Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

polavaram

Featured Replies

  • Replies 3.8k
  • Views 398.4k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Crude Criminal mentality unna worst fellow jagan gadu..vadu chesina vidhvamsala ki modi gade asalu culprit 

  • TDP_2019
    TDP_2019

  • Happy tears 3 years ago this looked like an impossible job. Focus will be back on spillway and spill channel. Polavaram going to be a reality soon  

Posted Images

  • Author

ఉప్పొంగెలే గోదావరి

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 03 Sep 2026 05:15 IST

Ee

Font size

5 min read

gg-pref.gif

ఉత్తరాంధ్ర గడపలోకి పోలవరం నీళ్లు
అనకాపల్లి జిల్లాలో అఖండ జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు
నదుల అనుసంధానంతో రుణం తీర్చుకుంటా
వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు తరలింపు
రూ.35వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేసిన సీఎం

AP020926main-1a.webp

నీటి విడుదల అనంతరం పోలవరం ఎడమ కాలువలో జల సవ్వడి

రాష్ట్ర అధికారిక గీతం శంకరంబాడి సుందరాచారి రాసిన మా తెలుగుతల్లికి గీతంలో.. గలగలా గోదావరి కదిలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలు పండుతాయని విన్నాం. ఆ స్ఫూర్తిని నిజం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. మీ అందరికి హామీ ఇస్తున్నా.. ఈ జలవిజయం ప్రజల విజయం అవుతుంది.

చంద్రబాబు


చంద్రబాబు నాయుడు అనే నేను..

చంద్రబాబు నాయుడు అనే నేను 2015 సెప్టెంబరు 16న పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేశాను. 2017 ఆగస్టు 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాను. మళ్లీ ఈరోజు గర్వంగా చెబుతున్నా.. 2026 సెప్టెంబరు 2న గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు తీసుకొచ్చాను. మళ్లీ చెబుతున్నా. వచ్చే మూడేళ్లలో రూ.35వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తిచేస్తాను.’


ఈనాడు - విశాఖపట్నం 

AP020926main-1b.webp

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో మంత్రులు రవీంద్ర, నారాయణ, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి

గోదావరి, కృష్ణా నదులను రాష్ట్రంలోని అన్ని నదులతో అనుసంధానించడం ద్వారా ప్రతి ఎకరాకూ సాగు నీరందించే పవిత్రలక్ష్యాన్ని సాధించి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటానని, తెలుగుతల్లికి జలహారతి పడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమకాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు బుధవారం విడుదల చేశారు. ముందుగా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ‘వెలిగొండతో కరవుపీడిత మార్కాపురానికి కృష్ణమ్మను తరలించి నీళ్లిచ్చాం. శ్రీశైలం మల్లన్న పాదాల నుంచి మార్కాపురం చెన్నకేశవస్వామి చెంతకు నల్లమల కొండలను చీల్చుకొని కృష్ణమ్మ ప్రవహించగా... నేడు గోదావరి నది పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి తరలివచ్చింది. తూర్పుకనుమలు, అడవులు, నదులు, వాగులు, వంకలు, హైవేలను దాటుకొని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో ఇక్కడికి చేరింది. వచ్చే ఏడాది నాటికి సింహాద్రి అప్పన్న  పాదాల చెంతకు తీసుకువెళ్తాం. భవిష్యత్తులో అరసవిల్లి సూర్యనారాయణస్వామి దగ్గరకు తరలించి వంశధారకు అనుసంధానిస్తాం’ అని చెప్పారు.

ఆ మండలాలు విలీనమవ్వకుంటే పోలవరం కలే..

‘2014లో అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టిపెట్టా. తెలంగాణలో ఉండిపోయిన ఏడు మండలాలను అప్పుడు మన రాష్ట్రంలో కలపకపోతే పోలవరం ప్రాజెక్టు కలగానే మిగిలిపోయేది. మోదీ ప్రమాణస్వీకారం చేసినరోజు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లా. ఏపీలో వాటిని కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పా. ఆయన వెంటనే ఆర్డినెన్స్‌ ఇచ్చి ఆ ఏడు మండలాలను కలిపారు. ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు 72% పూర్తయింది. గొడ్డలి పార్టీ అధికారంలోకి రావడం ఈ ప్రాజెక్టుకు శాపమైంది. కూటమి అధికారంలోకి వచ్చాక శాపవిముక్తి కలిగింది. గోదావరి నీళ్లు ఇక్కడికి సులభంగా రాలేదు. అక్విడక్టులు, కొండలను తొలచి, నీళ్లు వెళ్లడానికి పైవంతెనలు నిర్మించి, భూవివాదాలు పరిష్కరించి, నిర్వాసితులకు న్యాయం చేసి ఇలా అన్నింటినీ అధిగమించాం’ అని చంద్రబాబు తెలిపారు. 

AP020926main-1c.webp

రైతులతో కలిసి నీటి విడుదలకు స్విచ్‌ నొక్కుతున్న జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

2028 నాటికి జాతికి అంకితం

‘పోలవరం ఎడమ కాలువ ద్వారా 4లక్షల ఎకరాలకు నీరందుతుంది. మొత్తం రూ.5వేల కోట్ల ప్రాజెక్టులో రూ.3,200 కోట్లు నేను సీఎంగా ఉండగానే ఖర్చుచేశాం. తూర్పుగోదావరి జిల్లాలో 81వేల ఎకరాలు, కాకినాడ జిల్లాకు 1.67 లక్షల ఎకరాలు, కోనసీమలో 2,300 ఎకరాలు, అనకాపల్లి జిల్లాకు 1.5 లక్షల ఎకరాలకు నీరందుతుంది. 9లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయి. విశాఖపట్నంలోని పరిశ్రమలకు 23 టీఎంసీల నీళ్లు అందిస్తాం. ఎడమ కాలువను విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అనుసంధానిస్తాం. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, చంపావతి నదుల మీద 12 ప్రాజెక్టులను గోదావరికి అనుసంధానిస్తాం. వీటికి రూ.3,200 కోట్లు ఖర్చుచేసి 2028 నాటికి జాతికి అంకితం చేస్తాం. క్రెడిట్‌ చోరీ కోసం గొడ్డలిపార్టీ విషప్రచారం చేస్తోంది. పోలవరాన్ని నాశనం చేయాలని చూసిన వ్యక్తులు.. వారే నిర్మించామంటారు’ అని ఎద్దేవా చేశారు. 

డేటాసెంటర్లపై విష ప్రచారం

‘ఉత్తరాంధ్ర ప్రజలను వైకాపా నేతలు పీడించారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వనివారు రుషికొండ ప్యాలెస్‌ కోసం రూ.500 కోట్లు ఖర్చుచేశారు. ఆ డబ్బులతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవి. డేటాసెంటర్లు వస్తే నీరు, విద్యుత్తు కొరత ఏర్పడుతుందని పేటీఎం బ్యాచ్‌లతో ప్రచారం చేయిస్తున్నారు. విశాఖలోని డేటాసెంటర్లకు కావాల్సింది 5 టీఎంసీల నీళ్లే’ అని స్పష్టం చేశారు. 

AP020926main-1d.webp 

పోలవరం ఎడమ కాలువ నీటి విడుదల కార్యక్రమంలో శిలాఫలకం వద్ద సీఎం చంద్రబాబు

మరో రంగారెడ్డి జిల్లాగా అనకాపల్లి

‘గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క పైసా ఇవ్వలేదు. భోగాపురం విమానాశ్రయం, భారీ డేటాసెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తుంటే అసూయపడుతున్న గొడ్డలి పార్టీ అడ్డంకులు సృష్టిస్తోంది. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుళ్లు అనుసంధానం అవుతాయి. మిత్తల్‌ స్టీల్‌ప్లాంటు, సెమీకండక్టర్ల పరిశ్రమలు వస్తున్నాయి. దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం రంగారెడ్డి జిల్లా సాధిస్తోంది. అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లా అవుతుంది. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్ర అవ్వాలన్నదే నా విజన్‌. 2019లోనూ తెదేపా అధికారంలోకి వచ్చుంటే పోలవరం, అమరావతి ప్రాజెక్టు ఫలాలు ఎప్పుడో అందేవి. అందుకే అభివృద్ధి శాశ్వతం అవ్వాలంటే ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

AP020926main-1d1.webp

సభావేదిక వద్దకు వస్తూ కండువా ఊపి ప్రజలను ఉత్సాహపరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.