August 2Aug 2 6 hours ago, Yaswanth526 said:Are they running pattiseema motors to pump water to Krishna?
August 7Aug 7 Author పోలవరం నిర్మాణం.. 45.72 మీటర్ల వరకుBy Andhra Pradesh News DeskPublished : 07 Aug 2026 04:55 ISTEeFont size2 min readఫేజ్-1 నిధులు 41.15 మీ. వరకే అయినా.. తర్వాతా పనుల కొనసాగింపు 2027 జూన్‌కల్లా తొలి దశ పూర్తి చేయాలన్నది లక్ష్యం: కేంద్రంఈనాడు, దిల్లీ: పోలవరం తొలి దశ కింద కేంద్రం ఇచ్చే నిధులు 41.15 మీటర్లకే పరిమితమైనప్పటికీ సివిల్ వర్క్స్ మాత్రం జలాశయం పూర్తి స్థాయి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) అయిన 45.72 మీటర్ల వరకూ సాగుతాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి స్పష్టం చేశారు. తొలిదశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గురువారం లోక్‌సభలో వైకాపా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. ‘పోలవరం ఫేజ్-1 (41.15 మీటర్ల వరకు) నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా? ఇటీవలి కాలంలో ఎన్ని నిధులు విడుదల చేసింది? నిర్దేశిత సమయానికి (2027కి) 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసేందుకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందా? కేంద్రం విడుదల చేసిన గ్రాంట్ కేవలం ఫేజ్-1 కోసమేనా? లేదంటే అందులో కెనాల్ నెట్‌వర్క్, విద్యుత్తు కేంద్రం, సహాయ, పునరావాస బకాయిలు ఏమైనా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక షరతులను ఎంత మేరకు అమలు చేస్తోంది? నిధుల విడుదలకు అవసరమైన తాజా ప్రాజెక్టు రిపోర్టులు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఎంతవరకు సమర్పించింది’ అని మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా సమాధానమిచ్చారు. అందులో ముఖ్యాంశాలివీ..సజావుగా పనులుపోలవరం ప్రాజెక్టు ఫేజ్-1 (+41.15 మీటర్ల ఎలివేషన్ లెవెల్ వరకు నీటి నిల్వ)కు 2023 నాటి ధరల ప్రకారం రూ.30,436.95 కోట్ల నిధులు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో ఇంకా చెల్లించాల్సిన గ్రాంట్ రూ.12,157.53 కోట్లు. అందులో 2024-25లో ఆర్థిక సంవత్సరంలో రూ.5,512.40 కోట్లు, 2025-26లో రూ.2,810.22 కోట్లు విడుదల చేసింది. 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసే క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయి. నీ గ్యాప్-1, గ్యాప్-2లో ప్రధాన డ్యాం నిర్మాణంతో పాటు భూసేకరణ, సహాయ, పునరావాస పనులను 2027 జూన్‌కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర గ్రాంట్ 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసే ఫేజ్-1 పనుల వరకే పరిమితం. దాని పరిధిలోకి +45.72 మీటర్ల వరకు (ఫుల్ రిజర్వాయర్ లెవెల్) ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్, +41.15 మీటర్ల వరకు భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలు, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులన్నీ వస్తాయి. విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలి. ఏపీ ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల టెక్నికల్ డాక్యుమెంట్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సకాలంలో సమర్పిస్తోంది.
Create an account or sign in to comment