాన్ని రూపొందించారు.

10 పంపులతో అయిదు లైన్లు వెళ్లాలి

ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ వద్ద 10 పంపులు ఉండేలా డిజైన్‌ చేశారు. దీనికి సుమారుగా 10.52 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి అవసరం. ప్రస్తుతం 7.52 ఎకరాలను సేకరించారు. అవసరం మేరకు భూమి రాకపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు కేంద్రం పనులు చేస్తున్నారు. గతంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సేకరించిన భూమిలో నాలుగు పంపులను ఏర్పాటు చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. 10 పంపులతో పూర్తిస్థాయిలో పంపుహౌస్‌ పూర్తిచేసేందుకు ఆ ప్రాంతంలో రైతు ముందుకురాకపోవడంతో పనులు జాప్యం లేకుండా జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న భూమిలో నాలుగు పంపులతో పనులు చేపట్టడం వల్ల నిర్దేశించిన గడువు సమయానికి నీరు వదిలేందుకు ముందుచూపు పనులుగా ఉన్నాయంటున్నారు.

50,500 మీటర్ల పైపులైను పనులు..

పురుషోత్తపట్నం పంపుహౌస్‌ నుంచి 10 పంపుల ఏర్పాటుకు అయిదు వరుసల్లో పైపులైను పనులు 50,500 మీటర్లు పూర్తిచేయాలి. ఒక్కో పంపు 3.2 మీటర్ల డయాతో 5.8 మీటర్ల పొడవు ఉంది. ఒక్కో పంపును భూమిలోకి దించే సమయంలో అయిదు మీటర్ల లోతున ఉంచాలి. రోజుకు ఒకలైనులో అయిదు పైపులు ఇలా భూమిలోకి దించితే నిర్దేశించిన గడువులో పైపులైన్‌ పూర్తిచేసేందుకు వీలుంది. పరిహారం కోసం భూమిలిచ్చిన రైతుల అభ్యంతరాలతో కొన్నిచోట్ల ఆటంకం కలగడం, మరికొన్ని చోట్ల రాయి తగలడంతో కొంత సమస్య ఎదురవుతోంది. పెదకొండేపూడిలో 1.5 కిలోమీటర్ల మేర భూమిలో రాయి తగలడంతో బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. 50,500 మీటర్ల పైపులైను పనులకు అవసరమైన పైపులను సిద్ధం చేశారు. ప్రస్తుతం నాగంపల్లి, చినకొండేపూడి, వంగలపూడి తదితర ప్రాంతాల్లో 7,256 మీటర్ల పైపులైన్‌ పనులను చేశారు.

భూసేకరణలో ఫేజ్‌-2 వేగం

ఎత్తిపోతల పనుల్లో భూసేకరణకు సంబంధించి పేజ్‌-1 పురుషోత్తపట్నం కంటే ఫేజ్‌-2 జగ్గంపేట వేగవంతంగా ఉంది. అక్కడ రైతులు నిర్దేశించిన పరిహారానికి ముందుకురావడంతో అవసరమైన 103 ఎకరాల భూమిని సేకరించారు. జగ్గంపేట నుంచి ఏలేరు జలాశాయానికి 12 కిలోమీటర్ల మేర రెండు పైపులైన్లుతో నీటి సరఫరా వెళ్లేలా పనులు చేపట్టారు. ఇప్పటికే ఆ పాంతంలో సుమారుగా 4 కిలోమీటర్ల మేర పనులను పూర్తిచేశామని అధికారులు చెబుతున్నారు. పురుషోత్తపట్నం వచ్చేసరికి 206.3475 ఎకరాల భూమికి 132.818 ఎకరాల భూమిని ప్రభుత్వం జలవనరుల శాఖకు అప్పగించింది. అందులోనే పనులు చేపట్టాల్సి ఉండడంతో కొంత మందకొడి తప్పడం లేదు. నాలుగు ఎకరాల్లో గొట్టాలు వేసి మధ్యలో రెండు ఎకరాల్లో వదిలేసి మళ్లీ స్వాధీనం చేసిన స్థలంలో పనులు చేయడంతో సమస్య ఎదురవుతోంది.

పరిహారం పంపిణీతో పనులు మరింత వేగం

ఎత్తిపోతల పథకం పనులకు పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి ప్రాంతాల్లో ఎకరాకు రూ. 28 లక్షలు, నాగంపల్లిలో ఎకరాకు రూ.24 లక్షల వంతున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించడంతో 234 మంది రైతులు తమ భూములను అప్పగించారు. వారికి పరిహారంగా ఇప్పటికే ఫే¶జ్‌-1, ఫేజ్‌-2ల్లో సుమారుగా రూ. 23.26 కోట్లు బ్యాంకుల్లో జమ చేశారు. భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న మిగిలిన రైతులు కూడా అదే పరిహారం కోరుతూ ముందుకొస్తున్నారు. వీరికిచ్చే పరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

పుష్కర పంపులు కలిపేస్తున్నారు...

పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి ఏలేరుకు నీరు విడుదల చేయాలనే ఆదేశాలతో పురుషోత్తపట్నంలోనే ఉన్న పుష్కర-1, 2 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంపులను కొత్తగా చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన ఎత్తిపోతల పనుల వద్ద కొంత భూసేకరణ సమస్య ఉండడంతో ముందుగా మూడు పంపులను పూర్తిచేస్తున్నారు. ఒక్కో పంపు 3,500 క్యూసెక్కుల వంతున 10,500 క్యూసెక్కుల చొప్పున పంపింగ్‌ చేస్తారు. పుష్కర నుంచి ఒక్కో పంపు 175 క్యూసెక్కుల వంతున 1400 క్యూసెక్కుల నీరు వస్తుంది. సుమారుగా 12 వేల క్యూసెక్కుల నీటిని నిర్ణీత లక్ష్యంలో విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అదే సమయంలో పుష్కర ఎత్తిపోతల పథకాలకు రంపచోడవరం 220 విద్యుత్తు ఉపకేంద్రం నుంచి వచ్చే సరఫరా తరచుగా నిలిచిపోతుంది. దీంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు అవసరమైన 52.2 మెగావాట్ల విద్యుత్తుకు అవసరమైన ఉపకేంద్రం పంపుహౌస్‌ వద్దనే పూర్తిచేయడంతో పుష్కర పథకాలను దీంట్లో కలిపేస్తున్నారు.

మూడు పంపులతో పనులు వేగవంతం...

పురుషోత్తపట్నం వద్దనే ముందుగా నాలుగుపంపుతో పంపుహౌస్‌ చేపట్టాం. ఎల్‌ఎంసీకి చెందిన భూమి మూడు పంపులకు సరిపడే విస్తీర్ణం ఉండడంతో ఆ ప్రాంతంలో వాటిని వేగవంతంగా పూర్తిచేస్తున్నాం. అయిదు వరుసల్లో గొట్టాల ఏర్పాట్లు ఆటంకాలు లేకుండా చేసుకెళుతున్నాం. మే 23వ తేది లోపు మిగతా భూములను కూడా ప్రభుత్వం అప్పగిస్తుంది. నిర్ణీత గడువులో కనీసం నాలుగు పంపుల ద్వారా అయినా 50 శాతం సాగునీరయినా పంపించగలుగుతాం. పెదకొండేపూడి గిరిజన గ్రామం వద్ద రాయి తగలడంతో బ్లాసింగ్‌ చేసి గొట్టాలు దించడం కొంత సమయం పెరుగుతుందే తప్ప ఎటువంటి ఆటంకం ఉండదు. 50,500 మీటర్ల గొట్టాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన పైపులు సిద్ధంగా ఉంచాం.

- ఎస్‌.సుగుణాకరరావు, ఎస్‌ఈ, పోలవరం ఎడమ ప్రధానకాలువ, తుని

eag-top2b.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

జలవనరుల శాఖకు భూముల అప్పగింత
eag-gen1a.jpg

నాగంపల్లి(సీతానగరం), న్కూస్‌టుడే: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూముల అప్పగింత కార్యక్రమం మొదలైంది. గతేడాది డిసెంబరులోనే సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనుల కోసం రైతుల నుంచి భూముల సేకరణ చేపట్టారు. రైతులకు పరిహారం అందిచడంలో కూడా జాప్యం చేయకుండా సుమారు రూ.56 కోట్ల నిధులు ఒకే విడతలో రైతుల ఖాతాలకు జమ చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం భూసేకరణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం పూర్తి చేసింది. అవార్డు విచారణ పూర్తి చేసేసరికి 206.34 ఎకరాల భూమికి గాను 132.81 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి అప్పగించారు. మరో 73.53 ఎకరాల భూమికి చెందిన రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇందులో కొందరు అవార్డు విచారణ గ్రామసభల్లో ప్రభుత్వం నిర్ణయించిన పరిహారానికి తమ భూములు అప్పగిస్తామని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌కు విన్నవించారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తమ చేతుల్లో ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముందస్తు ఒప్పందం చేసుకున్న రైతులకు ఎకరాకు రూ.24 లక్షలు, రూ.28 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా కోర్టుకు వెళ్లిన వారికి 2013 భూసేకరణ చట్టం అనుసరించి పరిహారం పంపిణీ చేస్తామన్నారు. వంగలపూడి, నాగంపల్లి గ్రామాలకు అవార్డు ప్రకటించేశారు. దాంతో శుక్రవారం ఉదయం సీతానగరం తహసీల్దార్‌ కనకం చంద్రశేఖరరావు ప్రత్యేక రెవెన్యూ బృందాలతో ఆయా గ్రామాలకు వెళ్లి నిర్దేశిత భూములను జలవనరులశాఖ ఉన్నతాధికారులకు అప్పగించారు. రెవెన్యూ అప్పగించిన భూములు అధికారికంగా తమచేతుల్లోకి రావడంతో ఒకటి, రెండురోజుల్లో పనులు చేపడతామని పోలవరం ఎడమ ప్రధానకాలువ ఎస్‌ఈ సుగుణాకరరావు తెలిపారు. ఇక పురుషోత్తపట్నం, చినకొండేపూడి భూములకు అవార్డు ప్రకటించే ప్రక్రియను వేగవంతం చేశామని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ తెలిపారు. ఇప్పటికే ఉద్యాన, అటవీ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల నుంచి ఆయా పొలాల్లో ఉండే వనరులపై నివేదికలు పూర్తి చేశామన్నారు. న్యాయపోరాటానికి వెళ్లిన రైతులు, తమ భూముల్లోకి అధికారుల వచ్చి పనులు చేపడితే అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. ఈ నెల 29 తర్వాత రెవెన్యూశాఖ అప్పగించిన భూముల్లో జలవనరులశాఖ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

పురుషోత్తపట్నం భూసేకరణ పూర్తి
 
  • 70 ఎకరాలు బలవంతపు సేకరణతో రైతుల ఆందోళన
  • 17 మందిపై కేసులు
రాజమహేంద్రవరం, మే 29 (ఆంధ్రజ్యోతి): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి గ్రామాలలో 217 ఎకరాల ప్రైవేట్‌ భూమి ఇందుకు సేకరించారు. మరికొంత ప్రభుత్వ భూమి ఉంది. ప్రైవేట్‌ భూమి మొత్తం 284మంది రైతులకు సంబంధించినది కాగా, 187మంది రైతులు తమ భూములను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇవ్వడానికి అంగీకార పత్రాలు రాసిచ్చారు. కానీ 70 ఎకరాలకు సంబంధించిన 87మంది రైతులు పట్టిసీమ భూమికి ఇచ్చిన మాదిరిగానే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంగీకార పత్రాలు ఇవ్వలేదు. కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. ఈ నేపఽథ్యంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈ70 ఎకరాలను కూడా సేకరించినట్టు రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌, భూసేకరణ అధికారి విజయకృష్ణన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాని కోర్టు విషయం తేలకుండా, అవార్డ్‌నోటీసులు తమకు ఇవ్వకుండా భూమి సేకరించడమేమిటంటూ సంబంధిత రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పనులకు ఆటంకం కలిగించిన 17మందిపై కేసులు నమోదు చేశారు.

They should have avoided arrests... Valu adigina daniki madye margam edokati nirnayinchalsindi

Link to comment
Share on other sites

Inka bhoosekarana kaaleda purushottama patnam ki, August lo project ready & water release chesthamu annaru.

We will teach them a lesson annarugaa 2 weeks back polavaram meeting lo

28 lakhs ante vaddu annaru

2013 land act prakaram 8 lakhs ichhi saripedtaru

court emi antundi land act prakaram pothe

Link to comment
Share on other sites

I didn't understand, evaru will teach lesson andi.

2013 act prakaram 8L ee vasthaaya, TDP trying to give 28L but some farmers are doing politics? are they from Talli/Pilla congress?

land ivvakunda project apali ani vedva plan

Link to comment
Share on other sites

I didn't understand, evaru will teach lesson andi.

2013 act prakaram 8L ee vasthaaya, TDP trying to give 28L but some farmers are doing politics? are they from Talli/Pilla congress?

నాగంపల్లి(సీతానగరం), న్కూస్‌టుడే: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూముల అప్పగింత కార్యక్రమం మొదలైంది. గతేడాది డిసెంబరులోనే సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనుల కోసం రైతుల నుంచి భూముల సేకరణ చేపట్టారు. రైతులకు పరిహారం అందిచడంలో కూడా జాప్యం చేయకుండా సుమారు రూ.56 కోట్ల నిధులు ఒకే విడతలో రైతుల ఖాతాలకు జమ చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం భూసేకరణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం పూర్తి చేసింది. అవార్డు విచారణ పూర్తి చేసేసరికి 206.34 ఎకరాల భూమికి గాను 132.81 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి అప్పగించారు. మరో 73.53 ఎకరాల భూమికి చెందిన రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇందులో కొందరు అవార్డు విచారణ గ్రామసభల్లో ప్రభుత్వం నిర్ణయించిన పరిహారానికి తమ భూములు అప్పగిస్తామని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌కు విన్నవించారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తమ చేతుల్లో ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముందస్తు ఒప్పందం చేసుకున్న రైతులకు ఎకరాకు రూ.24 లక్షలు, రూ.28 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా కోర్టుకు వెళ్లిన వారికి 2013 భూసేకరణ చట్టం అనుసరించి పరిహారం పంపిణీ చేస్తామన్నారు. వంగలపూడి, నాగంపల్లి గ్రామాలకు అవార్డు ప్రకటించేశారు. దాంతో శుక్రవారం ఉదయం సీతానగరం తహసీల్దార్‌ కనకం చంద్రశేఖరరావు ప్రత్యేక రెవెన్యూ బృందాలతో ఆయా గ్రామాలకు వెళ్లి నిర్దేశిత భూములను జలవనరులశాఖ ఉన్నతాధికారులకు అప్పగించారు. రెవెన్యూ అప్పగించిన భూములు అధికారికంగా తమచేతుల్లోకి రావడంతో ఒకటి, రెండురోజుల్లో పనులు చేపడతామని పోలవరం ఎడమ ప్రధానకాలువ ఎస్‌ఈ సుగుణాకరరావు తెలిపారు. ఇక పురుషోత్తపట్నం, చినకొండేపూడి భూములకు అవార్డు ప్రకటించే ప్రక్రియను వేగవంతం చేశామని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ తెలిపారు. ఇప్పటికే ఉద్యాన, అటవీ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల నుంచి ఆయా పొలాల్లో ఉండే వనరులపై నివేదికలు పూర్తి చేశామన్నారు. న్యాయపోరాటానికి వెళ్లిన రైతులు, తమ భూముల్లోకి అధికారుల వచ్చి పనులు చేపడితే అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. ఈ నెల 29 తర్వాత రెవెన్యూశాఖ అప్పగించిన భూముల్లో జలవనరులశాఖ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

If i recall correctly EG collector in the review meeting said that the court refused to stay the "land acquisition PROCESS"

Adi vachhaka memu 28 lakhs teesukontam ani vacharu kontha mandi. But govt wont take it now. They will go according to land act. Govt has a strong case

Link to comment
Share on other sites

Object chesindi Jaffas ayithe don't show mercy. ilaantollaki YSR ee correct, 50K-1L ichhina teesukuni mossukunnaru in 2009.

TDP/Neutrals ayithe enthokontha ichhi satisfy cheyyandi.

CBN chaala chotla Polavaram canal, Pattiseema etc... lanti chotla projects importance valla 20-60L varaku pay chesadu keeping in mind it's farmers in 2014-15.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...