Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vizag IT

Featured Replies

  • Replies 742
  • Views 80.7k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

గర్వపడేలా పని చేయాలి

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 06 Aug 2026 05:53 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

ప్రపంచ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర యువత భాగస్వాములు కావాలి
‘ఐబీఎం ఫ్యూచర్‌ నౌ’ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేశ్‌

ap050826main3a.webp

ఐబీఎం ఉద్యోగులతో మాట్లాడుతున్న మంత్రి లోకేశ్‌

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే-ఎంవీపీ కాలనీ: ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డిజిటల్‌ సేవలు, సాంకేతికత ఆధార ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖ ఆవిర్భవిస్తోంది. ఇందుకు ‘ఐబీఎం ఫ్యూచర్‌ నౌ’ సెంటర్‌ తోడ్పాటు అందిస్తోంది. కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే మా లక్ష్యం కాదు. నాణ్యమైన ఉపాధిని సృష్టించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడం, రాష్ట్ర యువత ప్రపంచ డిజిటల్‌ ఆర్థికవ్యవస్థలో భాగస్వాములు అయ్యేలా ఒక సంపూర్ణ వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఐబీఎం సంస్థ విశాఖలోని ఇసుకతోటలో ఏర్పాటుచేసిన ‘ఐబీఎం కన్సల్టింగ్‌ ఫ్యూచర్‌ నౌ సెంటర్‌’ను ఆ సంస్థ దక్షిణాసియా ఎండీ సందీప్‌ పటేల్‌తో కలిసి లోకేశ్‌ బుధవారం ప్రారంభించారు. ఐబీఎం సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించారు. అందరూ గర్వపడేలా పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ఏఐ గవర్నెన్స్, ఇంటెలిజెన్స్, కెమికల్స్‌ అండ్‌ పెట్రోలియం ఆపరేషన్స్‌ గురించి అక్కడి ప్రతినిధులను లోకేశ్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ... రాష్ట్రంపై ఐబీఎం నిబద్ధతను స్వాగతిస్తున్నామన్నారు.

ap050826main3b.webp

ఐబీఎం ఫ్యూచర్‌ నౌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి లోకేశ్, దక్షిణాసియా ఎండీ సందీప్‌ పటేల్‌ తదితరులు

ఐబీఎం ప్రతినిధులు ఏమన్నారంటే

‘డిజిటల్‌ యుగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం ‘వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యసాధన రూపంలో భారతదేశానికి అందివచ్చింది. ఏఐతో పాటు ఇతర సాంకేతికతలను అందిపుచ్చుకుని దీర్ఘకాలిక విలువను సృష్టించేందుకు అవసరమైన సామర్థ్యాల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. విశాఖలో ఐబీఎం కన్సల్టింగ్‌ ఫ్యూచర్‌ నౌ సెంటర్‌ ఇందుకు నిదర్శనం’ అని దక్షిణాసియా ఎండీ సందీప్‌ పటేల్‌ అన్నారు. 

‘ఐబీఎం కన్సల్టింగ్‌ భారతదేశంలో విశాఖపట్నం సహా 15 ప్రాంతాల నుంచి ఫ్యూచర్‌ నౌ సెంటర్లను నిర్వహిస్తోంది. స్థానిక యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే లక్ష్యంతో విశాఖకు వచ్చాం. హైబ్రిడ్‌ క్లౌడ్, ఏఐ, వ్యాపారసేవల రంగాల్లో ఐబీఎం అగ్రగామి సంస్థ’ అని ఇండియా మేనేజింగ్‌ పార్టనర్‌ ఉషా శ్రీకాంత్‌ తెలిపారు.


Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.