Jump to content

Recommended Posts

Posted

nenu mito oksari chebithe ledu transstroy okkade chesthunadu annaru.

Brother till 2015 november there is no sub-contracts given to anyone.

AP govt istundi sub-contracts ki seeing company previous works only after dec2015 anduke works speed ayayi. Even L&T and baver ni kuda AP govt selected

From 2004-2015 only 2.5crores cubic metres sand works done

In Jan,Feb ki 56lakhs cubic metres done march 26lakhs cubic metres sand works due to sub-contracts only.

In April inko 2-3 companies ki sub-contracts ki ichindi.

Now govt planning to give sub-contract to some company works related to cement 36lakhs cubic metres work undi denini kuda sub-contract idam ani companies list preparing to speed up works.

Posted
పోలవరాన్ని నింపొద్దని ఆదేశించాం: కేంద్రం
 
న్యూఢిల్లీ, మే 10 (ఆంధ్రజ్యోతి): పొరుగు రాష్ట్రాలైన ఒడిసా, చత్తీ్‌సగఢ్‌లతో తలెత్తిన వివాదాలు ముగిసే వరకూ పోలవరం జలాశయాన్ని నింపొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో మంగళవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్మాణంపై విధించిన నిలుపుదల ఉత్తర్వులను శాశ్వతంగా ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం తమను కోరిందని తెలిపారు. అయితే, గతేడాది జూన్‌లో కొన్ని నిబంధనలతో ఏడాది పాటు నిర్మాణాన్ని కొనసాగించుకునేందుకు అనుమతించామని తెలిపారు. కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని దాఖలైన పిటిషన్ల తుది విచారణ జూలై 7కు ఎన్‌జీటీ వాయిదా వేసింది. ప్రాజెక్టు కరకట్టల నిర్మాణంపై ఒడిసా, చత్తీ్‌సగఢ్‌లలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, అప్పటి వరకు నిర్మాణం ఆపాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దరి లింగ తదితరులు జాతీయ హరిత ధర్మాసనంలో పిటిషన్లు దాఖలు చేశారు.

worst BJP why did you support birufication with out any proper solution for ap problems.you will address every ones concerns except AP

1st we needs to sort out problems with 2 states appudu no one can stop dam construction

Posted

Last paragraph

Dabbulu manam ivvalanta, pettanam central govt chestundanta smuk9c.gif

Feku gaadi telivi thetalu

e Modi gadi kanna cong vallu chala mancholu anipisthundi.

  • 3 weeks later...
  • 4 weeks later...
Posted

న్యూఢిల్లీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): పోలవరం జాతీయ ప్రాజెక్టు డిజైన్లపై కేంద్ర జల సంఘం(సీడబ్ల్యుసీ) ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ బుధవారం చర్చించింది. ఏపీ సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌కు సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యుసీకి అందజేశారు. వీటిపై సాంకేతిక కమిటీ సమీక్ష జరిపింది. అయితే, ఈ డిజైన్లకు సంబంధించి సీడబ్ల్యుసీ ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదని, ప్రతి డిజైన్‌పైనా లోతుగా సమీక్ష మాత్రమే జరిపిందని ఏపీ సాగునీటి శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. హెడ్‌వర్క్స్‌కు సంబంధించి పలు రకరకాల డిజైన్లు ఉంటాయని, వీటన్నింటికీ సీడబ్ల్యుసీ అనుమతులు పొందాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికి కొన్ని డిజైన్లను మాత్రమే సమర్పించామని, మరికొన్నింటిని సమర్పించాల్సి ఉందని చెప్పారు. దీనివల్ల ప్రాజెక్టు ఆగదని వివరించారు. వర్షాల కారణంగా పోలవరం పనులు కొంత ఆగాయని, మరలా కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి చెల్లించటంపై కేంద్రం ఈ ఏడాదికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

Mari ee edadi nirnayam thisukuntaru antaaa :kick:

Posted
పోలవరానికి ఢోకాలేదు!
 
636027603271567413.jpg
  • పనుల నిషేధంపై మరో ఏడాది వెసులుబాటు?
  • సీఎం లేఖపై నేడు కేంద్ర మంత్రి జావదేకర్‌ నిర్ణయం.. రాష్ట్ర కార్యదర్శితో మాట్లాడిన కేంద్ర కార్యదర్శి
హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడ్డంకి లేకుండా మరో ఏడాది పాటు వెసులుబాటును కల్పిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయంటూ ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాలతో పాటు.. రాష్ట్రానికి చెందిన కొందరు కేంద్ర పర్యావరణశాఖకు ఫిర్యాదులు చేశారు. దీంతో.. ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు ఆపేయాలంటూ ఆ శాఖ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, దీని చరిత్ర, ఇతర రాష్ట్రాలతో ఎదురవుతున్న సమస్యలను గురించి సోదాహరణంగా వివరిస్తూ జావదేకర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న నిషేధాన్ని ఏడాది పాటు సడలిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.
 
ఈ ఆదేశాల గడువు ఈ నెల 30తోనే ముగుస్తోంది. దీంతో.. నిషేధంపై మరో రెండేళ్ల సడలింపు కోరుతూ ఇటీవల సీఎం కేంద్ర మం త్రికి లేఖ రాశారు. స్వయంగా ఆయనతో మాట్లాడారు కూడా. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కాగా.. ఈ లేఖపై మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి భారతి రాష్ట్ర అభిప్రాయాన్ని సేకరించారు. రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు ఆయన ఫోన్‌ చేశారు. పోలవరం నిర్మాణం స్థితిగతులపై ఆరా తీశారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారని శశిభూషణ్‌ను భారతి ప్రశ్నించారు. 2018 నాటికి పూర్తి చేస్తామని శశిభూషణ్‌ స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా పట్టిసీమ నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోస్తున్నామని..ఈ ఖరీ్‌ఫలో ఈ కార్యక్రమం సమర్థంగా అమలు చేస్తామని వివరించారు.
 
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు 55 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని శశిభూషణ్‌ను భారతి ప్రశ్నించారు. వాస్తవానికి.. అంతర్రాష్ట్ర జల వివాదాలు ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే చాలని.. ఆ మేరకు ముంపు ప్రాంతమైన భద్రాచలంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశామని శశిభూషణ్‌ తెలిపారు. కానీ ఒడిసా మాత్రం తమ రాష్ట్రంలోని ముంపు ప్రాం తంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని పట్టుబడుతోందని అన్నారు. ఈ రెండు రాష్ట్రాల పర్యావరణ అధికారులకు అవసమైన చలానా మొత్తాన్ని చెల్లించామని, ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించాలని కొన్ని వందల సార్లు కోరామని భారతి దృష్టికి తీసుకొచ్చారు.
 
అయినా సహకారం అందించకుండా.. ఏపీని, కేంద్రాన్ని నిందిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయని, పర్యావరణ శాఖ వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని వివరించారు. రాష్ట్ర అభిప్రాయంతో భారతి ఏకీభవించారు. కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి తనతో ఫోన్లో మాట్లాడిన వివరాలను శశిభూషణ్‌ జల వనరుల మంత్రి దేవినేనికి వివరించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి జావదేకర్‌తో చంద్రబాబు మాట్లాడి ఉండడం, ఇప్పుడు కేంద్ర కార్యదర్శే స్వయంగా వివరాలు తెలుసుకున్న నేపథ్యంలో ప్రాజెక్టు పనుల నిషేధంపై సడలింపు తప్పక లభిస్తుందని రాష్ట్రప్రభుత్వం ఆశాభావంతో ఉంది.
Posted
  • ‘స్టాప్‌ వర్క్‌’ ఆర్డర్‌ రెండేళ్లపాటు నిలిపివేత 

హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పనులు మరో రెండేళ్లపాటు నిరాటంకంగా కొనసాగించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ‘స్టాప్‌ వర్క్‌’ ఆర్డర్‌ను రెండేళ్లపాటు నిలిపివేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో... 2018 జూన్‌ 30 వరకూ పోలవరం పనులు సజావుగా కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని, గిరిజనుల జీవన స్థితిగతులు విచ్ఛిన్నమవుతాయని ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా రాష్ట్రాలు... కోర్టులకు, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలకు ఫిర్యాదు చేశాయి. వాస్తవానికి, 2005లో పోలవరం నిర్మాణం పనులు చేపట్టే సమయంలో ఉన్న నోటిఫికేషన్‌ మేరకు... ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు ఉన్నప్పటికీ ఒక రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే సరిపోతుంది. ఈ మేరకు 2005లో భద్రాచలంలో అప్పటి ఏపీ ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయం సేకరించింది. కానీ, 2007లో వచ్చిన కొత్త ఆదేశాల మేరకు... ముంపు ప్రాంతం ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ఈ నియమావళి మేరకు తమ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదని, అటవీ ప్రాంతం ముంపునకు గురై గిరిజనుల జీవన స్థితిగతులకు ముప్పువాటిల్లుతున్నందున తక్షణమే ఈ నిర్మాణం పనులు నిలిపివేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో పోలవరం పనులు నిలిపివేయాలంటూ గత ఏడాది జూన్‌లో ఏపీని కేంద్రం ఆదేశించింది. కానీ, ఏపీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం... ఏడాది పాటు ‘స్టాప్‌ వర్క్‌’ ఆర్డన్‌ను నిలిపివేస్తూ గత ఏడాది ఉత్తర్వు జారీ చేసింది. దీని కాలపరిమితి గురువారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో... సీఎం చంద్రబాబు జోక్యంతో ఈ ఉత్తర్వుల నిలుపుదలను మరో రెండేళ్లు కేంద్రం పొడిగించింది.

:super:

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...