March 22, 20251 yr Author OJI India: ఓజేఐ ఇండియా ప్యాకేజింగ్ పరిశ్రమ అట్టపెట్టెలు, ఇతర ప్యాకేజింగ్ వస్తువుల తయారీ దిగ్గజ సంస్థ ఓజేఐ గ్రూప్ అనుబంధ ఓజేఐ ఇండియా ప్యాకేజింగ్ తిరుపతి జిల్లా శ్రీసిటీ సెజ్‌లో 43,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటును శుక్రవారం ప్రారంభించారు. By Business News DeskPublished : 22 Mar 2025 03:51 IST Ee Font size 1 min read శ్రీసిటీ (వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: అట్టపెట్టెలు, ఇతర ప్యాకేజింగ్ వస్తువుల తయారీ దిగ్గజ సంస్థ ఓజేఐ గ్రూప్ అనుబంధ ఓజేఐ ఇండియా ప్యాకేజింగ్ తిరుపతి జిల్లా శ్రీసిటీ సెజ్‌లో 43,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటును శుక్రవారం ప్రారంభించారు. జపాన్ కాన్సుల్ జనరల్ (చెన్నై) మునియో తకాహషి, ఓజీ హోల్డింగ్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈఓ హిరోయుకి ఇసోనో, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, ఓజీ ఇండియా ప్యాకేజింగ్ సీఈఓ యోషియుకి కురహషి పాల్గొన్నారు. దేశంలో ఇది అయిదో ప్లాంటు కాగా, దక్షిణ భారతదేశంలో అతిపెద్దదని హిరోయుకి ఇసోనో తెలిపారు. 100 మిలియన్ చదరపు మీటర్ల వార్షిక సామర్థ్యం ఉందని, అట్టపెట్టెలు, ఇతర ఉపకరణాలను ఇక్కడ తయారు చేస్తామన్నారు. శ్రీసిటీలో కోబెల్‌కో ఆర్‌అండ్‌డీ కేంద్రం జపాన్‌కు చెందిన కోబెల్‌కో మెషినరీ అనుబంధ కోబెల్‌కో కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఇండియా, కొత్తగా పరిశోధన -అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని శ్రీసిటీ సెజ్‌లో ఉన్న తమ యూనిట్లో ఏర్పాటు చేయనుంది. 20,000వ హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్‌ను తమ యూనిట్లో ఉత్పత్తి చేసిన సందర్భంగా, ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది. ఏడాదికి 3000 హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లను తయారు చేసే సామర్థ్యం తమకు ఉందని, వీటిని భారత విపణితో పాటు 16 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సంస్థ సీఈఓ తకెమిషి తెలిపారు.
May 7, 20251 yr Author రేపు శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్‌కు శంకుస్థాపన రాయలసీమలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి లోకేశ్ ఈ నెల 8న భూమిపూజ చేస్తారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. By Andhra Pradesh News DeskPublished : 07 May 2025 05:11 IST Ee Font size 1 min read రూ.5,001 కోట్ల పెట్టుబడులు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేశ్ ఈనాడు, అమరావతి: రాయలసీమలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి లోకేశ్ ఈ నెల 8న భూమిపూజ చేస్తారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీసిటీలో ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా రాబోయే ఆరేళ్లలో రూ.5,001 కోట్ల పెట్టుబడులను సంస్థ పెడుతుందని పేర్కొంది. ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, సీమ ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు తీసుకుంటున్న చర్యల గురించి ఎల్‌జీ కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. ‘ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసే యూనిట్‌లో సంస్థ తయారు చేస్తుంది. ఈ సంస్థ ద్వారా రాబోయే ఆరేళ్లలో సుమారు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. రూ.839 కోట్లతో మరో ఐదు అనుబంధ యూనిట్లు ఇక్కడ రాబోతున్నాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే లక్ష్యం. ఇందులో భాగంగా గత 11 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికే ఆర్సెలార్ మిత్తల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, టాటా పవర్, రిలయన్స్ సీబీజీ ప్లాంట్లు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి’ అని ప్రభుత్వం తెలిపింది.
May 8, 20251 yr Author ఏపీని ఎలక్ట్రానిక్స్ పవర్‌హౌస్‌గా మారుస్తాం: మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరణ, పెట్టుబడి కలిసేచోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. By Andhra Pradesh News TeamPublished : 08 May 2025 14:28 IST Ee Font size 1 min read తిరుపతి: ఆవిష్కరణ, పెట్టుబడి కలిసేచోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఏపీని ఎలక్ట్రానిక్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు బాటలు వేస్తున్నామన్నారు. ‘‘ఈరోజు ఎల్జీ యూనిట్‌కు మాత్రమే కాదు.. ఏపీ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నాం. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు కంటే పెద్దది. ఇది రాష్ట్రంతో పాటు దేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయి. రూ.5వేల కోట్లకు పైగా పెట్టుబడితో రాష్ట్రానికి ప్రపంచస్థాయి తయారీ యూనిట్‌ను ఎల్జీ తీసుకొచ్చింది. ‘మేడ్ ఇన్ ఆంధ్రా నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్’ వరకు మా జైత్రయాత్ర కొనసాగుతుంది’’ ‘‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా శ్రీసిటీ యూనిట్‌లో ఎల్జీ ఆవిష్కృతమైంది. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు, ఏపీ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వడంతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నాం’’ అని లోకేశ్ అన్నారు.
May 30, 20251 yr Author డైకిన్ సంస్థకు ప్రోత్సాహకాలు ఈనాడు, అమరావతి: తిరుపతి జిల్లా శ్రీసిటీలో డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణ ప్రాజెక్టుకు ప్రోత్సాహకాలు (టైలర్‌మేడ్ ఇన్సెంటివ్‌లు) చెల్లించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2,475 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,150 మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. మెగా కేటగిరీ కింద ఈ ప్రాజెక్టును పరిగణించి ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 మేరకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంస్థ ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ (2014-20) కింద రూ.1,604 కోట్ల పెట్టుబడిపై ప్రోత్సాహకాల కోసం దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించి, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
February 6Feb 6 Author అపోలో టైర్స్ రూ.1,100 కోట్లతో విస్తరణ By Andhra Pradesh News DeskPublished : 06 Feb 2026 05:51 IST Ee Font size 1 min read ఒప్పందం మేరకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అపోలో టైర్స్ పరిశ్రమ రెండో దశ విస్తరణలో భాగంగా రూ.1,100 కోట్ల పెట్టుబడితో నూతన ప్రాజెక్టు చేపట్టనుంది. మొదటి దశలో రూ.3,800 కోట్లతో తిరుపతి జిల్లా శ్రీసిటీ సమీపంలోని చినపాండూరు వద్ద 256 ఎకరాల్లో తయారీ యూనిట్‌ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మూడు దశల్లో కలిపి రూ.5,810 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గతేడాది సెప్టెంబరులో ప్రాజెక్టు విస్తరణకు ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చింది. పదేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపుతో పాటు కంపెనీకి అవసరమైన విద్యుత్, నీరు అందించేందుకు అంగీకరించింది. ప్రాజెక్టు విస్తరణతో సుమారు 1,800 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ డీపీఆర్‌లో పేర్కొంది.
February 12Feb 12 Author శ్రీసిటీలో డైకిన్-రెచీ ఇండియా నూతన ప్లాంటుకు భూమిపూజ By Andhra Pradesh News DeskPublished : 12 Feb 2026 04:37 IST Ee Font size 1 min read రూ.547 కోట్ల పెట్టుబడి.. 500 మందికి ఉపాది భూమిపూజ చేస్తున్న సంస్థ ప్రతినిధులుÅ శ్రీసిటీ (వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: శ్రీసిటీలో డైకిన్-రెచీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త పరిశ్రమ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేసింది. జపాన్‌కు చెందిన డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా, తైవాన్‌కు చెందిన రెచీ ప్రెసిషన్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న ఈ కంపెనీలో ఏసీల విడిభాగాలు (రోటరీ కంప్రెసర్లు) ఉత్పత్తి చేస్తారు. 33 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో రూ.547 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఏడాదికి 20లక్షల రోటరీ కంప్రెసర్లు తయారుచేస్తారు. నూతన ప్లాంటు భూమిపూజ కార్యక్రమంలో డైకిన్ ఇండియా ఛైర్మన్, ఎండీ కన్వల్‌జీత్ జావా, డైరెక్టర్ సెకిదా నయోటో, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జావా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్ లక్ష్యానికి అనుగుణంగా డైకిన్ లోకలైజేషన్ ప్రయాణంలో ఇదో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
Create an account or sign in to comment