Jump to content

AP IT sector


Recommended Posts

Capgemini may set up development centre in Vizag: CEO

 Santosh Patnaik
VISAKHAPATNAM, July 28, 2017 00:00 IST
Updated: July 28, 2017 05:22 IST
 
‘The city remains on top of our list’

Capgemini, the global leader present in over 40 countries with a headcount of nearly two lakh, may consider setting up a development centre in Visakhapatnam.

Forecasting a bright future for the city to emerge as a technology hub owing to its strategic location, beachfront and valley and well-developed educational institutes, Capgemini India CEO Kandula Srinivas told The Hindu on Thursday that, at the appropriate time, they would consider establishing a development centre here.

Mr. Srinivas earlier held talks with Special Chief Secretary and IT Adviser to Chief Minister J.A. Chowdary. They were addressing a national meet on skill development at GITAM University.

Consolidation

He said their company, a French multinational with headquarters in Paris and revenue of 12.54 billion Euros in 2016, was now consolidating its centres due to transition faced by the IT industry as a result of emerging new technologies.

Visakhapatnam is the largest city in Andhra Pradesh with an IT turnover of Rs. 2,000 crore. It is home to big companies including Tech Mahindra, Wipro, IBM, Concentrix and WNS. “Right now there is no proposal to locate a development centre in Visakhapatnam. The State government is also keen on developing IT in a big way. In future, the city will remain on top of our list for new investments,” he said.

Mr. Srinivas said Hyderabad became a prominent IT hub after two decades of launching Cyber Towers. “Vizag with a robust industrial base and good connectivity is emerging as a new hub in Andhra Pradesh. I am certain it will also become one of the prominent IT hubs as it has all the ingredients to stake claim as an ideal destination for investors.”

He said there was good scope for technology companies in Internet of Things, artificial intelligence and machine learning, analytics and blockchain technology, and appreciated the efforts made by the State government to promote blockchain and other fintech companies in Vizag.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

విశాఖలో సరికొత్త ఐటీ వేదిక ‘టెక్‌ హబ్‌’
ఐటీ సంస్థల కోసం అధునాతన వసతులతో భవనం
తొమ్మిది అంతస్తుల్లో 1.75 లక్షల చ.అడుగుల ప్రాంగణం
రేపు అధికారికంగా ప్రారంభం
it4.jpg

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ ఐటీ రంగంలో కొత్త శకం ప్రారంభంకానుంది. గురువారం నగరంలో ఎనిమిది కొత్త ఐటీ సంస్థలను ‘టెక్‌హబ్‌’ భవనంలో ప్రారంభించేందుకు రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం నగరంలోని సత్యం కూడలిలో విస్తృతమైన మౌలిక సదుపాయాలతో నిర్మించిన ‘టెక్‌హబ్‌’ భవనం ముస్తాబవుతోంది. విశాఖ నుంచి ఇప్పటికే ఏటా రూ.1800 కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. సుమారు వంద వరకు సంస్థలు ఐటీ సేవలందిస్తున్నాయి. చాలామంది ఐటీ ఆధారిత సంస్థల్ని ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇన్నాళ్లూ తగిన ప్రాంగణం అందుబాటులో లేక ముందుకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ చొరవ తీసుకున్నారు. ఐటీ సంస్థలకు కేటాయించడానికి వీలుగా టెక్‌మహీంద్ర సంస్థ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. తొమ్మిది అంతస్తుల్లో 1.75 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు నేరుగా నిర్వహించుకోడానికి వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ భవనానికి ‘టెక్‌హబ్‌’ అని పేరు పెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ ఏజెన్సీ (ఎపీటా) ఆధ్వర్యంలో ఇప్పటికే ఐదు అంతస్తుల్లో పూర్తి స్థాయిలో వసతులను అభివృద్ధి చేశారు. రెండు నెలల్లో దశలవారీగా ఎనిమిది ఐటీ సంస్థలకు ప్రాంగణాన్ని కేటాయించారు. ఆయా సంస్థలు నేరుగా తమ కార్యకలాపాలను ప్రారంభించుకోడానికి వీలుగా ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఫలితంగా భవనం అధికారికంగా ప్రారంభించడానికి ముందే ఆయా సంస్థల్లో కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఇప్పటికే 800 మంది ఉద్యోగాలు నియమితులయ్యారు. మిగిలిన నాలుగంతస్తుల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించి రెండు మూడు నెలల్లో ప్రముఖ ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వీటి వల్ల మరో 1200 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. టెక్‌హబ్‌ భవనంలో మొత్తం రెండు వేల మంది సౌకర్యంగా ఉద్యోగాలు చేసుకునేలా వసతి కల్పించారు.

సాంకేతిక పరిజ్ఞానాలకు అగ్రప్రాధాన్యం
విశాఖలో ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, బీపీవో, కేపీవో సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవంగా పేరొందిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), మెషిన్‌లెర్నింగ్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ రంగ పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) తదితర రంగాల్లో కూడా విశాఖ ప్రగతి సాధించాలన్న ఉద్దేశంతో ఆయా పరిజ్ఞానాల ఆధారంగా పనిచేసే సంస్థలకు టెక్‌హబ్‌లో స్థానం కల్పించారు.

ప్రారంభించనున్న సంస్థలివే...
డిజిపబ్‌ అపెక్స్‌ కొవాంటేజ్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వెంచర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్ఫోమ్యాట్రిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐడీఏ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జివా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అవ్యా ఇన్వెన్‌ట్రాక్స్‌, వర్చువల్‌ గార్డ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అంజూర్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విస్మయ ప్రీమీడియా సర్వీసెస్‌ సంస్థ మొదటి ఐదు అంతస్తుల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆయా సంస్థలను ఐటీ మంత్రి లోకేష్‌ గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు.

విశాఖ ఐటీ ప్రగతిలో మైలురాయి రాష్ట్రంలో ఐటీ సంస్థలు ప్రారంభించుకోవాలనుకునే వారి కోసం టెక్‌మహీంద్ర భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం లీజుకు తీసుకుంది. ఐటీ సంస్థలు నేరుగా తమ కార్యకలాపాలు ప్రారంభించుకునేలా అన్ని వసతులు అభివృద్ధి చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వూపందుకుంటున్న మెషిన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ తదితర రంగాల సంస్థలు కూడా ఇక్కడ కాలుమోపనున్నాయి.

- జె.ఎ.చౌదరి, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు
Link to comment
Share on other sites

విశాఖకు మరో ఎనిమిది ఐటీ కంపెనీలు

నేడు ప్రారంభించనున్న ఐటీ మంత్రి లోకేష్‌

ఈనాడు అమరావతి: విశాఖపట్నంలో మరో ఎనిమిది ఐటీ కంపెనీలు గురువారం ప్రారంభం కానున్నాయి. నగరంలోని రిషికొండ వద్ద టెక్‌ మహీంద్రాకు చెందిన లక్ష చదరపు అడుగుల కార్యాలయ స్థలంగల 11 అంతస్తుల భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఏటీ ఏజెన్సీ(ఏపీటా) అద్దెకు తీసుకుని ఐటీ కంపెనీలకు కేటాయించింది. ఇందులో ఎనిమిది ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. వీటిని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్‌ గురువారం ప్రారంభించనున్నారు. ఈ కంపెనీలు అక్కడ 770 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. ‘ఏపెక్స్‌’ కంటెంట్‌ సొల్యూషన్స్‌, వెంచర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌, ఐడీఏ ఆటోమేషన్‌, జీవా డిజిటల్‌ సర్వీసెస్‌, అవ్యా ఇన్‌వెట్రాక్స్‌, వర్చువల్‌ గార్డ్‌ సర్వీసెస్‌, అమ్‌జూర్‌ ఇన్ఫోటెక్‌, విస్మయ ప్రీమీడియా సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Link to comment
Share on other sites

విశాఖలో టెక్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్
24-08-2017 11:24:23
 
636391706684970329.jpg
విశాఖ: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖలో టెక్ హబ్‌ను ప్రారంభించారు. ఈ టెక్ హబ్ కేంద్రంగా అపెక్స్, వెంచర్ ఆఫ్ షోర్, ఐడీఏ, జివ డిజిటల్ సర్వీస్, అవ్య ఇన్వెంట్రాక్స్, వీజీఎస్, ఆమ్ జర్, విస్మయా ప్రీ మీడియా సర్వీసులు పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ..ఈ టెక్ హబ్‌ ద్వారా 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా తొలి విడతలో 900మందికి ఉద్యోగాలు ప్రకటించినట్లు మంత్రి నారా లోకేష్ అన్నారు.
Link to comment
Share on other sites

Lokesh ki idi good achievement in these tuff times.......  :applause: .......Personel ga sadinchadu....

Waiting for many more to come from him

 

e week lo Vizag ki annouce chesina 9 companies(patra,Concentrix and WNS ) anni manchive but Conduent is latest&BIG one..

 

/*****

Lokesh Nara‏Verified account @naralokesh  9h9 hours ago
In a video conference with representatives of Conduent Inc, discussed on the modalities to begin its operations in Vizag. (1/2)
Happy to announce that the company will immediately begin its operations & provide 5000 jobs. (2/2)


Conduent Inc, is 7 billion $ company with 93,00 employees

Xerox Corp separated Business process unit into Conduent Inc this year

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...