June 13Jun 13 Author రెండేళ్లలో మారిన పోలవరం రూపురేఖలు - పరుగులు పెడుతున్న పనులుకూటమి సర్కార్ రాకతో ప్రాజెక్టుకు సరికొత్త వెలుగులు - డి-వాల్‌ను 14 పూర్తి చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం - గోదావరి పుష్కరాల లోపే ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులుPolavaram Development of 2 years of NDA Government (ETV Bharat)By ETV Bharat Andhra Pradesh TeamPublished : June 13, 2026 at 10:42 AM IST5 Min ReadPolavaram Development of 2 years in NDA Government : తుగ్లక్ మార్క్ నిర్ణయాలు, ఘోర తప్పిదాలు, అడ్డగోలుగా రివర్స్ టెండర్లు, కొట్టుకుపోయిన కోట్ల రూపాయలు. డ్యామేజీలు, సీపేజీలు. గతంలో చేసిన పనులన్నీ గోదావరి పాలు. ఇదీ పోలవరానికి వైఎస్సార్సీపీ చేసిన నష్టాలు. కూటమి సర్కార్ రాకతో కథ మొత్తం మారిపోయింది. ఐదేళ్లూ అంధకారంలో ఉన్న ప్రాజెక్టుకు ఇప్పుడు సరికొత్త వెలుగులొచ్చాయ్. సీఎం వ్యూహాలు ఫలించాయ్. నిపుణుల సలహాలు తోడయ్యాయ్. పనులు పరుగులు పెడుతున్నాయ్. మొత్తంగా రెండేళ్లలో రూపురేఖలు మారిపోయాయ్. లక్ష్యం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయ్. ఏడాదిలోగా ఈ మహాయజ్ఞం పూర్తి కావాలంటే ఏం చేయాలి? సర్కార్ ముందున్న సవాళ్లేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. వైఎస్సార్సీపీ రివర్స్ గేర్‌తో వినాశనానికి గురైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సంక్షోభాల చీకట్లను చీల్చుకుంటూ సరికొత్త వెలుగులతో సాకారం దిశగా అడుగులు వేస్తోంది. డయాఫ్రం వాల్‌ను కేవలం 14 నెలల్లోనే రికార్డు సమయంలో నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రధాన డ్యాం వద్ద అగాథాలు పూడ్చివేశారు.2027 మహా పుష్కరాల కంటే ముందే ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేసి జాతిక అంకింత ఇవ్వాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు. అయితే అసలు పోలవరం ఇంత ఆలస్యం కావడానికి కారణాలేంటి? వైఎస్సార్సీపీ చేసిన పాపమేంటి? కూటమి సర్కార్ సాధించిన విజయాలేంటి? భవిష్యత్తులో చేయాల్సిన పనులేంటి? అనే వాటిపై సమగ్ర విశ్లేషణ ఇది.అగాథాలు సాంకేతికతతో పూడ్చివేత: డయాఫ్రం వాల్ డ్యామేజ్ ప్రధాన డ్యాం వద్ద సీపేజ్ ఇదీ వైఎస్సార్సీపీ మార్క్ వినాశనం రెండేళ్ల క్రితం అంటే 2024 జూన్‌లో పోలవరం పరిస్థితి మహా దారుణం. గత జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుకు గుండె లాంటి డయాఫ్రం వాల్ తీవ్రంగా ధ్వంసమైంది. 2020లోనే ఈ కట్టడం దెబ్బతిన్నా ఏడాది పాటు దాన్ని గుర్తించలేని చేతకానితనంలో నాటి ప్రభుత్వం, పాలకులు ఉన్నారు. దీనికి తోడు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట గోదావరిని తలపించేలా సీపేజీ సమస్య ముంచెత్తింది. దీంతో భారీ అగాథాలు ఏర్పడ్డాయి. ఎడమ కాలువ పనులు ఐదేళ్లలో ఒక్క శాతం కూడా ముందుకు కదల్లేదు. పునరావసం అస్సలు పట్టించుకోలేదు. ఇలా పోలవరం పాలిట శాపంగా మారింది వైఎస్సార్సీపీ పాలన.కేవలం 14 నెలల్లోనే కొత్త డి-వాల్ పూర్తి: జెట్ స్పీడ్‌లో పనులు రెండేళ్లలో మారిన రూపురేఖలు ఇదీ కూటమి సర్కార్ కమిట్‌మెంట్ కూటమి ప్రభుత్వం రాగానే పోలవరానికి పట్టిన గ్రహణాన్ని వీడగొట్టింది. కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం అథారిటీలతో సమన్వయం చేసుకుంటూ అంతర్జాతీయ విదేశీ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించింది. విదేశీ నిపుణులు ఏడుసార్లు ప్రాజెక్టును సందర్శించారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసిన పాత డయాఫ్రం వాల్ స్థానంలో కూటమి సర్కార్ కేవలం 14 నెలల్లోనే కొత్త డి-వాల్ పూర్తి చేసింది.365 ప్యానెళ్లు, 13 వందల 72.60 మీటర్ల పొడవునా ఈ పటిష్టమైన వాల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం నుంచి వచ్చే సీపేజీని అరికట్టేందుకు విదేశీ నిపుణుల సూచనలతో బట్రస్ డ్యాంను నిర్మించారు. ప్రధాన డ్యాం ప్రాంతాల్లో ఏర్పడిన అగాథాలను వైబ్రో కాంపాక్షన్ సాంకేతికతతో విజయవంతంగా పూడ్చివేసి నేలను పటిష్టం చేశారు. డ్యాం గ్యాప్ -3 కాంక్రీటు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఎత్తు పెంచే పనులను వేగవంతం చేశారు. మొత్తం 53.32 మీటర్ల ఎత్తుకు నిర్మించాల్సి ఉండగా గ్యాప్ -1 ఇప్పటికే 33 మీటర్లు, గ్యాప్ -2 ను 20 మీటర్ల ఎత్తుకు నిర్మించారు.80 శాతానికి పైగా పనులు పూర్తి: గడచిన రెండేళ్లలోనే ప్రాజెక్టుపై 6 వేల 33 కోట్లు ఖర్చు చేశారు. గత వైఎస్సార్సీపీ సర్కార్ వదిలేసిన ఎడమ కాలువ పనులను పరుగులు పెట్టించి 80 శాతానికి పైగా పూర్తి చేశారు. అటు కుడి, ఎడమ కాలువ అనుసంధాన పనులు కూడా 90 శాతానికి చేరుకున్నాయి. పాత ప్రభుత్వంలో అటకెక్కిన పునరావాస పనులను చురుగ్గా చేపట్టారు. కేవలం రెండేళ్లలోనే నిర్వాసితుల కోసం 2 వేల 237 కోట్లు చెల్లించారు. గతంలో పనులు ఆపేసిన గుత్తదారులకు కొత్త ధరలకు టెండర్లు కేటాయించి నిర్వాసితుల కాలనీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.లక్ష్యం సాధించాలంటే ఏడాదిలో ఏం చేయాలి?2027 జూన్ నాటికి మొత్తం డ్యాం +53.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. గ్యాప్-1 పొడవు 584 మీటర్లు. 33 మీటర్ల ఎత్తువరకు దీని నిర్మాణం పూర్తయింది. గ్యాప్-2 ప్రధాన డ్యాం 1,750 మీటర్లు. ఇది 20 మీటర్ల ఎత్తు వరకు పూర్తయింది. నిర్మాణంలో ప్రతి లేయర్‌లో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తూ పూర్తి చేయాలి. ఆరు నెలలకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంది. జనవరి నుంచి అవసరమైన మెటీరియల్ సేకరిస్తున్నారు. పనుల వేగం పెంచాలి. వారం వారం లక్ష్యం కచ్చితంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.పునరావాసంలో మొత్తం 38 వేల 060 కుటుంబాలను తరలించాలి. ఇంతవరకు 17 వేల 261 కుటుంబాలు తరలించారు. మరో 20 వేల 799 కుటుంబాలను తరలించాల్సి ఉంది. ఇందుకు 4 వేల 395 కోట్లు కావాలి. కాలనీలు నిర్మించాలి. 6 వేల 950 ఎకరాలు సేకరించి ఇవ్వాలి. సకాలంలో ఇవి పూర్తి చేయాలంటే ఇంకా వేగం పెంచాల్సి ఉంది. వైఎస్సార్సీపీ సర్కార్‌లో ధ్వంసమైన గైడ్‌బండ్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలి. స్పిల్ వే వైపు వచ్చే ప్రవాహం వల్ల సుడిగుండాలు ఏర్పడకుండా ఇది రక్షణగా నిలుస్తుంది.అప్రోచ్ ఛానల్‌లో ఇంకా 38.5 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తొలగించాల్సిన పనులు మొదలు పెట్టాలి. డి వాల్ నిర్మాణం సందర్భంగా ప్యానళ్లు నదీగర్భంలో దింపే విషయంలో మొదట్లో కొన్ని సమస్యలు తలెత్తినా అవి పరిష్కారమైనట్లు విదేశీ నిపుణులు ప్రకటించారు. డి వాల్‌లో బ్లీడింగ్ కనిపించిన ప్యానళ్ల మధ్య సంబంధంపై గుత్తేదారు కంపెనీ నుంచి నివేదిక తీసుకోవాలని సిఫార్సు చేశారు. అన్ని ప్యానళ్ల నిలువు, భ్రమణం కొలవడానికి బావర్ నివేదికల్లో ఉన్న త్రీడీ డేటాను సమీక్షించాలన్నారు. లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలని విదేశీ నిపుణులు సూచించారు.డి వాల్ పైభాగాన్ని కొంత మేర తొలగించి ప్రధాన డ్యాం నిర్మించాలి. పోలవరం అధికారులు డి వాల్‌ను 400 మీటర్ల మేర +18.5 మీటర్ల వద్ద కోత పెట్టిన అంశం చర్చనీయాంశమైంది. విదేశీ నిపుణుల బృందం +19 నుంచి కోత పెట్టి పనులు చేయాలని సిఫార్సు చేసింది.
June 18Jun 18 On 6/13/2026 at 9:23 AM, Yaswanth526 said:1 year chepthunnaruElections lopala ithe good anukovatame full level lo kattina no use le rehabilitation complete cheyakunda. 41 meters height ki water canals lo ki vasthadi. a pina just 75 tmc water capacity ante. connectivity works 90% completed already, technically e year ne ivvali coffer dam dwara canal ki .. inko month lo telusthadi.
Wednesday at 11:45 AM3 days Author కొత్త డయాఫ్రం వాల్ భేష్By Andhra Pradesh News DeskPublished : 08 Jul 2026 04:57 ISTEeFont size5 min readపరీక్షల ఫలితాలన్నీ బాగున్నాయ్ ఏడో పర్యటన అనంతరం విదేశీ నిపుణుల బృందం కితాబుప్రాథమిక నివేదిక సమర్పణ ఈనాడు, అమరావతి: ‘పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త డయాఫ్రం వాల్ నాణ్యత భేషుగ్గా ఉంది. పరీక్షల ఫలితాలన్నీ నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాయి. కొన్ని పరీక్షల ఫలితాలు.. ప్రమాణాలను మించి ఉన్నాయి. వాల్‌ను నిర్మించిన బావర్ సంస్థ అందించిన సీఐఎస్ డేటా ఆధారంగా.. ప్యానెళ్ల మధ్య అతికింపు(అనుసంధానం) తదితరాలు నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నట్లు 3డీ నమూనా పరిశీలనలో నిర్ధారణ అయింది’ అని విదేశీ నిపుణుల బృందం తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. గతంలో ఆరుసార్లు ఆ బృందం వచ్చి పనులను పరిశీలించింది. బృంద సభ్యుడు హించ్‌బెర్గర్ మేలో మరోసారి మూడు రోజుల పాటు పోలవరంలో పర్యటించారు. పనులను పరిశీలించారు. తర్వాత దిల్లీలో కేంద్ర జలశక్తి, కేంద్ర జలసంఘం నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. పరిశీలనలు, నాణ్యత నియంత్రణ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రాథమిక నివేదికను సమర్పించారు. తుది నివేదిక రావాల్సి ఉంది. ప్రాథమిక నివేదికలోని ముఖ్యాంశాలివీ.. కొత్త డయాఫ్రం వాల్‌ను 1,372.6 మీటర్ల పొడవున 365 ప్యానెళ్లతో నిర్మించారు. ప్యానెళ్ల సగటు లోతు 51 మీటర్లు. గరిష్ఠ లోతు 97.6 మీటర్లు. 2025 జనవరి 18న పనులు ప్రారంభించి 2026 ఏప్రిల్ 2 నాటికి పూర్తి చేశారు.7,311 యూసీఎస్, సీసీఎస్ పరీక్షలు నిర్వహించారు. యూసీఎస్ అంటే వాల్ అడ్డంగా ఎంత ఒత్తిడిని తట్టుకోగలదు? అని పరీక్షించడం. డయాఫ్రం వాల్‌పై వేల టన్నుల మట్టి, నీటి ఒత్తిడి ఉంటుంది. పైనుంచి ఒత్తిడి ఉన్నప్పుడు ఎంతమేర తట్టుకోగలదనేది ముఖ్యం. సీసీఎస్ అంటే.. నాలుగు వైపులా ఒత్తిడి ఉంటే ఏమేరకు తట్టుకోగలదని నిర్ధారించే పరీక్ష. 841 పర్మెబిలిటీ పరీక్షలు, 23,607 స్లంపు పరీక్షలు చేశారు. నీటిని డయాఫ్రం వాల్ ఎంతవరకు అడ్డుకుంటుందనే అంశాన్ని పెర్మబిలిటీ పరీక్ష తేలుస్తుంది. స్లంప్ పరీక్షలు కాంక్రీటు తీరును తెలుపుతాయి. అన్ని రకాల పరీక్షల ఫలితాలూ సానుకూలంగా ఉన్నాయి.డయాఫ్రం వాల్ నిర్మాణంలో 38 ప్యానెళ్లలో బ్లీడింగు సమస్య వచ్చినట్లు గుర్తించారు. ట్రెమీ ద్వారా కాంక్రీటు పోసే వేగాన్ని తగ్గించి బ్లీడింగును నియంత్రించేందుకు ప్రాజెక్టు బృందం ప్రయత్నించింది. ఉష్ణోగ్రతను నియంత్రించడం సాధ్యం కాలేదని అది 32 డిగ్రీల కన్నా అధికంగా ఉందని గుర్తించారు. ఆ ఉష్ణ ప్రభావంపై తిరుపతి ఐఐటీలో విశ్లేషించారు. టీ16 మిశ్రమంపై విశ్లేషణ చేసి ఉష్ణ ప్రభావాలు సురక్షిత స్థాయుల్లోనే ఉన్నాయని తేల్చారు. దీంతోపాటు బ్లీడింగు జరిగిన ప్యానెళ్లను పరిశీలించడానికి 200 నుంచి 225 మి.మీ. పొడవున్న 48 కోర్ నమూనాలను సేకరించి పరీక్షించారు. ఎలాంటి ప్రతికూల ఫలితాలూ రాలేదు.డయాఫ్రం వాల్ పైభాగాన్ని సా కట్ చేసి దిగువ కాంక్రీటు ఎలా ఉందో పరిశీలించారు. నాణ్యత గల కాంక్రీటు కనిపించింది. (డయాఫ్రం వాల్‌లో పైభాగంలో బలహీన కాంక్రీటు ఉంటుంది. దానిని తొలగించేందుకు సా కట్ చేయాలి) దానిని పరిశీలిస్తే పగుళ్లు, ఖాళీలు, ఇతర నిర్మాణ లోపాలు లేవు. డయాఫ్రం వాల్ బయటి భాగాల్లో కొన్నిచోట్ల మరమ్మతులు చేయాల్సి వచ్చింది. గోడ వెలుపలి ఉపరితలానికి సాయిల్ బెంటోనైట్ అతుక్కుపోవడమే ఇందుకు కారణం. కొన్ని ప్యానెళ్ల జాయింట్లకూ మరమ్మతులు చేశారు. డయాఫ్రం వాల్‌కు సంబంధించి తనిఖీ చేసిన, ఆమోదం పొందిన రికార్డులను మేం పరిశీలించలేదు. ఆ రికార్డులన్నింటినీ భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు.ప్యానెళ్లు రాతిలోకి దిగబడ్డాయా?తొలుత ప్యానెళ్లు రాతిలోకి ఏమేరకు దిగబడ్డాయనే అంశంపై చర్చ జరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ సిరామిక్స్ శాస్త్రవేత్త అక్కడ ఉండి పరిశీలించారు. ఆ రికార్డుల ప్రకారం రాతిలోకి 3 నుంచి 4 మీటర్ల వరకు ప్యానెళ్లను చొప్పించారు. కొన్నిచోట్ల 7 మీటర్ల వరకు వెళ్లాయి. కనీసం 2 మీటర్లు చొప్పిస్తే చాలని విదేశీ నిపుణుల బృందం పేర్కొంది. ఆ ప్రకారమే చేశారు.వాల్ నిర్మాణంలో బావర్ సంస్థ.. కట్టర్ ఇంక్లినేషన్ సిస్టంను ఉపయోగించింది. ప్రతి ప్యానెల్‌కూ సంబంధించి ఆటో క్యాడ్ చిత్రాలను పరిశీలించి పనులు చేసింది. కట్టర్ నిలువుగా దిగిందా.. పక్కకు వెళ్లిందా అనేదాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పని చేసేందుకు ఇది వీలుకల్పిస్తుంది. 5 ప్యానెళ్లలో చిన్నపాటి వ్యత్యాసాలున్నట్లు గుర్తించి, మళ్లీ తవ్వి ఎం10 లీన్ కాంక్రీటుతో నింపి లోపాలను సరిచేశారు. సీఐఎస్ డేటా, ఆటో కాడ్ నమూనాల ప్రకారం విదేశీ నిపుణుల బృందం సంతృప్తికరంగా ఉంది.రికార్డులను బట్టి ప్లాస్టిక్ కాంక్రీటు పరిమాణం 5 నుంచి 6% అధికంగా ఉంది. నిపుణుల బృందం అభిప్రాయం ప్రకారం ఇది సాధారణమైన వ్యత్యాసమే.జాగ్రత్తలు తీసుకోవాలి.. గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణంలో 16 టన్నుల వైబ్రేటరీ రోలర్‌తో కుదించడంతో మేం ఏకీభవించకపోయినా.. అది సాంకేతిక అవసరాలకు అనుగుణంగా పని చేస్తోందని గమనించాం.డ్యాం నిర్మాణంలో ఫిల్టర్లు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.గ్యాప్ 1.. డ్యాం జోన్ 1లో అవసరానికి మించి నిర్మించి తర్వాత కత్తిరిస్తున్నారు. దీని వల్ల సమయం వృథా అవుతుంది.ప్రధాన డ్యాం నిర్మాణంలో క్వారీలోనే రాళ్లను వడబోయాలి. ప్రమాణాలకు అనుగుణమైన వాటిని మాత్రమే పని వద్దకు తీసుకొచ్చి ఉపయోగించాలి. ఫిల్టర్ పక్కన తొలుత పెద్దపెద్ద రాళ్లు వేసి వాటిని తొలగించడం కన్నా ముందే జాగ్రత్త పడాలి.డయాఫ్రం వాల్‌ను ఆనుకుని వేస్తున్న మట్టి నాణ్యతను ఇంకా మెరుగుపరచాలి. ఎక్కువ తేమ ఉండేలా చూసుకోవాలి. 2026 జనవరితో పోలిస్తే ఈ విషయంలో నాణ్యత మెరుగుపడింది.జి హిల్ ప్రాంతంలో రెండు చోట్ల షియర్ జోన్ల(బలహీన శిలలు ఉన్న ప్రాంతం)ను గ్రౌటింగు చేస్తున్న విధానం బాగుంది. గ్రౌట్ మిశ్రమం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.మేలో 3 డోజర్లు మాత్రమే ఉన్నాయి. వాటిని పెంచాలని సిఫారసు చేస్తున్నాం.గ్యాప్ 2 క్లే రీచ్‌లో నిర్మాణ సమయంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేయగలిగే ప్రణాళిక ఉండాలి.గ్యాప్ 2 ఆనకట్ట నిర్మాణ ప్రాంతానికి బయట మరిన్ని బోర్ హోల్స్ తవ్వాలి. డిజైన్ అంచనాలను నిర్ధారించడానికి ఇవి ఉపయోగపడతాయి
Wednesday at 02:44 PM3 days Polavaram Update 🚧The newly constructed diaphragm wall has received positive feedback from the experts team after multiple rounds of quality inspections.✅ All test results satisfactory✅ Preliminary report submitted✅ 51 of 365 diaphragm wall panels completed (97.6 m)✅ Work progressing as per schedule
Wednesday at 03:21 PM3 days pattiseema pump(s) kooda on ayyai ga, aithe e year kooda gravity dwara water ivvatam ledhu .
Create an account or sign in to comment