October 10Oct 10 Author పోలవరానికి పర్యాటక ఆభరణంBy Andhra Pradesh News DeskPublished : 10 Oct 2026 05:54 ISTEeFont size3 min readనదీ, అటవీ అందాలకు అదనంగా ఐకానిక్ వంతెనతెలుగు సంస్కృతి ఉట్టిపడేలా స్పిల్‌వే సొగసులునావిగేషన్ టన్నెల్, జల రవాణా మార్గాల అభివృద్ధిప్రాజెక్టుకు మూడు జాతీయ రహదారుల అనుసంధానంకేంద్ర సహకారం కోరుతూ ప్రతిపాదనలుఈనాడు - అమరావతిఐకానిక్ వంతెనల నిర్మాణం ఊహాచిత్రంగోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు పర్యాటక సొబగులు అద్దేందుకు సర్కారు అడుగులు వేస్తోంది. 2027 జూన్ నెలాఖరున పుష్కరాల కన్నా ముందే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. ప్రాజెక్టు సమీపంలోని పాపికొండలు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. జలాశయం రూపుదిద్దుకున్న తర్వాత అదనంగా వచ్చే ఆకర్షణలు అనేకం. పర్యాటకులు వాటిని ఆస్వాదించేందుకు వీలుగా మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అందుకోసం ప్రాజెక్టు ప్రాంతాన్ని జాతీయ రహదారులకు అనుసంధానం చేయనున్నారు. వీటికి కేంద్రం ఆర్థికంగా, విధాన నిర్ణయాల పరంగా తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా దిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు.సులువుగా చేరుకొనేలా..పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకులు సులువుగా చేరుకునేందుకు మూడు జాతీయ రహదారులతో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఖరగ్‌పుర్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ హైవే పోలవరం సమీపంలోని పట్టిసీమ వద్ద గోదావరి నదిని దాటుతుంది. దీన్ని పట్టిసీమ వద్ద కాకుండా పోలవరం వద్ద నదిని దాటించేలా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. అక్కడ రోడ్డు నిర్మాణంలో భాగంగా నదిపై వంతెన మంజూరు చేయించుకొనేందుకు ప్రయత్నిస్తోంది.సూర్యాపేట నుంచి కొవ్వూరు వరకు ఎన్‌హెచ్-365బీ రహదారి నిర్మిస్తున్నారు. ప్రతిపాదిత మార్గం ప్రస్తుతం పట్టిసీమ నుంచి కొవ్వూరు వరకు ఉంది. ఈ జాతీయ రహదారిని 5.5 కి.మీ. మేర పొడిగిస్తే పోలవరం ప్రాజెక్టు సైతం అనుసంధానమవుతుంది. ఈ రహదారితో గోదావరి ఎడమ గట్టున కొవ్వూరు వద్ద కలుస్తుంది. దీనివల్ల గోదావరి గట్టు పొడవునా పోలవరం వరకు చక్కని రవాణా సౌకర్యం ఏర్పడుతుంది.మరోవైపు రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-516ఈ) నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రహదారిని రెండు వైపులా కలపాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టు ఎడమ వైపు నుంచి 26.70 కి.మీ. మేర అదనంగా రహదారి నిర్మిస్తే ఈ 516 హైవే అనుసంధానమవుతుంది. అక్కడి నుంచి మరో 11 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే జాతీయ రహదారి 16కు కలుస్తుంది. దీంతో రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పోలవరం వద్దకు చేరడం సులభమవుతుంది. ప్రాజెక్టు ఎడమ వైపు నుంచి 24.6 కి.మీ. రోడ్డు నిర్మిస్తే రాజమహేంద్రవరం-విజయనగరం జాతీయ రహదారి గోకవరం వద్ద కలుస్తుంది.ఇవీ ప్రణాళికలు..పోలవరం స్పిల్‌వేకు సమాంతరంగా గోదావరి ఎడమ, కుడి గట్టులను కలిపేలా వంతెనల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రాజెక్టు వద్దకు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా అనుసంధాన రహదారులు నిర్మిస్తారు. స్పిల్‌వేకు సమాంతరంగా 3.42 కి.మీ. పొడవున వంతెన రానుంది. దీన్నే ఐకానిక్ వంతెనగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ప్రాజెక్టు స్పిల్‌వేను సుందరీకరిస్తారు. రాత్రి, పగలు ప్రత్యేకంగా కనిపించేలా.. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఆర్కిటెక్చర్ నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు.జలాశయం, స్పిల్‌వే, చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో వందల ఎకరాలను పర్యాటకంగా ఎలా తీర్చిదిద్దవచ్చో అంతర్జాతీయ ఏజెన్సీల సాయంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ల్యాండ్ స్కేపింగ్, మౌలిక సదుపాయాల కల్పన, ఆతిథ్య ఏర్పాట్లు చేపట్టనున్నారు.ప్రాజెక్టు ఎడమ వైపు నావిగేషన్ టన్నెల్ నిర్మాణంలో ఉంది. దీని లోపలి నుంచి పడవలు ప్రయాణిస్తాయి. సరకు రవాణాకే కాకుండా ఆ టన్నెల్‌లో ప్రయాణించేందుకు పర్యాటకులకూ అవకాశం కల్పిస్తారు. ఈ నేవిగేషన్ సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.500 కోట్లు అదనంగా అవసరం.
October 11Oct 11 4 hours ago, Yaswanth526 said:Emiti ee comparison.akkada maa pitha kastapadi raktamu daara posi kattinchadu. U dirty politicians evvaru a kastanni chuda ta ledu gaa @Quant bro
November 6Nov 6 Author పోలవరం ప్రాజెక్టు పూర్తికిగడువు పెంపు?By Andhra Pradesh News DeskPublished : 06 Nov 2026 05:18 ISTEeFont size3 min read2027 మార్చి నెలాఖరు వరకు ప్రస్తుత పరిమితిమరో 3 నెలలు అదనపు సమయం అవసరమా?వాస్తవ పరిస్థితులపై అధ్యయనానికి ఐదుగురితో కమిటీ2027-28 ఆర్థిక సంవత్సరంలో నిధుల ఖర్చుకు కేంద్రం అనుమతి ముఖ్యంతదనుగుణంగా అథారిటీ అడుగులు..ఈనాడు, అమరావతి: పోలవరం తొలిదశ కచ్చితంగా ఎప్పుడు పూర్తి అవుతుందో తేల్చి చెప్పేందుకే ఆ ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని కోరింది. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి, డిజైన్ల ఆమోదం, ఏ విభాగంలో పని పరిమాణం ఎంతుంది? 2027 మార్చి నెల దాటి ఇంకా ఎంతకాలం సమయం పడుతుంది? అన్న అంశాలను కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా పోలవరం పనుల గడువు పెంచేలా కేంద్రజల్‌శక్తిశాఖ అనుమతి కోసం అథారిటీ లేఖ రాయాలి. ఆ అనుమతి ఉంటేనే 2027-28 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేసేందుకు వీలు ఉంటుంది. ఈ మేరకు పీపీఏ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిటీలో పీపీఏ సభ్య కార్యదర్శి, పోలవరం అథారిటీ చీఫ్ ఇంజినీరు (ప్లానింగు, డిజైన్), రాష్ట్ర జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, వ్యాప్కోస్ జనరల్ మేనేజర్, పునరావాస కమిషనర్‌లను సభ్యులుగా నియమించారు. కిందటి నెలలో కేంద్రజల్‌శక్తి కార్యదర్శి పోలవరంపై సమీక్షించిన సందర్భంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఎందుకీ కమిటీ?పోలవరం ప్రాజెక్టు తొలిదశకు కేంద్రం రూ.30,436.95 కోట్లతో అంచనాలను 2024 జూన్ తర్వాత సవరించింది. ఈ ప్రాజెక్టులో +41.15 మీటర్ల ఎత్తులో నీరు నిలిపేందుకు వీలుగా ఈ నిధులు మంజూరు చేసింది. అప్పటి వరకు ఇచ్చిన నిధులు పోను రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు, అదీ అడ్వాన్సుగా అందజేసేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఇది.కేంద్ర మంత్రి మండలి ఈ నిధులు ఇచ్చేందుకు అనుమతిస్తూ ప్రాజెక్టు తొలిదశను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది. ఒక వేళ ఆలస్యమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని షరతు విధించింది.2026 మార్చి ఆఖరుకు పూర్తయ్యే పరిస్థితులు లేకపోవడంతో 2027 మార్చి 31 నాటికి పూర్తి చేయాలంటూ ఈ ఏడాది మార్చిలో కేంద్ర జల్‌శక్తి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణం వేగంగా సాగుతున్నా 2027 మార్చి ఆఖరుకు ఎంత వరకు పూర్తవుతుందనేది కాస్త అనుమానమే. 2027 జూన్ నెలాఖరుకు కచ్చితంగా పూర్తి చేయగలమనే నమ్మకం అధికార యంత్రాంగంలో కనిపిస్తోంది. ఇందుకు కేంద్రం నుంచి గడువు పెంపు ఉత్తర్వులు అందుకోవాల్సి ఉంటుంది.అంచనాల సవరణ కమిటీ ఆమోదం, అనుమతి మేరకు 2027 మార్చి 31 వరకే నిధులు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. తదుపరి ఆర్థిక సంవత్సరంలోకి అంటే 2027-28లో పోలవరంపై ఖర్చు చేయాలంటే కేంద్రం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తదుపరి ఆర్థిక సంవత్సరంలో పోలవరంపై రూ.981.12 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు. కేంద్రం నుంచి గడువు పెంపు అనుమతి కోసం లేఖ రాసే క్రమంలో పోలవరం అథారిటీ ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని భావించింది.ఈ కమిటీ పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత నిర్మాణ, ఆర్థిక పురోగతిని మదింపు చేయాలి. ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన ఆకృతుల అనుమతులు, పూర్తి చేసేందుకు ఉన్న సాధన సంపత్తి, రక్షణ పనులకు సంబంధించిన అంశాలు పరిశీలించాలి. 2027 మార్చి తర్వాత ఎంత కాలానికి పూర్తి చేయగలరు? అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?లేదా? అన్న అంశమూ పరిశీలించాలి.భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణ వాస్తవ పరిస్థితులు పరిశీలించి, ఎప్పటికి పూర్తి అవుతాయో తేల్చాలి. చేయబోయే పనులన్నీ రూ.30,436.95 కోట్ల పరిధిలోనే ఉండాలి.పోలవరం పనుల గడువు పెంపు కోరుతూ కేంద్రజల్‌శక్తికి నివేదించేందుకు వీలుగా ఈ నివేదిక ఉండాలి.
Create an account or sign in to comment