Jump to content

32,814 acres land denotified for Amaravati


Recommended Posts

సీఆర్‌డీఏ పరిధిలోకి మరో 7 గ్రామాలు
 
  • మొత్తం పరిధి 8914.51 చ.కిమీ మేర పెరుగుదల
  • మున్సిపల్‌ శాఖకు సీఆర్‌డీఏ ప్రతిపాదన
హైదరాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సీఆర్‌డీఏ పరిధిని మరో 311.19 చదరపు కిలోమీటర్ల మేర పెంచాలని మున్సిపల్‌ శాఖకు సీఆర్‌డీఏ ప్రతిపాదన పంపింది. ప్రస్తుతం ఏపీసీఆర్‌డీఏ 8603.32 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇందులో గుంటూరు జిల్లాకు చెందిన 26, కృష్ణా జిల్లాలోని 30 మండలాలున్నాయి. కొంత అటవీభూమి కూడా ఉంది. యూజర్‌ ఏజెన్సీ హోదాలో సీఆర్‌డీఏ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ, వాతావరణ మార్పుల శాఖను సంప్రదించి అటవీ భూముల డైవర్షన్‌ ప్రక్రియపై దృష్టి సారించింది. ఆ ప్రతిపాదనల్లో భాగంగా కృష్ణా జిల్లాలోని కాట్రేనిపాడు ఫారెస్ట్‌ బ్లాక్‌ను, గుంటూరులో వెంకటాయపాలెం ఫారెస్ట్‌ బ్లాక్‌, దాని అదనపు భూభాగాన్ని సీఆర్‌డీఏలో కలపాలని కోరారు. వాటి పరిధిలోని 7 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలో కలపాలని తాజాగా ప్రతిపాదించారు.కృష్ణా జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో ఒకటి ఉంది.
Link to comment
Share on other sites

  • 5 weeks later...
  • 1 month later...

అటవీ భూముల అభివృద్ధికి చర్యలు

భవిష్యత్తు అవసరాలకు ముందుచూపు

జిల్లాలో 2,874 హెక్టార్లు గుర్తించిన ఏడీసీ

kri-gen1a.jpg

మాచవరం (విజయవాడ), న్యూస్‌టుడే: కృష్ణా జిల్లాలో ఉన్న అటవీ భూములను అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో ఇందులో పలు నిర్మాణాలతోపాటు పచ్చదనం వెల్లువిరిసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ బాధ్యతను అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సీఆర్డీఏ)కు అప్పగించిన సర్కారు తాజాగా ఆ బాధ్యతను అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) బదలాయించింది. అయితే జిల్లాలోని విజయవాడ గ్రామీణ మండలం, ఆగిరిపల్లి, ముసునూరు మండలాల్లో వేల హెక్టార్లలో అటవీ భూములున్నాయి. వీటిని జల్లెడ పట్టి మంచి భూములను తీసుకొని అభివృద్ధి చేసే విషయమై సంస్థ ఛైర్‌పర్సన్‌ డి.లక్ష్మీపార్థసారథి, ఉన్నతాధికారులు, జిల్లా అటవీశాఖ అధికారులు శుక్రవారం ఆయా మండలాల్లో పర్యటించారు. మూడు మండలాల్లో 8,120 హెక్టార్లలో అటవీ భూములు ఉన్నాయి. అందులో 2,874 హెక్టార్లు అభివృద్ధికి అనకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తూరు తాడేపల్లిలో 194.7 హెక్టార్లలో ఉన్న అటవీ భూముల్ని పరిశీలించి వీటిని అన్ని విధాలుగా తీర్చిదిద్దటానికి వీలుగా ఉన్నట్లు అధికారులు నిర్ణయించారు. గన్నవరం మండలంలోని మెట్లపల్లి, ఆగిరిపల్లి మండలంలోని సూరవరం, వట్టిగుడపాడు, ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు, అన్నవరం, రేగుంట ప్రాంతాల్లో ఉన్న అటవీ భూముల్లో అనుకూలంగా ఉన్న భూములను అటవీ నిర్మూలన భూములుగా మారిస్తే బాగుంటుందని ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారథిµ అధికారులతో చర్చించారు. చాలా ప్రాంతాల్లో అటవీ భూములు ఉండగా.. అవి కొండ ప్రాంతాలు, పోలవరం కుడి ప్రధాన కాలవకు చేరువలో ఉండటంతో చివరకు 2,874 హెక్టార్లు అభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు. ఈ భూములపై ఏడీసీ ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను అందించనుంది. ఈ పర్యటనలో ఏడీసీ అధికారులు ఎస్‌.విశ్వనాథ్‌, సురేష్‌బాబు, వెంకటేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు సతీష్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

 

సీఆర్‌డీఏ పరిధిలోకి మరో 7 గ్రామాలు

 

  • మొత్తం పరిధి 8914.51 చ.కిమీ మేర పెరుగుదల
  • మున్సిపల్‌ శాఖకు సీఆర్‌డీఏ ప్రతిపాదన
హైదరాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సీఆర్‌డీఏ పరిధిని మరో 311.19 చదరపు కిలోమీటర్ల మేర పెంచాలని మున్సిపల్‌ శాఖకు సీఆర్‌డీఏ ప్రతిపాదన పంపింది. ప్రస్తుతం ఏపీసీఆర్‌డీఏ 8603.32 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇందులో గుంటూరు జిల్లాకు చెందిన 26, కృష్ణా జిల్లాలోని 30 మండలాలున్నాయి. కొంత అటవీభూమి కూడా ఉంది. యూజర్‌ ఏజెన్సీ హోదాలో సీఆర్‌డీఏ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ, వాతావరణ మార్పుల శాఖను సంప్రదించి అటవీ భూముల డైవర్షన్‌ ప్రక్రియపై దృష్టి సారించింది. ఆ ప్రతిపాదనల్లో భాగంగా కృష్ణా జిల్లాలోని కాట్రేనిపాడు ఫారెస్ట్‌ బ్లాక్‌ను, గుంటూరులో వెంకటాయపాలెం ఫారెస్ట్‌ బ్లాక్‌, దాని అదనపు భూభాగాన్ని సీఆర్‌డీఏలో కలపాలని కోరారు. వాటి పరిధిలోని 7 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలో కలపాలని తాజాగా ప్రతిపాదించారు.కృష్ణా జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో ఒకటి ఉంది.

 

motham krishna and guntur antae saripodi ga... most of the krishna distric is in crda...  

Link to comment
Share on other sites

  • 5 months later...
త్వరలోనే అటవీ భూముల డీనోటిఫికేషన్?
 
  • కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు!
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న అటవీ భూములను డీనోటిఫై చేసి, తనకు అప్పగించాల్సిందిగా ఏపీసీఆర్‌డీయే దాదాపు రెండేళ్లుగా చేస్తున్న అభ్యర్థనలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ భూములను రాజధాని కోసం అప్పగిస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కొన్నివారాల్లోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ శాఖకు అనుబంధంగా పని చేసే ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ అధికారులు కోరిన సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వడమే కాకుండా వెలిబుచ్చిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేశారు. దీంతో, దీర్ఘకాలంగా నానుతూ వస్తున్న ఈ అంశం త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని ఏపీ సీఆర్‌డీయే ఆశిస్తున్నట్లు భోగట్టా.
12,444 హెక్టార్ల కోసం కృషి
ప్రపంచంలోని మేటి 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలంటే భూసమీకరణ ప్రాతిపదికన సమీకరించిన సుమారు 33,000 ఎకరాలు, ప్రభుత్వ భూములతోపాటు అమరావతికి సమీపంలో, వివిధ ప్రదేశాల్లో విస్తరించి ఉన్న 12,444 హెక్టార్ల అటవీ భూమి కూడా అవసరమని సీఆర్‌డీయే భావిస్తోంది. ఈ అటవీ భూములను డీనోటిఫై చేసి, తమకు అప్పగిస్తే వాటిల్లో రాజధాని ప్రాంతానికి చుట్టుపక్కల అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామిక, వాణిజ్య తదితర క్లస్టర్లను అభివృద్ధి పరచాలన్నది ఆ సంస్థ అభిప్రాయం. నిబంధనలను అనుసరించి ఈ భూమికి సరిసమానమైన భూమిని వేరొక ప్రాంతంలో ఇచ్చేందుకు అంగీకరించడంతోపాటు అందులో అడవులను పెంచేందుకు అవసరమైన నిధులను కూడా ఇస్తామంటూ ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర అధికారులు, సీఆర్‌డీయేల మధ్య ఇప్పటికి పలు పర్యాయాలు సమావేశాలు నిర్వహించినా డీనోటిఫికేషన్ కు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు.
ఎప్పటికప్పుడు ఈ అంశం ఒక కొలిక్కి వచ్చేస్తుందనిపించినా కేంద్ర అధికారులు మళ్లీ ఏవేవో అనుమానాలు వ్యక్తం చేయడంతో అలా జరగకపోవడం పరిపాటైంది. కానీ, ఈ నెల 16న ఢిల్లీలో జరిన చర్చలు మాత్రం ఈ అంశానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే విధంగా సాగినట్లు సమాచారం. రాష్ట్ర అధికారుల వివరాలపై కేంద్ర అధికారులు సంతృప్తి చెందారని భావిస్తున్న సీఆర్‌డీయే ఉన్నతాధికారులు ఇకపై వాయిదాలు అవసరం లేకుండా అటవీ భూముల డీనోటిఫికేషన్ కు కేంద్రం ఉత్తర్వులు వెలువరించడం ఖాయమని విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ పరిణామం చోటు చేసుకోవచ్చునని వారు అంచనా వేస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Andhra Pradesh’s plan for capital Amaravati faces green hurdle

Environment ministry has formed a panel to examine Andhra Pradesh govt’s plan for capital Amaravati after several green concerns were raised over the project

 
 
naidu-koHC--621x414@LiveMint.jpg
Andra pradesh chief minister Chandrababu Naidu. Photo: Mint

New Delhi: Andhra Pradesh’s plan to build a new capital city, Amaravati, has run into a potential roadblock. The environment ministry has formed an expert panel to examine the state government’s master plan for the capital after several environmental concerns were raised over the project.

The project involves diversion of 13,377 hectares of forest land in favour of the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA) to develop infrastructure for Amravati.

The proposal was first submitted in October 2015 to the forest advisory committee (FAC), of the ministry of environment, forest and climate change (MoEFCC) but has not received forest clearance yet.

The proposal was discussed in the FAC’s latest meeting on 16 May. Minutes of the meeting were reviewed by Mint.

At the meeting, FAC took note of the submissions made by the forest division of the environment ministry and its regional office in Chennai on the project.

The submissions noted the proposal includes diversion of 890.43 hectares of the Kondapally forest.

“This Kondapally forest, with overall forest area of 9,137.19 hectares, acts as the lungs of Vijayawada people with lot of historical associations and should not be disturbed… The Kondapally toys using the soft wood from the trees ‘Givotia Rotteleofrmis’ mainly available in these forests has obtained the geographical indicator (GI) certification also,” the submission noted.

Another concern is whether the land proposed to be used for compensatory afforestation in exchange for diversion of forest land is suitable for afforestation.

“The FAC took note of the above facts and the detailed presentation made by the officers of the government of Andhra Pradesh and after detailed deliberations recommends that an expert committee shall be constituted by the ministry (MoEFCC) to examine the master plan for the capital of Andhra Pradesh prepared by the state government,” said the minutes of the FAC’s meeting.

“On receipt of the expert committee’s report, the matter would be considered in the FAC and appropriate recommendations shall be made accordingly,” the FAC said.

FAC is the nodal body under the Forest Conservation Act 1980 which recommends or rejects proposals for diversion of forest land for non-forestry purposes like mining and infrastructure development.

FAC only makes recommendations, and the final clearance is given the environment ministry. It is, however, very rare that MoEFCC overturns FAC recommendations.

Link to comment
Share on other sites

CBN enduku Modi to untunado ippatiki anna ardam ayyinda?

 

2010 lo vachina Tribunal laws to a vache konni projects kuda apestaru...Congress leaders ni blackmail chesindi kani itla ENVIROMENT/TRIBUNALs to game adochu ani Modi chupinche daka teliledu evadiki....

Link to comment
Share on other sites

  • 2 weeks later...
రాజధానికి తొలగనున్న అటవీ సంకటం!
 
 
  • అటవీ భూమి కేటాయింపుపై ఉన్నతస్థాయి కమిటీ
  • కృష్ణా, గుంటూరుల్లో పర్యటించనున్న కేంద్ర, రాష్ట్రాల అధికారులు
అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అటవీ భూమిలో 30,739 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్డీఏ గత కొన్ని నెలలుగా చేస్తున్న యత్నాలు త్వరలోనే ఫలించనున్నాయి. ఈ అంశం పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. దీంతో అటవీ భూముల మళ్లింపు ప్రక్రియలో చెప్పుకోదగిన పురోగతి కనిపిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
 
ఈ కమిటీ సభ్యులు కొద్ది రోజుల్లోనే అమరావతి కోసం ఉద్దేశించిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అటవీ భూములను పరిశీలించేందుకు రానున్నారని, తమ పర్యటనలో భాగంగా అటవీ భూముల మళ్లింపునకు సంబంధించిన అంశాలన్నింటినీ వారు నిశితంగా అధ్యయనం చేయనున్నారని సమాచారం. మొత్తం ఎనిమిది మంది సభ్యులుండే ఈ కమిటీలో నలుగురు అధికారులు కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన నలుగురు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు చెందిన వారుంటారు. కేంద్రానికి చెందిన అందరూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీ్‌స(ఐఎఫ్ఎస్‌) అధికారులు కాగా, రాష్ట్రం తరఫున ఇద్దరు రాష్ట్ర అటవీ శాఖకు, మిగిలిన ఇద్దరు టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగానికి చెందిన వారు ఉండనున్నారు.
నెలలుగా కొనసాగుతున్న ప్రక్రియ
అమరావతి నిర్మాణం కోసం చుట్టుపక్కల ఉన్న సుమారు 30,739 ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేసి, తమకు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఆర్డీఏ కేంద్రానికి చాలా నెలల క్రితమే దరఖాస్తు చేసుకుంది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నిబంధనలను అనుసరించి ఆ భూమికి సమాన విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ వనీకరణ నిమిత్తం భూమిని అప్పగించేందుకుగాను వివిధ జిల్లాల్లో భూములను కూడా గుర్తించింది. ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేసింది.
 
ఇంకా అవసరమైన చర్యలు సైతం చేపట్టింది. వీటిని పేర్కొంటూ సీఆర్డీఏ ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయడం, అక్కడి అధికారులు కొర్రీలు వేయడం, వాటికి సమాధానాలిస్తూ సీఆర్డీఏ మళ్లీ అభ్యర్థనలు పంపడం గత కొన్ని నెలల కాలంలో పరిపాటైంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య పలు సమావేశాలు కూడా జరిగాయి. అయితే ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఈ యావత్తు వ్యవహారం సాగతోంది. ఒకదశలో అటవీ భూముల మళ్లింపు అసాధ్యమని కూడా అనిపించింది.
 
ఆ తర్వాత.. సీఎం చంద్రబాబు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఈ విషయంపై దృష్టి పెట్టి, మళ్లింపునకు అనుమతులు సత్వరమే లభించేందుకు తమ స్థాయిలో ప్రయత్నాలు జరిపారు. దీంతోపాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ లేవనెత్తిన అభ్యంతరాలు, సందేహాలన్నింటికీ సీఆర్డీఏ సంతృప్తికరమైన జవాబులివ్వడంతో పరిస్థితి క్రమంగా సానుకూలంగా మారింది. ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయడంతో త్వరలోనే అమరావతికి అవసరమైన అటవీ భూములు సీఆర్డీఏకు అందడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Link to comment
Share on other sites

అటవీభూములపై పరిశీలనకు కమిటీ రాక

ఈనాడు అమరావతి: రాజధాని అవసరాలకు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 31 వేల ఎకరాల అటవీ భూముల్ని కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం నియమించిన నలుగురు సభ్యుల ఉన్నతస్థాయి బృందం మంగళవారం విజయవాడ వచ్చింది. 31 వేల ఎకరాలు రెండు జిల్లాల్లో వేర్వేరు చోట్ల ఉన్నాయి. వాటిని డీనోటిఫై చేసి, రాజధాని అవసరాల కోసం వినియోగించుకునేందుకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చాన్నాళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
అటవీ భూముల మళ్లింపుపై సీఆర్‌డీఏ ఆశాభావం

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధికి దాదాపు 12వేల హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అంగీకరిస్తుందని రాజధాని ప్రాంత అభివృధ్ధి సాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఆశాభావంలో ఉంది. గురువారం ఇందుకు సంబంధించి అటవీ సలహా కమిటీ (ఎఫ్‌ఏసీ) సమావేశంలో ఓ నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న అటవీ భూములను మళ్లింపు ప్రక్రియ ద్వారా కేటాయిస్తే అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ యోచన. ఈ ప్రతిపాదనల్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఎఫ్‌ఏసీకి అందజేశారు. దాని తరఫున ఓ బృందం ఇటీవల సీఆర్‌డీఏ ప్రాంతంలో పర్యటించి, మళ్లింపు కోరిన భూములను పరిశీలించింది. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉంటుందని అటవీ శాఖ చెబుతోంది. భూములను మళ్లించేటప్పుడు పలు నిబంధనలు పాటించడంతోపాటు అడవులు పెంచడం, అందుకయ్యే వ్యయాన్ని భరించడం, తీసుకొన్న భూముల్లో ఏయే ప్రాజెక్టులు వస్తాయనే వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో సీఆర్‌డీఏ స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ తేల్చి చెప్పింది. సీఆర్‌డీఏ అంశంతోపాటు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అటవీ అనుమతులపైనా గురువారంనాటి సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

అటవీ భూముల మళ్లింపుపై సీఆర్‌డీఏ ఆశాభావం

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధికి దాదాపు 12వేల హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అంగీకరిస్తుందని రాజధాని ప్రాంత అభివృధ్ధి సాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఆశాభావంలో ఉంది. గురువారం ఇందుకు సంబంధించి అటవీ సలహా కమిటీ (ఎఫ్‌ఏసీ) సమావేశంలో ఓ నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న అటవీ భూములను మళ్లింపు ప్రక్రియ ద్వారా కేటాయిస్తే అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ యోచన. ఈ ప్రతిపాదనల్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఎఫ్‌ఏసీకి అందజేశారు. దాని తరఫున ఓ బృందం ఇటీవల సీఆర్‌డీఏ ప్రాంతంలో పర్యటించి, మళ్లింపు కోరిన భూములను పరిశీలించింది. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉంటుందని అటవీ శాఖ చెబుతోంది. భూములను మళ్లించేటప్పుడు పలు నిబంధనలు పాటించడంతోపాటు అడవులు పెంచడం, అందుకయ్యే వ్యయాన్ని భరించడం, తీసుకొన్న భూముల్లో ఏయే ప్రాజెక్టులు వస్తాయనే వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో సీఆర్‌డీఏ స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ తేల్చి చెప్పింది. సీఆర్‌డీఏ అంశంతోపాటు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అటవీ అనుమతులపైనా గురువారంనాటి సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

  • 5 weeks later...
రాజధానికి అటవీ భూములు!
18-08-2017 02:22:30
 
636386197520340842.jpg
  • బదిలీకి కేంద్ర పర్యావరణ శాఖ ఓకే
  • ఫలించిన ముఖ్యమంత్రి ప్రయత్నాలు
  • వెంకటాయపాలెంలో 1,835 హెక్టార్లు,
  • తాడేపల్లిలో 251.77 హెక్టార్లు బదిలీ
  • రాజధాని నిర్మాణానికి తొలగిన అడ్డంకి
 
న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. రాజధాని నిర్మాణానికి అటవీ భూములను బదిలీ చేసుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కృషికి ఫలితం లభించింది. దీంతో తాడేపల్లి, వెంకటాయపాలెంలలో అటవీ భూములను రాజధాని కోసం ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)కి మార్గం సుగమమైంది.
 
రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే నిరుపయోగంగా ఉన్న అటవీ భూములను ఉపయోగించుకోవడానికి విభజన చట్టంలో కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం కావలసిన అటవీ భూములను గుర్తించి రెండేళ్ల క్రితమే కేంద్ర అటవీశాఖ అనుమతి కోసం పంపింది. రాష్ట్రపతి రామ్‌నాఽథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారానికి ఇటీవల ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి.. అటవీ భూముల బదిలీకి అనుమతించాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. నిజానికి అటవీ నిపుణుల కమిటీ ఈ ఏడాది జూన్‌ 19 నుంచి జూన్‌ 22 వరకూ క్షేత్రస్థాయి తనిఖీల కోసం అమరావతికి వచ్చింది. సీఆర్‌డీఏ అధికారులతో చర్చల అనంతరం సమగ్ర నివేదికను తయారు చేసింది.
 
ఈ నివేదికను జూలై 20వ తేదీన జరిగిన అటవీశాఖ సలహా కమిటీ (ఎఫ్‌ఏసీ) సమావేశంలో కేంద్రం ఆమోదించింది. అయితే సలహా కమిటీ పూర్తిస్థాయి భేటీలో మరోసారి ఈ నివేదికపై చర్చించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎఫ్‌ఏసీ సమావేశంలో అటవీభూముల బదిలీపై కూలంకషంగా చర్చించి రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని 251.77 హెక్టార్లు, వెంకటాయపాలెంలోని 1835.32 హెక్టార్ల అటవీభూము ల బదిలీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇంతే మొత్తం లో కర్నూలు, కడప, అనంతపురం జి ల్లాల్లో కొత్తగా అడవుల పెంపకానికి త గిన నిధులను, భూ ములను రాష్ట్ర ప్రభుత్వం సూ చించింది. తాజా నిర్ణయంతో మొత్తంగా 12444.89 హెక్టార్ల అటవీభూములను సీఆర్‌డీఏ వినియోగించుకోనుంది.
 
చింతలపూడికీ లైన్‌క్లియర్‌
చింతలపూడి ఎత్తిపోతల పథకం కోసం 347.64 హెక్టార్ల అటవీభూముల బదిలీకి కూడా ఎఫ్‌ఏసీ అనుమతించింది. 2016 చివరిలో ఈ ప్రాజెక్టు కోసం మొదట 469.18 హెక్టార్ల అటవీ భూముల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. కేంద్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అంచనాలను సవరించి 347.64 హెక్టార్ల అటవీ భూముల కోసం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జూలై 20వ తేదీన జరిగిన ఎఫ్‌ఏసీ భేటీలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టును మాత్రమే నిర్మిస్తారా.. లేక వేరే ఇతర అవసరాలకు ఈ భూములను వాడుకునే ఉద్దేశం ఉందా.. అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా నివేదిక అందించడంతో గురువారం సమావేశంలో అనుమతులను మంజూరుచేస్తున్నట్లు ప్రకటించింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...