Jump to content

AP IT sector


Recommended Posts

త్వరలో రాష్ట్రానికి 3 ఐటీ కంపెనీలు: లోకేశ్‌
 
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): త్వరలో రాష్ట్రానికి మూడు ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన కొద్దిసేపు విలేకరుల తో మాట్లాడారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఇప్పటికే తమ ఐటీ విభాగాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి అంగీకరించిందని, మరో రెండు ఐటీ కంపెనీలతో కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే 45 రోజుల్లో వీటిని తేవడానికి కార్యాచరణతో పనిచేస్తున్నామన్నారు.
Link to comment
Share on other sites

మరో రెండు ఐటీ సంస్థలొస్తాయ్‌: మంత్రి లోకేష్‌

ఐటీ శాఖపరంగా 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు ఐటీ మంత్రి లోకేష్‌ చెప్పారు. రాష్ట్రానికి ఐటీ సంస్థల్ని తీసుకురావడంలో భాగంగా హెచ్‌సీఎల్‌తో ఒప్పందం చేసుకొన్నామని, త్వరలో మరో రెండు ప్రముఖ ఐటీ సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ముచ్చటిస్తూ 15వేల వరకూ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐటీ సంస్థలు విశాఖపట్నం వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. ‘ఈ రంగంలో ప్రాజెక్టులకేమీ ఇబ్బంది లేదు. మన దగ్గర మానవ వనరులు తగినంతగా ఉన్నాయి. మెరికల్లాంటివాళ్లున్నార’న్నారు. ఐటీ ఉద్యోగులు కూడా అవకాశాలుంటే హైదరాబాద్‌ నుంచి విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Link to comment
Share on other sites

పక్షం రోజులకో కంపెనీతో ఒప్పందం

లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ఇందుకవసరమైన కార్యాచరణ రూపొందించండి

మంత్రి నారా లోకేష్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: ఇకపై ప్రతి 15 రోజులకోసారి ఐటీకి సంబంధించి ఒక పెద్ద కంపెనీతో ఒప్పందం చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఆయన ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

ప్రతి నెలా ఐటీపై సమీక్ష: విశాఖపట్నంను ఐటీ హబ్‌గా తయారు చేయడానికి కావాల్సిన రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. ఇకనుంచి ఐటీ శాఖపై ప్రతి నెలా సమీక్ష చేద్దామని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ డిజటలైజేషన్‌ చేసి, ఆన్‌లైన్లో పర్యవేక్షించాలన్నారు. ఇందుకు సంబంధించి శాఖలో అంతర్గతంగా ఒక వెబ్‌ పోర్టల్‌ను నిర్వహించాలన్నారు. కంపెనీలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అనుమతులు, భూ కేటాయింపులు తదితరాలన్నీ త్వరితగతిన ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలను ఆహ్వానించడానికి ఎంతదూరమైనా తానే స్వయంగా వెళతానన్నారు. తనకు ప్రొటోకాల్‌ కంటే ఉద్యోగాలు రావడమే ముఖ్యమన్నారు. ఐటీ శాఖలో ఉండే అధికారులంతా ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని ప్రగతిని ఎప్పటికప్పుడు అందులో సమీక్షించుకుంటే బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌, ఐటీ సలహాదారు జేఏ చౌదరి, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాబు, ఈ-ప్రగతి సీఈఓ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Airport confirmation manchi upu techindi vizag north lo...400 crore ocenarium kuda airport finalize avvatam valla kadilindi...

 

A area 1400 acres decoit dongala batch ki ichadu.cbn govt court lo fight chesi techindi malli..asalunu Mottam govt land rushikonda,yendada,kapuluppada upto bhimili...decoit ttasfered 30k acres in that area to batch and nothing left to govt now.oka paddati ga dobbesaru beach front ni..

 

Puran aunty illu value double ayindi CBN punyama ani :) Combined AP lo top properties care of address Puran aunty hill..

 

Sevenhills dr too much kattadu Bay area laga..

Link to comment
Share on other sites

సైబర్‌ భద్రతపై విద్యార్థులకు శిక్షణ

ఐటీ శాఖతో హెచ్‌ఎస్‌బీసీ ఒప్పందం : మంత్రి లోకేష్‌

ఈనాడు, అమరావతి: సైబర్‌ దాడులు, వన్నాక్రై లాంటి వైరస్‌ దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకు సైబర్‌ భద్రతపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కుంటోందని, ఆటోమేషన్‌, రోబో టెక్నాలజీలతో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని ముందే వూహించి అందుకుతగ్గ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సైబర్‌ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్‌, యాంటీ మనీలాండరింగ్‌ లాంటి కోర్సుల దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు.సైబర్‌ సెక్యూరిటీలో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని, హెచ్‌ఎస్‌బీసీ ఏటా 2 వేల మంది విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తోందని తెలిపారు. ఆ సంస్థతో కుదిరిన ఒప్పందం వల్ల రాష్ట్రానికి ప్రయోజనాలుంటాయన్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని కళాశాలల్లో 250 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. వచ్చే ఏడాది వెయ్యి మందికి ఈ రంగాల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Link to comment
Share on other sites

50 వేల ఉద్యోగాలు లక్ష్యం

ఐటీ కంపెనీల కోసం కొత్త విధానం

గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

తొలుత విశాఖలో లక్ష చ. అడుగుల విస్తీర్ణంలో..

సమాచార సాంకేతిక రంగం అభివృద్ధిపై ప్రభుత్వ వ్యూహం

ఈనాడు - అమరావతి

5ap-main4a.jpg

ఐటీ, పరిశోధన, అభివృద్ధి రంగాలకు సంబంధించిన పరిశ్రమలను మరింత ఆకర్షించడానికి రాష్ట్రంలో పెద్దఎత్తున ‘గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్‌’(జీఐసీ)లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోని పలు బహుళజాతి కంపెనీలు, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ తదితర ఐటీ 5ap-main4b.jpgదిగ్గజ కంపెనీలు ‘గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్‌’లను సమర్థంగా వినియోగించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్‌ విధానం 2017’ రూపొందించింది. అవకాశాలున్న ముఖ్య నగరాల్లో ఈ కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. తొలుత విశాఖలో లక్ష చ.అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటుచేయనున్నారు. తరువాతి దశలో రాజధాని అమరావతి, తిరుపతి, ఇతర నగరాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు.

ఐటీ కంపెనీలు అవుట్‌సోర్సింగ్‌ విధానంలోనూ ఉద్యోగులను నియమించుకుంటాయి. ఇందులో కొన్ని ఇబ్బందులు ఉండటం, ఉద్యోగుల్లో నైపుణ్యలేమి తదితర కారణాల వల్ల సత్ఫలితాలు లభించక నేరుగా నియామకాల వైపు అవి మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ కేంద్రాలను అభివృద్ధి చేస్తే కంపెనీలు పూర్తిస్థాయిలో ఇక్కడే కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. 2000లో దేశంలో 180 జీఐసీ కేంద్రాలు మాత్రమే ఉండగా 2016లో అవి ఏకంగా 1050కి చేరుకున్నాయి. జీఐసీ కేంద్రాలు చేస్తున్న ఎగుమతులూ పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అనుకూలం: జీఐసీ కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క జీఐసీ ఏర్పాటుకాలేదు. ఈ రంగం భవిష్యత్తు అభివృద్ధి, అవసరాలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రాన్ని జీఐసీ అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ రూపొందించింది. 2020నాటికి రాష్ట్రంలోని జీఐసీ కేంద్రాల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. విశాఖను ఫిన్‌టెక్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతున్న క్రమంలో అక్కడ జీఐసీ కంపెనీలు పెద్దఎత్తున రావడానికి అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. ఒక్కో ప్రాజెక్టుకు కనీసం రూ.500 కోట్ల పెట్టుబడులు వచ్చేలా, కనీసం 500 ఉద్యోగాలు వచ్చేలా విధానాన్ని రూపొందించారు. జీఐసీ కంపెనీలకు మౌలిక సదుపాయాలు, మానవ వనరులకు సంబంధించి ఇతరులపై ఆధారపడకుండా అన్నీ సమకూర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్‌ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు.

Link to comment
Share on other sites

బుధవారం విశాఖలో మంత్రి లోకేశ్ పర్యటన
 
 
636323860852132713.jpg
విశాఖ: బుధవారం నగరంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించనున్నారు. వీసా క్యాష్‌లెస్‌ కికాఫ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హోటల్ నోవాటెల్‌లో ఏఎన్ఎస్ఆర్ కంపెనీతో ఏపీఐఐసీ ఒప్పందం చేసుకోనుంది. మధురవాడ ఐటీ సెజ్‌లో 10 ఎకరాల భూమిని ఏఎన్ఎస్ఆర్‌ కంపెనీకి కేటాయించనుంది. ఈ ఒప్పందం ద్వారా వెయ్యికోట్ల పెట్టుబడులు, ఆరేళ్లలో పదివేల ఉద్యోగాలు కల్పించనున్నారు.
Link to comment
Share on other sites

విశాఖలో ఏఎన్‌ఎస్‌ఆర్‌ జీఐసీ సంస్థ రాక

10 ఎకరాల్లో నిర్మాణం

ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో గ్లోబ్‌ ఇన్‌హౌస్‌ కేంద్రం నిర్మించడానికి ఈ రంగంలో పేరొందిన ఏఎన్‌ఎస్‌ఆర్‌ జీఐసీ సెంటర్‌ ముందుకొచ్చింది. విశాఖపట్నం మధురవాడలోని ఏపీఐఐసీకి చెందిన 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థ జీఐసీ కేంద్రాన్ని నిర్మించనుంది. ఇందుకోసం ఏపీఐఐసీ, ఆ సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా సాగుతాయి. ఇందుకోసం ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుచేస్తారు. వచ్చే ఆరేళ్లలో జీఐసీ ద్వారా వెయ్యి కోట్ల పెట్టుబడులు, ఆరువేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదర్చుకోనుంది.

జీఐసీ విధానం జారీ: గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్లను ప్రోత్సహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆ దిశగా ఒక కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్‌(జీఐసీ)-2017 విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. జీఐసీల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ రంగంలో 2020 కల్లా రూ.2500 కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేసి, 50వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఈ విధానంలో లక్ష్యం పెట్టుకుంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...