Jump to content

Guntur city beautification


Recommended Posts

  • Replies 141
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 4 weeks later...
గుంటూరుకు... న్యూ లుక్‌
19-09-2017 08:20:21
 
636414060412634311.jpg
  • నగర రహదారులు... హరిత హారాలు
  • రూ. 8 కోట్లతో పనులు
  • డిజైన్లు పరిశీలించి ఆమోదం తెలిపిన కలెక్టర్‌ శశిధర్‌
  • పెదకాకాని జంక్షన్‌ వద్ద గుంటూరు స్వాగత ఆర్చి
గుంటూరు: గుంటూరు నగర సుందరీకరణపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలకు ఒక రోల్‌ మోడల్‌గా గుంటూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధానంగా నగరానికి ఒక ఐకానిక్‌ ఆర్చ్‌ని నిర్మించేందుకు డిజైన్లను తయారు చేయిస్తోంది. అలాగే రహదారులను హరితహారాలుగా మార్చి అమరావతి రాజధానికి గుంటూరు నగరం ఒక ముఖద్వారంగా చేసేందుకు పనులు ప్రారంభించబోతున్నది. మొత్తం రూ.8 కోట్ల అంచనా వ్యయంతో సిటీ మోడర్‌నైజేషన్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం కన్సల్టెన్సి ప్రతినిధులు తీసుకువచ్చిన డిజైన్లను జిల్లా కలెక్టర్‌, కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ కొన శశిధర్‌ పరిశీలించారు.
 
          స్థానిక కళాకారులు నగరానికి మోడ్రన్‌ లుక్‌ తీసుకువచ్చేందుకు ఇప్పటికే స్వచ్ఛందంగా పనులు ప్రారంభించారు. వారి కళానైపుణ్యాన్ని ప్రభుత్వ సంస్థల ప్రహరీపై ప్రదర్శిస్తున్నారు. గుంటూరు సంస్కృతి ఉట్టిపడేలా వేస్తున్న పెయింటింగ్స్‌తో ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి, మహిళా కళాశాల, కలెక్టరేట్‌, కలెక్టర్‌ బంగ్లా, రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం తదితర భవనాలకు కొత్త కళ ఉట్టి పడుతున్నది. దీనిని కార్పొరేషన్‌పరంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్పెషలాఫీసర్‌ హోదా లో కలెక్టర్‌ శశిధర్‌ తరచుగా నగరపాలక సంస్థ కమిషన్‌ అనురాధతో సిటీలుక్‌పై సమీక్షిస్తున్నారు. కార్పొరేషన్‌, పోలీస్‌, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో నెలకొసారి ట్రాఫిక్‌పై చర్చించేందుకు షెడ్యూల్‌ నిర్ణయించారు. పెదకాకాని నుంచి గుంటూరు నగరంలోని ప్రవేశించే ఆర్‌యుబీ వద్ద గుంటూరుకు స్వాగతం అనే పెద్ద అక్షరాలతో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో భారీ ఆర్చ్‌ నిర్మించేందుకు నిర్ణయిం తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలతో హరితహారాలను అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం కార్పొరేషన్‌ బడ్జెట్‌ నుంచి నిధులు వెచ్చిస్తారు. అవసరమైతే కార్పొరేట్‌ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈవిధంగా నగరానికి టూరిజం లుక్‌ కూడా తీసుకొస్తారు. కన్సటెన్సీ సంస్థ రూపొందించి తీసుకువచ్చిన డిజైన్లను కలెక్టర్‌ సోమవారం జిల్లా పరిషత్‌లో పరిశీలించి కొన్ని మార్పులతో ఆమోదం తెలిపారు.
 
స్ర్టీట్‌ ఆర్ట్‌తో నూతన శోభ..
స్ర్టీట్‌ ఆర్ట్‌తో నగరంలోని ప్రధాన రహదారులకు కొత్త శోభ వచ్చింది. గతంలో ఎన్ని పనులు చేపట్టినా రాత్రి కాగానే బహిరంగ మూత్ర విసర్జన చేసేవారు, పరిశుభ్రతకు రూ.కోట్లు దుబారా అయ్యాయి. ఎప్పుడైతే త్రీడీ పెయింటింగ్స్‌తో నగరంలోని కళాకారులు ముందుకు వచ్చారో అప్పటినుంచి చాలా వరకు పరిసరాలను అపరిశుభ్రం చేయరాదన్న అవగాహన ప్రజల్లో కలగడం ప్రారంభమైంది. వచ్చే ఏడాది జూలైలో జరిగే సీతాకోక చిలుకల పండగనాటికి రహదారులపై చేపట్టబోతున్న పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్‌ శశిధర్‌ ఆదేశించారు.
Link to comment
Share on other sites

గుంటూరుకు.. రాజధాని లుక్‌
 
 
636420120572596632.jpg
  • సుమారు రూ.175కోట్లతో అరండల్‌పేట నూతన రైల్వే బ్రిడ్జ్‌
  • 150వ ఉత్సవాల సందర్భంగా మారనున్న రూపురేఖలు
  • త్వరలో శంకుస్థాపన ఫ పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
 
ఆంధ్రజ్యోతి, గుంటూరు: గుంటూరు నగరానికి రాజధాని లుక్‌ సంతరించుకోనుంది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన అరండల్‌పేట రైల్వే బ్రిడ్జ్‌ను పూర్తి స్థాయిలో ఆధునికీకరించబోతున్నారు. నగరపాలక సంస్థ 150వ వార్షికోత్సవాలకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సీటిగా ఎంపిక చేసి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. గుంటూరు నగర నలుమూలలను రాజధాని వెలగపూడికి అనుసంధానం చేసే విధంగా మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నారు. దీనిలో భాగంగానే అరండల్‌ పేట ఓవర్‌ బ్రిడ్జి రూపురేఖలను మారుస్తున్నారు.
 
రూ.175కోట్లతో ప్రతిపాదనలు
ఏసీ కాలేజి - శంకర్‌విలాస్‌ సెంటర్‌ను అనుసంధానం చేసే రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ పెరిగన జనాభా, వాహనాలు, రాకపోకలకు సరిపోవడం లేదు. ప్రధానంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి వెళ్లాలంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రాకపోకలకు ఈ బ్రిడ్జే కీలకంగా ఉంది. రాజధాని కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత నిత్యం వీఐపీల రాకపోకలతో రద్దీగా మారింది. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి స్థానంలో సుమారు 60 - 70 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అంచనాలు రూపొందించారు. ప్రధానంగా బ్రిడ్జ్‌ని నాలుగు లైన్‌లుగా విస్తరించాల్సి ఉంది. దీంతో పాటు బ్రిడ్జ్‌కు రెండువైపులా అండర్‌ బ్రిడ్జ్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. అండర్‌ బ్రిడ్జ్‌లను నగర ప్రజలు ఉపయోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కొత్త బ్రిడ్జి ప్రతిపాదనలు ఏసీ కాలేజ్‌ సమీపంలోని దివంగత ఎంజే మాణిక్యరావు విగ్రహం నుంచి అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ వరకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జ్‌లో ప్రభుత్వ వైద్యశాల, సెయింట్‌ జోసఫ్‌ ఆసుపత్రి ఎదురు డైవర్షన్‌ రోడ్లు ఉన్నాయి. ఈ రెండు డైవర్షన్లను అటునుంచి అరండల్‌ పేట వైపు అండర్‌ బ్రిడ్జ్‌లుగా ప్రతిపాదించారు.
 
అంచనాలు సిద్ధం
2004లో పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ స్థాయిలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జ్‌ ప్రతిపాదనలు చేశారు. అవి కార్యరూపం దాల్చలేదు. దీనికి భారీ వ్యయం అవుతుందని.. దానికి తగిన స్థాయిలో రాకపోకలు లేవని ఈ ప్రతిపాదనలను నిపుణుల బృదం తిరస్కరించింది. రాజధాని తరువాత రాకపోకలను దృష్టిలో ఉంచుకొని గుంటూరు-విజయవాడలను రాజధాని అమరావతికి అనుసంధానం చేస్తూ జంట నగరాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రం గుంటూరు - విజయవాడలను స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేసి రూ.వెయ్యి కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. దానిలో భాగంగానే రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ ఆధునీకరణ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
త్వరలో శంకుస్థాపన
అరండల్‌పేట నూతన రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు అధికార పార్టీ నేతలు తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థ ఏర్పడి 150 ఏళ్లు పూర్తయింది. నగర పాలక సంస్థ 150 ఏళ్ల ఉత్సవాలను ప్రభుత్వం భారీగా నిర్వహించబోతుంది. దీనిలో భాగంగానే ఈ నెల 27న గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో 150 ఏళ్ల ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, ఆనందబాబు, నారాయణ, ఎంపీలు గల్లా, రాయపాటి, ఎమ్మెల్యేలు మోదుగుల, ధూళిపాల్ల, రావెల, ముస్తాఫా, తదితరలు సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.
బ్రిడ్జ్‌ ప్రాంతాన్నిపరిశీలించిన మంత్రులు
అరండల్‌ పేట ఓవర్‌ బ్రిడ్జిని సోమవారం మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యే మోదుగులలు పరిశీలించారు. కంకర్‌గుంట అండర్‌ బ్రిడ్జ్‌, అరండల్‌పేట, బ్రాడిపేట, ఏసీ కాలేజ్‌, మెడికల్‌ కాలేజ్‌, శంకర్‌విలాస్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న రాకపోకలు, రహదారుల విస్తరణ, డ్రైనేజ్‌, ట్రాఫిక్‌ తదితర సమస్యలను కమిషనర్‌ సీహెచ్‌ అనురాధ మంత్రులు, ఏంపీ జయదేవ్‌, వేణుగోపాలరెడ్డికి వివరించారు. రెండేళ్లలో బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తి కావాలని ఎంపీ జయదేవ్‌ స్పష్టం చేశారు. అండర్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణం పూర్తయిన తరువాత కొత్త బ్రిడ్జ్‌ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి తెలిపారు. నవ్యాంధ్రకు గుంటూరు కేంద్ర బిందువుగా ఉంది. రాష్ట్రంలోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు రాజధానికి చేరుకోవాలంటే ఈ బ్రిడ్జే కీలకమని మంత్రి ఆనందబాబు అన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి గుంటూరు నగర రూపు రేఖలను రాజధాని స్థాయికి చేర్చాలని భావిస్తున్నట్లు మంత్రి ఆనందబాబు తెలిపారు. అండర్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి సుమారు రూ.75కోట్లు అవుతుందని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.నిధుల కొరత లేదన్నారు. గుంటూరు నగర, జిల్లా ప్రజల రాకపోకలు, రాజధాని అనుసంధానానికి అరండల్‌పేట బ్రిడ్జ్‌ కీలకమని ఎంపీ గల్లా మంత్రి దృష్టికి తెచ్చారు. నగరపాలక సంస్థ, ఆర్‌అండ్‌బీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే, సీఆర్‌డీఏ తదితర శాఖలు సమన్వయంగా పనిచేయాలని జయదేవ్‌ కోరారు. మంత్రుల పర్యటనలో ఆర్‌అండ్‌బీ, రెవిన్యూ, రైల్వే అధికారులు, పార్టీ నేతలు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయలు, యార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, టీడీపీ నగర అధ్యక్షుడు చందూ సాంబశివరావు, వెన్నా సాంబశివారెడ్డి, రాయపాటి రంగారావు, చిట్టిబాబు, దారపనేని నరేంద్ర, మద్దాళి గిరి, వేములపల్లి శ్రీరాం ప్రసాద్‌, హిదాయిత్‌, రావిపాటి సాయి పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

గుంటూరు బీఆర్ స్టేడియానికి.. మహర్దశ
 
 
636429619296577174.jpg
  • పీపీపీ విధానంలో స్టేడియం అభివృద్ధి
  • నేడు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్న స్పోర్ట్స్‌ సెక్రటరీ
  • హాజరుకానున్న మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి, ఆనంద్‌బాబు
ఆంధ్రజ్యోతి, గుంటూరు: దశాబ్ధాల చరిత్ర కలిగి నేడు శిథిలావస్థ స్థితిలో ఉన్న బ్రహ్మానందరెడ్డి స్టేడియం రూపురేఖలు మారబోతోన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో స్టేడియాన్ని సకల హంగులతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ విధంగా అభివృద్ధి చేయబోయేదన్న వివరాలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను రాష్ట్ర క్రీడల శాఖ కార్యదర్శి శనివారం ఇవ్వనున్నారు. మంత్రులు, జిల్లా కలెక్టర్‌ తదితరులు హాజరుకానున్న దృష్ట్యా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరి అభిప్రాయాలు తీసుకొన్న అనంతరం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్టేడియంలు అభివృద్ధి చేసిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది.
 
జిల్లా కేంద్రంలోని ఆర్‌టీసీ బస్టాండ్‌కు అత్యంత సమీపంలోనే బీఆర్‌ స్టేడియంని నాలుగు దశాబ్ధాల క్రితమే నిర్మించారు. మొదట్లో ఇక్కడ స్పోర్ట్స్‌ హాస్టల్‌ నిర్వహించారు. స్టేడియం ఆవరణలో అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, స్కేటింగ్‌, జిమ్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఇక్కడ స్విమ్మింగ్‌ పూల్స్‌ నిర్మించాలని ఆలోచన చేశారు. అయితే నిర్వహణ భారంగా పరిణమించడం, ప్రభుత్వం నుంచి అరకొరగానే నిధులు మంజూరు కావడం వలన స్టేడియం నేడు శిథిలావస్థ స్థితికి చేరుకొంది. బహిరంగసభలు, వివాహ శుభకార్యాలకు కూడా స్టేడియాన్ని వినియోగించడం వలన దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఒక దశలో స్టేడియంకు ఆనుకొనే ఉన్న ఖాళీస్థలాన్ని ఆదాయపు పన్ను శాఖకు కేటాయించారు. అయితే వివిధ కారణాలతో ఆది నిలిచిపోయింది.
 
స్టేడియానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు మరింత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. పీపీపీ పద్ధతిలో ఒక ఏజెన్సీని ఎంపిక చేసి అభివృద్ధి బాధ్యతలు అప్పగిస్తే అన్ని ఆ సంస్థ చూసుకొంటుందనేది ప్రభుత్వ భావన. గుజరాత్‌, కేరళ, మహారాష్ట్రలో పీపీపీ పద్ధతిన అభివృదిఽ్ధ చేసిన స్టేడియంలు నేడు క్రీడావసరాలు తీరుస్తున్నాయి. అభివృద్ధి చేసిన సంస్థకు ఫీజులు వసూలు చేసుకొనే హక్కు కల్పిస్తారు. అలానే స్టేడియం నిర్వహణ కోసం షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతిస్తారు. ఇలా ఒక బెస్టు స్పోర్టింగ్‌ కాంప్లెక్స్‌గా బీఆర్‌ స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, కలెక్టర్‌ కోన శశిధర్‌, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మహమ్మద్‌ ముస్తఫా, డీఎస్‌డీవో మహేష్‌ తదితరులు హాజరై శనివారం ప్రభుత్వం ఇచ్చే పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను పరిశీలించి అభిప్రాయాన్ని తెలియజేస్తారు.
Link to comment
Share on other sites

  • 5 months later...
గుంటూరులో ఆర్టీసీ మినీ బస్టాండ్‌
28-03-2018 08:19:42
 
636578219835759675.jpg
  • పది రోజుల్లో అందుబాటులోకి..
  • ఎన్టీఆర్‌ బస్టాండ్‌కు తగ్గనున్న బస్సుల రద్దీ
  • విజయవాడ సర్వీసులన్నీ ఇక్కడ నుంచే..
గుంటూరు: నగరంలో మరో ఆర్టీసీ మినీ బస్టాండ్‌ అందుబాటులోకి రానున్నది. ఎన్‌టిఆర్‌ బస్టాండ్‌ ప్రాంగణం లో మణిపురం బ్రిడ్జి వైపున అత్యాధునిక సదుపాయాలతో మినీ బస్టాండ్‌ రూపుదిద్దు కుంటోంది. ప్రధానంగా ఎన్టీఆర్‌ బస్టాండ్‌ లో రద్దీని తగ్గించే క్రమంలో నిర్మిస్తోన్న మినీ బస్టాండ్‌ మరో పదిరోజుల్లోనే పూర్తి కానున్నది. ఇక విజయవాడ సర్వీసులన్నీ ఇక్కడ నుంచి రాకపోకలు సాగించనున్నా యి. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిగా గుంటూరు ఎంపికైన నాటి నుంచి ఎన్టీర్‌ బస్టాండ్‌కు ఆర్టీసీ బస్సులు, ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపయింది. ఇక విజయ వాడతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే సర్వీసులతో తాకిడి పెరిగింది. నిత్యం వందలాదిబస్సులు, వేలాది మంది ప్రయాణీకులతో ఎన్‌టిఆర్‌ బస్టాండ్‌లో ట్రాఫిక్‌ పెరుగుతోంది. ప్రయాణీకులు, బస్సుల రద్దీని తగ్గించేందుకు ఎన్టీఆర్‌ బస్టాండ్‌లో 2.25 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు గత ఏడాదిలోనే శంకుస్థాపన చేశారు. రూ.రెండు కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మినీ బస్టాండ్‌ను జనవరి కల్లా పూర్తిచేసేందుకు నిర్ణయించారు. కొన్ని అవాంతరాల కారణంగా మార్చి నెలాఖరుకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
 
aefawe.jpg13 ఫ్లాట్‌ఫామ్‌లు..
మొత్తం 13 ఫ్లాట్‌పామ్‌లతో మినీ బస్టాండ్‌లో ప్రయాణీకులకు సకల సదుపాయాలు కల్పించనున్నారు. అత్యాధునిక సదుపాయాలతో కుర్చీలు, ఫ్యాన్‌లు, వినోదం కోసం టీవీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక వయా గుంటూరు మీదుగా విజయాడ, కాకినాడ, అమలాపురం రీజియన్‌కు వెళ్ళే సర్వీసులన్నీ ఇక్కడ నుంచే బయల్దేరతాయని రీజనల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. దాంతో పాటు ఎన్‌టిఆర్‌ బస్టాండ్‌ నుంచి మీని బస్టాండ్‌ను కలిపేలా లింకురోడ్డు కూడా అభివృద్ధి చేస్తున్నారు. మినీ బస్టాండ్‌లో రిజర్వేషన్‌ కౌంటర్‌తో పాటు ఆర్టీసీ కొరియర్‌, పార్శిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
గుంటూరులో మినీ బస్టాండ్‌ సిద్ధం
12-05-2018 09:37:29
 
636617146498234513.jpg
  • త్వరలో ప్రారంభోత్సవం
  • ఎన్టీఆర్‌ బస్టాండ్‌కు తగ్గనున్న రద్దీ
  • ఇక విజయవాడ సర్వీసులన్నీ ఇక్కడి నుంచే
గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిగా గుంటూరు ఎంపికైన నాటి నుంచి ఎన్టీఆర్‌ బస్టాండ్‌కు ఆర్టీసీ బస్సులు, ప్రయాణికుల రద్దీ దాదాపు రెట్టింపయింది. విజయవాడతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే సర్వీసుల తాకిడి మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో గుంటూరులోని మణిపురం బ్రిడ్జి వైపున ఎన్టీఆర్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో అత్యాధునికంగా మినీ బస్టాండ్‌ సిద్ధమైంది. బస్సులతో కిటకిటలాడే ఎన్టీఆర్‌ బస్టాండ్‌కు త్వరలో ఉపశమనం కలగనున్నది. మినీబస్టాండ్‌ ప్రారంభోత్సవానికి త్వరలో ముహూర్తం ఖరారు చేయనున్నట్లు రీజనల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. ఎన్టీఆర్‌ బస్టాండ్‌లో రద్దీని తగ్గించే క్రమంలో మినీ బస్టాండ్‌ను నిర్మించారు. ఈ బస్టాండ్‌ త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది.
 
నిత్యం వందలాది బస్సులు, వేలాది మంది ప్రయాణికులతో ఎన్టీఆర్‌ బస్టాండ్‌లో ట్రాఫిక్‌ రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఇక పండుగలు, శెలవు దినాల్లో అయితే ప్రయాణికులు, బస్సుల తాకిడి చెప్పనలవి కాకుండా ఉంది. బస్టాండ్‌లో ప్రయాణికులు నిలబడేందుకు కూడా ఒక్కోసారి అవకాశం ఉండటం లేదు. బస్సులు స్టాండ్‌లు ఖాళీలేక ఎక్కడంటే అక్కడ నిలుస్తుండేవి. దీంతో ఏ బస్సు ఎటువస్తుందో అర్థం కాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండేవారు. ఈ క్రమంలో బస్టాండ్‌లో రద్దీని తగ్గించేందుకు ఎన్టీఆర్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో మణిపురం బ్రిడ్జి వైపున 2.25 ఎకరాల్లో మినీ బస్టాండ్‌ ఏర్పాటు చేసేందుకు గత ఏడాదిలో శంకుస్థాపన చేశారు. విజయవాడ సర్వీసులన్నీ ఇక్కడ నుంచే రాకపోకలు సాగించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన మినీ బస్టాండ్‌ను జనవరి కల్లా పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్ని అవాంతరాల కారణంగా జాప్యం జరిగింది. మొత్తానికి మరో వారం పది రోజుల్లో ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
 
 
ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు ....
మినీ బస్టాండ్‌లో 13 ఫ్లాట్‌పామ్‌లను ఏర్పా టు చేశారు. ఇక్కడ ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పించనున్నారు. ఆధునికంగా కుర్చీలు, ఫ్యాన్‌లు, వినోదం కోసం టీవీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక వయా గుంటూరు మీదగా విజయవాడ, కాకినాడ, అమలాపురం రీజియన్‌కు వెళ్ళే సర్వీసులన్నీ ఇక్కడ నుంచే బయల్దేరతాయని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్‌ బస్టాండ్‌ నుంచి మీని బస్టాండ్‌కు ప్రయాణికులు రాకపోకలు సాగించేలా లింకురోడ్డు కూడా అభివృద్ధి చేశారు. మినీ బస్టాండ్‌లో రిజర్వేషన్‌ కౌంటర్‌తో పాటు ఆర్టీసీ కొరియర్‌, పార్సిల్‌ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు రాత్రులు సైతం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రతా పరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...