Jump to content

Prakasam Barrage Beautification


Recommended Posts

  • 3 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
ప్రకాశం బ్యారేజీకి కొత్త కళ
 
636280132827480935.jpg
  • ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు
  • రూ.6.2 కోట్లతో విద్యుత్‌ కాంతులు
  • పనులపై జలవనరులశాఖ ప్రత్యేక శ్రద్ధ
మంగళగిరి: సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడిన ప్రకాశం బ్యారేజీ కొత్త కళను సంతరించుకోనున్నది. ఇప్పటివరకు ఓ సాధారణ బ్యారేజీగా పరిగణించబడిన ప్రకాశం బ్యారేజీ గత ఏడాదిన్నరగా జలవనరుల శాఖ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధాసక్తులతో అటు సందర్శకులను ఆకట్టుకుంటూ మరో వైపు ఎప్పటికప్పుడు పటిష్ఠవంతమవుతుంది. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం పూ ర్తయ్యాక పాలకులు దశాబ్దాలపాటు దానిని నిర్లక్ష్యం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన అనంతరం ప్రకాశం బ్యారేజీకి మహర్దశ పట్టింది.
 
తొలిగా బ్యారేజీపై యుద్ధప్రాతిపదికన తారు రోడ్డును పునర్నిర్మాణం చేశారు.
 
గత ఏడా దిన్నర కాలంగా చూస్తే ఇంచుమించు రూ.30 కోట్ల మేర నిధులను వెచ్చించి ప్రకాశం బ్యారేజీని అటు నిర్మాణపరంగానూ, ఇటు సందర్శకులను ఆకట్టుకునేలా సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రివేళల్లో రంగు రంగుల విద్యుత్‌ కాంతులీనేలా రూ.6.2 కోట్ల వ్యయంతో బ్యారేజీని సుందరీకరించారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఓ కోటి రూపాయల తాలూకూ పనులు మిగిలి ఉన్నాయి. ఇక జలవనరుల శాఖ సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యయంతో బ్యారేజీకి సంబంధించి మరమ్మతులను చేపట్టింది. ఇందులో ప్రధానంగా బ్యారేజీకి దిగువన రూ.10 కోట్లతో యాప్రాన్‌ పునర్నిర్మాణ పనులను చేపట్టారు. ఇందులో కాంక్రీట్‌ బ్లాక్స్‌ పనులు పూర్తికాగా, కొద్దిపాటి స్టోన్‌ వర్కు మిగిలివుంది. రూ.7 కోట్లకు పైగా వ్యయంతో బ్యారేజీ స్కవర్‌ స్లూయిజ్‌ గేట్ల మార్పిడిని చేపట్టారు.
 
 
విజయవాడ వైపు ఆరు స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లు ఉండగా... వాటిలో రెండింటిని పుష్కరాల సందర్భంగా మార్చివేశారు. మరో నాలుగు గేట్లను విజయవాడ వైపు మార్చాల్సి ఉంది. ఇక సీతానగరం వైపున ఎనిమిది స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లను ఈ నెల 18 నుంచి మార్చబోతున్నారు. ఇందుకోసమై రిజర్వాయరు వైపు ఇప్పటికే క్రాస్‌బండ్‌ నిర్మించారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ పాత, కొత్త రెగ్యులేటర్ల మధ్య వున్న కాంక్రీట్‌ బెడ్‌ దెబ్బతినిపోగా... దానిని పునర్నిర్మించారు. ఇక్కడ కాలువకు ఇరువైపులా కాంక్రీట్‌ రిటైనింగ్‌ వాల్స్‌ను నిర్మించబోతున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీ దిగువన సీతానగరం వైపు కొత్తగా కాంక్రీట్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మిస్తున్నారు. వీటికితోడు విజయవాడ వైపు దుర్గా ఘాట్‌ పరిసర తీరప్రాంతాన్ని, ఇటు సీతానగరం వైపు కొండవాలు ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
 
 
ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద రాజధాని ప్రాంత అవసరాల కోసమై సరికొత్తగా బ్యారేజీ కం ఆనకట్టను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని సాధ్యమైనంత త్వరగా నిర్మించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నిర్మాణ పనులకు సంబంధించి డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు కోసం ప్రభుత్వం యాప్‌ కోస్‌ అనే ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ రాడార్‌ సిస్టమ్‌ ద్వారా యుద్ధప్రాతిపదికన సర్వే పూర్తిచేసి రెండు మాసాల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 1 month later...
  • 1 month later...
  • 6 months later...
  • 1 month later...
  • 1 month later...
  • 3 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...