Jump to content

AP IT sector


Recommended Posts

  • 3 weeks later...

ప్రవాసాంధ్రులకు ఎర్రతివాచీ
ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ సదుపాయం
విశాఖ, విజయవాడల్లో నాలుగు భవనాల్లో ఏర్పాట్లు
కంపెనీల ఏర్పాటుకు వంద సంస్థల ఆసక్తి

మాతృభూమికి సేవాభిలాష ఉన్న ప్రవాసాంధ్రులకు వేదికలా రూపొందిన ఎన్‌ఆర్‌టీ (ప్రవాస తెలుగువారు) సొసైటీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తున్నాయి. సొసైటీ ప్రతినిధులు రెండు దఫాలుగా అమెరికా, కెనడా, బ్రిటన్‌ తదితర దేశాల్లో పర్యటించి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నించారు. తొలి దశలో 35 మంది, రెండో దశలో 65 మంది రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు. వీటిలో 95 శాతం ఐటీ కంపెనీలే ఉన్నాయి. ప్రభుత్వమే ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి భవనాలను అద్దెకు తీసుకుని విదేశాల నుంచి వచ్చే ఐటీ సంస్థలు నేరుగా తమ కార్యకలాపాలు ప్రారంభించేలా (ప్లగ్‌ అండ్‌ ప్లే) సిద్ధం చేయనుంది. వివిధ రాయితీలు కల్పిస్తుంది. భవిష్యత్తులో రాజధాని అమరావతిలో ఎన్‌ఆర్‌టీ సొసైటీ ‘ఎన్‌ఆర్‌టీ’ ఐకాన్‌ పేరుతో 27 అంతస్తుల భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనతో ఉంది. దీని కోసం పదెకరాలు కావాలని ప్రభుత్వాన్ని ఈ సొసైటీ కోరింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయంగా ఆమోదించారని, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్రుల వ్యవహారాల సలహాదారు, ఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు, సీఈఓ వేమూరు పి.రవికుమార్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయా దేశాల్లో ఎన్‌ఆర్‌టీ సొసైటీ స్థానికులను సమన్వయకర్తలుగా నియమిస్తోంది.

05ap-main14b.jpg

మొత్తం నాలుగు భవనాలు.. ప్రవాసాంధ్రులు కంపెనీలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం విశాఖలో మూడు, విజయవాడలో ఒక భవనాన్ని సిద్ధం చేస్తోంది. విశాఖలో టెక్‌మహీంద్రా, వుడా, పాంటాలూన్స్‌ భవనాల్లో కొంత భాగాలను లీజుకు తీసుకుంది. ఈ మూడు భవనాల్లో కలిపి రెండు లక్షల చ.అడుగుల విస్తీర్ణాన్ని అందుబాటులోకి తెస్తోంది. విజయవాడలోని అశోక్‌నగర్‌ ప్రాంతంలో 60 వేల చ.అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాన్ని సిద్ధం చేస్తోంది. తొలి దశలో విజయవాడలో 21 కంపెనీలు, విశాఖలో 20 కంపెనీలు ఏర్పాటవుతాయి. తొలి దశలో వచ్చేందుకు సిద్ధమైన 35 కంపెనీల్లో 33 అమెరికావి, రెండు బ్రిటన్‌వి ఉన్నాయి. రెండో దశలో అమెరికా, కెనడాల్లోని 18 నగరాల్లో పర్యటించగా 65 కంపెనీలు ముందుకు వచ్చాయని రవికుమార్‌ వివరించారు. ఇవన్నీ చిన్న, మధ్యతరహా కంపెనీలే. ఒక్కో సంస్థలో 25 నుంచి 200 వరకు ఉద్యోగులు ఉంటారు. ఇవన్నీ వస్తే రూ.500-600 కోట్ల పెట్టుబడులు వస్తాయని, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని రవికుమార్‌ చెప్పారు.

ప్రవాసాంధ్రుల పెట్టుబడితో.. అమరావతిలో ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ పేరుతో నిర్మించే భవనానికి సంబంధించిన ప్రాథమిక నమూనాలను ఎన్‌ఆర్‌టీ సొసైటీ సిద్ధం చేసింది. దీనిలో వంద కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైనంత స్థలం ఉంటుంది. మూడు వేల మంది వరకు కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం ఉంటుంది. దీని నిర్మాణానికి సుమారు రూ.300 కోట్లు ఖర్చవుతుందని సొసైటీ అంచనా వేస్తోంది. భవనానికి నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ ఏర్పాటు చేయనున్నారు. సొసైటీ కార్యాలయం కూడా ఈ భవనంలోనే ఉంటుంది. ఈ భవనాన్ని వివిధ సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని భవన నిర్మాణానికి పెట్టుబడి పెట్టిన ప్రవాసాంధ్రులకు దామాషాలో పంచుతారు.

Link to comment
Share on other sites

Cisco to set up Internet of Everthing innovation centre in Vizag

 
1454928693-3057.jpg

Cisco will set up an internet of everything (IoE) Innovation centre in Visakhapatnam to drive regional innovation and will enable partners and start-ups to build solutions around IoE and engage in rapid prototyping.

The innovation centre is one of the initiatives proposed by the company in an MoU signed with Andhra Pradesh government on Thursday.

Among other initiatives, Cisco will also invest in an advanced Technology centre of Excellence and Research Lab in the Institute of Digital Technology at Tirupati, focused on cyber security, smarty city and manufacturing solutions.

The MoU was signed as a part of the inauguration of India's first statewide broadband project-AP Fiber Net, in Visakhapatnam in the presence of Andhra Pradesh chief minister N Chandrababu Naidu and Cisco executive chairman Irving Tan among others.


The company has also announced plans for the expansion of Cisco Networking Academy in 70 colleges to train around 10,000 new students in the state.

 
Link to comment
Share on other sites

ఎపి నుంచీ గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలు
 
636035366911544445.jpg
  • స్టార్ట్‌ప్స్ కు అన్నివిధాలా ప్రోత్సాహం 
  • ఐటి రంగంలో కీలక మార్పులు 
  • ఎపి ఐటి ప్రమోషన్‌, ఇన్నోవేషన్స్‌ ప్రత్యేక ప్రతినిధి వీణ గుండవల్లి 
స్టార్ట్‌ప్స్ ను ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి టెక్నాలజీ దిగ్గజ కంపెనీలను సృష్టించవచ్చని సీనియర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌, ఎపి ఐటి ప్రమోషన్‌ అండ్‌ ఇన్నోవేషన్స్‌ ప్రత్యేక ప్రతినిధి వీణ గుండవల్లి అన్నారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో రెండు ఐటి కంపెనీలు నడుపుతున్న ఆమె స్టార్టప్స్‌ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..
 
ఎపిలో స్టార్టప్స్‌ వాతావరణం ఎలా ఉంది?
అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో స్టార్ట్‌ప్సకు చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన వారి ఆలోచనలు వారికేమీ తీసిపోవు. అందుకే ఇక్కడా స్టార్ట్‌ప్సను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాం. ఎపిలోనూ ఫేస్‌బుక్‌,గూగుల్‌ వంటి సంస్థలను సృష్టించాలనే ఆలోచనలతో పని చేస్తున్నాం. ఇందుకోసం రాష్ట్రంలోని యువతకు అవసరమైన చేయూత అందిస్తాం.
 
ఐటి రంగంలో వస్తున్న మార్పులను ఎలా తీసుకోవాలి?
ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో కీలకమైన మార్పులు వస్తున్నాయి. గతంలో విదేశాల నుంచి వచ్చే ప్రాజెక్టులను భారత్‌లో పూర్తిచేసేవారు. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీతో అలాంటి ప్రాజెక్టులు చేయడానికిగానీ, ఇతరత్రా పనులకుగానీ మనుషులు అవసరం లేని స్థితి ఏర్పడింది. రోబోట్స్‌ లేదా సాఫ్ట్‌వేర్స్‌, ఐటి రంగంలో కీలకభూమి పోషిస్తున్నాయి. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి.
 
ఇతర రంగాల్లో వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి?
బ్యాంకింగ్‌, షాపింగ్‌, విద్య, వైద్యం, హోటల్స్‌ రంగంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. వీటిల్లో దేనికీ కేంద్రాలు, కార్యాలయాల అవసరం లేకుండా అన్నింటా ఆన్‌లైన్‌ ద్వారానే సేవలు అందుతున్నాయి. బ్యాంకింగ్‌, షాపింగ్‌ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సేవలు కూడా ఆన్‌లైన్‌లోనే అందుతున్నాయి. పాఠాలు ఆన్‌లైన్‌లో చెబుతున్నారు. అలాగే టెలీమెడిసన్‌ కూడా వచ్చింది. అవసరానికంటే ఎక్కువ ఉన్న ఇళ్లను అద్దెకు ఇస్తూ హోటల్‌ రంగానికి పోటీగా నిలుస్తున్నారు. ఇలా అన్నింటా వినూత్న మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు తగ్గట్టుగా మనం స్టార్టప్‌ ఐడియాలను రూపొందించాలి.
 
ఎపిలో స్టార్ట్‌ప్స్ ను ఎలా ప్రోత్సహిస్తారు?
ఎపిలో స్టార్ట్‌ప్సకు అన్నిరకాల ప్రోత్సాహం అందిస్తాం. ఇందుకోసమే సాప్‌ (ఎస్‌ఎపి) వంటి ఐటి దిగ్గజ కంపెనీలతో అవగాహనా ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకున్నాం. స్టార్టప్‌ ఐడియాలతో వచ్చేవారికి తగిన గైడెన్స్‌, ఇంక్యుబేషన్స్‌, మెటీరియల్‌, మార్కెటింగ్‌ సదుపాయం వంటి వాటిని అందించేందుకు సాప్‌ కంపెనీ 180 కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇవిగాక 200 మంది కలిసి మెంటర్స్‌గ్రిడ్‌.కామ్‌ పేరుతో స్టార్టప్స్‌ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రత్యేకించి ఎపి కోసం ఒక పేజీ కేటాయించాం. ఎవరైనా కొత్త ఎంటర్‌ప్రెన్యువర్స్‌ ఇందులో సైన్‌అప్‌ చేయవచ్చు. అలాగే మెంటర్‌గా ఎవరినైనా ఎంపిక చేసుకునే అవకాశమూ ఉంటుంది.
 
రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధి చెందాలంటే?
రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్లయింది. ఐటి రంగం అభివృద్ధికి ఇది చాలా తక్కువ సమయం. ఇందుకోసం ముం దుగా మనకు మంచి నాయకత్వం పెరగాలి. మౌలిక సదుపాయాలను బాగా డెవలప్‌ చేసుకోవాలి. స్టార్టప్స్‌ సక్సె్‌సకు కొంత సమయం పడుతుంది. విజయాల కోసం కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. స్టార్ట్‌ప్సకు ఐడియాలు, ఇన్వెస్ట్ మెంట్‌, మార్కెటింగ్‌ అన్నీ అవసరమే. వాటిని అందించి ఇక్కడి యువతను ప్రోత్సహించడం కోసమే సాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం.
- (విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
Link to comment
Share on other sites

రాష్ట్రంలో స్టార్ట్‌ప్‌లకు ప్రోత్సాహం
 
  • శాప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 
  • రూ.8,772 కోట్ల పెట్టుబడికి సిద్ధం 
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆధునితకను అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్‌ ఐటి సలహాదారు జెఎ చౌదరి అన్నారు. రాష్ట్రంలో స్టార్టప్స్‌ అభివృద్ధిపై గురువారం విశాఖలో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. స్టార్ట్‌ప్సను ప్రోత్సహించేందుకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కంపెనీ శాప్‌ (సిస్టమ్‌ అప్లికేషన్‌ ప్రొడక్ట్‌) మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. విశాఖతోపాటు, తిరుపతిలో కూడా స్టార్టప్‌ యాక్టివిటీ ఎక్కువగా ఉందని చౌదరి చెప్సారు. వీటిని ప్రోత్సహించేందుకు శాప్‌ కంపెనీ 130 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,772 కోట్లు) పెట్టుబడిగా సమకూర్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. రాషా్ట్రన్ని ఫినోటెక్‌ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న కృషిలో భాగంగానే శాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఐటి ఇన్నోవేషన్‌ అండ్‌ ప్రమోషన్‌ ప్రత్యేక ప్రతినిధి వీణా గుండవిల్లి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో ఈ ప్రాంతాన్ని ఐటి రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు భాగస్వాములమయ్యామని తెలిపారు. వ్యవసాయ, వైద్య రంగాల్లో స్టార్ట్‌ప్సకు బంగారు భవిష్యత్తు ఉందన్నారు. శాప్‌ డైరెక్టర్‌ మయాంక్‌ మథూర్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని, అయితే ఒక ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. రాష్ట్రంలో స్టార్ట్‌ప్సను మరింతగా ప్రోత్సహించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేశామని చెప్పారు.
 
ఒప్పందం వివరాలు..
ఈ ఎంఒయు ప్రకారం శాప్‌ సంస్థ 130 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతుంది. సంస్థ రూపొందించిన ‘హనా’ టెక్నాలజీ ద్వారా స్టార్టప్‌ కంపెనీలకు విలువైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటిని మార్కెట్‌లో కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాగే స్టార్టప్‌ కంపెనీల ఉత్పత్తులకు అవసరమైన మార్కెట్‌ సపోర్ట్‌ అందించేందుకూ శాప్‌ కంపెనీ అంగీకరించింది.
Link to comment
Share on other sites

 

రాష్ట్రంలో స్టార్ట్‌ప్‌లకు ప్రోత్సాహం

 

  • శాప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 
  • రూ.8,772 కోట్ల పెట్టుబడికి సిద్ధం 
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఆధునితకను అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్‌ ఐటి సలహాదారు జెఎ చౌదరి అన్నారు. రాష్ట్రంలో స్టార్టప్స్‌ అభివృద్ధిపై గురువారం విశాఖలో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. స్టార్ట్‌ప్సను ప్రోత్సహించేందుకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కంపెనీ శాప్‌ (సిస్టమ్‌ అప్లికేషన్‌ ప్రొడక్ట్‌) మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. విశాఖతోపాటు, తిరుపతిలో కూడా స్టార్టప్‌ యాక్టివిటీ ఎక్కువగా ఉందని చౌదరి చెప్సారు. వీటిని ప్రోత్సహించేందుకు శాప్‌ కంపెనీ 130 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,772 కోట్లు) పెట్టుబడిగా సమకూర్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. రాషా్ట్రన్ని ఫినోటెక్‌ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న కృషిలో భాగంగానే శాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఐటి ఇన్నోవేషన్‌ అండ్‌ ప్రమోషన్‌ ప్రత్యేక ప్రతినిధి వీణా గుండవిల్లి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో ఈ ప్రాంతాన్ని ఐటి రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు భాగస్వాములమయ్యామని తెలిపారు. వ్యవసాయ, వైద్య రంగాల్లో స్టార్ట్‌ప్సకు బంగారు భవిష్యత్తు ఉందన్నారు. శాప్‌ డైరెక్టర్‌ మయాంక్‌ మథూర్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని, అయితే ఒక ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. రాష్ట్రంలో స్టార్ట్‌ప్సను మరింతగా ప్రోత్సహించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేశామని చెప్పారు.

 
ఒప్పందం వివరాలు..
ఈ ఎంఒయు ప్రకారం శాప్‌ సంస్థ 130 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతుంది. సంస్థ రూపొందించిన ‘హనా’ టెక్నాలజీ ద్వారా స్టార్టప్‌ కంపెనీలకు విలువైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటిని మార్కెట్‌లో కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాగే స్టార్టప్‌ కంపెనీల ఉత్పత్తులకు అవసరమైన మార్కెట్‌ సపోర్ట్‌ అందించేందుకూ శాప్‌ కంపెనీ అంగీకరించింది.

 

:super:   SAP vasthe boost up guarenteed

Link to comment
Share on other sites

naku alane anipisthundi

 

 

Vizag motham scrap tho nimputunaru mostly US recruiting no s/w jobs 

 

Nenu inka 2014 lo Babu garu vacharu hayiga Vizag lo settle avudam anukuna but scene is completely reverse

Link to comment
Share on other sites

AP focusing on niche areas in IT sector

 
BL12_STATES_CHOWDA_2928612e.jpg
THE HINDU JA Chowdary, IT Adviser to the Government of Andhra Pradesh

Vizag to be developed as main centre

Visakhapatnam, July 11:  

 

Andhra Pradesh is trying to focus on certain niche areas in the IT sector and the government has drawn up ambitious plans to develop Visakhapatnam as the main centre and also to promote IT at places such as Tirupati and Hindupur, according to IT Adviser to the State government JA Chowdary.

A key figure in the promotion of the IT sector in Hyderabad in the united AP, he has been appointed by the AP government to develop the sector in the State after bifurcation.

‘Challenging scene’

 

In an interview here recently, Chowdary said he had earlier taken part in the development of the sector in Hyderabad. “But it has to be done now in more trying and challenging circumstances in the new AP. We have to attract the IT companies, generate jobs and create the right kind of ecosystem for start-ups.”

He said the image of Chief Minister N Chandrababu Naidu as a tech-savvy one would be of immense help in attracting the US-based IT companies to the State. The AP government has also appointed Veena Gundavalli, an IT entrepreneur based in the Silicon Valley, as a special representative of the State for the purpose.

Chowdary said there were several entrepreneurs from the State working in the sector in the US and their help would be enlisted. Besides, the focus would also be on attracting the US companies, mid-sized ones and the smaller ones, to the State.

Emerging areas

 

He said there were many emerging areas in the IT sector and “we want to bring in the most advanced technologies in the building of the capital or the smart cities or in other matters.”

He said a start-up accelerator was coming up here with the assistance of SAP and a major IT tower was already under construction.

“There were already some IT companies here and if a few more big companies arrive there would be a big boost to the brand image of Vizag as an IT destination. That would be our endeavour,” he added.

 

(This article was published on July 11, 2016)
Link to comment
Share on other sites

ఐటీ సెజ్‌ను డీనోటిఫై చేస్తున్నాం: సీఎస్‌ టక్కర్‌
 
636040210095181218.jpg
విశాఖ: ఐటీ సెజ్‌ను డీనోటిఫై చేస్తున్నామని, డీనోటిఫికేషన్‌తో ఐటీ అభివృద్ధి చెందుతుందని ఏపీ సీఎస్‌ టక్కర్‌ తెలిపారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా వివిధ వర్గాలతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సమస్యలపై చర్చించామని చెప్పారు. జిల్లాలో పని ప్రారంభానికి ఇప్పటికే 40 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. లక్ష మంది సామర్థ్యం గల చోట 2వేల కోట్ల టర్నోవర్‌తో పని ప్రారంభిస్తే 19 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారని టక్కర్‌ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...