Jump to content

Nagarjuna konda,Anupu


Recommended Posts

  • Replies 90
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ఆదాయం... వినోదం

తీగమార్గాలకు ప్రతిపాదనలు

అమలు చేస్తే పర్యటలకు ఆనందమే

మాచర్ల, న్యూస్‌టుడే

gnt-sty3a.jpg

జిల్లాలో పర్యటక శాఖ తీగమార్గం ద్వారా వినోదం కల్పిస్తామన్న హామీలు నీరుగారుతున్నాయి. ప్రముఖ పర్యటక ప్రాంతాలు నాగార్జునసాగర్‌, ఎత్తిపోతల జలపాతం, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం కోటప్పకొండ ఉన్నాయి. ఏళ్ల తరబడి ఉత్తుత్తి ప్రచారాలు మినహా, పర్యటకుల ముందుకు తీగమార్గం తీసుకువచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దేశంలోని వివిధ ప్రాంతాలలో విజయవంతంగా నడుస్తున్న రోప్‌వే (తీగమార్గం) ఏపీ పర్యటకశాఖ ఏర్పాటు చేస్తే ఆదాయం, పర్యాటకులకు వినోదం అందుబాటులోకి వస్తుంది.

జిల్లాలో 3 చోట్ల పరిశీలనలు

గతంలోనే జిల్లాలోని నాగార్జునసాగర్‌, ఎత్తిపోతల జలపాతం, కోటప్పకొండ వద్ద తీగ మార్గం ద్వారా పర్యటకులను తీసుకు వెళ్లాలనే ప్రతిపాదనలు జరిగాయి. కాకుంటే కార్యరూపం దాల్చలేదు. నాగార్జునసాగర్‌- నాగార్జునకొండ మధ్య ప్రయాణానికి ఉన్న ఏకైక మార్గం నీటిలో ప్రయాణమే. 1955 నుంచి ఇక్కడ ప్రయాణాలు పడవలు, లాంచీల ద్వారా సాగుతున్నాయి. 14 కిలోమీటర్ల ప్రయాణానికి 45 నిమిషాలు పడుతుంది. ఇక్కడ రాకపోకలకు లాంచీ ప్రయాణం తర్వాత ఉన్న మరోమార్గం రోప్‌వే ప్రయాణం. 1980లోనే ఇక్కడ తీగమార్గం ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. కృష్ణానది మీదుగా రోప్‌వే ఏర్పాటు చేసి, పర్యటకులను చేరవేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రోప్‌వే ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. సాగర్‌కు సమీపంలోని చింతలతండా సమీప ప్రాంతం కృష్ణానది నుంచి నాగార్జునకొండకు తీగమార్గంపై గతంలోనే ఆలోచనలు చేశారు. తీరా ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఉందనేది చాలామందికి తెలియదు. ఇలా చేస్తే 14 కిలోమీటర్ల దూరం 5 నుంచి 7 కిలోమీటర్లకు తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. 10 నిమిషాల్లో కొండకు చేరొచ్చు. ప్రస్తుతం విదేశీయులు నిత్యం సాగర్‌కు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఏదో ఒక కొత్తదనం కోరుకుంటారు. రోప్‌వే ద్వారా ప్రయాణం చేస్తుంటే అందమైన కృష్ణానది దృశ్యాలు చూడవచ్చు. నాగార్జునసాగర్‌కు సమీపంలోనే ఎత్తిపోతల జలపాతం ఉంది. ఇక్కడ 60 అడుగుల పై నుంచి కిందకు పడే జలపాతం పక్కగా రోప్‌వే ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం పర్యటక శాఖ పరిశీలించింది. దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయని అంచనాలు వేసింది. ప్రస్తుతం ఈ వూసే ఎత్తడం లేదు. నాగార్జునసాగర్‌కు వచ్చే వారు ఇక్కడికి వస్తారని గుర్తించారు. చుట్టూ ఎతైన కొండలు, అందమైన సుందర ప్రాంతాలు ఎత్తిపోతల సొంతం. ఇక్కడ తీగమార్గం ప్రయోజనకరమని గుర్తించారు. ఇక జిల్లాలో కోటప్పకొండ దేవాలయంలో ఎత్తైన కొండ మీదున్న త్రికోటేశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి చేరాలంటే రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. ఇక్కడ తీగమార్గం కోసం సర్వేలు చేశారు. అవకాశాలు సానుకూలంగానే వచ్చాయి. కింద నుంచి కొండపైకి తీగమార్గం వేస్తే సులభంగా వెళ్లవచ్చు. కొన్ని రోజులు ప్రచారం చేశారు. తీరా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇలా పర్యటక ప్రాంతాలలో రోప్‌వే అందుబాటులోకి వస్తే ఆలయాల ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

దృష్టి సారిస్తే ఆదాయ వనరులు

పర్యటక శాఖ ఎప్పుడో పాతకాలంలో అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రాజెక్టుల ద్వారానే ఆదాయం సమకూర్చుకుంటుంది. నాగార్జునసాగర్‌లో లాంచీస్టేషన్‌, ఎత్తిపోతలలో వసతి గృహాలు, రెస్టారెంట్లపైనే దృష్టి పెట్టింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏ పని చేయాలన్నా పెద్ద కష్టం కాదు. ప్రస్తుతం శ్రీశైలంలో తీగమార్గం ద్వారా పర్యటకులను పర్యటక శాఖ పాతాళగంగ వరకు తీసుకు వెళ్తుంది. దీనిద్వారా ఏటా ఆదాయం వస్తోంది. ఒకసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి పర్యవేక్షణ ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పెట్టుబడులకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రభుత్వం చొరవ చూపేలా నేతలు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
రాష్ట్రంలో ‘బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌’
11-08-2017 03:37:44
 
636380194659818319.jpg
  • ‘‘స్వదేశీ దర్శని స్కీమ్‌’’ ద్వారా అభివృద్ధి
  • రూ.100 కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదం
  • మొదటి దశలో ఏడు ప్రాంతాలను గుర్తింపు
  • శ్రీకాకుళం, విశాఖ, అమరావతిల్లో ముఖ్య ప్రాంతాలు ఎంపిక
 
అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను ఆన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న బుద్ధిజం ఆలయాలను, ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్రం ప్రభుత్వం ప్రారంభించిన ’’స్వదేశీ దర్శనీ’’ పథకంలో భాగంగా ’’బుద్ధిస్ట్‌ సర్కూట్‌’’ పేరుతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే బౌద్ధ ఆలయాల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ.120 కోట్లతో ప్రతిపాదనలు పంపింది.
 
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం కొన్ని మార్పులు చేస్తూ రూ.100 కోట్ల విడుదల చేసేందుకు సిద్ధమయింది. ప్రాజెక్టు పేరులోనే ఉన్నట్లుగా శ్రీకాకుళం దగ్గర నుంచి అమరావతి వరకూ ఒక సర్కూట్‌గా ఆలయాలను అభివృద్ధి చేయనున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖలో మధ్యలో ఉన్న తోట్లకొండ, బావికొండ, బజ్జనకొండతో పాటు లింగాలకొండ, సాలిహుందం ప్రాంతాల్లో 190.65 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. దీంతో పాటు గుంటూరు జిల్లాల్లో పాత అమరావతిలో 7.68 ఎకరాలు, అనుపులో 117 ఎకరాలు అభివృద్ది చేయనున్నారు. పర్యాటక శాఖ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మ్యూజియంలు, మెడిటేషన్‌ సెంటర్లుతో పాటు ఆ ప్రాంతంలో పార్కులు, రిసార్టులు వంటివి అభివృద్ధి చేస్తారు.
 
మన రాష్ట్రంలో ముఖ్యమయిన బుద్ధిజం ప్రాంతాలు సుమారు 20 వరకూ ఉన్నాయి. వీటిలో 15 ప్రాంతాలను స్వదేశీ దర్శనీ భాగంగా ’’బుద్ధిస్ట్‌ సర్కూట్‌’’గా అబివృద్ది చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం మొదట విడతలో 7 ప్రాంతాలను అభివృద్ది చేయాలని సూచిస్తూ... రూ.100 కోట్లు కేటాయించేందుకు సిద్ధమయింది. అలాగే, రూ.33 కోట్లతో నాగార్జున కొండను అభివృద్ది చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు కేంద్రానికి సంబంధించి ’’ప్రసాద్‌ స్కీమ్‌’’లో భాగంగా అభివృద్ది చేస్తున్న ధ్యాన బుద్ధా ప్రాజెక్టు కూడా మరో రెండు నెలల్లో పూర్తి కావస్తోంది.
 
రూ.27 కోట్లతో అభివృద్ధి చేయాలని తలపెట్టిన ధ్యాన బుద్ధా ప్రాజెక్టులో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. మరో 30 శాతం పనులు కొనసాగుతున్నాయి. ఆక్టోబర్‌ చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అమరావతి పేరు ప్రఖ్యాతలు ప్రపంచ వ్యాప్తం అవుతాయి.
Link to comment
Share on other sites

  • 1 month later...

మళ్లీ ఆ మధురానుభూతి

పర్యటక అందాల వీక్షణకు అవకాశం

నాగార్జున సాగర్‌- శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం

మాచర్ల, న్యూస్‌టుడే

gnt-sty3a.jpg

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతుండటంతో పర్యటక శాఖకు ప్రాణం పోసినట్లు అవుతోంది. పర్యటక ప్రాంతాల ద్వారా ఆదాయంపై దృష్టి సారించిన ఆ శాఖ కలిసొస్తున్న అవకాశాలను వినియోగించు కోవాలని దృష్టి సారించింది. ఇందుకు నాగార్జున సాగర్‌- శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం ద్వారా ఆదాయం రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 5 ఏళ్ల క్రితం నుంచే రాకపోకలు ఉన్నా మూడేళ్లుగా సాగర్‌లో ఆశించిన మేర నీరు లేక నిలిచాయి. తాజాగా శ్రీశైలం నుంచి సాగర్‌కు నీళ్లు వస్తున్న నేపథ్యంలో పునరుద్ధరించాలని చూస్తోంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ పర్యటక శాఖ అధికారులు భద్రతాపరంగా ఉన్న లోపాలపై ఇటీవల పరిశీలించారు. శ్రీశైలంకు దిగువన తెలంగాణ ప్రభుత్వం నీటనిల్వ కోసం గతంలో చెక్‌డ్యాం నిర్మించింది. దీని వద్ద కొంత ఇబ్బంది ఉంటుందన్న అభిప్రాయం ఉంది. నీటిమట్టం పెరిగితే దీన్ని అధిగమించవచ్చని నిర్ధారణకు వచ్చారు. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం 580 అడుగులు ఉండేలా చూసుకుని లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

120 కిలోమీటర్లు.. 6 గంటలు.. నాగార్జున సాగర్‌- శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణానికి ఉన్న దూరం 120 కిలోమీటర్లు. ఈ గమ్యస్థానం చేరేందుకు 6 గంటలకు పైగానే పడుతుంది. ఈ ప్రయాణంలో పర్యటకులు పొందే అనుభూతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతుంది. ఎత్తయిన కొండలు, పచ్చదనంతో కప్పేసిన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రవహించే కృష్ణమ్మ, వీటికంటే మధురమైన పర్యటక శాఖ ఆధ్వర్యంలోని పసందైన విందు, నోరూరించే చేపల వంటకాలు సిద్ధం చేయనుంది. నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు తీసుకువెళ్లి, అక్కడ వసతి సౌకర్యం కల్పించి శ్రీశైలంలో దైవ దర్శనం చేయిస్తారు. ఇష్టమైన వారు తిరుగు ప్రయాణంలో లాంచీలోనే సాగర్‌కు చేరుకోవచ్చు. కాదనుకుంటే శ్రీశైలంలో వాహనాల ద్వారా వెళ్లిపోవచ్చు. లాంచీలో వచ్చి వెళ్లేందుకు, ఒక వైపు ప్రయాణానికి వేర్వేరుగా ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. మూడేళ్లుగా లాంచీల రాకపోకలు లేవు. ప్రస్తుతం అగస్త్య లాంచీ ఆధునికీకరణ చివరిదశలో ఉంది. అనుపు వద్ద చేస్తున్నారు. త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. సాగర్‌కు నీటిచేరిక భారీగా ఉంటున్న నేపథ్యంలో గతంలో నత్తనడకన సాగిన పనులు 10 రోజులుగా వేగంగా చేపట్టారు.

580 అడుగులు నిల్వ ఉంటే.. గతంలో 560 అడుగులు నీటిమట్టం ఉన్న సమయంలో ప్రయాణాలు సాగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా సరిహద్దులో కృష్ణానది వద్ద నీటినిల్వకు తెలంగాణా ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మించింది. దీనివల్ల లాంచీ ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఉంటాయనే ఆందోళన ఆంధ్రప్రదేశ్‌ పర్యటక శాఖ వ్యక్తం చేసింది. అవసరమైతే చెక్‌డ్యాం ఉన్నవరకు లాంచీని తీసుకు వెళ్లాలని చూసింది. అక్కడి నుంచి బస్సుల ద్వారా పర్యటకులను తరలించాలన్న ఆలోచన కూడా చేసింది. అయితే ఈ విషయంలో కచ్చిత నిర్ణయం తీసుకోలేదు. అయితే వూహించని విధంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరడం కలిసొచ్చింది. ప్రస్తుతం నీటిమట్టం 565 అడుగులు దాటుతోంది. మరో 15 అడుగులు పెరిగితే లాంచీ నీటిలో దించనున్నారు. మరోవైపు సాగర్‌కు చేరుతున్న నీటిని 590 అడుగుల వరకు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాగర్‌ డ్యాంలో 585 అడుగుల కంటే తక్కువగా నీటిమట్టం తగ్గకుండా చూడనున్నారు.

పనులు మేం సిద్ధం చేస్తున్నాం...

మా పరంగా లాంచీలు తిప్పేందుకు సిద్ధం అవుతున్నాం. 580 అడుగులకు సాగర్‌ నీటిమట్టం చేరితే రాకపోకలు ఉంటాయి. అనుపులో లాంచీని కూడా సిద్ధం చేస్తున్నాం. పర్యటకులకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తాం. ప్రస్తుతం సాగర్‌లో ఆశాజనకంగా నీటిమట్టం పెరుగుతోంది.

-సూర్యనారాయణ, లాంచీ స్టేషన్‌ మేనేజర్‌, నాగార్జున సాగర్‌
Link to comment
Share on other sites

  • 5 months later...
ఆదర్శస్మారక్‌కు నాగార్జునకొండ ఎంపిక
05-04-2018 09:24:14
 
అమరావతి: భారత పురావస్తుశాఖ నాగార్జున సాగర్‌ డ్యాం బ్యాక్‌ వాటర్‌లోని నాగార్జున కొండను ఆదర్శస్మారక్‌ కింద ఎంపికచేసింది. ఈ పథకం కింద పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పరుస్తారు. దేశంలో ఈ పథకం కింద గుర్తించిన వంద పర్యాటక ప్రాంతాల్లో నాగార్జునకొండ ఒకటి కావడం విశేషం! ఈ పర్యాటక కేంద్రాల్లో భారత పురావస్తు శాఖ వసతి గృహాలు, తాగునీరు, బెంచీలు, వ్యాఖ్యాన కేంద్రాలు, గార్డెన్లు వంటివి ఏర్పాటు చేస్తుంది. కృష్ణా నదిలో మధ్యలో ఉన్న ఈ నాగార్జున కొండ ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఐల్యాండ్‌ మ్యూజియం. ఈ మ్యూజియంలో బుద్ధుని జీవిత విశేషాలకు సంబంధించిన శిలాఫలకాలు, జాతక కథలు, పాత రాతియుగం నాటి పనిముట్లు, మట్టిపాత్రలు ఉంటాయి. టిబెట్‌, చైనా తదితర దేశాలకు చెందిన బుద్ధిస్టులు ప్రతియేటా సందర్శిస్తుంటారు
Link to comment
Share on other sites

  • 2 months later...
  • 3 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...