February 24Feb 24 4. Gap-1లో EL ఇరవై మూడు మీటర్ల లోతు trench తియ్యమంటే ఒక మీటర్ తక్కువ తొవ్వి గోడ కట్టారు (Page no 1) https://drive.google.com/file/d/1I2c3Bbudb2krQm2WVv837ZD2cAggx28a/view?fbclid=IwY2xjawQKgSlleHRuA2FlbQIxMABicmlkETFkU2NZdWlTRkZrcGtEU2NFc3J0YwZhcHBfaWQQMjIyMDM5MTc4ODIwMDg5MgABHg_JYJQzK2x9z7HLRIV0WHYQOzcGujd8v5knLnt3TSAXFqmSVKrlJlrIZ0nM_aem_mcaPMWKAxpDLC7YVTE_8rw
March 19Mar 19 Author పోలవరం నిర్వాసితులను.. గుండెల్లో పెట్టుకుంటాం By Andhra Pradesh News DeskPublished : 19 Mar 2026 04:28 IST Ee Font size 3 min read పుష్కరాలకు ముందే పూర్తి న్యాయం చేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చాకే రూ.1,943 కోట్లు ఇచ్చాం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.226 కోట్ల చెక్కు అందజేత పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు చెక్కును అందిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే శిరీషా దేవి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ప్రశాంతి ఇతర ఉన్నతాధికారులు ఈనాడు, అమరావతి: గోదావరి పుష్కరాలకన్నా ముందే.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇళ్లు, భూముల్ని త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని.. వారంతా సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో.. భూసేకరణ, పునరావాస ప్యాకేజీ కింద మూడో విడతగా రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘వారం రోజుల్లో డయాఫ్రంవాల్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పుష్కరాలకంటే ముందే ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితమిస్తాం.’ అని అన్నారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.. నిర్వాసితుల్ని పట్టించుకోని వైకాపా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి వైకాపా ప్రభుత్వమే కారణం. పోలవరం ఏమైనా పర్వాలేదనే అహంకార ధోరణితో వ్యవహరించారు. వారి అలక్ష్యం వల్ల డయాఫ్రంవాల్ దెబ్బతింది. నిర్వాసితుల్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లను మార్చకుండా ఉంటే ప్రాజెక్టు పూర్తయ్యేది. నిర్వాసితులకు న్యాయం జరిగేది. ఓ మహిళకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సీఎం చంద్రబాబు వేగవంతంగా చెల్లింపులు కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు వేగవంతంగా చెల్లింపులు చేస్తున్నాం. మూడు విడతల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1,943 కోట్లు చెల్లించాం. 2025 జనవరిలో సంక్రాంతికి మొదటి విడతగా రూ.800 కోట్లు ఇచ్చాం. దీపావళికి రెండో విడతగా రూ.916 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమచేశాం. తొలిదశలో 38,068 మంది నిర్వాసితుల్ని తరలించేందుకు చర్యలు చేపట్టాం. 75 నిర్వాసిత కాలనీల్లో 26 పూర్తి చేశాం. 49 నిర్మాణంలో ఉన్నాయి. 2022లో గుర్తించిన 17,114 మంది నిర్వాసితులకు కాలనీలు నిర్మించి, వారిని తరలించే చర్యలు ప్రారంభించాం. 2027 ఏప్రిల్ నాటికి కాలనీలు పూర్తిచేసి పునరావాసం కల్పిస్తాం. నిర్వాసిత కుటుంబాల్లోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తాం. ఈ పనులకు రూ.3,500 కోట్లు ఖర్చుచేస్తాం. ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షలు ఇస్తున్నాం. ఇంటి స్థలానికి ఇచ్చే మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచాం. వైకాపా ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుతున్నాం. నిర్వాసితుల్ని దృష్టిలో ఉంచుకునే పోలవరం జిల్లా ఏర్పాటుచేశాం. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.5 వేల కోట్లు ఖర్చుచేయాలి. కూటమి వల్లే ఆనందం: కూటమి అధికారంలోకి వచ్చాకే పునరావాస, పరిహార ప్యాకేజీ నిధులు అందాయని నిర్వాసిత కుటుంబాలు.. చంద్రబాబు వద్ద ఆనందం వ్యక్తంచేశాయి. చెక్కు విడుదల సందర్భంగా ప్రాజెక్టు ముంపు గ్రామాల నుంచి వచ్చిన నిర్వాసిత కుటుంబాలు హర్షాతిరేకాలు వెలిబుచ్చాయి. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని.. చంద్రబాబు పాలన కలకాలం కొనసాగాలని మహిళలు ఆకాంక్షించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయిప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
March 21Mar 21 On 3/18/2026 at 7:06 PM, Yaswanth526 said: It's very unfortunate that TDP failed to do campaign on this. Even SM also silent... more than 2k crores package to people who lost their lands within 21 months... Jagan didn't give not even single paise....
March 31Mar 31 పోలవరం’పై యుద్ధం ప్రభావంABN , Publish Date - Mar 31 , 2026 | 06:32 AMఅమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పోలవరం పనులపై పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం పడింది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు అవసరమైన బండరాళ్ల కోసం పక్కనే ఉన్న కొండల నుంచి రాయిని తొలిచేందుకు అవసరమయ్యే అమ్మోనియం నైట్రేట్ గల్ఫ్ నుంచి రావాల్సి ఉంది. ఇటీవల జరిగిన బ్లాస్టింగ్‌లకు వాడేయడంతో అమ్మోనియం నైట్రేట్ కొరత ఏర్పడింది. దీంతో 30 శాతం మేర బ్లాస్టింగ్ తగ్గిందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నిర్ణీత కాలవ్యవధిలోనే సమాంతర డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతున్నాయని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లుగానే గడువులోగా మార్చి నెలాఖరు నాటికి అంటే.. రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు
April 2Apr 2 Author పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తిBy Andhra Pradesh News TeamPublished : 02 Apr 2026 17:28 ISTEeFont size1 min readఅమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వం నిర్వాకంతో డయాఫ్రం వాల్ దెబ్బతిని, రూ.440 కోట్ల మేర ప్రజాధనం వృథా అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నిపుణుల సూచనలతో రూ.900 కోట్లతో మరో డయాఫ్రం వాల్ నిర్మించింది. గతేడాది జనవరి 18న పనులు ప్రారంభించి.. రికార్డు స్థాయిలో 440 రోజుల్లో 1,372 మీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మించింది. ఈ పనులు పూర్తికావడంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజినీర్లను సన్మానించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద స్వీట్లు పంచారు.
Create an account or sign in to comment