Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

SriCity

Featured Replies

  • Replies 233
  • Views 31.2k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • sonykongara
    sonykongara

  • సిటీని సందర్శించిన ‘సోర్స్‌ ఇండియా’ ప్రతినిధుల బృందం  శ్రీసిటీ (వరదయ్యపాళెం) న్యూస్‌టుడే: భారతదేశంలో ఎలక్ట్రానిక్‌ తయారీదారుల కోసం పనిచేస్తున్న ప్రధానసంస్థ.. ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌

  • sonykongara
    sonykongara

Posted Images

  • Author

శ్రీసిటీలో 220 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం : సీఎం చంద్రబాబు

పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీసిటీలోని బిజినెస్‌ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 19 Aug 2024 14:55 IST
 
 
 
 
 
 

190925-cbnhnj-inner.jpg

శ్రీసిటీ: పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీసిటీలోని బిజినెస్‌ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని చెప్పారు. ‘‘ 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. భారత్‌ను ఐటీ.. ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను. గతంలో పీపీపీ విధానంలో హైటెక్‌ సిటీ చేపట్టాను. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు. ఇందులోని ప్రతి నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు. 

శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. సెజ్‌, డొమెస్టిక్‌ జోన్‌, ఫ్రీట్రేడ్‌ జోన్‌లు వచ్చాయి. 220 కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం ఉంది. ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యాం. ఆటోమేటివ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. 4.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సాధించడం చాలా గొప్ప విషయం’’ అని చంద్రబాబు తెలిపారు.

గోల్డెన్‌ రేటింగ్‌ కోసం కృషి

చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉందని చంద్రబాబు అన్నారు. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్‌ జోన్‌గా తయారు చేయాలనేది తన ఆలోచనని చెప్పారు. ‘‘ శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్‌ రేటింగ్‌ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. పచ్చదనం కోసం వందశాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. సహజంగా చల్లనివాతారవణం కల్పనకు చర్యలు తీసుకుంటాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్‌ ధరలు తగ్గించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది.

పైప్‌లైన్ల ద్వారా ఏసీ!

కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. రాజధాని కోసం 29వేల మంది రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటింటికీ నీరు, విద్యుత్‌, ఫైబర్‌ నెట్‌ అందిస్తున్నాం. గ్యాస్‌ మాత్రమే కాకుండా ఏసీ కూడా పైప్‌లైన్ల ద్వారా తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతున్నా.  2029 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. విజన్‌ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి ఒకటి లేదా రెండు స్థానాల్లో భారత్‌ నిలుస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.

  • 1 month later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • Author

పర్యావరణహిత నగరంగా శ్రీసిటీ

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:12 AM

 

శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం తన పారిశ్రామిక భాగస్వాములతో కలిసి స్థిరమైన వనరుల వినియోగ విధానాలను మరింత బలోపేతం చేస్తోంది.

పర్యావరణహిత నగరంగా శ్రీసిటీ
 

 

  • నిర్మాణ పనుల్లో 90శాతం ఎం-శాండ్‌ వినియోగం

  • మట్టి పునర్వినియోగంపై మార్గదర్శకాలు

వరదయ్యపాళెం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం తన పారిశ్రామిక భాగస్వాములతో కలిసి స్థిరమైన వనరుల వినియోగ విధానాలను మరింత బలోపేతం చేస్తోంది. రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌.. అనే వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్‌ ఎకానమీ) మూల సూత్రాల ఆధారంగా పర్యావరణానికి హానిని గణనీయంగా తగ్గించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టుల పనుల్లో ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఎం-శాండ్‌ (గ్రానైట్‌ రాళ్ల పొడితో తయారయ్యే ఇసుక)ను విధిగా 90 శాతం ఉపయోగించాలని నిర్ణయించింది. ఫిల్లింగ్‌ కోసం బయట మట్టిని కొనుగోలు చేయడం తగ్గించి ఆయా ప్లాట్లలో తవ్విన మట్టినే ఉపయోగించే విధానాన్ని ప్రోత్సహించనుంది. దీంతో పాటు భూ ఉపరితలాన్ని సమర్థంగా నిర్వహించి వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వకు ఉత్తమ పరిష్కారాలు చూపనుంది.

 
 

హరిత నగర లక్ష్యాన్ని సాధించే దిశగా సుస్థిర వనరుల నిర్వహణ, పర్యావరణ హిత కార్యకలాపాలను అమలు చేయడంలో శ్రీసిటీ ఎప్పుడు ముందుంటుందని ఎండీ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి చెప్పారు. సర్క్యులర్‌ ఎకానమీ సూత్రాలను అవలంబించడం ద్వారా స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి దోహదపడే చర్యలను అమలు చేస్తామన్నారు. కాలుష్య రహిత ఇంధన వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఏజీ అండ్‌ పీ నెట్‌వర్క్‌ ద్వారా.. కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ను శ్రీసిటీ అందుబాటులోకి తెచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించే పద్ధతి వల్ల ఉత్పత్తి నాణ్యత మెరుగుపడటమే కాకుండా బొగ్గు వినియోగంతో ఏర్పడే కాలుష్య బెడదను అరికడుతుందన్నారు. పారిశ్రామిక సంస్థలు వీలైనంత త్వరగా సీఎన్‌జీకి మారడం ద్వారా ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోచ్చని తెలిపారు. ఈ నూతన విధానాల అమలు ద్వారా పారిశ్రామికాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యతను నెలకొల్పి ప్రముఖ సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా శ్రీసిటీ తన నిబద్ధతను చాటుకుంటుందని వెల్లడించారు.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.