February 18Feb 18 Author శ్రీసిటీలో క్యారియర్ ఏసీ యూనిట్ By Andhra Pradesh News DeskPublished : 18 Feb 2026 04:45 IST Ee Font size 1 min read రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు సిద్ధం వెయ్యి మందికి ఉద్యోగాలు కుదిరిన ఒప్పందం కలెక్టర్ వెంకటేశ్వర్ సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్న క్యారియర్ ఎండీ సుందరేశన్ నారాయణన్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి శ్రీసిటీ(వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ (హెచ్‌వీఏసీ) రంగంలో అగ్రగామిగా ఉన్న క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుకు లీజ్ డీడ్‌పై సంతకం చేసింది. రూ.వెయ్యి కోట్లతో ఏర్పాటుచేసే ఈ కేంద్రం ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మరో రెండువేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 39 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో సుస్థిర, ఇంధన సామర్థ్యం కలిగిన కూలింగ్ పరిష్కారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమక్షంలో క్యారియర్ ఎండీ సుందరేశన్ నారాయణన్, శ్రీసిటీ ఎండీ డా.రవీంద్ర సన్నారెడ్డి పరస్పర ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వ్యాపారం, వేగవంతమైన అమలుకు అనుగుణంగా శ్రీసిటీ ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్, ఆటోమొబైల్ రంగంలో ప్రధానకేంద్రంగా ఎదుగుతోందన్నారు. ఎండీ సుందరేశన్ నారాయణన్ మాట్లాడుతూ శ్రీసిటీలోని ప్రపంచస్థాయి మౌలికవసతులు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ల ప్రోత్సాహంతో నూతన ప్లాంటు ఏర్పాటుచేస్తున్నామని పేర్కొన్నారు.
February 27Feb 27 Author ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక సంస్థ.. శ్రీసిటీలో ఏర్పాటు By Andhra Pradesh News TeamPublished : 27 Feb 2026 13:23 IST Ee Font size 1 min read అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక సంస్థ రానుంది. అమెరికా-జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్.. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ కర్మాగారం ఏర్పాటు చేయనుంది. మెట్‌గ్లాస్ ఇండియా పేరుతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అల్లాయ్ రిబ్బన్‌ను ఇది ఉత్పత్తి చేయనుంది. ఈ సంస్థ తొలి దశలో 77 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 200 మందికి నేరుగా ఉద్యోగాలు కల్పించనున్నారు. 2026 అక్టోబర్ నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సీఈవో శాన్‌స్టాక్ తెలిపారు. అధునాతన జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్లాంట్‌లో వినియోగిస్తామని ప్రొటీరియల్ సంస్థ తెలిపింది. తొలిదశలో ఏడాదికి 30వేల టన్నుల సామర్థ్యంతో ఇది పనిచేయనుంది. ప్లాంట్‌లో పనిచేసేందుకు స్థానిక యువతకు ఎక్కువ అవకాశం కల్పిస్తామని పేర్కొంది. దీనికి అనుగుణంగా పలువురిని ఎంపిక చేసి వారికి జపాన్‌లో శిక్షణ ఇస్తామని వెల్లడించింది.
February 28Feb 28 Author రాష్ట్రానికి మరో ఉక్కు కర్మాగారం By Andhra Pradesh News DeskUpdated : 28 Feb 2026 04:08 IST Ee Font size 2 min read శ్రీసిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అమెరికా-జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ ఈనాడు, దిల్లీ: రాష్ట్రానికి మరో ఉక్కు కర్మాగారం రానుంది. అమెరికా-జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్... మెట్‌గ్లాస్ ఇండియా పేరుతో శ్రీసిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ సీన్ ఎం.స్టాక్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లలో ఉపయోగించే పరికరాలను ఇందులో ఉత్పత్తి చేయనున్నారు. ఈ సంస్థ తొలిదశలో సుమారు 77-80 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఎల్లాయ్ రిబ్బన్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ఏడాది చివరినుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అధునాతన జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇందులో ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టనున్నారు. తొలిదశలో ఏడాదికి 30వేల టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ పనిచేస్తుంది. స్థానికులకు జపాన్‌లో శిక్షణ ఇక్కడి ఉద్యోగాల్లో స్థానిక యువతకే ఎక్కువ అవకాశం ఇస్తామని సీఈఓ సీన్ ఎం.స్టాక్ చెప్పారు. తమ అవసరాలకు తగ్గట్టు ఉద్యోగులను ఎంపిక చేసి వారికి జపాన్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ‘‘మేం తొలి ఎలక్ట్రిక్ స్టీల్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. వ్యాపారం చేయడానికి అనువైన వాతావరణం అక్కడుంది. ఈ ప్లాంట్ తక్కువ విద్యుత్తు వినియోగంతో సాగుతుంది. ప్రస్తుతం భారత్ ఏటా 22-26వేల టన్నుల ఎలక్ట్రిక్ స్టీల్ దిగుమతి చేసుకుంటోంది. మా ప్లాంట్‌లో తొలిదశలో 30వేల టన్నులు ఉత్పత్తి చేస్తాం. కాబట్టి దిగుమతులు తగ్గుతాయి. భారతదేశ ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం అని నిర్ణయించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటుచేస్తున్నాం. తొలిదశలో 77-80 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నా, తర్వాత 150-160 మిలియన్ డాలర్లకు తీసుకెళ్తాం. ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేస్తాం. తొలి దశలో 200 మందికి, మలిదశలో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్లాంట్‌లో స్టీల్ ఉత్పత్తికి మేం బొగ్గు వినియోగించం. అంతా విద్యుత్తు ఫర్నేస్ ద్వారానే జరుగుతుంది. ఇనుప ఖనిజాన్ని స్థానిక ఉత్పత్తిదారుల నుంచే సేకరిస్తాం’’ అని ఆయన వెల్లడించారు. అమెరికా సుంకాల తగ్గింపు వల్ల ఆక్వా హబ్‌గా ఏపీ ఆక్వాలో దేశంలోనే మనం నంబర్ 1. ఎగుమతుల్లో మన రాష్ట్ర వాటా 34%. ఈ ఏడాది 17% వృద్ధి నమోదైంది. ఆక్వా జోన్ పెద్దఎత్తున అభివృద్ధి చేస్తాం. యూనిట్ విద్యుత్తు రూ.1.50 చొప్పున ఇచ్చి ఆక్వా రంగాన్ని పునరుద్ధరించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. దేశంలోని చేపల ఉత్పత్తిలో 29%, రొయ్యల ఉత్పత్తిలో 75% ఏపీలోనే ఉంది. అమెరికా సుంకాల తగ్గింపు వల్ల ఏపీ ఆక్వాకల్చర్ హబ్‌గా మారనుంది
April 18Apr 18 Author శ్రీసిటీలో పీజీ టెక్నోప్లాస్ట్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారంBy Andhra Pradesh News DeskPublished : 18 Apr 2026 05:44 ISTEeFont size1 min readరూ.1,305 కోట్ల పెట్టుబడులు, 2,910 మందికి ఉపాధిశ్రీసిటీ, (వరదయ్యపాళెం) న్యూస్‌టుడే: ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల తయారీ సంస్థ పీజీ టెక్నోప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ఇప్పటికే శ్రీసిటీలో కేటాయించిన స్థలంలో పరిశ్రమ నిర్మాణ పనులు కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్నాయి. రూ.1,305 కోట్ల పెట్టుబడులతో 2,910 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ సంస్థ శ్రీసిటీలో కొత్త యూనిట్‌ను నెలకొల్పనుంది. ఫిబ్రవరి 2న ఈ కంపెనీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, మార్చి 28న ఏపీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఏపీఈడీబీ), రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ), ఐటీ, ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక రంగ సంప్రదింపుల కమిటీ (సీసీఐటీఈఐ) నుంచి త్వరితగతిన అనుమతులు వచ్చాయి. అనంతరం ఈ నెల 7న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డుతో పాటు ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు అందాయి. వేగంగా అనుమతులు మంజూరు చేయడంపై పీజీ కంపెనీ యాజమాన్యం శుక్రవారం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
Thursday at 02:26 PM4 days Author 2028 నాటికి 80% ఏసీల ఉత్పత్తి ఏపీలోనేBy Andhra Pradesh News DeskPublished : 07 May 2026 05:10 ISTEeFont size3 min read‘క్యారియర్’ పెట్టుబడులు.. సీఎంపై నమ్మకానికి నిదర్శనంభూమిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్భూమిపూజ కార్యక్రమంలో మంత్రి లోకేశ్, పక్కన క్యారియర్ సంస్థ ప్రతినిధులు సుందరేశన్, గియర్జెస్, డేవిడ్ గిట్లిన్, నడియా విల్లెనెవ్ఈనాడు,తిరుపతి: క్యారియర్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రస్తుతం డేటా సెంటర్ల ఏర్పాటు పెరుగుతోందని.. ఇందులో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వాటిని నడిపించే వ్యవస్థలను నిర్మించాలన్నదే తమ లక్ష్యమన్నారు. డేటాసెంటర్లకు అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్స్, హై ఎఫీషియన్సీ చిల్లర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ వంటివి అవసరమన్నారు. డేటా సెంటర్లకు కూలింగ్ యూనిట్ల సరఫరాలో క్యారియర్ ముఖ్యభూమిక పోషిస్తుందన్నారు. 2027 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఏసీల్లో 60 శాతం, 2028 నాటికి 80 శాతం ఏపీలోనే తయారవుతాయని తెలిపారు. భవిష్యత్తులో ఇది 100 శాతం అయ్యేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో బుధవారం అమెరికా దిగ్గజ సంస్థ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టి 3 వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ ‘2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ముఖ్యమంత్రి, ఆయన వెనుక కసితో పనిచేసే బృందం ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు సర్కార్ ఏపీలో ఉన్నందునే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఒక్క జూమ్ కాల్‌తో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంటు రాష్ట్రానికి వచ్చింది. పారిశ్రామికవేత్తలకు ఏ అవసరం వచ్చినా వాట్సప్ మెసేజ్ దూరంలో అందుబాటులో ఉంటాం’ అని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. నెలాఖరుకు ఏఐ ఆధారిత నైపుణ్యం ప్రాజెక్టు ప్రారంభం‘ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం నైపుణ్యం పోర్టల్‌ను తీసుకొస్తున్నాం. ఏఐ ఆధారిత ఈ ప్రాజెక్టును నెలాఖరుకు ప్రారంభిస్తాం. విశాఖ ఏఐ గ్లోబల్ హబ్‌గా తయారవుతుంది. క్యారియర్ సంస్థ శ్రీసిటీలో పరిశోధనా కేంద్రాన్నీ ఏర్పాటు చేయాలి. నేను తొలిసారి ఇంట్లో వినియోగించింది క్యారియర్ ఏసీనే. చంద్రబాబు తన కార్యాలయంలో ఏసీ 17 డిగ్రీలు ఉండేలా చూసుకుంటారు. అన్ని డిగ్రీల శీతల స్థితి ఉండే ఆవిష్కరణ చేసింది క్యారియర్ సంస్థనే. శ్రీసిటీ సెజ్ మాత్రమే కాదు.. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్. 8,500 ఎకరాల్లో 31 దేశాలకు చెందిన 250కి పైగా కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్‌కు శ్రీసిటీ ఉత్తమ నమూనాగా నిలుస్తోంది’ అని లోకేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఛైర్మన్, సీఈఓ డేవిడ్ ఎల్.గిట్లిన్, ఆ సంస్థ క్లైమెట్ సొల్యూషన్స్ ఏసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రెసిడెంట్ మైకేల్ ఎల్.గియర్జెస్, క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ (క్యారియర్ ఎండీ) ఎండీ సుందరేశన్ నారాయణన్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ ఎండీ సుందరేశన్ నారాయణన్.. కొంతసేపు తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. ఏడాదిలోనే క్యారియర్ సంస్థ ఉత్పత్తి ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.► Read latest Andhra pradesh News and Telugu News
Create an account or sign in to comment