March 22, 20251 yr 4 hours ago, sonykongara said: 4 hours ago, sonykongara said: Asalu 98cr tho direct ga 1million people ki effect ayye pani oka padathi padu lekunda chesthunaru...........central ivvakapoyina state should look into this matter....
April 18, 20251 yr Author 5 hours ago, aditya369 said: Guntur channel extension gurnichi emina links unnaya? unnayi
April 26, 20251 yr Author On 4/18/2025 at 6:55 AM, aditya369 said: Guntur channel extension gurnichi emina links unnaya?
June 14, 20251 yr Author రెండు ఆర్వోబీలకు రూ.159.40 కోట్లు గుంటూరు నగరంలో రెండు ఆర్వోబీల నిర్మాణానికి రూ. 159.40 కోట్లు మంజూరు చేస్తూ రైల్వేబోర్డు సంచాలకుడు హేమంత్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. By Andhra Pradesh Dist. DeskPublished : 14 Jun 2025 03:57 IST Ee Font size 2 min read ఉత్తర్వులిచ్చిన రైల్వేశాఖ శ్యామలానగర్ రైల్వే గేటు న్యూస్‌టుడే - గుంటూరు రైల్వే: గుంటూరు నగరంలో రెండు ఆర్వోబీల నిర్మాణానికి రూ. 159.40 కోట్లు మంజూరు చేస్తూ రైల్వేబోర్డు సంచాలకుడు హేమంత్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. గుంటూరు-నల్లపాడు మార్గంలోని శ్యామలానగర్ (ఎల్సీ 312) ఆర్వోబీకి రూ. 78.46 కోట్లు, గుంటూరు-నంబూరు మార్గంలోని సంజీవయ్యనగర్ (ఎల్సీ 2) ఆర్వోబీకి రూ. 80.94 కోట్లు కేటాయించారు. రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరులో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఈ రెండు వంతెనల నిర్మాణానికి అయ్యే ఖర్చును రైల్వేశాఖే భరించనుంది. కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయత్నాలు ఫలించి ఈ నిధులు మంజూరయ్యాయి. పదేళ్ల నుంచి... శ్యామలానగర్ రైల్వేగేటు ఉన్న ప్రాంతంలో పదేళ్ల కిందటే ఆర్యూబీ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. రైల్వేశాఖ నిధులు కూడా మంజూరు చేసింది. మురుగునీటి మళ్లింపు అంశం పరిష్కారం కాకపోవడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుని తొలుత నాలుగు వరుసల ఆర్వోబీ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి సాంకేతికపరమైన ఇబ్బందులున్నాయని కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన అధికారుల కమిటీ చెప్పడంతో చివరకు రెండు వరుసల ఆర్వోబీ నిర్మాణానికి రూ. 78.46 కోట్లు మంజూరయ్యాయి. సంజీవయ్యనగర్‌లో... సంజీవయ్యనగర్ రైల్వేమార్గంపై పరిమిత ఎత్తుగల వంతెన నిర్మించాలని గతంలోనే నిధులు మంజూరయ్యాయి. డ్రైనేజీ సమస్య కారణంగా ఆర్యూబీ సాధ్యం కాదని తేల్చిన అధికారులు ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆర్వోబీలు పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయినట్టే. ఆర్వోబీల నిర్మాణ బాధ్యతలను కేంద్రమే తీసుకుంటుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్... రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇప్పటివరకు రూ.473.50 కోట్లు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే రైల్వే వంతెనల నిర్మాణానికి కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ. 473.50 కోట్లు మంజూరు చేయించారు. ఈ రెండు వంతెనలు కాకుండా.. ఇన్నర్‌రింగ్‌రోడ్డు వద్ద (ఎల్సీ 3) రూ. 107.79 కోట్లు, పెదపలకలూరు (ఎల్సీ 6)కు రూ.41.31 కోట్లు, మంగళగిరి డంప్‌యార్డు (ఎల్సీ 14)కు రూ. 129 కోట్లు, గుంటూరు-నందివెలుగు (ఎల్సీ 249)కు రూ. 36 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. కొన్ని వంతెనల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.
Create an account or sign in to comment