sonykongara Posted April 25, 2016 Posted April 25, 2016 Hero MotoCorp is setting up a new manufacturing facility in Andhra Pradesh, in which it plans to invest Rs 3,000 crore.The plant will have a of capacity of 1.8 million units. Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will be laying foundation stone for the new facility next month. The automobile firm has three manufacturing facilities -- at Gurgaon and Dharuhera in Haryana and Haridwar in Uttarakhand. The two-wheeler major is setting up two more facilities at Neemrana in Rajasthan and Halol in Gujarat. For the new facility, the state government has allocated around 600 acres of land at Tada in Chittor district, on the border of Chennai, which is one of the largest automotive hubs in the country. Last September, the company signed an MoU with the Andhra Pradesh government to allot 600 in Chittoor district to the company. The facility will come close to SriCity, an industrial township. However, land allocation had become a legal issue after a petition was filed by a Chennai-based company claiming that it had obtained interim injunction orders in 2007 from the Court when the state government attempted to procure its lands. According to reports, the petitioner moved the High Court alleging that the AP government has failed to follow the provisions of fair compensation, transparent land acquisition and rehabilitation and resettlement. While a single judge delivered a verdict, a division bench stayed the order, which came as a big relief for Hero MotoCorp from the Hyderabad High Court, which vacated a stay on the construction work and allowed the two-wheeler maker to erect a wall around the 600 acres it was allotted. With these developments, the company has decided to start construction of the factory. While the company did not disclose any numbers till now. Last September, the AP government successfully wooed Hero MotoCorp and the facility will cater both domestic and export markets. Hero MotoCorp proposed to build its sixth facility with a capacity of 1.8 million units with an estimated investment of Rs 3,000 crore. The new facility will take Hero's overall annual capacity of 12 million units.
sonykongara Posted April 26, 2016 Author Posted April 26, 2016 హీరోకు వచ్చే మాసంలో ముహూర్తంఇసుజు పరిశ్రమ ప్రారంభానికి తాను తిరిగి బుధవారం శ్రీసిటీకి వస్తున్నట్లు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో చెప్పారు. అదే సందర్భంలో కొన్ని కారణాలతో హీరో పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. వచ్చేనెలలో ఈ పరిశ్రమకు భూమిపూజ కార్యక్రమాలు చేసితీరుతామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గోపాలకృష్ణారెడ్డి, శ్రీసిటీ ఛైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డి, మాండలేజ్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చైన్ ఎగ్జికూటివ్ వైస్ ప్రెసిడెంట్ డానియల్ మైర్స్, మాండలేజ్ ఇంటర్నేషన్ ఆసియా పసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ వైస్ ప్రెసిడెంట్ ఆస్కార్ రంగెల్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమౌళి వెంకటేష్, ఏపీఐఐసీ ఛైర్మన్ కృష్ణయ్య, జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్, ఉప పాలనాధికారి భరత్‌గుప్తా, జిల్లా ఎస్పీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య(సత్యవేడు), సుగుణ (తిరుపతి), సత్యప్రభ(చిత్తూరు), ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
sonykongara Posted February 18, 2017 Author Posted February 18, 2017 ఏపీకి ‘హీరో’! త్వరలో భూమి రిజిస్ట్రేషన్.. శ్రీసిటీ దగ్గర్లో స్థలం రాష్ట్రం నుంచే బైక్స్ తయారీ.. అనంతకు హ్యుండాయ్ హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి కీలకమైన భారీపరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దులోని శ్రీ సిటీ సెజ్‌కు సమీపంలో హీరో మోటార్ కార్ప్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ భూమిపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో కోర్టు ఆమోదంతో .. న్యాయపరమైన అవరోధాలు ఎదురుకాకుండా పరిశ్రమల శాఖ చర్యలు తీసుకుంది. ఈ భూమిలో గ్రామ దేవతగా కొలుస్తున్న కొన్ని చెట్లు ఉన్నాయి. గ్రామస్థులతో శాఖ అధికారులు చర్చలు జరిపారు. వారి సెంటిమెంట్‌ను గౌరవించి..గ్రామదేవత కోసం ఆలయాన్ని నిర్మించి ఇచ్చారు. ఇలా, భూవివాదాన్ని పరిష్కరించుకొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే హీరో మోటార్ కార్ప్.. ఈ భూములను రిజిసే్ట్రషన్ చేసుకునేందుకు రానున్నది. అదే జరిగితే, రాష్ట్రంలోనే హీరో ద్విచక్ర వాహనాలు తయారవుతాయి. వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. భూముల రిజిసే్ట్రషన్ అంశం వచ్చే కేబినెట్‌లో ఆమోదం పొందే వీలుంది. ఇక.. మరో దిగ్గజ కార్ల తయారీ కంపెనీ కూడా అనంతపురం జిల్లాలో ప్లాంటును స్థాపించేందుకు సన్నద్ధమవుతోంది. హ్యుండాయ్ కార్ల తయారీలో ప్రముఖ స్థానం పొందిన కొరియాకు చెందిన ‘కియ’..రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. చెన్నైలో హ్యుండాయ్ కార్ల తయారీ యూనిట్ ఉంది. సంపూర్ణ సామర్థ్యంలో ఉత్పత్తి సాగిస్తుండటంతో.. ఆ ప్లాంటు విస్తరణకు వీలు లేదు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ‘కియ’ కంపెనీని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానం పలుకుతున్నాయి. అయినా, చెన్నైకి సమీపంలోనే ఉన్న అనంతపురం జిల్లాపై ‘కియ’ దృష్టి సారించింది. ఇప్పటి దాకా, కొరియాలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో ‘కియ’ యాజమాన్యం.. రాష్ట్రంలో ప్లాంటు పెట్టడంపై కాస్త మౌనం దాల్చింది. అంతకు ముందే .. అనంతపురం జిల్లాలో పర్యటించి ప్లాంటు స్థాపనకు అనువైన భూమిని పరిశీలించింది. ఎంవోయూ ప్రతులు ‘ కియ’కు చేరాయని, త్వరలోనే ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగనున్నాయని పరిశ్రమశాఖ వర్గాలు చెబుతున్నాయి.
sonykongara Posted February 18, 2017 Author Posted February 18, 2017 అన్ని అడ్డంకులు దాటుకుని, వచ్చేస్తుంది ‘హీరో మోటార్స్’... Super User 17 February 2017 Hits: 1569 ‘హీరో మోటార్స్’స్థాపనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అవుతుంది. ప్లాంట్ శంకుస్థాపన త్వరలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో వివాదాలు మధ్య, భూమి హీరో మోటార్ కార్ప్ పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే పేరున్న ద్విచక్ర మోటారు వాహనాల కంపెనీ హీరో మోటోకార్ప్ తమ పరిశ్రమను చిత్తూరుజిల్లా పరిధిలోని, తడ వద్ద గల శ్రీ సిటీ సెజ్ కు సమీపంలో 600ఎకరాల భూమిని హీరో కంపెనీకి రాష్ర్ట ప్రభుత్వం కేటాయించింది. హీరో కంపెనీ తమ ప్లాంటును దక్షిణభారతదేశంలో పెట్టడానికి సిద్ధమవగానే ఆంధ్రాతోపాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచాయి. ఈ ప్రాజెక్టును పట్టుబట్టి సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చారు. ఈ ప్లాంటుకోసం హీరో మోటార్స్ మూడు దశల్లో రూ. 1600 కోట్లమేరకు పెట్టుబడి పెట్టనుంది. ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా మరో 2000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మొదటి దశ ఉత్పత్తి 201 8నాటికి ప్రారంభమవుతుందని అంచనా వేసినా కోర్ట్ కేసులు కారణంగా, పోయిన ఏడాది పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కుదరలేదు. ఏటా ఐదు లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ‘హీరో మోటార్స్’ రాష్ట్రానికి రాకుండా, తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న కొంత మంది... మొదటి అడ్డంకి: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో ప్లాంటు ఏర్పాటు కోసం ఆ సంస్థకు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం గతేడాది కేటాయించింది. అయితే, అవి తమ భూములని, తాము వాటిని కొనుగోలు చేశామని, ఈమేరకు పట్టాలు కూడా ఉన్నాయంటూ ఐశ్వర్య ఆర్చిడ్స్ అండ్ ప్లాంటేషన్ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. Advertisements ఈ భూముల పై హైకోర్టు విచారణ జరగగా, వీటిని కేటాయించింది ఒక కర్మాగారానికని, దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి... రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ భూముల్లో ప్లాంటు నిర్మాణం చేసుకోవచ్చునని హైకోర్టు గతేడాది నవంబరు 26న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ఏర్పాటులో జాప్యం జరిగితే రాష్ట్రానికి కూడా నష్టమని అభిప్రాయపడింది. ఆ భూములు ప్రైవేటువని తేలితే తగినంత నష్టపరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ, హైకోర్టు మధ్యంతర ఆదేశాలను ఐశ్వర్య సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ధర్మాసనం తీర్పును ప్రకటిస్తూ.. ఐశ్వర్య సంస్థ ప్రయోజనాలను హైకోర్టు తగిన విధంగానే పరిష్కరించిందని, ఆ భూముల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు కొనసాగించవచ్చునని, హైకోర్టు తుది తీర్పును బట్టి ఐశ్వర్య సంస్థకు పరిష్కారం లభిస్తుందని చెప్పింది. ఆ భూముల్లో ‘హీరో’ ప్లాంటు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపింది. రెండో అడ్డంకి: సుప్రీం కోర్ట్ తీర్పుతో మార్గం సుగుమం అయ్యింది అనుకున్న తరుణంలో, ఈ భూమిలో గ్రామ దేవతగా కొలుస్తున్న కొన్ని చెట్లు ఉన్నాయిని, అవి తీస్తే ఉరుకోము అని, గ్రామస్తులు ఎదురు తిరిగారు. వీరి వెనుక ఎవరు ఉన్నా, సెంటిమెంట్ తో కూడుకున్నది కాబట్టి, గ్రామస్థులతో అధికారులు చర్చలు జరిపారు. వారి సెంటిమెంట్‌ను గౌరవించి, గ్రామదేవత కోసం ఆలయాన్ని నిర్మించి ఇచ్చారు. ఇలా, భూవివాదాన్ని పరిష్కరించుకొన్నారు. ఇలా అన్ని అడ్డంకులు తొలగించుకున్న నేపథ్యంలో త్వరలోనే హీరో మోటార్ కార్ప్, ఈ భూములను రిజిసే్ట్రషన్ చేసుకునేందుకు రానున్నది. మరి ఇంకా ఏ అడ్డంకులు రాకుండా, ప్రపంచంలోనే పేరున్న ద్విచక్ర మోటారు వాహనాల కంపెనీ మన రాష్ట్రంలో మొదలవ్వాలని కోరుకుందాం...
Yaswanth526 Posted February 18, 2017 Posted February 18, 2017 Finally ela ithe ne ap vallu sadincharu ga hero ni
Royal Nandamuri Posted February 18, 2017 Posted February 18, 2017 ekadekkadinuncho vachina recommendation lu kadani AP ki vastunnarante ikkada leaders+bureaucrats entha followup chesi untundo oohinchukovachu.
sonykongara Posted February 18, 2017 Author Posted February 18, 2017 ekadekkadinuncho vachina recommendation lu kadani AP ki vastunnarante ikkada leaders+bureaucrats entha followup chesi untundo oohinchukovachu. CBN,kambhampati rammohan rao
sonykongara Posted March 10, 2017 Author Posted March 10, 2017 ఏపీకి హీరో కంపెనీకి భూమి రిజిస్ర్టేషన్ పూర్తి శ్రీసిటీ సెజ్ దగ్గర్లో భూమి తీసుకున్న ద్విచక్ర దిగ్గజం గన్నవరం ఎయిర్‌పోర్టు దగ్గర హెచ్‌సీఎల్‌కు 100 ఎకరాలు స్థలం చూసిన ప్రతినిధులు కేంద్రం అనుమతే తరువాయి ఉగాది నాటికి శంకుస్థాపన? అమరావతి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు కొత్త కంపెనీలు తరలివస్తున్నాయి. ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటార్స్ కార్ప్..తనకు కేటాయించిన భూమిని గురువారం రిజిస్ర్టేషన్ చేయించుకోగా, మరో పెద్ద కంపెనీ హెచ్‌సీఎల్.. ప్లాంటు కోసం ప్రభుత్వం సూచించిన భూమిని చూసుకొని వెళ్లింది. ఉగాది నాటికి ‘భూమి’పైకి వెళ్లాలనే ఆలోచనతో ఉంది. మరోవైపు ‘హీరో’ త్వరలోనే ప్లాంటు నిర్మాణానికి టెంకాయ కొట్టేందుకు సిద్ధమవుతోంది. శ్రీసిటీ సెజ్‌కి సమీపంలో తనకు కేటాయించిన భూమిని ఈ సంస్థ రిజిస్టర్ చేసుకుంది. ఇప్పటిదాకా .. హీరో మోటార్స్‌కు కేటాయించిన భూమి వివాదంలో ఉండడంతో .. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెనుకంజ వేసింది. అయితే.. పలు దఫాలు చర్చలు, సంప్రదింపులు జరిపాక .. ఈ సంస్థ రిజిస్ట్రేషన్‌కు సుముఖత వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో 600 ఎకరాల భూమిని హీరో మోటార్స్ కార్ప్‌కి తొలుత కేటాయించారు. అయితే, ఆ భూమి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వేరేచోట వివాదరహితమైన భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా..హీరో మాత్రం మొదటి కేటాయించిన భూమినే ఇవ్వాలని పట్టుబట్టింది. దీంతో, ఈ భూమిపై ఉన్న వివాదాలను ఒక్కొక్కటిగా పరిశ్రమల శాఖ పరిష్కరించి.. రిజిస్ట్రేషన్‌కి దారి సుగమం చేసింది. వాస్తవానికి గత ఏడాది మార్చి 31న హీరో మోటార్స్ కార్ప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు హీరో మోటార్స్ కార్ప్ .. ఈ ప్లాంట్‌లో మూడు చక్రాల ఎలక్ట్రికల్ వాహనాలు, ఎరోస్పేస్- టెక్నాలజీలను గ్రీన్ టెక్నాలజీలో తయారు చేయాలి. కాగా, హీరో సంస్థ అభ్యర్థన మేరకు త్రీవీలర్స్ అని ఒప్పందంలో ఉన్న పదానికి బదులు త్రీ వీలర్స్ అండ్ మొబిలిటీ సొల్యూషన్స్ అనే పదాన్ని చేర్చారు. అదేవిధంగా గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీలోగా భూమిని అప్పగించాలన్న క్లాజ్‌ను ఈఏడాది 31లోగా అని మార్పు చేశారు. మరోవైపు, ప్రముఖ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ అయిన హెచ్‌సీఎల్..అమరావతిలో తన కార్యకలాపాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతుంది. గన్నవరం సమీపంలో డెవల్‌పసెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. దానికోసం ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం సమీపంలో 100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని హెచ్‌సీఎల్ అధినేత నాడర్ పరిశీలించారు. ఉగాది నాటికి శంకుస్థాపన చేసే ఆలోచనలో ఈ సంస్థ ఉంది. అయితే, ఈ భూమి గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉండటం సమస్యగా మారింది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఎత్తయిన భవనాలు నిర్మించడం నిషేధం. భవన నిర్మాణాలకు సంబంధించిన డిజైన్‌లకు కేంద్ర విమానయాన సంస్థ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఉగాది నాటికి పూర్తి చేసుకొని.. ప్లాంటుకు శ్రీకారం చుట్టాలని హెచ్‌సీఎల్ భావిస్తోంది.
MVS Posted March 10, 2017 Posted March 10, 2017 Three wheeler kuda ante lot of scope for direct & indirect employment opportunities..
MVS Posted March 10, 2017 Posted March 10, 2017 ఏపీకి హీరో కంపెనీకి భూమి రిజిస్ర్టేషన్ పూర్తి శ్రీసిటీ సెజ్ దగ్గర్లో భూమి తీసుకున్న ద్విచక్ర దిగ్గజం గన్నవరం ఎయిర్‌పోర్టు దగ్గర హెచ్‌సీఎల్‌కు 100 ఎకరాలు స్థలం చూసిన ప్రతినిధులు కేంద్రం అనుమతే తరువాయి ఉగాది నాటికి శంకుస్థాపన? అమరావతి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు కొత్త కంపెనీలు తరలివస్తున్నాయి. ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటార్స్ కార్ప్..తనకు కేటాయించిన భూమిని గురువారం రిజిస్ర్టేషన్ చేయించుకోగా, మరో పెద్ద కంపెనీ హెచ్‌సీఎల్.. ప్లాంటు కోసం ప్రభుత్వం సూచించిన భూమిని చూసుకొని వెళ్లింది. ఉగాది నాటికి ‘భూమి’పైకి వెళ్లాలనే ఆలోచనతో ఉంది. మరోవైపు ‘హీరో’ త్వరలోనే ప్లాంటు నిర్మాణానికి టెంకాయ కొట్టేందుకు సిద్ధమవుతోంది. శ్రీసిటీ సెజ్‌కి సమీపంలో తనకు కేటాయించిన భూమిని ఈ సంస్థ రిజిస్టర్ చేసుకుంది. ఇప్పటిదాకా .. హీరో మోటార్స్‌కు కేటాయించిన భూమి వివాదంలో ఉండడంతో .. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వెనుకంజ వేసింది. అయితే.. పలు దఫాలు చర్చలు, సంప్రదింపులు జరిపాక .. ఈ సంస్థ రిజిస్ట్రేషన్‌కు సుముఖత వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో 600 ఎకరాల భూమిని హీరో మోటార్స్ కార్ప్‌కి తొలుత కేటాయించారు. అయితే, ఆ భూమి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వేరేచోట వివాదరహితమైన భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా..హీరో మాత్రం మొదటి కేటాయించిన భూమినే ఇవ్వాలని పట్టుబట్టింది. దీంతో, ఈ భూమిపై ఉన్న వివాదాలను ఒక్కొక్కటిగా పరిశ్రమల శాఖ పరిష్కరించి.. రిజిస్ట్రేషన్‌కి దారి సుగమం చేసింది. వాస్తవానికి గత ఏడాది మార్చి 31న హీరో మోటార్స్ కార్ప్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు హీరో మోటార్స్ కార్ప్ .. ఈ ప్లాంట్‌లో మూడు చక్రాల ఎలక్ట్రికల్ వాహనాలు, ఎరోస్పేస్- టెక్నాలజీలను గ్రీన్ టెక్నాలజీలో తయారు చేయాలి. కాగా, హీరో సంస్థ అభ్యర్థన మేరకు త్రీవీలర్స్ అని ఒప్పందంలో ఉన్న పదానికి బదులు త్రీ వీలర్స్ అండ్ మొబిలిటీ సొల్యూషన్స్ అనే పదాన్ని చేర్చారు. అదేవిధంగా గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీలోగా భూమిని అప్పగించాలన్న క్లాజ్‌ను ఈఏడాది 31లోగా అని మార్పు చేశారు. మరోవైపు, ప్రముఖ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ అయిన హెచ్‌సీఎల్..అమరావతిలో తన కార్యకలాపాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతుంది. గన్నవరం సమీపంలో డెవల్‌పసెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. దానికోసం ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం సమీపంలో 100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని హెచ్‌సీఎల్ అధినేత నాడర్ పరిశీలించారు. ఉగాది నాటికి శంకుస్థాపన చేసే ఆలోచనలో ఈ సంస్థ ఉంది. అయితే, ఈ భూమి గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉండటం సమస్యగా మారింది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఎత్తయిన భవనాలు నిర్మించడం నిషేధం. భవన నిర్మాణాలకు సంబంధించిన డిజైన్‌లకు కేంద్ర విమానయాన సంస్థ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఉగాది నాటికి పూర్తి చేసుకొని.. ప్లాంటుకు శ్రీకారం చుట్టాలని హెచ్‌సీఎల్ భావిస్తోంది. </p> HCl ki anta land avasarama
KaNTRhi Posted March 10, 2017 Posted March 10, 2017 HCl ki anta land avasarama IT park laga kadatharemo le....
vinayak Posted March 10, 2017 Posted March 10, 2017 JAFFA batch Jaffa ki cheppandi CBN valane ee companies anni vastunnayi ani......................JAFFA mukham chusi okkadu kuda pettubadi pettaru
sonykongara Posted March 10, 2017 Author Posted March 10, 2017 hcl technologies(software), hcl infosystems (hardware)
LuvNTR Posted March 10, 2017 Posted March 10, 2017 mana AP ki inka bad time nadusthondi kabatte ee HCL ki 100 acres ivvadam ani mana SRK annai opinion.
chsrk Posted March 10, 2017 Posted March 10, 2017 mana AP ki inka bad time nadusthondi kabatte ee HCL ki 100 acres ivvadam ani mana SRK annai opinion. Thammai...kusalama.....eeda Trump flight ekkinchetattunte nuvvu India llo nannu train kindha thoselaaga unnavga...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now